Jump to content

సంత్ సేవాలాల్ మహరాజ్

వికీపీడియా నుండి
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్
జననం
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్

(1739-02-15)1739 ఫిబ్రవరి 15
రామ్ జీ నాయక్ తాండా , బావన్ బరాడ్,

గుత్తి - బళ్ళారి ప్రాంతం ప్రస్తుతం పిలువ బడే పేరు సేవాగడ్, గుత్తి మండలం,

అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
మరణం1806 డిసెంబరు 4(1806-12-04) (వయసు 67)
రూయిగడ్, తాలుకా డిగ్రేస్, జిల్లా ఎవత్మాల్, మహారాష్ట్ర
సమాధి స్థలంపౌరహాగడ్, వాసీం జిల్లా, మహారాష్ట్ర భారతదేశం
వృత్తిసంఘ సంస్కర్త (Social reformer)
తల్లిదండ్రులు
  • భీమానాయక్ (తండ్రి)
  • ధర్మణి మాతా (తల్లి)

శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ (15 ఫిబ్రవరి 1739 - 4 డిసెంబర్ 1806) బంజారాల ఆరాధ్య దైవం[1]. అతను హిందూధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారు.సేవాలాల్ మహరాజ్ [2]జయంతి పురస్కరించుకుని ఫిబ్రవరి 15న సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 2024లో ప్రకటించింది.[3]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్‌ జిల్లా [4]గుత్తి మండలంలోని రాంజీనాయక్‌ తాండలోని రామావత్ గోత్రంలో భీమానాయక్,ధర్మణిమాత దంపతులకు 1739 లో కాళయుక్తి నామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఫిబ్రవరి నెల 15వ తేదీన ఆదివారం రోజున మగ శిశువు జన్మించాడు.[5]ఇతనికి సేవాలాల్‌ అని నామకరణం చేశారు. సేవాలాల్‌ పెరిగిన తరువాత కొంతకాలంలో మేరమ్మగా పిలువబడే జగదాంబ దేవి ప్రత్యక్షమై సేవాలాల్‌ని నాకు అప్పజెప్పమని భీమనాయక్‌ను అడుగుతుంది. అమ్మ వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవాలాల్‌ అందుకు ఒప్పుకోడు. తల్లిదండ్రులు సేవాలాల్‌ను అమ్మవారికి అప్పగిస్తుంటే నేను శాఖాహారిని జగదాంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలి చేయదలచు కోలేదని అంటాడు. అప్పుడు మేరమ్మ సేవాలాల్‌కు ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది. అయిన సేవాలాల్‌ చలించడు. చివరకు తండాలను, కష్టాల పాలు చేస్తుంది. ఇదంతా సేవాలాల్‌ కారణంగా జరుగుతుందని తండావాసులు, తాండ రాజ్యం నుంచి అతనిని బహిష్కరిస్తారు. కానీ అమ్మవారికి మేకలను బలి ఇవ్వకుండ అమ్మవారు శాంతిస్తారని ప్రజలు నమ్ముతారు. వారి కోరిక మేరకు ఏడు దేవతలు (సాతీ భావానీ)లకు మేకపోతు బలి ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు. ఏడు మేకలను ఏడుగురు అమ్మవారుల ముందు ఉంచుతారు. కాని సేవాలాల్‌ ప్రజల మూఢనమ్మకానికి ఏకీభవించడు. ఎందుకంటే ఆయన అమాయక ముగ జీవుల్ని బలిచేస్తుంటే చూడలేక, ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవాలాల్‌ ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ల దగ్గర పడేస్తారు. నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రార్థిస్తాడు.

అమ్మవారు సేవాలాల్‌ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది. ఇన్నాళ్లు నేను పెట్టే పరీక్షలో సేవాలాల్‌ నెగ్గాడు. నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు అయిన ఇతని నాయకత్వంలో ప్రయణించండి అని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి సేవాలాల్‌ జగదాంబమాతనే తన మార్గదర్శకురాలిగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు. ఆరు నెలల ప్రాయంలోనే సేవాలాల్‌ కొండపైన చాముండేశ్వరీ దేవతా మూర్తులతో ఆటలు ఆడుకునేవాడు. సేవాలాల్‌- చాముండేశ్వరి అమ్మవారు ఆటలు ఆడడం రహస్యంగా భీమా నాయక్‌ గమనించి విచారిస్తే ప్రతిదినం అలాగే అడుకుంటామన్నాడు. పెరిగి పెద్దవాడైన సేవాలాల్‌ ఆవులు కాసేవాడు. తల్లిసద్ది కట్టిస్టే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవులోనికి పోయేవాడు. ఒక బంకమట్టితో రొట్టెలు చేసి తినేవాడు. ఈ విచిత్ర ప్రవర్తన తల్లితండ్రులకు తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది.

బోధనలు

[మార్చు]

ఈ సమస్త జీవకోటికి మాతృరూపం (తల్లిగా) వెలిసిన అమ్మభవాని గురించి అమ్మను పూజించాలని, కాని ఫలితం ఆశించవద్దని బంజారా లకు బోధించారు. సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌గారు, హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుసుడయ్యారు. సేవాలాల్‌ మహరాజ్‌ ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు. ఆ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్‌ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో బ్రిటిష్‌, ముస్లీం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యింది. ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మర్గంలో నడిపించేంందుకు సేవాలాల్‌ మహారాజ్‌ అవతరించారు. సేవాలాల్‌ మహరాజ్‌ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తుంది[6].

మహిమలు

[మార్చు]

సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ మహిమలు అద్భుతమైనవి. వీటి మీద అనేక కథనాలు కలవు. వాటిలో పురుషున్ని స్త్రీగా మార్చడం,ఒక ముంత బియ్యంతో 10,000 మందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని మూడు దినాల తరువాత బ్రతికించడం, విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీయం చేయడం. ఉదృతంగా పారే ప్రవాహాన్ని ఆపి తమ తాండ ప్రజలను, ఆవులను దాటించడం. సేవాలాల్‌కు అపకీర్తి తీసుకురావాలని జాదూగర్‌ వడితియా ఒక పురుసుడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి సంతానం ప్రసాదించాలని కోరతాడు. సేవాలాల్‌ తథాస్తు అంటూ దీవిస్తాడు. నిజంగానే ఆ పురుషుడు స్త్రీగా మారిపోతాడు. అతని పేరు చింగ్ర్యా అబ్బాయి, చింగ్ర్యీ అమ్మాయి గా మారిపోతాడు అలాగే సేవాలాల్‌ దర్బారులోనికి తలవంచి ప్రవేశించడానికి అతడి ప్రవేశ మార్గంలో చిన్న తలుపును ఏర్పాటు చేయగా సేవాలాల్‌ తన ఆకారాన్ని కుదించుకుని తలవంచకుండానే ఆ దర్వాజాలో నుండి ప్రవేశిస్తాడు. అలాగే సేవాలాల్‌ను బావిలో దిగి సన్నని నూలు పోగు ఆధారంతో పైకి వచ్చి తన భక్తిని నిరూపించారు.

ఉద్యమాలు

[మార్చు]

సేవాలాల్‌ మహరాజ్‌ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ఫేరి ఫర్‌ ఒకటి పేరి అనగా ఆంగ్లేయులు,ఇస్లామ్ పై యుధం చేయడం ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలు అరికట్టడం, క్షేత్రధర్మాన్ని రక్షించడం మొదలైనవి అన్ని ముఖ్యమైనవి.

పార్లమెంటులో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలి

[మార్చు]

సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహం పార్లమెంటులో ఆవరణంలో ప్రతిష్టించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. పార్లమెంటులో అయిన మాట్లాడుతు 12 కోట్ల బంజారా సమాజం యొక్క ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు సమాజం కోసం అనేక సంస్కరణలు చేసి అహర్నిషలు సమాజం కోసం కృషి చేసారని. ఆ మహామనిషి యొక్క విగ్రహం పార్లమెంటు ఆవరణంలో ఉండాలని అన్నారు[7][8].

మూలాలు

[మార్చు]
  1. Desk 15, Disha Web (2024-02-20). "సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం". www.dishadaily.com. Retrieved 2024-03-13.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. ABN (2023-02-22). "సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ గొప్ప ఆధ్యాత్మికవేత్త". Andhrajyothy Telugu News. Retrieved 2024-03-13.
  3. "ఆధ్యాత్మిక యోధుడు సంత్ సేవాలాల్ మహారాజ్ – Thapasvi Manoharam" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-03-04. Retrieved 2024-04-23.
  4. Today, Telangana (2021-02-21). "The journey and life of Sant Sri Sevalal Maharaj". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-03-13.
  5. Velugu, V6 (2023-02-15). "బంజారాల ఆరాధ్య దైవం సంత్​సేవాలాల్ మహారాజ్​". V6 Velugu. Retrieved 2024-03-13. {{cite web}}: zero width space character in |title= at position 25 (help)CS1 maint: numeric names: authors list (link)
  6. Bureau, The Hindu (2023-02-26). "As part of Banjara community outreach, Union government to mark Sant Sevalal Maharaj Jayanti". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-03-13.
  7. admin (2024-08-06). "సేవాలాల్ విగ్రహం పార్లమెంట్ లో పెట్టాలి …..లోకసభ లో ఎంపీ అర్వింద్". EDISANGATHI NEWS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-06.
  8. "NZB: సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి.. ఎంపీ ధ‌ర్మ‌పురి". Prabha News. 2024-08-06. Retrieved 2024-08-06.

7.SANT SRI SEVALAL MAHARAJ HISTORY PART 1 Archived 2018-02-06 at the Wayback Machine

ఇతర లింకులు

[మార్చు]