Jump to content

సంజీవ్ శర్మ

వికీపీడియా నుండి
సంజీవ్ శర్మ
Sanjeev Sharma1
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సంజీవ్ శర్మ
పుట్టిన తేదీ (1965-08-25) 1965 ఆగస్టు 25 (వయసు 59)[1]
ఢిల్లీ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm medium
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 184)1988 డిసెంబరు 02 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1990 జూలై 26 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 65)1988 జనవరి 2 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1990 జూలై 20 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లి ఎ
మ్యాచ్‌లు 2 23 89 61
చేసిన పరుగులు 56 80 2,785 573
బ్యాటింగు సగటు 28.00 10.00 36.16 26.04
100లు/50లు 0/0 0/0 3/16 0/2
అత్యుత్తమ స్కోరు 38 28 117 58
వేసిన బంతులు 4,140 2,979 14,982 2,602
వికెట్లు 6 22 41 47
బౌలింగు సగటు 41.16 36.95 43.80 43.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3 8 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/37 5/26 8/76 5/26
క్యాచ్‌లు/స్టంపింగులు 11/0 27/0 39/0 16/0
మూలం: ESPNcricinfo, 2019 మార్చి 9

సంజీవ్ శర్మ (జననం 1965 ఆగష్టు 25) 1988 నుండి 1997 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 23 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన మాజీ భారతీయ క్రికెటర్, క్రికెట్ కోచ్. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలరు. 80వ దశకంలో కపిల్ దేవ్ కు ఓపెనింగ్ భాగస్వాములుగా ప్రయత్నించిన అనేక మంది బౌలర్లలో అతను ఒకడు. 1988-89లో న్యూజిలాండ్‌తో జరిగిన తన తొలి టెస్టులో 37 పరుగులకు మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 1989లో వెస్టిండీస్‌లో పర్యటించాడు. దాదాపు 20 సంవత్సరాల పాటు సాగిన కెరీర్ తర్వాత, అతను 2004 నవంబరులో పోటీ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.

1991లో రంజీ ట్రోఫీ సందర్భంగా ఢిల్లీలోని కర్నైల్ సింగ్ స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో 117 నాటౌట్, రెండవ ఇన్నింగ్స్‌లో 55 నాటౌట్‌గా నిలిచాడు. అవి అతని కెరీర్లో అత్యుత్తమ ఫస్ట్ క్లాస్ బ్యాటింగ్ గణాంకాలు. ఈ బ్యాటింగ్‌కు గానూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.


2019 ఆగస్టులో అరుణాచల్ ప్రదేశ్ క్రికెట్ జట్టు సీనియర్ కోచ్‌గా నియమితుడయ్యాడు. [2]

ఈ రోజుల్లో, అతను తన సమయాన్ని ఢిల్లీలో UClean ఫ్రాంచైజీని నడుపుతున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. Sanjeev Sharma
  2. "BCCI eases entry for new domestic teams as logistical challenges emerge". ESPN Cricinfo. Retrieved 31 August 2018.