Jump to content

సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల
సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల భవనం
రకంప్రభుత్వ వైద్య విద్య
స్థాపితం2021
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
విద్యార్థులు150
స్థానంసంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం

సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల. గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2021లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది.[1] ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[2]

నిర్మాణ వివరాలు

[మార్చు]

సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని 35 ఎకరాల ప్రదేశంలో 90వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో 30 కోట్ల రూపాయలతో కళాశాల భవన నిర్మించబడింది. 40 కోట్ల రూపాలయతో వైద్య కళాశాల, దవాఖానలో విధులు నిర్వహించే నర్సుల కోసం ప్రత్యేకంగా కళాశాల, వసతి గృహాలు కూడా నిర్మించబడ్డాయి.[3] గ్రౌండ్‌ ఫ్లోర్‌లో క్యాంటీన్‌, వివిధ రకాల రెండు ల్యాబ్స్‌, రీడింగ్‌ రూమ్స్‌, ఫ్యాకల్టీ గదులు ఏర్పాటుచేయగా, మొదటి అంతస్తులో ప్రథమ సంవత్సరం విద్యాబోధన, అధ్యాపకులు, ఫ్యాకల్టీల గదులు ఉన్నాయి.

కోర్సులు - శాఖలు

[మార్చు]
  • అనాటమీ
  • ఫార్మాకాలజీ
  • ఫిజియోలాజీ
  • బయోకెమిస్ట్రీ
  • పాథాలజీ
  • మైక్రోబయోలాజీ
  • ఫోరెన్సిక్ మెడిసిన్
  • జెనరల్ సర్జరీ
  • ఆర్థోపెడిక్స్
  • ఓటో-రైనో-లారిగోలజీ
  • ఆప్తాల్మోలజీ
  • జనరల్ మెడిసిన్
  • టిబి & ఆర్‌డి
  • డివిఎల్
  • సైకియాట్రీ
  • పీడియాట్రిక్స్
  • ఓబిజీ
  • అనస్థీషియాలజీ
  • కమ్యూనిటీ మెడిసిన్
  • రేడియోడియాగ్నోసిస్
  • ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
  • టీబీసీడీ
  • సీటీ సర్జరీ
  • న్యూరో సర్జరీ
  • న్యూరాలజీ
  • ప్లాస్టిక్‌ సర్జరీ
  • యూరాలజీ
  • గాస్ట్రోఎంట్రాలజీ
  • ఎండోక్రైనాలజీ
  • నెఫ్రాలజీ
  • కార్డియాలజీ
  • ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్
  • ఈఎన్‌టీ
  • ఆప్తల్
  • అనస్తీషియా
  • డెంటల్

తరగతుల ప్రారంభం

[మార్చు]

2022 ఆగస్టు నాటికి 54 మంది వైద్యులు, 43 మంది సీనియర్‌ రెసిడెంట్‌లు నియమించబడ్డారు. 2022 నవంబరు 15 నుండి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 8 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించి వైద్యరంగంలో గుణాత్మక మార్పుకు, దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయానికి నాందిపలికాడు.[4]

ఎనమిది వైద్య కళాశాలలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

సిబ్బంది

[మార్చు]

వీటిలో 15 ప్రిన్సిపల్, 15 వైస్‌ ప్రిన్సిపల్‌ కమ్‌ ప్రొఫెసర్, 105 ప్రొఫెసర్, 180 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 300 లెక్చరర్, 15 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, 15 ఆఫీస్‌ సూపరింటెండెంట్, 30 సీనియర్‌ అసిస్టెంట్, 15 లైబ్రేరియన్, 30 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.[5] వీటితోపాటు ఈ వైద్య కళాశాలో విధులు నిర్వహించేందుకు కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, ల్యాబ్ అటెండెంట్, రికార్డింగ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్ వంటి 33 పోస్టులు కేటాయించబడ్డాయి.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sangareddy Government Medical College (About Us)". Archived from the original on 2022-11-07. Retrieved 2022-11-07.
  2. Today, Telangana (2022-08-11). "MCI grants 150 MBBS seats to Sangareddy Medical College". Telangana Today. Archived from the original on 2022-08-12. Retrieved 2022-11-07.
  3. telugu, NT News (2022-02-26). "సంగారెడ్డిలో వైద్య కళాశాల పనులు వేగవంతం". www.ntnews.com. Archived from the original on 2022-02-28. Retrieved 2022-11-07.
  4. telugu, NT News (2022-11-15). "మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-16.
  5. "7 కొత్త వైద్య కళాశాలల్లో 7,007 పోస్టులు". Sakshi. 2021-06-25. Archived from the original on 2021-06-25. Retrieved 2022-11-07.

ఇతర లంకెలు

[మార్చు]