షేక్ సాబ్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేక్ సాబ్జీ

ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2021 - 29 మార్చి 2027
నియోజకవర్గం తూర్పు గోదావరి -పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 05 జనవరి 1966
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 2023 డిసెంబర్ 15
చెరుకువాడ,ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
తల్లిదండ్రులు షేక్‌ కబీర్ష, సైదాబీబి
జీవిత భాగస్వామి షేక్‌ సుభాన్ బిబి

షేక్‌ సాబ్జీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తూర్పు గోదావరి -పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

వృత్తి జీవితం

[మార్చు]

యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న షేక్ సాబ్జీ ఏలూరు మండలం, మాదేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంటుగా పనిచేస్తూ.. ఇంకా ఐదేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 2019 ఫిబ్రవరిలో సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు నుంచి విజయవాడ వరకు నిర్వహించిన పాదయాత్రకు నాయకత్వం వహించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

షేక్‌ సాబ్జీ 2021లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో యూటీఎఫ్, ఏపీటీఎఫ్-1938, పీడీఎలతో పాటు 25 ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా తూర్పు గోదావరి -పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేశాడు.[3] ఈ నియోజకవర్గంలో మొత్తం 17,467 మంది ఓటర్లు ఉండగా,16,054 ఓట్లు పాలవగా 11 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ పడ్డారు. షేక్ సాబ్లీకి 7,987 ఓట్లు రాగా, వైకాపాతో పాటు పీఆర్టీయూ ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో బరిలోకి దిగిన సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుకు 6,453 ఓట్లు పోలయ్యాయి, దీనితో షేక్ సాబ్జీ 1,534 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిచాడు. ఈ ఎన్నికల్లో తెదేపా మద్దతు తెలిపిన చెరుకూరి సుభాష్ చంద్రబోసు 106 ఓట్లు, భాజపా మద్దతుతో పోటీ చేసిన ఇళ్ల సత్యనారాయణకు 300 ఓట్లు పడ్డాయి. చెల్లని ఓట్లు 363 నమోదయ్యాయి.[4]

మరణం

[మార్చు]

షేక్ సాబ్జీ 2023 డిసెంబరు 15న ఏలూరులో అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొని అక్కడి నుండి భీమవరం వెళ్తుండగా పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం, చెరుకువాడలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (18 March 2021). "టీచరు ఎమ్మెల్సీ విజేతలు సాబ్జీ, కల్పలత". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  2. Eenadu. "ఎమ్మెల్సీగా షేక్‌ సాబ్జీ ఎన్నిక". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  3. Praja Sakti (23 February 2021). "కోలాహలంగా షేక్‌ సాబ్జీ నామినేషన్‌ పలు సంఘాల మద్దతు". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  4. HMTV (17 March 2021). "ఉభయగోదావరి టీచర్స్‌ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయం". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  5. Eenadu (15 December 2023). "రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
  6. TV9 Telugu (16 December 2023). "రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి.. ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందంటున్న ఫ్యామిలీ". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)