షిప్కి లా
షిప్కి లా | |
---|---|
సముద్ర మట్టం నుండి ఎత్తు | 3,930 m (12,894 ft) |
ఇక్కడ ఉన్న రహదారి పేరు | జాతీయ రహదారి 5 |
ప్రదేశం | హిమాచల్ ప్రదేశ్, భారతదేశం – టిబెట్, చైనా |
శ్రేణి | హిమాలయాలు |
Coordinates | 31°49′55″N 78°44′02″E / 31.83194°N 78.73389°E |
షిప్కి లా, భారత చైనా సరిహద్దులో, ఈ డజను పెద్ద భవనాలతో కూడిన పర్వత మార్గం, సరిహద్దు పోస్టు. టిబెట్‌లో లాంగ్‌కాన్ జాంగ్‌బో అని పిలిచే సట్లెజ్ నది ఈ కనుమ సమీపంలో టిబెట్ నుండి భారతదేశం లోకి ప్రవేశిస్తుంది.[1] షిప్కి లాకు నైరుతి దిశలో, భారతదేశం వైపున, నాలుగు కి.మీ దూరంలో ఒక శాఖామార్గం 4,720 మీటర్లు (15,490 అ.) ఎత్తు దాకా పోతుంది.
ఈ కనుమ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లా, టిబెట్‌లోని న్గారి ప్రిఫెక్చర్ మధ్య సరిహద్దు వద్ద ఉంది. సిక్కింలోని నాథు లా, ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్‌తో పాటు ఈ కనుమ, టిబెట్‌తో భారతదేశపు సరిహద్దు వ్యాపార కేంద్రాలలో ఒకటి. ఈ కనుమ ఖాబ్ పట్టణానికి సమీపంలో ఉంది.
కనుమ గుండా వెళ్ళే రహదారిని సరిహద్దు వెంబడి చిన్న తరహా స్థానిక వాణిజ్యానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు.[2] భారతదేశం-టిబెట్ సరిహద్దులో ఉన్న ఇతర సరిహద్దు కనుమల లాగానే, దీనిగుండా కూడా స్థానికేతరులను అనుమతించరు.[3] భారతదేశం, టిబెట్‌ల మధ్య భూమార్గంలో ప్రయాణించే చాలా మంది ప్రజలు నేపాల్ మీదుగా ప్రయాణిస్తారు.
భౌగోళికం
[మార్చు]1939 లో గార్టోక్ నుండి షిప్కి లా మీదుగా బాషహర్ రాష్ట్రానికి ప్రయాణించిన కెప్టెన్ రాబర్ట్ హామండ్ తన ప్రయాణాన్ని ఇలా వివరించాడు: [4]
టైక్ నుండి షిప్కికి వెళ్లే రహదారి చాలా ప్రమాదకరమైనది, ప్రణాంతకమైనది. కొన్నిసార్లు కొండ అంచు, కింద ప్రవహించే వాగులకు వందల అడుగుల ఎత్తున అసురక్షితంగా ఉంటుంది. మార్గం కోసుకుపోవడం వలన పోర్టర్లు మేకలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఆ దారిలో కొండల కొమ్ములపై వెళ్ళడానికి ఒకటి రెండింతలు వంగి నడవాలి. 4 మైళ్ల తర్వాత వంతెన ద్వారా సట్లెజ్ నదిని దాటాక కోరంగ్ అనే చిన్న గ్రామం ఉంది. టోలింగ్ తరవాత ఇదే మొదటి గ్రామం. ఒక మైలు దూరంలో కియుక్, 3 మైళ్ల దూరంలో షిప్కి ఉన్నాయి. ... అది [మా శిబిరం] గ్రామానికి అవతలి వైపు ఉందని మరుసటి రోజు మాకు తెలిసింది. షిప్కి లాకు వెళ్లే మార్గంలో దానిని మేం దాటాం. ఇది సరిహద్దు గ్రామం. అక్కడ ఒక లంబార్‌దార్ (ఊరిపెద్ద) ఉన్నాడు. అతను ఉర్దూ మాట్లాడతాడు, చాలా సహాయకారి. 13,420 అడుగుల ఎత్తున ఉన్న షిప్కి లా, టిబెట్ లోని బాషహర్ రాష్ట్రాల మధ్య సరిహద్దు. నాకు తెలిసినంత వరకు ఇది హిమాలయాల గుండా వెళ్ళ గలిగే అతి తక్కువ ఎత్తున ఉన్న మార్గం. సంవత్సరంలో ఎక్కువ భాగం తెరిచి ఉంటుంది: ఆ కనుమలో నేను విశ్రాంతి తీసుకొని టిబెట్ వైపు తిరిగి చూసాను. ఉదయ సూర్యుని వెలుగులో అది బంగారు గోధుమ రంగులోకి మారుతోంది. నా వెనక లియో పార్గియల్ పర్వతం నిలువెత్తున నిలిచి ఉంది. క్రింద సట్లెజ్ నది మోతపెడుతూ పారుతోంది. ఎదర ఇల్లు, నాగరికత ఉన్నాయి.[4]: 11
చైనా భారత వాణిజ్యం
[మార్చు]కారకోరం హైవే రవాణాకు ప్రమాదకరంగా ఉన్నందున అరేబియా సముద్రానికి చేరేందుకు ఎన్‌హెచ్ 5 ని మార్గంగా ఉపయోగించవచ్చని సూచించబడింది. దీని కోసం షిప్కి లా వద్ద సరిహద్దును తెరవడం వల్ల సరిహద్దుకు ఇరువైపులా వాణిజ్యం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.[5][1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "India-China trade through Shipki La reaches new high". Hindustan Times. Retrieved 9 June 2017.
- ↑ "Chinese horses: Bought for peanuts, sold at a premium - Hindustan Times". Archived from the original on 12 October 2014. Retrieved 2011-12-30.
- ↑ "Shipki La". www.dangerousroads.org. Retrieved 18 August 2017.
- ↑ 4.0 4.1 Hamond, Robert (January 1942), "Through Western Tibet in 1939", The Geographical Journal, vol. 99, no. 1, pp. 1–12, doi:10.2307/1788090, JSTOR 1788090
- ↑ "India-China Bhai Bhai revisited - India Global News - IBNLive". Ibnlive.in.com. Archived from the original on 2012-01-08. Retrieved 2011-12-14.