ఇస్రా, మేరాజ్
ఇస్లామీయ సాంప్రదాయాలలో ఇస్రా, మేరాజ్ (అరబ్బీ : الإسراء والمعراج), అనునవి సా.శ. 621 (1 హిజ్రీ పూర్వం) మహమ్మదు ప్రవక్త గారి షబ్-ఎ-మేరాజ్ న ఆరోహణాకార్యక్రమాల రెండు భాగాలు. మహమ్మదు ప్రవక్త భౌతికంగా మేరాజ్ ప్రయాణం చేశారని చాలామంది ముస్లిం పండితుల అభిప్రాయం. కొందరైతే ఆత్మపరంగా మేరాజ్ ప్రయాణం చేశారని భావిస్తారు.[1] క్లుప్తంగా ఈ ప్రయాణ సారాంశాన్ని ఖురాన్ లోని అల్-ఇస్రా సూరాలో 1 నుండి 60 సూక్తులలో వర్ణింపబడింది. ఇతరత్రా విషయాలు హదీసులలో నుండి లభించాయి.
- ఇస్రా: మక్కా నగరంలోని కాబాలో మహమ్మదు ప్రవక్త విశ్రాంతి తీసుకొనుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై, అల్లాహ్ ఆజ్ఞతో బుర్రాఖ్ పై కూర్చుబెట్టుకొని, మక్కానుండి "సుదూరపు మస్జిద్" (జెరూసలేం లోని మస్జిద్-అల్-అఖ్సా) కు తీసుకెళ్ళాడు. ఈ ప్రయాణాన్ని ఇస్రా అంటారు. ఇచ్చట ప్రవక్తల నమాజుకు ఇమామత్ చేశారు.
- మేరాజ్: "సుదూరపు మస్జిద్" నుండి జిబ్రయీల్, మహమ్మదు ప్రవక్తను బుర్రాఖ్ పై కూర్చోబెట్టి, మేరాజ్ స్వర్గారోహణకై తీసుకెళ్ళాడు. ఈ ప్రయాణాన్ని మేరాజ్ అంటారు.
ఈ ఆరోహణలో మహమ్మదు ప్రవక్త ఇతర ప్రవక్తలతో సంభాషిస్తాడు. అల్లాహ్ తోనూ సంభాషిస్తాడు. ఈ శుభఘడియలో అల్లాహ్ తన బహుమానంగా మహమ్మదు ప్రవక్తకు 5 పూటల ప్రార్థనలను (నమాజ్ లను) ప్రసాదిస్తాడు.
ఈ మహమ్మదు ప్రవక్త 'ఇస్రా, మేరాజ్' ఆరోహణనూ, ప్రయాణాన్ని విశ్వాసులు నమ్ముతారు (అందులో అబూబక్ర్ ప్రథముడు), అవిశ్వాసులు నమ్మక గేలిచేస్తారు.
మహమ్మదు ప్రవక్త 'ఇస్రా మేరాజ్' లను పునస్కరించుకొని ముస్లింలు షబ్-ఎ-మేరాజ్ లేదా లైలతుల్ మేరాజ్ పర్వాన్ని గడుపుకొంటారు. రాత్రంతా జాగారం చేసి నమాజ్ చేస్తారు.
ప్రయాణ విధము
[మార్చు]పెక్కు మంది ముస్లింలు ఈ ప్రయాణాన్ని 'భౌతిక (బొందితో) ప్రయాణ'మని నమ్ముతారు. కొందరైతే ఈ ప్రయాణం 'ఆత్మ పరమైన ప్రయాణం' (కల) అని భావిస్తారు. ఇస్లామీయ చరిత్రకారుడు ఇబ్న్ ఇస్ హాఖ్ ప్రకారం ఈ ప్రయాణం ఆత్మపర ప్రయాణం. హదీసుల ప్రకారం ఆయెషా సిద్దీఖా (మహమ్మదు ప్రవక్త గారి పత్ని) ఇలా చెప్పారు: "మహమ్మదు ప్రవక్త గారి ఆత్మ ఈ సుదూర ప్రయాణం (మేరాజ్) చేసింది" అని. కానీ అల్-తబరి, ఇబ్న్ కసీర్ ల ప్రకారం ఈ ప్రయాణం భౌతికమయినది.[2] అబుల్ అలా మౌదూది ప్రకారం : "ఇతర హదీసుల ప్రకారం ఈ ప్రయాణం భౌతికమయినది", " ఆత్మపరమైన ప్రయాణమని విశ్వాసులు అంగీకరించరు".[3]
మస్జిద్ అల్-అఖ్సా, సుదూరపు మస్జిద్
[మార్చు]మేరాజ్ జరిగిన సమయంలో, ఆ ప్రాంతంలో మస్జిద్ లేదు. అందుకే ఆ మస్జిద్ కు 'సుదూరపు మస్జిద్' లేక మస్జిద్-ఎ-అఖ్సా (అరబ్బీ భాష : المسجد الأقصى ) అని అంటారు. దీని వర్ణన ఖురాన్ 17:1,లో జరిగింది.ఈ మస్జిద్ జెరూసలేం లోని మస్జిద్ ల సమూహంలో గలదు.[4]
నవీన ధృక్పదం
[మార్చు]ఇస్లాంలో పర్వదినమైన లైలతుల్-మేరాజ్, హిజ్రత్కు ముందు తాయిఫ్ ప్రజలవద్దకు వెళ్ళకముందు జరిగింది. రజబ్ నెల 27వ తేదీన రాత్రి జరిగింది.
లైలతుల్-మేరాజ్ (అరబ్బీ: لیلة المعراج, లేదా షబ్-ఎ-మేరాజ్ అరబ్బీ شب معراج, ప్రపంచంలోని అన్ని దేశాలలోని ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వాన మస్జిద్ లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది. మహమ్మదు ప్రవక్త ఏ విధంగా అల్లాహ్ను కలవడానికి జిబ్రయీల్తో బుర్రాఖ్ పై ప్రయాణ మయ్యారు, వారి ప్రయాణం యేవిధంగా జరిగింది, అల్లాహ్, మహమ్మద్ ల మధ్య సంభాషణ, వాటి విషయాలు యేవి ఇవన్నియూ ప్రసంగరూపంలో సాగుతాయి. ఈ రాత్రిప్రయాణం జరిగి అల్లాహ్ తో సంభాషించిన తరువాత అల్లాహ్, మహమ్మదు ప్రవక్త ఆయన అనుచరులంతా రోజుకు అయిదు సార్లు నమాజ్ చెయ్యాలని ఆదేశిస్తాడు.[5][6]
ఖురాన్, హదీసులు
[మార్చు]ఈ విషయంగూర్చి ఖురాన్లో కొద్దిగా మాత్రంమే చర్చింపబడింది. హదీసులలో సంపూర్ణంగా వివరింపబడింది. ఇస్రా గూర్చి ఖురాన్ లోని 17వ సూరా అల్-ఇస్రాలో వర్ణింపబడింది. సూరా అన్-నజ్మ్లో కూడా ఇస్రా, మేరాజ్ గురించి వర్ణింపబడింది.[7]
ఖురాన్
[మార్చు]ఖురాన్ లో వర్ణనలు
“ | QuoteQuran | ” |
—Glory to (Allah) Who did take His servant for a Journey by night from the Sacred Mosque to the farthest Mosque, whose precincts We did bless,- in order that We might show him some of Our Signs: for He is the One Who heareth and seeth (all things)., 102 |
“ | QuoteQuran | ” |
—Behold! We told thee that thy Lord doth encompass mankind round about: We granted the vision which We showed thee, but as a trial for men,- as also the Cursed Tree (mentioned) in the Qur'an: We put terror (and warning) into them, but it only increases their inordinate transgression!, 102 |
“ | QuoteQuran-range | ” |
—18, For indeed he saw him at a second descent, Near the Lote-tree beyond which none may pass: Near it is the Garden of Abode. Behold, the Lote-tree was shrouded (in mystery unspeakable!) (His) sight never swerved, nor did it go wrong! For truly did he see, of the Signs of his Lord, the Greatest! |
హదీసులు
[మార్చు]హదీసులలో అతిముఖ్యమైన హదీసులు అనస్ బిన్ మాలిక్ (612-712) చే ఉల్లేఖించబడినవి. మహమ్మదు ప్రవక్త మేరాజ్ సమయంలో అనస్ బిన్ మాలిక్ యువకుడు.
ఇవీ చూడండి
[మార్చు]Notes
[మార్చు]- ↑ Al-Mawrid Institute. "A Question on the Night Journey of the Prophet". understanding-islam.com. Archived from the original on 2008-01-27. Retrieved 2008-02-25.
- ↑ Encyclopedia of Islam and Muslim world, Macmillan reference, USA, 2004. p.482
- ↑ Sayyid Abul Ala Maududi, The Meaning of the Qur'an (tafsir), 17:60 Archived 2007-09-28 at the Wayback Machine
- ↑ Moiz Amjad, The Position of Jerusalem and the Bayet al-Maqdas in Islam Archived 2008-01-26 at the Wayback Machine, understanding-islam.com Archived 2016-03-07 at the Wayback Machine, Al-Mawrid Institute
- ↑ BBC Religion and Ethics - Lailat al Miraj
- ↑ WRMEA article on Muslim holidays
- ↑ Sayyid Abul Ala Maududi, The Meaning of the Qur'an (tafsir).53:13 Archived 2007-09-28 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- "The Treatise of al-Miraj - from Risale-i Nur"
- "Night Journey"
- The Miracle of al-Isra and al-Mir’aj
- Egyptian Ministry of Culture Publication: The Prophet Muhammad's 'Night Journey' was Not to Jerusalem but to Medina
- The Position of Jerusalem and the Bayet al-Maqdas in Islam
- A. Bevan, Mohammed's Ascension to Heaven, in "Studien zu Semitischen Philologie und Religionsgeschichte Julius Wellhausen," (Topelman, 1914,pp. 53–54.)
- B. Schreike, "Die Himmelreise Muhammeds," Der Islam 6 (1915–16): 1-30
- Colby, Frederick. The Subtleties of the Ascension: Lata'if Al-Miraj: Early Mystical Sayings on Muhammad's Heavenly Journey. City: Fons Vitae, 2006.[1]
- J. Horovitz, "Muhammeds Himmelfahrt," Der Islam 9 (1919): 159-83
- Heribert Busse and Georg Kretschmar, Jerusalemer Heiligstumstraditionen (Wiesbaden: Otto Harrassowitz, 1987)
- Heribert Busse, "The Destruction Of The Temple And Its Reconstruction In The Light Of Muslim Exegesis Of Sûra 17:2–8", Jerusalem Studies In Arabic And Islam, 1996, Vol. 20, p. 1.
బయటి లింకులు
[మార్చు]- "The Treatise of al-Miraj - from Risale-i Nur"
- "Night Journey"
- The Miracle of al-Isra and al-Mir’aj
- Egyptian Ministry of Culture Publication: The Prophet Muhammad's 'Night Journey' was Not to Jerusalem but to Medina
- The Position of Jerusalem and the Bayet al-Maqdas in Islam
- http://www.sunnah.org/ibadaat/fasting/ascen3.htm Archived 2018-04-20 at the Wayback Machine