షకీల్ ఖాన్
స్వరూపం
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1], 2006 మే 3 |
షకీల్ అహ్మద్ ఖాన్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్. 1987లో ఒక వన్డే ఆడాడు.[1]
జననం
[మార్చు]షకీల్ అహ్మద్ ఖాన్ 1968, మే 28న పాకిస్తాన్, పంజాబ్ లోని లాహోర్లో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]పొడుగ్గా, బలంగా ఉన్న షకీల్ ఖాన్ హబీబ్ బ్యాంక్ తరపున మీడియం పేస్ బౌలింగ్ చేశాడు. 1987లో వసీం అక్రమ్ గాయపడినప్పుడు పాకిస్థాన్ తరఫున వన్డే ఆడేందుకు ఎంపికయ్యాడు. పెషావర్‌లోని అర్బాబ్ నియాజ్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో ఆడాడు. తొమ్మిది ఓవర్ల స్పెల్‌లో 50 పరుగులిచ్చి క్రిస్ బ్రాడ్ వికెట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 98 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్ చివరి ఆటగాడిగా బ్యాటింగ్ కు వచ్చి డకౌట్ అయ్యాడు.[3] తరువాత మళ్ళీ పాకిస్థాన్ తరపున ఆడలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "Shakeel Khan Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
- ↑ "Shakeel Khan Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
- ↑ "ENG vs PAK, England tour of Pakistan 1987/88, 3rd ODI at Peshawar, November 22, 1987 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.