Jump to content

శ్వేతా తివారీ

వికీపీడియా నుండి
శ్వేతా తివారి
జననం (1980-10-04) 1980 అక్టోబరు 4 (వయసు 44)[1]
ప్రతాప్ గఢ్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రాజా చౌదరి
(m. 1998; div. 2007)

అభినవ్ కోహ్లీ
(m. 2013; sep. 2019)
పిల్లలు2

శ్వేతా తివారీ (జననం 4 అక్టోబర్ 1980) భారతదేశానికి చెందిన హిందీ సినిమా, టెలివిజన్ నటి.[2] ఆమె 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచమై స్టార్ ప్లస్  ఛానల్ లో 2001 నుండి 08 వరకు కసౌతీ జిందగీ కే సీరియల్ లో ప్రేరణా శర్మ బసు పాత్ర ద్వారా మంచి గుర్తింపునందుకుంది. ఆమె  ఆ తర్వాత పర్వర్రిష్ (2011–2013), బెగుసరాయ్‌ (2015), మేరే డాడ్ కి దుల్హన్ (2019–2020) వంటి అనేక  ధారావాహికలలో నటించింది.[3] తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచింది.[4]

శ్వేతా తివారి బిగ్ బాస్ గెలిచినా క్షణాన

వైవాహిక జీవితం

[మార్చు]

తివారీ 1998లో నటుడు రాజా చౌదరిని వివాహం చేసుకొని తొమ్మిదేళ్ల తర్వాత 2007లో విడాకుల తీసుకుంది. వారికి 8 అక్టోబర్ 2000న కుమార్తె పాలక్ తివారీ జన్మించింది.[5][6] ఆమె ఆ తరువాత నటుడు అభినవ్ కోహ్లీ తో మూడు సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత 13 జూలై 2013న ఆయనను వివాహం చేసుకొని 2016 నవంబర్ 27న మగబిడ్డకు జన్మనిచ్చింది. తివారీ, కోహ్లిలు 2019లో విడిపోయారు.[7][8][9]

తివారి ఆమె కూతురితో 2012లో

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు   పాత్ర భాష గమనికలు
2004 మధోషి తబ్బసుమ్ హిందీ
ఆబ్ర కా దాబ్రా శివాని ఆర్. సింగ్
2008 త్రినేత్ర నేపాలీ
హమర్ సయన్ హిందుస్తానీ భోజ్‌పురి
కబ్ ఐబు అంగన్వా హమార్ నైనా
2009 ఏ భౌజీ కే సోదరి
అప్నీ బోలి అప్నా దేస్ సత్కర్ కౌర్ పంజాబీ
దేవ్రు కన్నడ అతిథి
2010 బెన్నీ అండ్ బబ్లూ షీనా హిందీ
2011 బిన్ బులాయే బరాతీ రాజ్జో / రోసీ
మిలే నా మిలే హమ్ ఒక పాటలో ప్రత్యేక ప్రదర్శన
2012 మ్యారీడ్ 2 అమెరికా ప్రతాప్ సింగ్ భార్య
యెడ్యాంచి జాతర మరాఠీ అతిథి
2014 సుల్తానాత్ ఉర్దూ
2023 మిత్రన్ దా నా చల్దా అడ్వా. ఇందు మిట్టల్ పంజాబీ
పర్పుల్ స్కార్ఫ్ దేవయాని హిందీ షార్ట్ ఫిల్మ్

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు   పాత్ర భాష గమనికలు మూ
2019 హమ్ తుమ్ అండ్ దెమ్ శివుడు హిందీ
2024 ఇండియన్ పోలీస్ ఫోర్స్ శృతి బక్షి హిందీ

మూలాలు

[మార్చు]
  1. Farzeen, Sana (4 October 2017). "Happy Birthday Shweta Tiwari: Salute to a woman who aced all her roles". The Indian Express. Retrieved 13 April 2019.
  2. Farzeen, Sana (4 October 2017). "Happy Birthday Shweta Tiwari: Salute to a woman who aced all her roles". The Indian Express. Retrieved 13 April 2019.
  3. "Shweta Tiwari birthday: Some facts about the 'Kasautii Zindagii Kay' actress". Times Now. 4 January 2018. Archived from the original on 9 March 2022. Retrieved 13 April 2019.
  4. "Palak Tiwari Opens Up On Nepotism". The Statesman. 9 May 2022. Retrieved 18 May 2022.
  5. "Shweta Tiwari's daughter Palak turns 17, actor shares special birthday wish for her sweetheart". The Indian Express (in Indian English). 8 October 2017. Retrieved 12 August 2019.
  6. "Shweta files for divorce". The Telegraph. 20 June 2007. Retrieved 18 May 2022.
  7. "Shweta Tiwari gives birth to baby boy". The Indian Express (in ఇంగ్లీష్). 3 December 2016. Retrieved 18 May 2022.
  8. "Shweta Tiwari promises something beautiful to son Reyansh on his birthday, see photos". The Indian Express (in Indian English). 5 December 2017. Retrieved 12 August 2019.
  9. "Shweta Tiwari on separation with 2nd husband: I will do what is right for my kids". India Today (in ఇంగ్లీష్). 12 October 2019. Retrieved 12 November 2019.

బయటి లింకులు

[మార్చు]