శ్రేష్ఠ
శ్రేష్ఠ | |
---|---|
జననం | 30 ఆగస్టు 1986 [1] |
వృత్తి | కవియిత్రి,గేయ రచయిత |
తల్లిదండ్రులు |
|
శ్రేష్ఠ తెలుగు సినిమా సినీ గేయ రచయిత. ఆమె 2012లో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ సినిమా ద్వారా సినీ రచయితగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. శ్రేష్ఠ 'అర్జున్ రెడ్డి', 'పెళ్లిచూపులు' సినిమాలకు పాటలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.[2][3][4]
జననం, విద్యాభాస్యం
[మార్చు]శ్రేష్ఠ 30 ఆగస్టు 1986లో తెలంగాణ రాష్ట్రం , ఆదిలాబాద్ జిల్లా , మంచిర్యాల లో చంద్రకళ, జాన్ శామ్యూల్ వెస్లీ దంపతులకు జన్మించింది. ఆమె ఉన్నత విద్యాభాస్యంత మంచిర్యాలలోనే పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బి పూర్తి చేసింది. శ్రేష్ఠ విద్యార్థి దశలోనే ‘మై కాలేజ్ లైఫ్’ అనే కవితా సంపుటిని ప్రచురించింది.[5]
రచించిన పాటలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | సంగీతం | పాట |
---|---|---|---|
2012 | ఒక రొమాంటిక్ క్రైమ్ కథ | ప్రవీణ్ ఇమ్మడి | అన్ని పాటలు |
2012 | కో అంటే కోటి | శక్తికాంత్ కార్తిక్ | "ఓ మధురిమవే ఎందుకు", "బంగారు కొండా" |
2012 | మైత్రి | వికాస్ | " ‘జిల్ జిల్ జిల్ జిగేలే నే" |
2013 | జబర్‌దస్త్ | ఎస్.ఎస్. తమన్ | "అరెరే అరెరే" |
2013 | వెయిటింగ్ ఫర్ యు | ప్రవీణ్ ఇమ్మడి | "ప్రాణం పురివిప్పిన వేళ" |
2015 | కొరియర్ బాయ్ కళ్యాణ్ | కార్తీక్ - అనూప్ రూబెన్స్ | "మాయ ఓ మాయ" |
2016 | పెళ్లి చూపులు | వివేక్ సాగర్ | "చినుకు తాకే", "మెరిసే మెరిసే" |
2017 | అర్జున్ రెడ్డి | రధన్ | "మధురమే" , "గుండెలోన" |
2017 | యుద్ధం శరణం | వివేక్ సాగర్ | "నీవాలనే", "ఎన్నో ఎన్నో భావాలే" |
2017 | హలో | అనూప్ రూబెన్స్ | "హలో","మెరిసే మెరిసే" |
2018 | ఆటగాళ్ళు | సాయి కార్తీక్ | "నీవల్లే నీవల్లే" |
2018 | ప్రేమకు రెయిన్ చెక్ | దీపక్ కిరణ్ | "ప్రాణమా" |
2018 | అభిమన్యుడు | యువన్ శంకర్‌రాజా | "అడిగే హృదయమే" |
2019 | నువ్వు తోపురా | పీఏ దీపక్ | "పద పదమని" |
2019 | దొరసాని | ప్రశాంత్ ఆర్ విహారి | "కళ్ళల్లో" |
2020 | ప్రెషర్ కుక్కర్ | సునీల్ కశ్యప్ | "నీ హృదయంతో నా హృదయం కలుసుకోనీ" |
2020 | మెరిసే మెరిసే | కార్తీక్ కొడకండ్ల | "కనులతో రచించు " |
2021 | ఈ కథలో పాత్రలు కల్పితం | కార్తీక్ కొడకండ్ల | "ఏమిటో ఏమిటో" |
2021 | డర్టీ హరి | మార్క్ కె రాబిన్ | "రాధా నీ రాధా" |
2024 | అలనాటి రామచంద్రుడు |
సినీరంగంలో వేధింపులు
[మార్చు]సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల (కాస్టింగ్ కౌచ్) గురించి శ్రేష్ఠ స్పందిస్తూ తాను కూడా వేధింపులకు లోనయ్యామంటూ చెప్పింది. ఈ వేధింపుల కారణంగా ఆమె రెండు సంవత్సరాలకు పైగా కెరీర్‌ను వదులుకున్నాని చెప్పింది.[6][7][8]
అవార్డులు
[మార్చు]- 2017లో ఉత్తమ సినీ గేయ రచయితగా జీ గోల్డెన్ అవార్డు
- 2019లో అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈటీవి వసుంధర పురస్కారం
- 2019లో సినారె - వంశీ ఫిలిం అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (10 July 2021). "తొలి తెలంగాణ సినీగేయ రచయిత్రి 'శ్రేష్ఠ'". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ "Songwriter chronicles: Lyricist Shreshta". The Hindu. Retrieved 2017-09-26.
- ↑ ఈనాడు. "ఆమె పాటల వెనక... ఎన్ని పాట్లున్నాయో!". Archived from the original on 13 October 2017. Retrieved 30 September 2017.
- ↑ BBC News తెలుగు (8 March 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ The New Indian Express (26 February 2020). "Lyricist Shreshta: There is gender discrimination in the Telugu film industry" (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ HMTV (4 January 2018). "ఆ డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టాలనిపించింది". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ BBC News తెలుగు (2 November 2017). "ఆ ప్రొడ్యూసర్ల భార్యలే 'ఒప్పుకోమనేవారు'". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ Sakshi (17 June 2018). "క్యాస్టింగ్ కౌచ్‌పై 'అర్జున్ రెడ్డి' ఫేం షాకింగ్ నిజాలు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.