శ్రీరామకృష్ణ
Jump to navigation
Jump to search
శ్రీరామకృష్ణ | |
---|---|
జననం | ముక్కామల రామకృష్ణ |
మరణం | 2024 ఏప్రిల్ 01 |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | ఎమ్.రామకృష్ణ |
వృత్తి | అనువాద సినిమా రచయత, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | - 2020 |
శ్రీరామకృష్ణ (మ. 2024 ఏప్రిల్ 01) భారతీయ ప్రముఖ సినీ రచయిత.[1] ఆయన బొంబాయి (1995), జెంటిల్‌మాన్ (1993), చంద్రముఖి (2005), అపరిచితుడు (2005) వంటి సినిమాలతో డబ్బింగ్ రచయితగా ప్రసిద్ధిచెందాడు. ఆయన చివరిగా సుప్రసిద్ధ నటుడు రజనీకాంత్ నటించిన దర్బార్ (2020) చిత్రానికి మాటలు అందించాడు. ఆయన మొత్తం కెరీర్ లో 300లకు పైగా చిత్రాలకు రచయితగా పనిచేయడమే కాకుండా బాలమురళి ఎం.ఏ, సమాజంలో స్త్రీ సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.
ఆయన తమిళ సినిమాలకు గీత రచయిత కూడా. అలాగే, ఆయన తెలుగులో విజయవంతమైన ప్రేమిస్తే సినిమాలో టైటిల్ సాంగ్‌ను రాశాడు.
సినిమాలు
[మార్చు](పాక్షికం)
- కోనసీమ మొనగాడు (1996)
- జీన్స్ (1998)
- ఒకేఒక్కడు (1999)
- నిన్ను చూసాక (2001)
- యుగానికి ఒక్కడు (2010)
మరణం
[మార్చు]శ్రీరామకృష్ణ 74 ఏళ్ల వయసులో అనారోగ్యంతో అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2024 ఏప్రిల్ 1న తుదిశ్వాస విడిచాడు. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "ప్రముఖ సినీ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత". EENADU. Retrieved 2024-04-02.