శివమణి (సినిమా)
స్వరూపం
శివమణి | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాథ్ |
రచన | కోన వెంకట్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | పూరీ జగన్నాథ్ |
కథ | పూరీ జగన్నాథ్ |
నిర్మాత | పూరీ జగన్నాథ్ డి.వి.వి. దానయ్య (సమర్పణ) |
తారాగణం | అక్కినేని నాగార్జున రక్షిత అసిన్ |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | డి. వి. వి. ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 23 అక్టోబరు 2003 |
సినిమా నిడివి | 143 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శివమణి 2003 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ ప్రేమకథా చిత్రం.[1] ఇందులో అక్కినేని నాగార్జున, అసిన్, రక్షిత ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు. కథలోని కొంత భాగం 1999లో విడుదలైన మెసేజ్ ఇన్ ఎ బాటిల్ చిత్రం నుండి తీసుకోబడింది, ఇది మెసేజ్ ఇన్ ఎ బాటిల్ - నికోలస్ స్పార్క్స్ నవల నుండి ప్రేరణ పొందింది.
కథ
[మార్చు]శివమణి వైజాగ్ పూర్ణా మార్కెట్ సి. ఐ. చాలా నిజాయితీ గల అధికారి. ప్రజలందరికీ తన ఫోను నెంబరు ఇచ్చి ఏ సమస్య ఉన్నా అతనికి ఫోన్ చేయమని చెబుతాడు. వసంత అనే అమ్మాయి సరదాగా అతనికి ఫోన్ చేస్తుంది. నెమ్మదిగా వసంత అతని ప్రేమలో పడుతుంది.
తారాగణం
[మార్చు]- శివమణిగా అక్కినేని నాగార్జున
- వసంతగా అసిన్
- పల్లవిగా రక్షిత[2]
- దత్తుగా ప్రకాష్ రాజ్
- ఆలీ
- ఎం. ఎస్. నారాయణ
- శివమణి తల్లిగా సంగీత
- వసంత తండ్రిగా మోహన్ రాజ్
- ఎ. సి. పి.గా బెనర్జీ
- బ్రహ్మాజీ
- ఎ. వి. ఎస్
- బండ్ల గణేష్
పాటలు
[మార్చు]- రామా రామా నీలిమేఘ శ్యామా , రచన: కందికోండ, గానం: కౌసల్య
- ఏనాటికీ మన , రచన: భాస్కర భట్ల , గానం.రఘుకుంచె, కౌసల్య
- గోల్డ్ రంగు, రచన: కందికొండ , గానం: రవివర్మ, రేవతి
- ఏ లోపలో , రచన: విశ్వ , గానం.స్మిత
- మోనా మోనా రచన: చక్రి , గానం. హరి హరన్, కౌసల్య
- సన్ సన్ , రచన: కందికొండ , గానం. శంకర మహదేవన్, కౌసల్య.
మూలాలు
[మార్చు]- ↑ G. V, Ramana. "Sivamani movie review". idlebrain.com. Retrieved 20 March 2018.
- ↑ The Times of India, Entertainment (1 April 2020). "From Idiot to Andhrawala, 5 movies of Rakshita you shouldn't miss". Archived from the original on 2 April 2020. Retrieved 6 June 2020.