Jump to content

వైకుంఠ లక్ష్మీపురం

అక్షాంశ రేఖాంశాలు: 16°35′23″N 80°59′34″E / 16.589802°N 80.992665°E / 16.589802; 80.992665
వికీపీడియా నుండి
వైకుంఠ లక్ష్మీపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
వైకుంఠ లక్ష్మీపురం is located in Andhra Pradesh
వైకుంఠ లక్ష్మీపురం
వైకుంఠ లక్ష్మీపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°35′23″N 80°59′34″E / 16.589802°N 80.992665°E / 16.589802; 80.992665
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521105
ఎస్.టి.డి కోడ్

వైకుంఠ లక్ష్మీపురం, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లాలో ఒక అతి చిన్న రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామానికి చెందిన అట్లూరి వంశీకులు స్వాతంత్ర్యానికి పూర్వం గ్రామంలో మూడున్నర ఎకరాల పొలంలో మంచినీటి చెరువును త్రవ్వించారు. ఇప్పుడు ప్రజలు శుద్ధినీటి వినియోగానికి అలవాటు పడటంతో, అట్లూరి వంశీకుల వారసులు గ్రామంలో లక్షల రూపాయల వ్యయంతో అధునాతన నీటిశుద్ధి పధకాన్ని, ఈ మంచినీటి పధకానికి అనుసంధానంగా నిర్మించారు. సద్గురు సాయినాధుని సేవాసమితి పేరిట దీనిని నిర్మించి, 2013 ఆగస్టు 11 నాడు ప్రారంభించారు. [1]

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

మంచినీటి చెరువు:- రెండు సంవత్సరాల క్రితం, ఈ చెరువులో పూడికతీత నిర్వహించారు. ఇప్పుడు, దాత శ్రీ పుట్టగుంట సతీష్‌కుమార్ వితరణగా అందించిన ఒక లక్షరూపాయలతో, ఈ చెరువులో ఒక ర్యాంప్ నిర్మాణాన్ని ప్రారంభించారు. [5]

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం, కాకులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

ప్రధానమైన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]

సూరపనేని లక్ష్మీనరసింహారావు:ఇతను ఈ గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోనే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు. తరువాత వీరు 1978లో భాషాప్రవీణ పూర్తిచేసి తెలుగు పండితులుగా శిక్షణ పూర్తిచేసుకున్నారు. 1984లో ప్రత్యేక భాషా పండితులుగా ఉద్యోగం వచ్చింది. 1985లో గ్రేడ్-2 పండితులుగానూ, 1988లో గ్రేడ్-1 పండితులుగానూ పదోన్నతులు పొందినారు. ఉపాధ్యాయవృత్తిలో నియమబద్ధంగా పనిచేయుచూనే, దూర విద్యా విధానంలో వీరు ఎం.ఏ., బి.ఈ.డి., పట్టాలు పొందినారు. వీరు 1992 నుండి 2002 వరకు, వీరు ఈగ్రామ పాఠశాలలోనే తెలుగు పండితులుగా పనిచేసారు. మరల 2012లో ఈ పాఠశాలకే బదిలీమీద వచ్చి, ప్రస్తుతం ఈ పాఠశాలలోనే తెలుగు పండితులుగా కొనసాగుచున్నారు. వీరికి చదువంటే ఆరో ప్రాణం. ఈ పాఠశాల విద్యార్థులకు తెలుగు భాషా నైపుణ్యం పెంపొందించేటందుకు తన వంతు కృషిచేస్తున్నారు. ఈ పాఠశాలలో 10వ తరగతి తుది పరీక్షలలో తెలుగులో ఉత్తీర్ణతా శాతం, దాదాపు 100% ఉన్నదంటే, అది వీరి కృషి ఫలితమే. ఫలితంగా ఈ సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. వీరు ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలుచుచునారు. [2]

గ్రామ విశేషాలు

[మార్చు]

స్థానిక పారిశ్రామికవేత్త శ్రీ పుట్టగుంట సతీష్ కుమార్, ఈ గ్రామాన్ని అకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయటానికై దత్తత తీసుకున్నారు. [4]

గ్రామ వ్యవసాయ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామములో అట్లూరి బాలసత్యనారాయణ అను రైతు, ఈ ప్రాంతంలో మొదటిసారిగా, ఈ ఏడాది, బాస్మతి వరి ధాన్యం సాగుచేసారు. ప్రత్యేకశ్రద్ధతో పైరుని పర్యవేక్షించి, ఒక ఎకరానికి 30 బస్తాల దిగుబడి అంచనాతో పంట కోతకు సిద్ధమగుచున్నారు. ప్రస్తుతం మార్కెట్టులో ఒక బస్తా బాస్మతి ధాన్యం రు. 3,200-00 ఉండగా ఎకరానికి రు. 90,000-00 ఆదాయం రాగలదని అంచనా. బాస్మతి వరిసాగుకు మన ప్రాంతం అనుకూలమేనని ఈ ప్రయోగం ద్వారా నిరూపితమైనది. సాధారణ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చునని, ఇక్కడి రైతులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. [3]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

[1] ఈనాడు విజయవాడ; 2013, ఆగస్టు-12; 5వపేజీ. [2] ఈనాడు విజయవాడ; 2014, నవంబరు-1; 4వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014, డిసెంబరు-8; 4వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, జూలై-13; 3వపేజీ.