Jump to content

వేమూరి రాధాకృష్ణమూర్తి

వికీపీడియా నుండి
వేమూరి రాధాకృష్ణమూర్తి
జననంసెప్టెంబర్ 20, 1934
మరణంఅక్టోబరు 4, 2001
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, దర్శకుడు
తల్లిదండ్రులువేమూరి రామమూర్తి, సీతారావమ్మ

వేమూరి రాధాకృష్ణమూర్తి (సెప్టెంబర్ 20, 1934 - అక్టోబరు 4, 2001) ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు. శ్రీరామభక్త కళా సమితి స్థాపకుడు.[1]

జననం - ఉద్యోగం

[మార్చు]

రాధాకృష్ణమూర్తి 1934, సెప్టెంబర్ 20న వేమూరి రామమూర్తి, సీతారావమ్మ దంపతులకు తెనాలి తాలుకా వేమూరులో జన్మించాడు. 1955లో సచివాలయంలో ఉద్యోగంలో చేరాడు. 1992, సెస్టెంబర్ 30న సచివాలయంలో డిప్యూటి సెక్రటరీ హోదాలో పదవీ విరమణ చేశాడు.

నాటకరంగ ప్రస్థానం

[మార్చు]

చిన్నవయసునుండే నాటకాలపై అసక్తి ఉన్న రాధాకృష్ణమూర్తి తన ఎనిమిదవ ఏట ధృవవిజయం అనే నాటకంలో స్త్రీపాత్ర పోషించాడు. పారశాల, కళాశాల రోజులలో నాటకాల్లో నటించాడు. 1966లో హైదరాబాద్ లో శ్రీభక్తరామదాసు కళాసమితి సమాజాన్ని స్థాపించి అనేక నాటకాలు పర్రదర్శించాడు. 1988నుంచి సంస్కారభారతి హైదరాబాద్ శాఖ ప్రదర్శించిన అనేక నాటకాలకు దర్శకత్వం వహించాడు. దుర్యోధనుడు అనవేమారెడ్డి, గయుడు, హరిశ్చంద్రుడు, రంగారాయుడు, భోజరాజు మొదలైన పాత్రలు ధరించాడు.

నటించిన నాటకాలు:

దర్శకత్వం చేసినవి:

  • నాయకురాలు
  • అల్లూరి సీతారామరాజు
  • లేపక్షి
  • విజయయాంధ్ర
  • మనిషిలో మనిషి
  • బంగారు సంకెళ్లు
  • విషప్రయోగం
  • రాజరాజు
  • శిరోమణి
  • రాజీనామా

బహుమతులు:

  • నంది బహుమతి: ఉత్తమ దర్శకుడు - మహాకవి కాళిదాసు (నాటకం), సంస్కార భారతి, 2001
  • ఉత్తమ బహుమతులు 5 - కప్పలు (నాటకం), హైదరాబాద్, 1956.

మరణం

[మార్చు]

రాధాకృష్ణమూర్తి 2001, అక్టోబరు 4న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.507.