వి. భూపాల్ రెడ్డి
వి. భూపాల్ రెడ్డి | |||
తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్
| |||
పదవీ కాలం 4 జూన్ 2021 - 3 జనవరి 2022 | |||
నియోజకవర్గం | మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గం | ||
---|---|---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 2007- 2009 | |||
నియోజకవర్గం | మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గం | ||
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2007 నుండి 2014 | |||
నియోజకవర్గం | మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1 మే 1947 రామచంద్రాపురం గ్రామం, పటాన్‌చెరు మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం , భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | గీత రెడ్డి | ||
నివాసం | హైదరాబాద్ | ||
మతం | హిందూ |
వెన్నవరం భూపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ శాసన మండలి మాజీ ప్రొటెం చైర్మన్‌గా ఉన్నాడు.[1] ఆయన 2023 జూలై 07న తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2][3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]వి. భూపాల్ రెడ్డి 1947, మే 1న తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం, రామచంద్రాపురం గ్రామంలో వి.నారాయణ రెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1962లో పటాన్‌చెరు లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]వి. భూపాల్ రెడ్డి 1967లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 1969లో పటాన్‌చెరు విద్యాకమిటీ అధ్యక్షుడిగా, 1975 నుండి 78 వరకు రెండు సార్లు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, 1987లో రామచంద్రాపురం మండల ప్రెసిడెంట్‌గా, 1987లో జిల్లా పరిషత్ పంచాయతీ సమితి కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నికై, మెదక్ జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశాడు. ఆయన 1996లో పీసీసీ సభ్యుడిగా, 2000లో పీసీసీ కార్యదర్శిగా పనిచేశాడు. వి. భూపాల్ రెడ్డి 2007లో కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో రెండోసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2012 నుండు 2014 వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[4] వి.భూపాల్ రెడ్డి 2016లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ నుండి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[5]
తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్
[మార్చు]వి.భూపాల్ రెడ్డిని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా 2021, జూన్ 3న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించింది.[6][7] ఆయన 2022 జనవరి 4న మెదక్ ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తైన నేపథ్యంలో శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్‌గా కాలపరిమితి పూర్తి చేసుకున్నాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ Nagaiah, Bhoopathi (3 June 2021). "Bhoopal Reddy: శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి". Disha daily (దిశ): Latest Telugu News | Breaking news. Archived from the original on 4 జూన్ 2021. Retrieved 4 June 2021.
- ↑ T News Telugu (6 July 2023). "తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
- ↑ Namasthe Telangana (7 July 2023). "ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా భూపాల్‌రెడ్డి". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
- ↑ Sakshi (25 June 2014). "భూపాలుడూ పాయే". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
- ↑ The Hindu (4 December 2015). "MLC polls: TRS to field Bhoopal Reddy". The Hindu (in Indian English). Archived from the original on 4 జూన్ 2021. Retrieved 4 June 2021.
- ↑ NTV (3 June 2021). "మండలి ప్రొటెం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డి.. గుత్తాతో భేటీ." NTV. Archived from the original on 4 జూన్ 2021. Retrieved 4 June 2021.
- ↑ TV9 Telugu (3 June 2021). "Protem Chairman: శాసన మండలిలో విచిత్ర పరిస్థితి.. ఒకేసారి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ రిటైర్.. ప్రొటెం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డి - trs mlc bhupal reddy appointed as telangana legislative council protem chairman". TV9 Telugu. Archived from the original on 4 జూన్ 2021. Retrieved 4 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (5 January 2022). "మండలి ప్రొటెమ్ చైర్మన్‌కు వీడ్కోలు". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.