విజయవాడ బైపాస్ రోడ్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయవాడ నగరం గుండా వెళ్ళే జాతీయ రహదారులపై ట్రాఫిక్ వత్తిడిని తగ్గించేందుకు ఉద్దేశించిన మార్గమే విజయవాడ బైపాస్ రోడ్డు. నగరం గుండా వెళ్ళే జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 65 లను కలుపుతూ ఈ 6 వరుసల బైపాస్ రోడ్డును నిర్మిస్తారు. ఈ రోడ్డు పశ్చిమ బైపాస్ రోడ్డు, తూర్పు బైపాస్ రోడ్డు అనే రెండు భాగాలుగా ఉంటుంది. దీన్ని భారత జాతీయ రహదారుల అధికార సంస్థ నిర్మిస్తోంది.

పశ్చిమ బైపాస్ రోడ్డు

[మార్చు]
విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI)
పొడవు17.88 కి.మీ. (11.11 మై.)
Existed2024 జూలై–present
Major junctions
దక్షిణం endజా.ర-16, చినకాకాని, గుంటూరు జిల్లా
ఉత్తరం endచిన్నఅవుటపల్లి, ఎన్‌.టి.ఆర్ జిల్లా
Location
CountryIndia
Statesఆంధ్రప్రదేశ్
Districtsగుంటూరు జిల్లా, ఎన్.టి.ఆర్ జిల్లా, కృష్ణా జిల్లా
రహదారి వ్యవస్థ

పశ్చిమ బైపాస్ రోడ్డు జాతీయ రహదారి 16 పై ఎన్టీయార్ జిల్లా లోని చిన అవుటపల్లి నుండి గుంటూరు జిల్లా లోని చిన కాకాని వరకు 47.88 కిలోమీటర్ల పొడవున ఉంది. ఇందులో భాగంగా కృష్ణానదిపై ఒక వంతెన నిర్మిస్తున్నారు. పశ్చిమ బైపాస్ రోడ్డు, హైదరాబాదు - మచిలీపట్నం జాతీయ రహదారి 65 ని గొల్లపూడి వద్ద దాటుతుంది. ఈ రోడ్డు రాజధాని అమరావతి లోని సీడ్ యాక్సెస్ రోడ్డును కూడా దాటుతుంది.[1]

ఈ రోడ్డును రెండు భాగాలుగా విభజించి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మొదటి భాగమైన చిన అవుటపల్లి నుండి గొల్లపూడి వరకు ఉన్న 30 కిలోమీటర్ల రోడ్డును మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తూండగా, గొల్లపూడి నుండి చిన కాకాని వరకు ఉన్న 17.88 కిలోమీటర్ల రెండవ భాగాన్ని అదాని ఎంటర్‌ప్రైజెస్ లిమిటెద్, నవయుగ ఇంజనీరింగ్ సంస్థ ఉమ్మడి సంస్థ అయిన విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది.

2024 జూన్ నాటికి ఈ రోడ్డు ఇంకా నిర్మాణ దశలో ఉంది. మొదటి భాగం 43 నెలల ఆలస్యం కాగా, రెండవ భాగం 6 నెలల ఆలస్యంతో పనులు నడిస్తున్నాయి.[2]

ఈ రహదారి పనులు 95% పూర్తయ్యాయి. కొన్ని చోట్ల హైటెన్షను విద్యుత్తీగలను తరలించడంలో భూసేకరణ సమస్య ఎదురైనందున మిగతా పని పూర్తి కాలేదు.[3]

తూర్పు బైపాస్ రోడ్డు

[మార్చు]

తాజా అమరిక ప్రకారం 49.32 కిలోమీటర్ల తూర్పు బైపాస్ రోడ్డు కృష్ణా జిల్లా పెద అవుటపల్లి వద్ద జాతీయ రహదారి 16 నుండి చీలి, ఉంగుటూరు, కంకిపాడు, గన్నవరం మండలాల గుండా రొయ్యూరు వద్ద కృష్ణానదిని దాటి గుంటూరు జిల్లా చినకాకాని వద్ద మళ్ళీ జాతీయ రహదారి 16 ను కలుస్తుంది. పశ్చిమ బైపాస్ రోడ్డు, విజయవాడ నగరానికి పశ్చిమంగా పోతూండగా, ఇది నగరానికి తూర్పుగా వెళ్తుంది. ఈ రోడ్డు పని ఇంకా మొదలు కాలేదు. దీని అమరికపై పలు సార్లు మార్పుచేర్పులు జరిగాయి. తొలుత తయారు చేసిన సవివర ప్రాజెక్టు నివేదిక స్థానే కొత్తగా మరో ప్రాజెక్టు నివేదికను తయారు చేయిస్తున్నారు.[4] దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల స్థలాన్ని సేకరించి కేంద్రానికి అప్పగించాల్సి ఉంది.[5]

మూలాలు

[మార్చు]
  1. Boda, Tharun (2023-08-21). "Wait for completion of Vijayawada bypass road gets longer". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2024-06-15. Retrieved 2024-06-15.
  2. "Details of Projects Showing Time Overrun in Andhra Pradesh". www.cspm.gov.in. Archived from the original on 2024-06-15. Retrieved 2024-06-15.
  3. "Vijayawada: విజయవాడ బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో జాప్యం". EENADU. Archived from the original on 2024-05-21. Retrieved 2024-06-17.
  4. "Vijayawada: విజయవాడ తూర్పు బైపాస్‌కు కేంద్రం తుదిరూపు?". ఈనాడు. Archived from the original on 2023-02-08. Retrieved 2024-06-17.
  5. "తూర్పు బైపాస్‌పై... ఆరునూరైనా తేల్చరేం?". EENADU. Archived from the original on 2024-06-17. Retrieved 2024-06-17.