వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/వికీపీడియా పరిచయం
స్వరూపం
చదువరి అభిప్రాయాలు
[మార్చు]కింది అభిప్రాయాలను పరిశీలించండి.
- అసలు ఏంటి ఈ వికీపీడియా అనే ప్రశ్న ఒకటి వేసి సమాధానం రాయాలి. దీనిలో "విజ్ఞానసర్వస్వం" గురించి టూకీగా రాస్తే బాగుంటుంది. తెలుగులో గతంలో ఏమేం ఉన్నాయి. ప్రస్తుతం ఉచితంగా అంతర్జాలంలో దొరికేవి ఏమైనా ఉన్నాయా అనేది రాయాలి. ఒక ఉదాహరణ ద్వారా చెబితే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామం ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఏయే గ్రామాలున్నాయి అనేది ఎక్కడ లభిస్తుంది? తెలుగు వికీపీడియాలో తప్ప ఇంకెక్కడా దొరకదు. ఒకవేళ దొరికినా అరకొర సమాచారమే ఉంటుంది. మానవుడు కోతి నుండి పుట్టాడు అని అంటారు. అసలు మానవ పరిణామం గురించి మనకు తెలుగులో సమాచారం ఎక్కడ దొరుకుతుంది? వికీపీడియాలో దొరికినంత సులభంగా, ఉచితంగా ఇంకెక్కడా దొరకదు. భారత పాకిస్తాన్‌లు 3 పెద్ద యుద్ధాలు (కార్గిల్ కాకుండా) చేసుకున్నాయని మనకు తెలుసు. అవి ఎప్పుడు, ఎందుకు, ఎలా జరిగాయి. ఎవరు గెలిచారు అనేది తెలుగులో ఎక్కడ దొరుకుతుంది -వికీపీడియాలోనే!
- వికీపీడియాలో రాయడానికి మనం నిపుణులం కానక్కర్లేదు. అంతర్జాలంలో, పుస్తకాల్లో, ఇతర వనరుల్లో ఉన్న సమాచారాన్ని సేకరించి ఒకచోట చేర్చి వ్యాసాలు రాయాలి. కొత్తగా సమాచారాన్ని సృష్టించం, ఉన్న సమాచారాన్ని సేకరించి మన స్వంత వాక్యాల్లో రాస్తాం. ఎక్కడి నుండి సేకరించామో ఆ మూలాన్ని ఇక్కడ ఉల్లేఖిస్తాం. (ఇది పాఠంలో ఈసరికే రాసారు గానీ, మరికాస్త వివరంగా రాయాలి)
- మరీ అత్యవసరం అనుకుంటే తప్ప ఎక్కువ లింకులు ఇవ్వకుండా ఉంటే మంచిదనుకుంటాను. మరీ ఎక్కువ లింకులిస్తే అవి పాఠకుల దృష్టిని మళ్ళిస్తాయి.
__చదువరి (చర్చ • రచనలు) 04:47, 12 ఏప్రిల్ 2022 (UTC)
- మీ సూచనలకు ధన్యవాదాలు చదువరి గారు. ఈ పేజీలో ఉన్నదాన్ని వీడియోకి తగ్గట్టుగా రాయబోతున్నాను. ఈ క్రమంలో మీ సూచనలు నాకు చాలాబాగా ఉపయోగపడనున్నాయి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:01, 12 ఏప్రిల్ 2022 (UTC)
- చదువరి గారూ, పేజీలోని వీడియో పాఠ్యం విభాగంలో వీడియో తయారీకోసం పాఠాన్ని రాశాను. ఒకసారి పరిశీలించి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే తెలియజేయగలరు.--Pranayraj1985 (చర్చ) 19:26, 21 అక్టోబరు 2022 (UTC)
- మీ సూచనలకు ధన్యవాదాలు చదువరి గారు. ఈ పేజీలో ఉన్నదాన్ని వీడియోకి తగ్గట్టుగా రాయబోతున్నాను. ఈ క్రమంలో మీ సూచనలు నాకు చాలాబాగా ఉపయోగపడనున్నాయి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:01, 12 ఏప్రిల్ 2022 (UTC)