Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ప్రాజెక్టు లోని ఉప పేజీల గురించి ఒక సూచన

[మార్చు]

@Pranayraj1985 గారూ, ఈ ప్రాజెక్టులో తయారు చేస్తున్న పేజీలు ప్రాజెక్టు పాత్‌ను (ఉపపేజీల పాత్) దాటి బయటకు పోయాయి. ఈ ప్రాజెక్టు పేరు "తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు". అంటే ఈ ప్రాజెక్టు పాత్ "వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు" అని ఉండాలి, అలాగే ఉంది. ఇంత వరకు ఓకే. కానీ మీరు తయారు చేసిన పాఠ్యాంశాలన్నీ ఈ [ప్రాజెక్టుతో సంబంధం లేనట్టు వేరే పాత్‌లో ఉన్నాయి. ఉదాహరణకు "వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/వ్యాస వివరాల పరిచయం" చూడండి. ఇది ప్రాజెక్టు పాత్‌లో లేదు. "వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక" అనే మరొక పాత్‌లో ఉంది. ఇదంతా కన్ఫ్యూజనుగా, ఏ పేజీ ఎక్కడ ఉంటుందో తెలీకుండా ఉంది. ప్రాజెక్టులో సృష్టించే పేజీలన్నిటినీ "వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక" అనే పేజీకి ఉప పేజీలుగా/ఉప ఉప పేజీలుగా/ఉప ఉప ఉప పేజీలుగా ఉంటే బాగుంటుంది. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 01:21, 22 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari గారూ, ఉపపేజీల పాత్ వేరేగా ఉన్నది నిజమే. ప్రాజెక్టులో తొలిపేజీగా 'వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు' పేజీని సృష్టించాము. దానికి సంబంధించిన ఉపపేజీలకు ఎక్కువ పదాలతో పేర్లు ఉంటే, పేజీల పేర్లు పొడవుగా కనిపిస్తాయన్న భావనతో ఉపపేజీలకు 'వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక' (తెలుగు వికీ పదానికి బదులుగా తెవికీ పదం) అనేది ఉపయోగించాను. అయితే, మరికొద్ది రోజులలో అన్నింటికి ఒకే పాత్ ఉండేలా మారుస్తాను. ధన్యవాదాలు.-- Pranayraj1985 (చర్చ) 18:08, 24 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మరొక సూచన

[మార్చు]

వికీలో డిఫాల్టుగా ఇపుడున్న రూపు (స్కిన్) స్థానంలో కొత్త రూపు రాబోతోంది. మనం చెయ్యబోయే పాఠాలు దానికి తగ్గట్టుగా రూపొందించుకోవాలి పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 01:41, 22 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టులో భాగంగా 10 వీడియోలకు సంబంధించిన పాఠ్యాలు, వాయిస్ ఓవర్లు, స్క్రీన్ రికార్డింగులు చేశాను. వికీలో డిఫాల్టుగా ఇపుడున్న రూపు (స్కిన్) స్థానంలో కొత్త రూపు రాబోతోందని ప్రాజెక్టు కమిటీ సభ్యుల సమావేశంలో నేను ప్రస్తావించగా... ఇప్పటివరకు చేసినవాటిని వదిలిపెట్టి, వాటి స్థానంలో కొత్త రూపుకు తగ్గట్టుగానే పాఠాలు రూపొందించుకుంటేనే బాగుంటుందని ప్రాజెక్టు కమిటీ సభ్యులు సూచించారు. వారి సూచనల మేరకు వాటని మళ్ళీ కొత్తగా రూపొందిస్తున్నాను.-- Pranayraj1985 (చర్చ) 18:22, 24 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా - మొబైల్ మాధ్యమంగా శిక్షణా వీడియోలు , పాఠ్యాంశాలు

[మార్చు]

కొద్ది కాలం క్రితం తెలుగు వికీ - హైదరాబాదు పుస్తక ప్రదర్శన లో నమోదు చేసుకొన్న వారికి తెలుగు వికీపీడియా శిక్షణ కోసం సముదాయం సహకారంతో కొన్ని ప్రజంటేషన్ లు తయారుచేశాము, వాటిని ఇక్కడ చూడగలరు, అంతే కాక చాల మంది వీకీపీడియాను మొబైల్ లో చూస్తున్నారు కాబట్టి పాఠ్యాంశాలు కొన్ని వీడియోలు మొబైల్ మాధ్యమంగా తయారుచేయగలరు, అంతే కాక వికిపీడియా మెబైల్ యాప్ గురించి కూడా తెలుపగలరు. Kasyap (చర్చ) 14:41, 21 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]