Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా గురించి వాడుకరులు స్వయంగా నేర్చుకోగలిగే పాఠ్య ప్రణాళిక, దానికి అవసరమైన అన్ని రకాల బోధనా ఉపకరణాలు తయారుచేసి అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ప్రాజెక్టు లక్ష్యాలు

[మార్చు]
  • ఒక చక్కటి పాఠ్య ప్రణాళికతో, వివిధ స్థాయిలలో, ఎవరి సాయం లేకుండానే, చూసి-చదివి-విని నేర్చుకునేలా ఉండే సహాయం పేజీలు, వీడియోలు, ఆడియోలూ కలిసిన ఒక పూర్తి పాఠ్య ప్రణాళిక, బోధనోపకరణాలు తయారుచేయడం.
  • ఈ తయారవుతున్న పాఠ్య ప్రణాళికను, బోధనోపకరణాలను ఆసక్తి కలిగిన వాడుకరుల మీద ప్రయోగించి చూసి, దానిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉన్నతమైన నాణ్యతతో రూపొందించడం.

ప్రణాళిక

[మార్చు]

ఈ ప్రాజెక్టు లక్ష్యాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళిక ముసాయిదా, దాన్ని సాధించేందుకు కార్య ప్రణాళిక రూపొందించడానికి ప్రాజెక్టు నిర్వహణా కమిటీ (స్వచ్ఛంద కృషి), ప్రాజెక్టు సమన్వయకర్త (జీతభత్యాలు ఉండే ఉద్యోగం) కలసి పనిచేస్తూ ఉంటారు. ప్రాజెక్టు నిర్వహణా కమిటీ సమన్వయకర్త ఉద్యోగాన్ని మేనేజ్ చేస్తుంది.
సమన్వయకర్త ఈ ప్రాజెక్టు విషయమై భాగస్వామ్యం కుదిరిన సంస్థలతో, ఆసక్తిగల వికీపీడియన్లు, ఇతర వ్యక్తులతో కలసి పనిచేస్తారు. తెలుగు వికీపీడియా సముదాయానికి సమన్వయకర్త పురోగతి తెలియపరుస్తూ ఉంటారు. ప్రాజెక్టు పేజీలో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌డేట్ చేస్తారు.

ప్రాజెక్టు నిర్వహణ

[మార్చు]
ప్రాజెక్టు కమిటీ

ప్రాజెక్టు కమిటీ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో నేరుగా సమన్వయకర్త పనిని పర్యవేక్షించడం, మేనేజ్ చేయడం, నివేదికలు ఆమోదించడం వంటివి చేస్తుంది. ఈ కమిటీ సభ్యులు స్వంత ఆసక్తి మేరకు స్వచ్ఛందంగా పనిచేస్తారు. వీరికి ఈ పర్యవేక్షణ, మేనేజ్‌మెంట్ వంటి పనులకు గాను ఏ విధమైన ఆర్థిక పారితోషికమూ లభించదు.

ప్రాజెక్టు సమన్వయకర్త

బడ్జెట్

[మార్చు]

మొదటి దశ (2021 ప్రథమార్థం)

[మార్చు]

ప్రాజెక్టు మొదటి దశలో (2021 ప్రథమార్థం) దీన్ని ఫండ్ చేసేందుకు సీఐఎస్-ఎ2కె సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రాజెక్టు సమన్వయకర్త జీతం ఇందులో ప్రధానమైన ఖర్చు కనుక నియామకం పూర్తయ్యాకా పూర్తి వివరాలు ఇక్కడ పొందుపరుస్తాం.

రెండవ దశ (2021 ద్వితీయార్థం)

[మార్చు]

వివరాలు భవిష్యత్తులో పొందుపరుస్తాం.

భాగస్వామ్యం

[మార్చు]

ఈ ప్రాజెక్టు నిర్వహణలో పలు సంస్థలు పలు హోదాల్లో భాగస్వాములై ఉంటాయి. వీటిపై తర్వలో వివరణ ఇస్తాం.

ఉప పేజీలు

[మార్చు]