Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఎ

వికీపీడియా నుండి
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

[మార్చు]
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
A Descriptive Catalogue Of The Telugu Manuscripts Vol XII [1] టి. చంద్రశేఖరన్(సం.) ఇది మద్రాసులోని ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలోని వ్రాతప్రతుల జాబితా. 5010010004394 1949
A Descriptive Catalogue Of The Telugu Manuscripts [2] పి.పి.ఎస్. శాస్త్రి (సం.) - ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన తంజావూరు సరస్వతీమహల్ లైబ్రెరీలోని వ్రాతప్రతుల కాటలలాగ్ 2020120000065 1933
A Collections Of Official Documents In The Telugu Language [3] సంకలనం.టి.జి.ఎం.లేన్ అధికారిక అనువాదపత్రములు. 1868 నాడు బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ఆధ్వర్యంలో అప్పటి ప్రభుత్వానికి పౌరులు రాసుకున్న తెలుగు అర్జీలను, కోర్టుల్లోని కొన్ని అధికార పత్రాలను ఈ గ్రంథంలో ప్రచురించారు. దాదాపుగా నేటికి(2014) 146 సంవత్సరాల నాటి పత్రాలు కావడంతో సామాజిక చరిత్రలో ఎంతగానో విలువైనవి. ఆనాడు ప్రజలు ఎదుర్కొన్న న్యాయపరమైన సమస్యలు, అవి తీర్చుకునేందుకు చేసుకున్న విన్నపాలు, అవి పరిష్కరింపబడ్డ తీరు తెలుస్తుంది. బ్రిటీష్ ఇండియాలోని భారతీయ, ఐరోపీయ రెవెన్యూ ఉద్యోగులు తమ నిత్య వ్యవహారంలో రాసుకున్న అధికారిక పత్రాలు, తమపై అధికారులకు పంపిన రిపోర్టులు, పెట్టుకున్న అర్జీలు ఈ గ్రంథంలో ప్రచురించారు. మరీ ముఖ్యంగా ఈస్టిండియా కంపెనీ పాలన నుంచి నేరుగా బ్రిటీష్ రాణి పాలన కిందకు వచ్చిన పదో సంవత్సరంలోనే ఈ గ్రంథం ముద్రించడంతో మారిన పరిపాలన స్థితిగతులు ప్రజలపై చూపిన ప్రభావం అంచనా కట్టేందుకూ ఉపకరిస్తుంది. విభిన్న భాషలున్న దేశంలో అందరికీ తెలియవలసిన అధికారికపత్రాలు, అర్జీలు, ఎక్కువమందికి చేరవేయాలని నిరూపించే పుస్తకం. అపురూపమైన చేతిరాతతో వ్రాసిన ఉత్తరాలు. 2021050000089 1868
ఎ.సి.రెడ్డి చరిత్ర [4] మూలం.పైడిమర్రి వెంకటసుబ్బారావు, అనువాదం.పచ్చారి వెంకటేశ్వర్లు జీవితచరిత్ర ఎ.సి.రెడ్డిగా పేరొందిన ఆనం చెంచుసుబ్బారెడ్డి నెల్లూరు ప్రాంతంలో సుప్రఖ్యాతులైన నాయకులు. ఇది ఆయన జీవితచరిత్రకు ఆంధ్రానువాదం. 2020120000045 1968
ఎ.చేహొవ్ కథలు [5] చేహొవ్ కథా సాహిత్యం అంటోన్ పావ్లొవిచ్ చెకోవ్ (1860-1904) ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ నాటక రచయిత. 19వ శతాబ్ది చివరిభాగాన వెలసిన రష్యన్ వాస్తవికతా సాంప్రదాయ ప్రధాన ప్రతినిధి.ది సీగల్అంకుల్ వన్యాత్రీ సిస్టర్స్ది చెర్రీ ఆర్చర్డ్ వంటి సుప్రసిద్ధ రచనల నిర్మాత. ఆయన వ్రాసిన కథాసాహిత్యమిది. 2020120028804 1973
ఎన్.జి.ఒ గుమాస్తా(నాటకం) [6] ఆత్రేయ నాటకం ఆచార్య ఆత్రేయ గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (1921 - 1989) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. అత్రేయకి ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు. ఆయన వ్రాసిన ప్రసిద్ధమైన ఎన్.జి.వో. గుమాస్తా నాటకమిది. 2020010006504 1952
ఎం.ఎన్.రాయ్ జీవితం-సిద్ధాంతం [7] కోగంటి రాధాకృష్ణమూర్తి సాహిత్యం కోగంటి రాధాకృష్ణమూర్తి గుంటూరు జిల్లా, తెనాలి ప్రాంతపు కూచిపూడి (అమృతలూరు) గ్రామంలో 1914 సెప్టెంబర్‌ 18న జన్మించారు. తెనాలి నుంచి నలంద ప్రచురణల సంస్థను నడిపారు.ఈయన అనువదించిన ఎం.ఎన్.రాయ్ వ్యాసాలు ఒక హేతువాద వాచకం అంటారు.రాడికల్‌ హ్యూమనిస్టు.ఏ ఇజాన్నీ హీనంగా నిరసించడటం తన అభిమతం కాదు. ఏ సిద్ధాంతానికీ సమగ్రత ఆపాదించరాదనీ, ప్రతి సిద్ధాంతంలోని మంచిని స్వీకరిస్తూ ముందుకు సాగటమే వివేకవంతుల లక్షణమని ఆయన భావన. ఆయన వ్రాసిన ఎం.ఎన్.రాయ్ జీవితచరిత్ర ఇది. 6020010034980 1978
ఎం.ఎల్.ఎ. ఆత్మకథ [8] మున్నవ గిరిధరరావు హాస్య సాహిత్యం ఎం.ఎల్.ఎ.ఆత్మకథ అనే ఈ రచన రాజకీయ వ్యంగ్య హాస్యాత్మక రచన. 2020120034979 1956
ఎక్కడికి [9] ముద్దుకృష్ణ కథల సంపుటి తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి చెందిన సంకలనకర్త అయిన ముద్దుకృష్ణ వ్రాసిన కథల సంకలనం ఇది. 2020010005041 1924
ఎక్కడనుండి-ఎక్కడకు? [10] కొడవంటి నరసింహం ఆధ్యాత్మికం కొడవంటి నరసింహం రాసిన ఆధ్యాత్మిక, తత్త్వరచన ఎక్కడి నుండి ఎక్కడకు? 2020120000371 1958
ఏకోజీ రామాయణం-1 [11] పరిష్కర్త, సంపాదకులు: మొరంగపల్లి బాగయ్య ఆధ్యాత్మికం 1728-36 మధ్యకాలంలో తంజావూరును పరిపాలించిన రాజు, మంచి కవి ఏకోజీ. ఆయన వ్రాసిన రామాయణానికి ఇది పరిష్కృత ప్రతి. 5010010000753 1950
ఏకోజీ రామాయణం-2 [12] పరిష్కర్త, సంపాదకులు: మొరంగపల్లి బాగయ్య ఆధ్యాత్మికం 1728-36 మధ్యకాలంలో తంజావూరును పరిపాలించిన రాజు, మంచి కవి ఏకోజీ. ఆయన వ్రాసిన రామాయణానికి ఇది పరిష్కృత ప్రతి. 2990100028479 1993
ఎతోవా పోరాటం గెలిచాడు [13] మూలం.మహాశ్వేతా దేవి, అనువాదం.చల్లా రాధాకృష్ణమూర్తి బాల సాహిత్యం, నవల ఎతోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించాడన్న విషయంపై ఈ నవల రచించారు. బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ రచన చేశారు. పిల్లలకు ఆసక్తి కలిగించేవిధంగా పుస్తకంలో చక్కని చాయాచిత్రాలు జతచేశారు. ఈ గ్రంథం వల్ల మన దేశంలోనే ఉంటూనే చాలామందికి తెలియని గిరిజనుల సంస్కృతి, వారి పోరాటాలు, జీవితంలో లక్ష్యాలు, వాటీని సాధించేందుకు వారు ఎంచుకోవాల్సిన కష్టభరిత ప్రయాణం వంటివి ఎన్నో తెలుస్తాయి. 99999990128967 1996
ఎబికె సంపాదకీయాలు-4 [14] ఎబికె సంపాదకీయాల సంకలనం ఎబికె ప్రసాద్ ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, పాత్రికేయుడు. ఆయన వ్రాసిన సంపాదకీయాలు ఆనాటి నడుస్తున్న చరిత్రకు ఒక దృక్కోణం వివరిస్తూంటాయి. వాటి సంకలనమిది. 2020120000035 1995
ఎలా చదవాలి [15] మన్నవ గిరిధరరావు వ్యక్తిత్వ వికాసం పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఎలా చదివితే మంచి ఫలితాలు పొందవచ్చునన్న అంశంపై ఈ పుస్తకం రచించారు. నిత్యజీవితంలో చదువుకు ఆటంకమయ్యే పరిస్థితులు అధిగమించడం, మానసిక బలహీనతలు వదిలించుకోవడం వంటి వివరాలు అందించారు. 6020010004093 1992
ఎవరు దొంగ? [16] ఆచార్య ఆత్రేయ నాటకాలు ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు. 2030020025556 1955
ఎం.ఎన్.రాయ్ [17][dead link] వి.బి.కార్నిక్ జీవిత చరిత్ర ఎం. ఎన్. రాయ్ గా ప్రసిద్ధిచెందిన మానవేంద్ర నాథ రాయ్ హేతువాది, మానవవాది. మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. భారతదేశంలో మార్క్సిస్టు ఉద్యమ పితామహుడు. ఇస్లామ్ చారిత్రక పాత్ర అనే పుస్తకంలో ఇస్లాం విప్లవాత్మకతను పొగిడాడు. కాంగ్రెస్ పార్టీ కోరుతున్న స్వాతంత్ర్యానికి దీటుగా, రాజ్యాంగం రావాలని, సంఘం మారాలని, పునర్వికాసం వైజ్ఞానిక ధోరణి ప్రబలాలని ఎం.ఎన్. రాయ్ చెప్పాడు. బ్రిటిష్ వారు ఎలాగు దేశం వదలి పోతారు, రెండో ప్రపంచ యుద్ధానంతరం అది జరిగి తీరుతుందని ఎం.ఎన్. రాయ్ కచ్చితంగా చెప్పాడు. ఆలోగా ఫాసిస్టులు, నాజీ నియంతలు, మన దేశంలో బలపడకుండా జపాన్ తిష్ఠవేయకుండా చూడాలన్నారు. తాత్కాలికంగా బ్రిటిష్ వారికి యీ రంగంలో చేయూత నివ్వాలన్నారు. ఆయన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు విడిచిపెట్టి ప్రత్యేకంగా తన భావజాలంతో రాయిస్ట్ పార్టీ నెలకొల్పారు. దక్షిణ అమెరికాలోని వివిధ దేశాల విప్లవాల్లో పాల్గొన్నారు. 20వ దశకం తొలి అర్థభాగంలో ప్రపంచ వ్యప్తంగా వివిధ దేశాలను ప్రభావితం చేసిన అతికొద్ది మంది భారతీయ రాజకీయ వేత్తల్లో రాయ్ ఒకరు. ఆయన జీవిత చరిత్ర ఇది. 99999990128985 1980
ఎం.హేమలత కథలు [18] హేమలత కథల సంపుటి రచయిత్రి 1971 నుంచి 1981 వరకూ, ఆపైన 1993 నుంచి 2000 వరకూ వ్రాసిన పలు కథలను సంకలనం చేసి ఈ పుస్తకరూపంలో ప్రచురించారు. 2990100068522 2000
ఎంకి పాటలు [19] నండూరి సుబ్బారావు గేయాలు నండూరి సుబ్బారావు రాసిన ఎంకిపాటలు తెలుగు భావకవిత్వంలోనూ, వ్యవహారికోద్యమంలోనూ కీలకమైనవి. ఎంకి-నాయుడు బావ అనే కాల్పనిక జంట ఈ పుస్తకం ద్వారా ప్రసిద్ధికెక్కింది. 2990100051645 2002
ఎంపిక చేసిన మహాత్మాగాంధీ రచనలు (సంపుటము 1 [20] సంపాదకులు: శ్రీమన్నారాయణ్ సాహిత్య సర్వస్వం మహాత్మా గాంధీగా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి జాతిపిత అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆన్ సాంగ్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారిపై బలంగా నిలిచివుంది. మహాత్మా గాంధీ తన ఆలోచనల్ని, పరిస్థితుల్ని, ప్రయోగాలను ఎప్పటికప్పుడు పత్రికలో వ్యాసాల్లో, లేఖల్లో, ఆత్మకథలో, నవజీవన్ సంపాదకీయాల్లో, ఇంకా అనేకానేక రచనల్లో వ్యక్తీకరించారు. ఆ రచనలన్నీ ఆయనను వ్యక్తీకరించేవే. కనుక ఈ గ్రంథాల్లో వారి సమగ్ర సాహిత్యాన్ని అనువదించి ప్రచురించారు. 2990100068523 1999
ఎంపిక చేసిన మహాత్మాగాంధీ రచనలు (సంపుటము 2 [21] సంపాదకులు: శ్రీమన్నారాయణ్ సాహిత్య సర్వస్వం మహాత్మా గాంధీగా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి జాతిపిత అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆన్ సాంగ్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారిపై బలంగా నిలిచివుంది. మహాత్మా గాంధీ తన ఆలోచనల్ని, పరిస్థితుల్ని, ప్రయోగాలను ఎప్పటికప్పుడు పత్రికలో వ్యాసాల్లో, లేఖల్లో, ఆత్మకథలో, నవజీవన్ సంపాదకీయాల్లో, ఇంకా అనేకానేక రచనల్లో వ్యక్తీకరించారు. ఆ రచనలన్నీ ఆయనను వ్యక్తీకరించేవే. కనుక ఈ గ్రంథాల్లో వారి సమగ్ర సాహిత్యాన్ని అనువదించి ప్రచురించారు. 2990100068524 1999
ఎంపిక చేసిన మహాత్మాగాంధీ రచనలు (సంపుటము 4 [22] సంపాదకులు: శ్రీమన్నారాయణ్ సాహిత్య సర్వస్వం మహాత్మా గాంధీగా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి జాతిపిత అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆన్ సాంగ్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారిపై బలంగా నిలిచివుంది. మహాత్మా గాంధీ తన ఆలోచనల్ని, పరిస్థితుల్ని, ప్రయోగాలను ఎప్పటికప్పుడు పత్రికలో వ్యాసాల్లో, లేఖల్లో, ఆత్మకథలో, నవజీవన్ సంపాదకీయాల్లో, ఇంకా అనేకానేక రచనల్లో వ్యక్తీకరించారు. ఆ రచనలన్నీ ఆయనను వ్యక్తీకరించేవే. కనుక ఈ గ్రంథాల్లో వారి సమగ్ర సాహిత్యాన్ని అనువదించి ప్రచురించారు. 2990100049365 1999
ఎంపిక చేసిన మహాత్మాగాంధీ రచనలు (సంపుటము 5 [23] సంపాదకులు: శ్రీమన్నారాయణ్ సాహిత్య సర్వస్వం మహాత్మా గాంధీగా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి జాతిపిత అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆన్ సాంగ్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారిపై బలంగా నిలిచివుంది. మహాత్మా గాంధీ తన ఆలోచనల్ని, పరిస్థితుల్ని, ప్రయోగాలను ఎప్పటికప్పుడు పత్రికలో వ్యాసాల్లో, లేఖల్లో, ఆత్మకథలో, నవజీవన్ సంపాదకీయాల్లో, ఇంకా అనేకానేక రచనల్లో వ్యక్తీకరించారు. ఆ రచనలన్నీ ఆయనను వ్యక్తీకరించేవే. కనుక ఈ గ్రంథాల్లో వారి సమగ్ర సాహిత్యాన్ని అనువదించి ప్రచురించారు. 2990100049366 1999
ఎందులకీ గోహత్య [24] గోపదేవ్ సాహిత్యం గోసంరక్షణ హిందూమతంలోని అత్యంత ఉద్వేగాత్మకమైన అంశం. దానిపై వ్రాసిన గ్రంథమిది. 9000000003112 1950
ఎడారి పువ్వులు [25] లత నవల నవలాసాహిత్యాన్ని రచయిత్రులు ఏలుతున్న 1960ల తరుణంలో అప్పటి ప్రఖ్యాత రచయిత్రుల్లో ఒకరైన లత కలం నుంచి వెలువడ్డ నవల ఇది. 2020010003775 1960
ఎమర్సన్ వ్యాసావళి [26] మూలం: థామస్ ఎమర్సన్, అనువాదం: బి.వి.శ్రీనివాసాచార్య సాహిత్యం ఎమర్సన్ 19వ శతాబ్దికి చెందిన అమెరికన్ మేధావి. ఆయన వ్రాసిన వ్యాసాలను బొమ్మకంటి వెంకట శ్రీనివాసాచార్యులు అనువదించగా ప్రచురితమైన గ్రంథమిది. దీనిలో రాజనీతి, కళ-విమర్శ, సత్యము, మహాపురుషులు అన్న ఎమర్సన్ వ్యాసాలతో పాటుగా ఎమర్సన్ జీవితము అన్న వ్యాసం కూడా జతచేశారు. 2020010005047 1956
ఎముకలు విరిగినప్పుడు [27][dead link] జితేంద్ర మహేశ్వరి వైద్య సంబంధ సాహిత్యం ఎముకలు విరిగితే ఏం చేయాలన్న అంశంపై వ్రాసిన ఆరోగ్య, వైద్య సంబంధ రచన ఇది. 99999990129011 1996
ఎన్ సైక్లోపీడిక్ మెడికల్ డిక్షనరీ(ఇంగ్లీష్-ఇంగ్లీష్-తెలుగు) [28] ఒ.ఎ.శర్మ సాహిత్యం ఇంగ్లీష్-ఇంగ్లీష్-తెలుగు మెడిసిన్ కి ఎన్ సైక్లోపీడియా డిక్షనరీ ఇది. శర్మ ఈ పుస్తకాన్ని రాశారు. 2020120000374 2000
ఎర్రజెండా [29] గంగినేని వెంకటేశ్వరరావు జీవితచరిత్రలు ఈ పుస్తకానికి తెలంగాణా గెరిల్లా యోధుల జీవిత గాథలు అన్నది ఉపశీర్షిక. దీన్ని విశాలాంధ్ర ప్రతిఘటనోద్యమంలో అస్తమించిన ఆంధ్ర గెరిలల్లా వీరులకు అంటూ అంకితమిచ్చారు. 2020050092753 1952
ఎలక్ట్రిక్ బల్బు-గ్రామఫోను సృష్టికర్త: థామస్ ఆల్వా ఎడిసన్ [30] మూలం: గ్లీంవుడ్ క్లార్క్, అనువాదం: మరిపూరు పిచ్చిరెడ్డి సాహిత్యం థామస్ ఆల్వా ఎడిసన్ ఆధునిక యుగంలోఅత్యంత కీలకమైన ఆవిష్కరణలు చేసిన వైతాళికుడు. ఆయన కృషివల్లనే నేటి విద్యుత్ బల్బు, గ్రామ్ ఫోన్ వంటి పరికరాలు తయారయ్యాయి. అటువంటి వ్యక్తి జీవితాన్ని గురించి వ్రాసిన గ్రంథమిది. 2020010005043 1959
ఎలక్ట్రాన్-ఆత్మకథ [31] మూలం: గిబ్సన్, అనువాదం: వసంతరాఫు వెంకటరావు సాహిత్యం ఎలక్ట్రాన్ అనేది ఫిజిక్స్ లో వచ్చే మౌలికమైన అంశాల్లో ఒకటి. దానికి ఆత్మకథలా వ్రాసి తేలికైన విధంగా సైన్స్ బోధించేందుకు ఉపకరించే గ్రంథమిది. 2020010005044 1953
ఎవరీ కన్య [32] తెన్నేటి కోదండరామయ్య నవల రామకృష్ణ మఠం స్వాముల సన్నిధానంలో సుశిక్షితురాలైన యువతి ఓ పల్లెటూరుకు చేరుకుని అక్కడొక మంచి వ్యక్తిని వివాహమాడి, వరకట్న సమస్యపై పోరాడి ఎందరో అమ్మాయిల జీవితాలకు వెలుగులు ప్రసాదించి ఆమె జీవితాన్ని సార్థకం చేసుకోవడం కథాంశం. 2020010005068 1960
ఎస్టేటుడ్యూటీ ఆక్టు [33] బలుసు వెంకట్రామయ్య పాలనా గ్రంథం ఎస్టేట్ డ్యూటీ యాక్ట్ అనే యాక్ట్ గురించి బులుసు వెంకట్రామయ్య వ్రాసిన గ్రంథం ఇది. 2020010005066 1954
ఎఱ్రయ్య తీర్చిన హరివంశము [34] సంధ్యావందనం గోదావరీబాయి సాహిత్యం ఎర్రన మహాభారత శేషమైన అరణ్యపర్వాన్ని పూర్తిచేయడంతో పాటుగా అనుబంధంగా హరివంశమనే స్వతంత్ర రచన కూడా చేశారు. దానిని గురించి గోదావరీబాయి వ్రాసిన గ్రంథమిది. 2020120004096 1985
ఎఱ్రన అరణ్యపర్వ శేషము [35] ఓగేటి అచ్యుతరామశాస్త్రి సాహిత్యం నన్నయ్య అరణ్యపర్వంలో శారదారాత్రుల వర్ణన వరకూ వ్రాసి ఆపైన మిగిలిన భాగాన్ని పూరించకుండా మరణించారని ప్రతీతి. ఆ కారణంగానే తిక్కన దానిని వదిలి మిగిలిన పదిహేను పర్వాలూ వ్రాశారని అంటారు. ఐతే మిగిలిన అరణ్యపర్వాన్ని అటు కొంత నన్నయ్య శైలీ, ఇటు కొద్దిగా తిక్కన శైలీ కనబరుస్తూనే స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కూడా కనబరుస్తూ పూర్తిచేసిన వారు ప్రబంధ పరమేశ్వర బిరుదాంకితులైన ఎర్రన. ఇది ఆయన పూరించిన అరణ్యపర్వం గురించిన రచన. 2020120000380 1989
ఎర్రాప్రగడ [36] వి.రామచంద్ర జీవితచరిత్ర ఎర్రాప్రగడ లేక ఎర్రన కవిత్రయంలోని ఒకరు. ఆయన నన్నయ వదిలివేసి, తిక్కన ఎత్తుకోని అరణ్యపర్వశేషాన్ని పూరించారు. అంతేకాక హరివంశాన్ని రచించారు. ఆయన జీవితచరిత్ర గ్రంథమిది. 2020120021361 1988
ఎఱ్రాప్రగడ [37] యశోదారెడ్డి జీవితచరిత్ర ఎర్రాప్రగడ లేక ఎర్రన కవిత్రయంలోని ఒకరు. ఆయన నన్నయ వదిలివేసి, తిక్కన ఎత్తుకోని అరణ్యపర్వశేషాన్ని పూరించారు. అంతేకాక హరివంశాన్ని రచించారు. ఆయన జీవితచరిత్ర గ్రంథమిది. 2020120004097 1972

మూలాలు

[మార్చు]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా[dead link]