మన్నవ గిరిధరరావు
స్వరూపం
మన్నవ గిరిధరరావు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు.
జీవిత విశేషాలు
[మార్చు]గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన మన్నవ ఇతని స్వగ్రామం[1]. ఇతడు విద్యార్థిగా వల్లభజోస్యుల సుబ్బారావు మొదలైనవారివద్ద శిష్యరికం చేశాడు. చరిత్రలో ఎం.ఎ. చదివాడు. యువభారతి అనే మాసపత్రికకు, భారతీయ మార్గం అనే మాసపత్రికకు, సాధన పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. గుంటూరులోని హిందూ కళాశాలలో రాజనీతిశాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నాడు. 1968-1974ల మధ్య ఉపాధ్యాయుల ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. ఇతడు జూలై 31, 2006న గుంటూరులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 77వ యేట మరణించాడు[2].
రచనలు
[మార్చు]- అప్రస్తుత ప్రసంగం
- కాంతిరేఖలు[3] (మూడు భాగాలు)
- లోకజ్ఞానం
- ఎలా చదవాలి?[4]
- మణిపూసలు
- పనికొచ్చేకథలు (రెండు భాగాలు)
- చదువుకుంటే బహుమతి
- సూక్తి సుధ
- హిందూ ధర్మ వైభవము
- భారత జాతికి ఆశాజ్యోతి
- వెర్రితలలు వేస్తున్న సెక్యులరిజం[5]
- ఎం.ఎల్.ఏ. ఆత్మకథ (నవల)[6]
మూలాలు
[మార్చు]- ↑ గుంటూరు మండల సర్వస్వము - పేజీ:450[permanent dead link]
- ↑ హిందూ దినపత్రికలో మన్నవ గిరిధరరావు మరణవార్త
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కాంతిరేఖలు మొదటిభాగం పుస్తకప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఎలా చదవాలి? పుస్తకప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో వెర్రితలలు వేస్తున్న సెక్యులరిజం పుస్తకప్రతి
- ↑ ఆర్కీవ్.ఆర్గ్‌లో ఎం.ఎల్.ఏ ఆత్మకథ పుస్తక ప్రతి