వికీపీడియా ఏషియన్ నెల 2021 బహుభాషలలో నిర్వహిస్తున్న ఎడిటథాన్. ఆసియా దేశాల వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచడం కోసం ఇది నిర్వహించబడుతుంది. 2021 నవంబరు 15 నుండి డిసెంబరు 15 వరకు జరుగుతుంది. ఆసియా ఖండంలోని వివిధ దేశాలు, ప్రదేశాల, వ్యక్తుల గురించి వ్రాయవచ్చు లేదా ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
ఆసియా వికీమీడియా సముదాయాల మధ్య గల స్నేహాన్ని గుర్తిస్తూ,తెవికీలో కనీసం నాలుగు వ్యాసాలను వ్రాసిన వారికి పాల్గొన్న ఇతర దేశ సముదాయాలనుండి ఒక ప్రత్యేక వికీపీడియా పోస్టుకార్డు పంపబడుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న దేశాలు - చైనా, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పైన్స్, తైవాన్, మరియు థాయ్లాండ్.
ఈ ప్రాజెక్టులో భాగంగా నాలుగు వ్యాసాలు రాసిన వారికి వికీపీడియా ప్రత్యేక పోస్టుకార్డు అందించబడుతుంది. అందరికంటే ఎక్కువ నాణ్యమైన వ్యాసాలు వ్రాసిన వ్యక్తికి "వికీపీడియా ఏషియన్ అంబాసడర్" బిరుదు ఇవ్వబడుతుంది.
వికీపీడియా ఏషియన్ నెలలో భాగంగా ఒక వ్యాసాన్ని గుర్తించాలంటే, ఇక్కడ ఇచ్చిన నిబంధనలు పాటించాలి:
ఆ వ్యాసం 0:00 UTC నవంబర్ 15, 2021, 23:59 UTC డిసెంబరు 15, 2021 మధ్య సృష్టించాలి.
కనీసం 3,500 బైట్ల నిడివి, కనీసం 300 పదాల పొడవు (సమాచార పెట్టె, మూస, వర్గం, మొ॥ లెక్కించబడవు)
4000 బైట్ల నిడివి కన్నా తక్కువ ఉన్న ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని మెరుగుపర్చవచ్చు. కనీసం 2000 బైట్లు చేర్చాలి, ఇంకా రమారమీ 300 పదాలు చేర్చాలి. ఈ నెలలో జరిగిన మార్పులే లెక్కించబడతాయి.
వ్యాసం విషయ ప్రాముఖ్యత కలిగి ఉండాలి.
కచ్చితమైన మూలాలు కలిగి ఉండాలి.
గూగుల్ ట్రాన్స్లేట్ వాడి వ్రాసినవి, సరియయిన భాషలో వ్రాయబడనివి చెల్లవు ట్రాన్స్లేట్ ఉపకరణం సహాయంతో ప్రచురించిన వ్యాసాలూ పరిగణించబడతాయి.
ఎలాంటి సమస్యాత్మక మూసలు వ్యాసంలో ఉండరాదు.
వ్యాసం జాబితా కానీ, పట్టిక గానీ కారాదు.
వ్యాసం విషయం సాంస్కృతికంగా, భౌగోళికంగా, రాజకీయంగా ఆసియాకు సంబంధించినదై ఉండాలి. మన సొంత దేశం మినహాయించి (అంటే భారత్ గురించి కాకుండా ఇతర దేశాల గురించై ఉండాలి).