Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు

వికీపీడియా నుండి

గ్రామాల వ్యాసాలు అభివృద్ధి పరచే క్రమంలో, సమాచారపెట్టెలు చేర్చారు. వీటిని మెరుగుపరచటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

ప్రస్తుత మూసలోపాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో గతంలో వాడిన సమాచారపెట్టె{{Infobox Settlement/sandbox}} లో క్రింది లోపాలున్నాయి.

  1. మూస రూపం పూర్తిగా పరీక్షించబడకుండానే sandbox రూపమే వాడారు. (2014 మార్చి ప్రాంతంలో)
  2. మూసని తెలుగు వికీలో గ్రామ వ్యాసాలకు ప్రత్యేకించి చేసేటప్పుడు అవసరంలేని పరామితులు అన్నీ వుంచేసరికి మూస చాలా పెద్దదై (112 వరుసలు) పోయింది.
  3. మూసలో ఎడమవైపున వచ్చే వివరాల పేర్లను కూడా మూసలో వుంచేసరికి, కొంతమంది వాడుకరులు అనవసర మార్పులు చేసి మూసకు ఏకరీతి పేర్లు వుంచటానికి వీలవుటలేదు.
  4. ఆంగ్ల వికీలో ఈ మూస మరింత మెరుగుపడింది. ఆ మార్పులు సులభంగా ప్రస్తుతమున్న మూసలో చేయలేము.
  5. సమాచారపెట్టెలో సమాచారం సమగ్రంగా, ఏకరీతిగా లేదని అర్ధమవుతున్నది. (చూడండి చర్చాపేజీ)

కొత్త మూస

[మార్చు]

{{Infobox India AP Village}} చూడండి.

వేటపాలెం లో సమాచారపెట్టె తెరపట్టు

దీనివలన ఉపయోగాలు

  1. పొట్టి మూస (16 వరుసలు), వికీడేటా వాడి ఒక్కవరుసగా చేయబడినది.
  2. కేవలం మార్పు చేయవలసిన వరసలు మాత్రమే వుంచబడినవి
  3. భౌగోళిక, జనగణన కు సంబంధించిన ప్రాథమిక వివరాలు మాత్రమే, ఒక్కజనాభా తప్పించి మిగతావి ఎక్కువసార్లు మార్చనవసరంలేదు.
  4. ఓపెన్ స్ట్రీట్ మేప్ తో కూడినది. (వికీడేటా దత్తాంశం వాడుతూ) (వేటపాలెం పేజీ లో పటంపై నొక్కి పరీక్షించండి. )

జరగవలసిన పని

[మార్చు]
  1. పాత మూసలో అవసరమైన విలువలను సాఫ్ట్వేర్ తో కొత్త మూస రూపం చేయుటకు వీలుందా?
    1. సమాచారం సమగ్రంగా, ఏకరీతిగా లేనందున, పాతమూసని సమూలంగా తొలగించి, వికీడేటా వాడుకతో కొత్త మూసని చేర్చటమే మంచిది. అయితే వికీడేటాలో సమాచార సమగ్రత గురించి వికీడేటాలో పనిచేసినవారు సమీక్షచేయలేదు కావున మొదట అవసరమైన వికీడేటా సమాచారాన్ని సమగ్రం చేయాలి.
  2. బాట్ తోవ్యాసాలలో మార్పులు.
  3. నాణ్యత తనిఖీ
  4. ప్రాజెక్టు సమీక్ష

పాల్గొనేవారు

[మార్చు]
  1. --అర్జున (చర్చ) 04:55, 29 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]


< పై వరుసలో # చేర్చి సంతకం చేయండి>

స్థితి

[మార్చు]

వికీడేటాలో సమాచారం సమగ్రం కావాలి, అప్పుడే ఇది చేపట్టగలము. కావున ఈ ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిపివేయబడినది.

పైలట్ ప్రాజెక్టు - 1

[మార్చు]

వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు/project1/ప్రకాశం జిల్లా మండల కేంద్రాలు లో మండల కేంద్రాలు నొక్కి చూడండి. 56 మండల కేంద్రాలు 10రోజులపైగా (14 జులై 2019-23 జులై 2019)అర్జున కృషితో సమాచారపెట్టెలు సరిచేయడమైనది. ఈ అనుభవంతో ఈ ప్రాజెక్టులో కృషి చేయదలచుకొనేవారికి సూచనలు

సూచనలు

[మార్చు]
  1. ఒక జిల్లా లో మండలకేంద్రాలను ఎంచుకోండి.
  2. వికీడేటా అంశానికి వెళ్లండి.
  3. దానిలో గల అంశాలు సరిచేయండి. (ఉదా: హనుమంతునిపాడు)
  4. ముఖ్యంగా capital of (మండలవ్యాసం), located in the administrative territorial entity (మండల వ్యాసం), coordinate location,population, area,postal code,local dialing code, official website, wikipedia links, description సరి చేయండి. coordinate location లో దోషాలు osm పటములో తెలియవచ్చు. area హెక్టేరు సంఖ్యని తప్పుగా కిలోమీటరుతో చేర్చారు. population కి ఒకే సంవత్సరానికి పట్టణ విభాగాలైతే తప్పుగా ఎక్కువ సంఖ్యలు వుండవచ్చు.
    1. coordinate location కొరకు https://www.openstreetmap.org/ , https://apsac.ap.gov.in/portal/ లో వెతకండి. ఇప్పటికే వ్యాసంలో వున్నా దానిని నిర్ధారించండి. దశాంశమానంలో బిందువు తర్వాత నాలుగు స్థానాల వరకే వుంచండి.
    2. population అంశాలు నిర్ధారణ కొరకు http://www.censusindia.gov.in/pca/Searchdata.aspx వాడండి. వెతికినప్పుడు చాలా సమాచారం వస్తుంది కాబట్టి మనం వెతికిన పదం మరల విహరిణిలో వెతికితే ఆ పదం వున్న చోట్ల వేరే రంగులో కనబడుతుంది. మరింత సమాచారం కొరకు (ఉదా: డేటా ఫైల్ లేదా PCA handbook (ఉదా: "District Census Handbook Prakasam" (PDF). 2014-06-16. Archived from the original (PDF) on 2018-11-14.చూడండి.
    3. population, area కొన్న సార్లు వుండవు. ఉదా: ప్రకాశం జిల్లాలో, దొనకొండ, ఉలవపాడు, సంతనూతలపాడు మండలాలలో అవి రెవిన్యూ గ్రామాలుగా గుర్తించబడలేదు.
    4. population తాజా సంఖ్య కు preferred rank ఇవ్వాలి.
    5. capital of చేర్చినపుడు, సంబంధిత మండలకేంద్రపు వికీడేటా అంశానికి వెళ్లి capital చేర్చండి.
    6. జనగణన వివరాలలో population, area లేకపోతే వాటిని వదిలివేయండి.
  5. వ్యాసములో {{Infobox Settlement/sandbox}} {{భారత స్థల సమాచారపెట్టె}} తొలగించి {{Infobox India AP Village}} లేదా {{Infobox India AP Town}} తో మార్చి సమాచారపెట్టె సరిగా వచ్చినది తనిఖీ చేయండి. (ఉదా:https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B9%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81&type=revision&diff=2694895&oldid=2573001 హనుమంతునిపాడు సవరణ)
  6. వ్యాసములో మండలం గురించిన సమాచారపెట్టెలు వుంటే వాటిని సంబంధిత మండలం వ్యాసంలో అవసరమైతే చేర్చి తొలగించండి.
  7. వ్యాసములో {{Maplink}}వాడుతూ OSM పటం చేర్చండి.
    1. అద్దంకి వ్యాసములో {{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point|title=అద్దంకి}} అని చేరిస్తే అప్రమేయంగా సంబంధిత వికీడేటా అంశంనుంచి అక్షాంశ రేఖాంశాలు తీసుకొని,అద్దంకి స్థానాన్ని పటం మధ్యలో అమర్చిచూపెడుతుంది. తొలిసారి భద్రపరచినపుడు కనబడకపోతే, పూర్తి తెర గుర్తు నొక్కి చూడండి.
  8. వ్యాసంలో సమాచారం అస్తవ్యస్తం గా వుంటే , దానిని సరిచేయటానికి ప్రయత్నించండి.
  9. ఇలా అన్ని జిల్లాల మండలకేంద్రాలు సవరించినతరువాత, ఒక్కొక్క మండలంలోని గ్రామ వ్యాసాలపై పని చేయవచ్చు.
  10. సవరణలు సరిగా జరిగాయాలేదా అన్నదానికి https://petscan.wmflabs.org/ ఉపకరణం వాడవచ్చు. ఉదా : ప్రకాశం జిల్లా మండలకేంద్రాలు, ప్రకాశం జిల్లాలో ఇంకా సమాచారపెట్టె మారనివి , పర్చూరు మండలంలోని గ్రామాలు, పర్చూరు మండలంలోని గ్రామాలు సమాచారపెట్టె మార్చనవి
  11. నాణ్యతతో పనిచేయటానికి ఒక అంశానికి 10-15 నిముషాలు పట్టవచ్చు.
  12. ప్రయోగాత్మకంగా చేయటానికి మీకు ముఖ్యమైన గ్రామం లేక పట్టణం వ్యాసానికి మార్పులు చేయండి. పై సూచనలు అవసరమైతే చర్చించి మార్చండి.

పైలట్ ప్రాజెక్టు - 2 (ప్రకాశం జిల్లా)

[మార్చు]

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు/వికీడేటా

వేగంగా పనిజరగాలంటే సూచనలు

[మార్చు]

బాట్ లేక స్క్రిప్ట్ తో వికీడేటాని తనిఖీ చేసి అవసరమైన ధర్మాలు చేర్చాలి. PIN, STD చాలావాటికి చేర్చవలసివుండగా,population, area తనిఖీ చేయాలి. సాంకేతికాలపై ఆసక్తిగల వారు దీనిపై శ్రద్ధ చూపాలి.

ప్రస్తుత చర్చలు

[మార్చు]

వనరులు

[మార్చు]