వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు/పాత చర్చ 3
1, 2, 3 |
సీరియస్‌నెస్ లోపించిన దిద్దుబాట్లు
[మార్చు]Nrgullapalli గారు ఈ మధ్య చేస్తున్న దిద్దుబాట్లు చూస్తే, ఆయన సీరియస్‌గా పనిచేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. మచ్చుకు గుడివాకలంక అనే పేజీలో వారు చేసిన దిద్దుబాట్లు..
ఎనిమిది దిద్దుబాట్లు - ఒక్కోదానిలో ఒక్కో కొత్త లైనును చేర్చారు, అంతే. అంటే ఎడిట్ ట్యాబును నొక్కి పేజీని ఎడిట్ మోడులో తెరవడం, ఎంటరు కీని ఒకసారి నొక్కడం, సేవు చెయ్యడం. మళ్ళీ వెంటనే ఎడిట్ ట్యాబును నొక్కడం, ఎంటరు కీని నొక్కడం, సేవు చెయ్యడం, మళ్ళీ వెంటనే ఎడిట్ ట్యాబును.. ఇలా వరసగా, మూణ్ణిముషాల్లో ఏడెనిమిది దిద్దుబాట్లు! ఏదో ఒక పేజీ విషయంలో కాదు, చాల ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాంటివి.
ఇలాంటి దిద్దుబాట్ల వలన వికీకి ప్రయోజనమేమైనా ఉందా అనే సంగతిని పక్కన ఉంచి, వికీకి నష్టమేమైనా ఉందా అని ఆలోచిస్తే, ఉందనే అనిపించింది. ఇతరులు కూడా ఈ దిద్దుబాట్ల ఆటలో పాల్గొనే అవకాశం ఉంది. ఒకరిద్దరు ఈ ఆట అంచుల్లో ఉన్నారేమో అనే సందేహం కలిగింది. (ప్రస్తుతానికి సందేహం మాత్రమే!) కొత్తగా చేరేవారు ఓహో ఇదన్నమాట ఇక్కడి అసలు బాగోతం అని తెవికీ పట్ల తేలిక భావం ఏర్పరచుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఇలాంటి దిద్దుబాట్లను ఆపించాలని నా ఉద్దేశం. ఏంచెయ్యాలో తోటి నిర్వాహకులు స్పందించాలని మనవి. __చదువరి (చర్చ • రచనలు) 02:56, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- చదువరి గారు, ఎంతో కాలంగా ఇటువంటి మార్పులు కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. కానీ ఇంతకాలం నిర్వాహక అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఇది వాడుకరుల తప్పు కాదని నా అభిప్రాయం. ఇటువంటి మార్పులు చేస్తున్నప్పుడు, వెంటనే పెద్దలు ఎందుకు స్పందించ లేదో అర్థం కాదు అని నేను అనను, నన్ను తప్పు పట్టి నాతో చెత్త చర్చ చేస్తారు. అప్పటికీ ఈ మధ్యన నేను కూడా ఇదే పద్ధతిలో మార్పులు చేశాను. కనీసం నేనంటే స్పందిస్తారు అని అనుకున్నాను, కానీ స్పందనలు లేవు. ఇప్పటికైనా మీరు ఒక పోస్ట్ పెట్టారు, ఇప్పుడు ఏం చేయాలో పాలసీలు రూపొందిస్తారని ఆశిస్తాను. మీ అభిప్రాయంతో చాలావరకు ఏకీభవిస్తాను. ఒకసారి అందరూ ఆలోచించి వాడుకరులకు సరి అయిన దిశా నిర్దేశనం చేయండి. JVRKPRASAD (చర్చ) 03:05, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- నేను కూడా ఆ సభ్యుడి దిద్దుబాట్లను గమనించాను. కాని చర్చతీసి ప్రక్రియ ప్రారంభించిననూ పవన్ లాంటి వారు అడ్డగిస్తారని నాకు తెలుసు. కాబట్టి చూస్తూ ఊరుకోవడమే తప్ప చేసేదేమీలేదు. రెండేళ్ళ క్రితపు అనుభవం దృష్ట్యా నిర్వాహణ కార్యక్రమాలు నా నుంచి పూర్తిగా ఆగిపోయాయి. ఇలాంటి దిద్దుబాట్లను ఆపడానికి తప్పకుండా ప్రయత్నించాలి. లేదంటే హెచ్చరిక జారీచేసి ఖాతరు చేయనప్పుడు సదరు సభ్యుడిపై నిరోధం విధించాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 05:03, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- ఇది ఖచ్చితంగా సదరు సభ్యుల బాధ్యతారాహిత్యమే. ఆయనను ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించి ఉన్నాము. అయినా ఆయన పద్ధతి మార్చుకోవడం లేదు. ఆయన ఇంక మారుతారని నేను ఆశించడం లేదు. శాశ్వత నిరోధం విధించడం మేలని నేను భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:28, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- ఈ విషయం ఆయన చర్చా పేజీలో రాశాను. ఒక రోజు సమయమిచ్చి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 06:54, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- ఇది ఖచ్చితంగా సదరు సభ్యుల బాధ్యతారాహిత్యమే. ఆయనను ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించి ఉన్నాము. అయినా ఆయన పద్ధతి మార్చుకోవడం లేదు. ఆయన ఇంక మారుతారని నేను ఆశించడం లేదు. శాశ్వత నిరోధం విధించడం మేలని నేను భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:28, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- దీనిని బట్టి నిర్వాహకులకన్నా వాడుకరులకు ఎక్కువ పవర్ ఉన్నట్లు అర్దమవుతుంది.నిజమైన వాడకరులకు చిత్తశుద్ది అనేది ఉంటే గణాంకాలు కోసం చెయ్యరు.ఏదేని ఒక వ్యాసం ఎడిట్ చేయాలని భావించినప్పుడు ఆ వ్యాసంలో తను గమనించిన సవరణలు అన్నీ ఒకటి, లేక రెండు ఎడిట్లులో చేస్తారు. అదే కొత్త వ్యాసం సృష్టించి,అభివృద్ధి చేసేటప్పుడు మరికొన్ని ఎక్కువ ఎడిట్లు చేయవలసిరావచ్చు.ఏదిఏమైనా ఇలా చేసే ఏ వాడుకరులైనా కేవలం గణాంకాల కోసమే అని అర్థమవుతుంది.పోనీ దీని ద్వారా నేను ఒక్కటి అడుగుతాను.దాని వలన వాడకరికి ఏదేని అదనపు ప్రయోజనం ఉందా?ఉద్యోగులకు మిగిలిన సెలవులు అమ్మకోవటానికి అవకాశం ఉన్నట్లు, వికీపీడియా వ్యవస్థాపకులు గణాంకాలను ఏమైనా కొనటానికి అవకాశం ఉందా?ఆలోచించగలరు. ప్రతి దానికి నియమాలు తయారు చేసుకోలేం.నియమాలు ఉన్నా మనం ఆచరిస్తేనే వాటి ఉపయోగం.ఇలాంటి పనులు ఏ వాడకరి చేసినా భాద్యతారాహిత్యమే. ముందుగా కొంత సమయమిచ్చి, మార్చుకొనలేక పోతే శ్వాశ్వత నిరోధం విధించడమే దీనికి పరిష్కార మార్గం అని నేను భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:04, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- యర్రా రామారావు గారు, వాడుకరులకు పవర్ ఎక్కువై కాదు, నిర్వాహకులకు శ్రద్ధ లేదని అనుకోకూడదా ? సవరణలు చేయడానికి కొలమానం అంటూ ఏముంటుంది ? గణాంకాలు వలన ఎవరికీ ఏ ప్రయోజనం ఉండదు. అస్సలు ఇక్కడ చేసిన పనికి ఒక్క పైసా ఎవ్వరూ ఇవ్వరు, రాదు. కేవలం ఆయాసం మాత్రమే మిగులుతుంది. ఏ కిరీటాలు తొడగరు. మరీ మాట్లాడితే సీనియర్లను ఏదో మిషతో మాట్లాడనీయకుండా, ఏ పని చేయనివ్వకుండా ఒక మూలన కూర్చో బెడతారు, వీలయితే తొలగిస్తారు. భాద్యతారాహిత్య ఎడిట్లు అనే ఒక పదంతో వాడుకరులను ఎలా అనగలం ? అందరి ఆరోగ్యం ఒకలా ఉండదు. అందరికీ అవకాశాలు ఒకలా ఉండవు. శ్వాశ్వత నిరోధం విధించడమనడం మాట అనడం చాలా తేలికగానే ఉంటుంది. తెవికీలో ఎవరైనా ఒక అక్షరం అయినా మార్చితే చాలు అని నినాదం ఇస్తున్నారు కదా ! అందుకే అక్షరానికి ఒక ఎడిట్ చేస్తున్నారేమో ? ఇక్కడ సీనియర్ లేదా జూనియర్ లేదా కొత్త వాడుకరి అనేది లేదు, ఎవ్వరైనా ఒకటే కదా ! ఎవరు ఎవరినయినా ఏమయినా ఎంతటివారినయినా ఎవరికిష్టం వచ్చినట్లు ఒక సమూహంలో సభ్యుడుగా ఉంటే (ఒంటరి వాళ్ళకు కుదరదు), ఏదైనా అనొచ్చు, చేయవచ్చు అనేది కొససాగుతోంది కదా ! ఇది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇది ఉచిత సేవా సంస్థ అనేది కూడా మనసులో పెట్టుకోవాలి. ఎడిట్లు అనేవి వికీకి ద్రోహం కాదు, నేరం కాదు. అతి ఎక్కువ ఎడిట్లు ఒక చిన్న విషయానికి ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం నిర్వాహక అధికారులకుంది. ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకు అనేక ఆరోగ్య, ఆర్ధిక, ఇంటి సమస్యలు ఉంటాయి. మీరన్నట్లు ఒక పెద్ద ఎడిట్ చేద్దామని చేస్తుంటే, కరంట్ పోవడం, నెట్ ఆగడం, కళ్ళు తదేకంగా చూడలేక పోవడం, అంత పెద్ద ఎడిట్ చేసేతఫ్ఫుడు ఒక్కోసారి తెలియకుండా, యధాలాపంగా కొద్ది సమాచారం హైలైట్ అయ్యి కొత్తది చేరటం, ఇలా ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఇవి పరిగణలోనికి తీసుకోవాలి. ఎవరైన అవకాశం ఉన్నంత వరకు తక్కువ ఎడిట్లతో ఎక్కువ సమాచారం చేరవేస్తే మంచిది. ఎక్కువ ఎడిట్లు, తక్కువ సమాచారం జోడిస్తే అది వికీపీడియన్ యొక్క వ్యక్తిగత అర్హత లు తెలియజేస్తుందేమో ? ఎడిట్లు కాలం అనేది నెలవారీ జాబితాలో తొలగిస్తే చాలా సమస్య(లు) తగ్గుతుంది(తగ్గుతాయి). ఇక ముందు ముందు ఎడిట్ల గణాంకాలు లెక్కలు కాకుండా ఒకరోజులో ఎంత సమాచారాన్ని అందించారో అనే గణాంకాలు వస్తే ఇటువంటి సమస్యలు రావు. JVRKPRASAD (చర్చ) 08:27, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- ఒక్క అక్షరం అయినా మార్చండి అంటే చిన్న అక్షర దోషాలో, లేదా ఇంకేదో వికీకి ఉపయోగపడేదేదో చేయమని అర్థం. ఒకే మాటున వ్యాసంలో ఒక్కో విభాగానికి ఒక్కో మార్పుగా కొత్త లైనులు చేర్చుకుంటూ పోవడం కాదు. అలా చేస్తే ఎవరిదైనా ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యమే అవుతుంది. రవిచంద్ర (చర్చ) 10:02, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- ఆ అక్షరం మార్పు వలన వికీకి ఉపయోగం ఉందేమోనని అదే ధోరణిలో మార్చుతున్నారేమో వారు. వారిని అడిగితే అర్థం ఏం చెబుతారో ? బాధ్యతా రాహిత్యం అనేది పాలసీలో ఎక్కడ ఉందో వాళ్ళకి లింకు ఇస్తే సరిపోతుంది.JVRKPRASAD (చర్చ) 10:57, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- ప్రతి చిన్న విషయానికి పాలసీలు సృష్టించుకుంటూ పోతే మన సమయమంతా పాలసీలు రాయడానికే సరిపోతుంది. విజ్ఞాన సర్వస్వంలో రాసేటప్పుడు మనం చేసే మార్పు వికీకి ఎలా ఉపయోగ పడుతుంది అనే చిన్న ఆలోచన చేస్తే ఇలాంటి మార్పులు పెద్ద ఎత్తున చేయము. ఇలాంటి మార్పులు ఎందుకు అనర్థ దాయకమో ఆయనకు పలుమార్లు వివరించడం జరిగింది. కావాలంటే ఆయన చర్చా పేజీని చూడగలరు. రవిచంద్ర (చర్చ) 11:24, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- పాలసీ ఉంటే అది మూలంగా ఉండి, సొంత అభిప్రాయం కాకుండా ఉంటుంది. ఇంతకు ముందు ఉంటే ఆ లింకు ఇస్తే సరిపోతుందని అన్నాను. అందరూ మళ్ళీ చెప్పి, సరి అయిన నిర్ణయం ఆలోచించి తీసుకోవడం మంచిదే, నేను అన్నీ చదువుతునే ఉంటాను, కానీ నన్ను, నా అభిప్రాయం సవ్యంగా అర్హం చేసుకోక, అనవసర చర్చలు చేసి, నన్ను నిందిస్తూ నిర్ణయం చేస్తారని, నా అభిప్రాయం వ్రాయను. JVRKPRASAD (చర్చ) 11:37, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- వాడుకరి:C.Chandra Kanth Rao గారు, మళ్ళీ నన్ను అదే చర్చలోకి లాగారు. నేను గతంలో నిషేధాన్ని ఎత్తివేయమని గుళ్ళపల్లి గారు చేసుకున్న అభ్యర్థనను సమర్థించాను. నాలాగే మరో ఇద్దరు వికీపీడయన్లు కూడా సమర్థించారు. అదంతా ఇక్కడ ఛూడవచ్చు. నిరోధం_తొలగింపు_అభ్యర్థన అన్న ఉపవిభాగాన్ని మన నిరోధ విధానాన్ని ఏ ఆంగ్ల వికీలోనైతే తెచ్చి అనువదించుకున్నామో అక్కడి నుంచే అనువదించాను. దాని ఆధారంగా నేను ఇదే పేజీలో తోటి సభ్యుల ముందు అభ్యర్థన పెట్టాను. ఆయనొక పద్ధతి అవలంబించారు, నేనూ పద్ధతే అవలంబించాను. ఇదలా ఉండగా పైన "నిరోధం_తొలగించ_వలెనని_విజ్నప్తి" అన్నదగ్గర "శిక్షణ ఇవ్వడంలో తప్పేమీ లేదు. అది వికీకి ఎంతో అవసరం, శిక్షణా కార్యక్రమాన్ని చర్చలు, ఒప్పందాలూ అంటూ మాట్టాడ్డం ఆయన తీసుకున్న శ్రద్ధను, శ్రమనూ కించపరచినట్లు అవుతుంది." అని వాడుకరి:Chaduvari పేర్కొన్న విషయం ఇక్కడ అసందర్భం కాదనుకుంటాను. నేను వాడుకరి:Nrgullapalli గారికి శిక్షణనిచ్చి, ఆయన సరిగా పనిచేస్తారని ఆశించి, నిషేధం తొలగించమని చంద్రకాంతరావు గారిని అభ్యర్థించడం, ఆయన తిరస్కరిస్తే సముదాయాన్ని కోరడం అన్న ప్రాసెస్లో ఏ తప్పూ లేదు. ఆ ప్రాసెస్ మొత్తం విఫలం అయినంతమాత్రానా ప్రాసెస్ తప్పు కాదు. సముదాయ సభ్యునిగా నేనొక సదుద్దేశంతో చేసిన పనిని ఇన్నిసార్లు "అడ్డంకి" అడ్డంకి అంటూ ప్రస్తావించడం సముచితం కాదని నేను భావిస్తున్నాను. పైగా నేను ఇంకా వ్యాఖ్యానించని చర్చలో నన్ను ప్రస్తావిస్తూ "కాని చర్చతీసి ప్రక్రియ ప్రారంభించిననూ పవన్ లాంటి వారు అడ్డగిస్తారని నాకు తెలుసు." అనడం నన్ను అగౌరవించడం, ముందే నా అభిప్రాయ ప్రకటనకు అడ్డుకట్ట వేయడమని నమ్ముతున్నాను. ఇది ఏ మాత్రం వికీ స్ఫూర్తి కాదు. కానేరదు. ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను - నిరోధం తొలగింపు అన్నది ఒకటి వికీపీడియా ప్రపంచంలో ఉండగా అందుకు అభ్యర్థించడం, సముదాయాన్ని దానిని పున:పరిశీలించమని కోరడం ఏ విధంగా అడ్డంకి అవుతుంది? --పవన్ సంతోష్ (చర్చ) 18:19, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- ఇతర నిర్వాహకులు, అధికారులు ఈ అంశాన్ని కాస్త పరిశీలించాలి. ఒక నిర్వాహకుడు పద్ధతి ప్రకారం పోయి నిర్ణయం తీసుకున్నాకా, ఆ నిర్ణయాన్ని చర్చించకుండా రివర్ట్ చేస్తే నిర్వహణా పనులకు అడ్డంకి అవుతుంది. మరో చర్చ ప్రారంభించి, ఫలానా కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించుకొమ్మని విజ్నప్తి చేయడం, తర్వాత సముదాయానికి నివేదించి అభిప్రాయాలు కోరడం చేయకూడదా? అంటే వికీపీడియాలో ఒకరు నిర్ణయం తీసుకున్నాకా దాన్ని ప్రశ్నించడం కాదు సరికదా పున:పరిశీలించమని కోరకూడదా? నిరోధం_తొలగింపు_అభ్యర్థన అనే పద్ధతి అనుసరించి నేను చేసిన పని అసలు వికీపీడియా నియమ నిబంధనలే పాటించనట్టు వ్యాఖ్యలు చేయడం సబబేనా? దయచేసి అందరూ పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 18:31, 25 ఫిబ్రవరి 2019 (UTC)
- C.Chandra Kanth Rao| గారూ, "కాని చర్చతీసి ప్రక్రియ ప్రారంభించిననూ పవన్ లాంటి వారు అడ్డగిస్తారని నాకు తెలుసు." - 1. ఇది వ్యక్తిగత నింద. 2. అసలు చర్చను పక్కదారి పట్టించే వ్యాఖ్య.
- రెండేళ్ళ కిందటే నిర్వహణ కార్యక్రమాలు ఆపేసానని అన్నారు. మీరు ఆపేస్తే ఆపేసుకోవచ్చు, అది ఇక్కడ అప్రస్తుతం. ఇక్కడ మిగతా వారు చేసే నిర్వహణ కార్యక్రమాలను మాత్రం దయచేసి అడ్డుకోకండి. నమస్కారాలతో__చదువరి (చర్చ • రచనలు) 01:17, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- వాడుకరి:రవిచంద్ర గారూ, Disruptive editing అని చాలా చాల రకాలైన దిద్దుబాట్ల గురించి, వాటి విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆంగ్లంలో ఓ పాలసీ ఉంది. అది అనువదించుకుందాం. మనవాళ్ళు కనిపెట్టిన కొత్త రకాల డిస్రప్టివ్ ఎడిటింగ్ టెక్నిక్కులు బహుశా ఆంగ్ల వికీపీడియాలో కూడా తెలియదనుకుంటా, వాటిని చేర్చుకుని వాటికీ తగ్గ చర్యలు అక్కడ రాసుకుందాం. ఇక మిగతా చర్చ గురించి: విధానమో, మార్గదర్శకమో లేదని దుశ్చర్యలని సముదాయం నిశ్చయించుకున్నవాటిపై చర్యలు తీసుకోకుండా ఆపనక్కరలేదు. సముదాయంలో పలువురు చర్చించి చేసే నిర్ణయాలు అభిప్రాయాలు కావు, సాధారణంగా విధానాలు అలానే రూపొందుతాయి. అలానే నా అభిప్రాయంలో ఇక్కడ మనం చేసే నిర్ణయం ఆ పాలసీలకు ప్రాతిపదిక అవుతుంది. ఈ పద్ధతులన్నీ Gaming the system అని దాని కిందకి వస్తాయి. --పవన్ సంతోష్ (చర్చ) 06:28, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- అవును ఈ పాలసీ మనం ఏర్పరుచుకోవలసిందే. పేజీ సృష్టించండి. నేను అనువాదం మొదలు పెడతాను. దాన్ని మన సముదాయానికి తగ్గట్లుగా మార్చుకుందాం. రవిచంద్ర (చర్చ) 06:43, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- ఇది ముమ్మాటికీ అడ్డంకే. చర్చ కొనసాగింపు నా చర్చాపేజీకి మార్చాను. నా సమాధానాలు ఇక్కడ చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:45, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- అవును ఈ పాలసీ మనం ఏర్పరుచుకోవలసిందే. పేజీ సృష్టించండి. నేను అనువాదం మొదలు పెడతాను. దాన్ని మన సముదాయానికి తగ్గట్లుగా మార్చుకుందాం. రవిచంద్ర (చర్చ) 06:43, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- చదువరి గారూ! అది వ్యక్తిగత నింద కాదు. "ఆ విషయం" కూడా ఈ చర్చకు సంబంధించినదే. ఆ సభ్యుడిపై జరిగే ప్రక్రియను అడ్డుకోకుంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేదే కాదు. సంవత్సరాల తరబడి ఒక సభ్యుడి దిద్దుబాట్ల మోజుతో తెవికీకి ఎంత నష్టం జరిగిందో అందరూ చూస్తున్నారు. మరి చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదెందుకు ? ఇది చర్చను పక్కదారి పట్టించే వ్యాఖ్యకూడా కాదు. ఇదివరకు చెప్పినట్లు ఇది కూడా చర్చకు సంబంధం ఉన్నదే. ఇప్పుడు "ఆ చర్చను" నా చర్చాపేజీలోనే కొనసాగిస్తాను. మీరు ప్రతిపాదించిన ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళండి. తెవికీ నాణ్యత మెరుగుపర్చడానికి చేసే ఏ ప్రతిపాదనకైనా నా పూర్తి మద్దతు ఉంటుంది. కేవలం చర్చకే మీరు "అడ్డుకోకండి" మాట ఉపయోగించారు. అయినా ఈ విషయంపై నేనేమీ ప్రశ్నించను కాని నిర్వహణ ప్రక్రియకు దెబ్బతీసే భిన్నమైన చర్చను ప్రారంభించడం మాత్రం "అడ్డంకి" కాదా! సి. చంద్ర కాంత రావు- చర్చ 09:56, 26 ఫిబ్రవరి 2019 (UTC)
"ఒక రోజు సమయమిచ్చి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాను." అని రవిచంద్ర గారు రాసారు. నేను ఆయన అభిప్రాయంతో ఏకీభచిస్తున్నాను. Nrgullapalli గారు చేస్తున్న దిద్దుబాట్లపై గతంలోనూ చర్చలు జరిగాయి. కానీ ఆయన మాత్రం ఆ చర్చల్లో తన వైపు వాదన చెప్పినట్లు నాకు గుర్తు లేదు. ఇప్పుడూ స్పందించలేదు. ఆయన తన తప్పును ఒప్పుకున్నట్లే మనం భావించవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 02:02, 27 ఫిబ్రవరి 2019 (UTC)
- నా పై అభిప్రాయానికి పొడిగింత - ఇప్పటికిప్పుడు నిషేధించాలి అనేది నా అభిప్రాయం కాదు. చర్య ఇప్పటికిప్పుడు కాకుండా, ఇకపై ఆయన తప్పు చేస్తే మరో హెచ్చరిక లేకుండా నిషేధించవచ్చు అని నా ఉద్దేశం. __చదువరి (చర్చ • రచనలు) 02:08, 27 ఫిబ్రవరి 2019 (UTC)
- ఆయన దిద్దుబాట్లు ఆపినట్లున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఏమీ చర్య తీసుకోవడం లేదు. మళ్ళీ ఇదే మార్పులు చేస్తే హెచ్చరిక లేకుండా చర్య తీసుకోవచ్చు. ఇది కాకుంటా మరేదో రకమైన మార్పులు చేస్తే హెచ్చరించి తర్వాత చర్య తీసుకోవాలని నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 04:55, 27 ఫిబ్రవరి 2019 (UTC)
- రవిచంద్ర గారితో నేను ఏకీభవిస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 06:19, 27 ఫిబ్రవరి 2019 (UTC)
- ఆయన దిద్దుబాట్లు ఆపినట్లున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఏమీ చర్య తీసుకోవడం లేదు. మళ్ళీ ఇదే మార్పులు చేస్తే హెచ్చరిక లేకుండా చర్య తీసుకోవచ్చు. ఇది కాకుంటా మరేదో రకమైన మార్పులు చేస్తే హెచ్చరించి తర్వాత చర్య తీసుకోవాలని నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 04:55, 27 ఫిబ్రవరి 2019 (UTC)
- గతంలో కూడా ఆయన దిద్దుబాట్లు ఆపినట్లే ఆపి మళ్ళీ మళ్ళీ అలాంటి పొరపాట్లే పదేపదే చేయడం జరిగింది. పొరపాట్లు చేయకుంటే ఫర్వాలేదు కాని ఇదివరకు ఎలాంటి తప్పిదాలకు హెచ్చరికలు జారీచేశామో అవే పొరపాట్లు పునరావృత్తమైతే ఇకపై హెచ్చరిక లేకుండా నిషేధం విధంచవచ్చు. కొత్తరకం పొరపాటు ఉంటేమాత్రం భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు చేయకుండా ముందుగా తెలిపి, హెచ్చరిక చేసి నిషేధం విధించవల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:54, 27 ఫిబ్రవరి 2019 (UTC)
స్వచ్ఛంద రాజీనామా
[మార్చు]నేను నా తెవికీ నిర్వాహక హోదాను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను. నిర్వాహకులెవరైనా స్టీవార్డుల దృష్టికి తెచ్చి నా నిర్వాహకహోదాను తొలగించుటకు ప్రయత్నించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:22, 1 మార్చి 2019 (UTC)
- వాడుకరి:C.Chandra Kanth Rao గారూ, స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకుంటున్నారు కాబట్టి, మీరే స్టీవార్డులను సంప్రదించాలి. మీ తరపున వేరొకరు చెయ్యడానికి కుదరదు. లింకు: m:Permissions#Removal_of_access __చదువరి (చర్చ • రచనలు) 17:47, 1 మార్చి 2019 (UTC)
గ్రామ పేజీల్లో సర్పంచి పేర్ల చేర్పు - మూకుమ్మడి మార్పులు
[మార్చు]శివకృష్ణ అనే సభ్యుడు మూకుమ్మడిగా గ్రామ వ్యాసాల్లో సర్పంచి పేర్లు చేరుస్తున్నారు. అందుకు మూలంగా కూడా కొన్ని లింకులు చూపిస్తున్నారు. ఉదాహరణకు ఆంధ్రభూమి, డైలీ హంట్ లాంటి మూలాలు. ఇలాంటి మార్పులను అంగీకరించాలా వద్దా అనే విషయంపై మనం చర్చించుకుంటే మంచిది. రవిచంద్ర (చర్చ) 08:01, 22 మార్చి 2019 (UTC)
- ఆ మార్పులు చెయ్యడం వరకూ నాకు అభ్యంతరం కనబడ్దం లేదు. అయితే మూలాలకు సంబంధించి ఆయన చూపిస్తున్న లింకు ఆర్కైవు లాంటిది కాదుగానీ.., అదొక యాగ్రిగేటరు సైటు లాంటిది. డైలీహంట్ ఎంత అవిశ్వసనీయమైనదో నాకు తెలవదు. (కానీ xiaomi అనే కెనానికల్ పేరు మాత్రం నాకు అభ్యంతరకరంగా ఉంది.). దాని వెనక ఉన్న అసలుపేజీ మాత్రం నవతెలంగాణ అనే పత్రికకు చెందినది. (నేను ఒకటి రెండు పేజీల్లో చూసాను). మరింత బలమైన వికీ-మిత్ర లింకుల కోసం నేను వెతికాను -ప్రభుత్వ సైట్లు, వార్తా సైట్లు వగైరాల్లో. నాకు ఎక్కడా సమాచారం కనబడలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషను సైట్లో కూడా తాజా ఫలితాల్లేవు. పాత సమాచారం మాత్రమే ఉంది.
- నేనొక పని చేసాను. తూటికుంట్ల పేజీలో ఉన్న సమాచారానికి మూలంగా అనే లింకును ఇచ్చారు. ఆ పేజీకి మూలమైన పేజీ కోసం వెతికితే, అనే అసలుపేజీ ప్రస్తుతం అందుబాటులోనే ఉంది. దాన్ని ఆర్కైవులో భద్రం చేసుకుని ఆ లింకును మూలంగా ఇస్తే (ఈ లింకును 22 పేజీల్లో వాడవచ్చు) ఇక మనకు అభ్యంతరం ఉండటానికేమీ లేదు. (ఎందుకంటే నవతెలంగాణ లింకుతో మనకు అభ్యంతరమేమీ ఉండదనుకుంటాను.)
- ఇకపోతే.. ఆంధ్రభూమి లింకులు - ఆయన ఆంధ్రభూమి లింకులు ఇచ్చి ఉంటే అసలు అభ్యంతరం ఎందుకు ఉండాలి?
- ఒకే సైటు నుండి అన్నేసి పేజీల్లో మూలాలు ఇవ్వవచ్చా అనే ప్రశ్నకు.. అది పెద్ద సమస్య కాదేమోననుకుంటాను (నిజాయితీగా చెప్పాలంటే.. నేనది పరిశీలించాలి.). ఒకే వ్యాసంలోని అనేక మూలాలు ఒకే లింకుకు చెందినవైతే అది గమనింపులో పెట్టుకోవాల్సిన సంగతి (పాయింటాఫ్ కన్సర్న్) అని చదివినట్టు గుర్తు. మొత్తమ్మీద, మూలంగా నవతెలంగాణ లింకు ఇస్తే ఇబ్బందేమీ ఉండదని నా అభిప్రాయం. __చదువరి (చర్చ • రచనలు) 15:39, 22 మార్చి 2019 (UTC)
- ఈ విషయమై అర్జున రావు గారు ఆ సభ్యుడికి హెచ్చరిక జారీ చేశారు. అందుకు సమాధానంగా అతను నేను మార్పులు చేయడమే ఎక్కువ. అసలు ఏం చేయమంటారు అంటూ అసహనం వ్యక్తం చేయడం చూశాను. వికీలో ఏదో మార్పులు చేద్దామని వచ్చే వారిని సరైన మార్గం చూపించడం మన కర్తవ్యం అని భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:37, 25 మార్చి 2019 (UTC)
- మొదట డైలీహంట్ అవిశ్వసనీయమైనది కాదు. అది అత్యంత ప్రాచుర్యం పొందిన న్యూస్ అగ్రిగేటర్. వార్తా పత్రిక, ఐటంల విశ్వసనీయతే ఆ లింకు విశ్వసనీయత అవుతుంది. అగ్రిగేటర్ కేవలం వార్తలు అక్కడ కూర్చుతుంది, ఆ కూర్చడంలో ఏ కలుపూ చేర్చుతున్నట్టు మనకి ఆధారాల్లేవు. కాబట్టి సమస్యలేదు. ఇక నవతెలంగాణ, ఆంధ్రభూమి విషయమై ఏ సమస్యలూ లేవు. ఒకే మూలాలు అన్ని వ్యాసాల్లోనూ ఇవ్వడం తప్పెందుకు కాదంటే రిలవెన్సు ఉంది. ఆయన అర్జున గారికి ఇచ్చిన సమాధానంలో అసహనం, కాస్త అవమానకరమైన ధోరణి ఉంది. ఆ ముక్క మొక్క మానయ్యేలోగా మనం వివరించాలి. ఇక్కడ తప్పనిసరిగా గారు, మీరు వంటి భాషే వాడాలని, అవతలివారిది తప్పే అనుకున్నా సదుద్దేశంతో చేస్తున్నారని భావించాలని వెళ్ళేకొద్దీ మనం చెప్పాలి. కానైతే మిగతా అంశాలన్నిటిలోనూ ఆయన ఉద్దేశపూర్వకంగా కానీ, తెలియక కానీ ఏ పొరబాటూ చేసినట్టు కనిపించడం లేదు. ఆయన పని స్పామ్ ధోరణిలోకి రాదు. మేలే చేస్తున్నారు.--పవన్ సంతోష్ (చర్చ) 07:47, 26 మార్చి 2019 (UTC)
- చదువరి గారు అన్నట్టు అగ్రిగేటర్ కన్నా ఆర్కైవు మేలు. ఆ ముక్కే అర్జున గారూ చెప్పారు. కానీ ఒక కొత్త వ్యక్తి మేలు చేసే మార్పులు, చాలా దిద్దుబాట్ల కన్నా నాణ్యమైన మార్పులు మూలాలతో సహా చేస్తున్నప్పుడు వెనువెంటనే ఆర్కైవులు వెతుక్కునే భారం పెట్టదగునా అన్న సందేహం ఉంది నాకు. మనమే ఆ ఆర్కైవు చేర్పులు చేసి, మీకు సాయం చేస్తున్నాననీ, మీరూ ఇలా చేస్తే బావుంటుందని మనం చెప్పడం మేలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేస్తున్నవి తప్పుడు మార్పులు కావు, మంచివే. --పవన్ సంతోష్ (చర్చ) 07:49, 26 మార్చి 2019 (UTC)
- మొదట డైలీహంట్ అవిశ్వసనీయమైనది కాదు. అది అత్యంత ప్రాచుర్యం పొందిన న్యూస్ అగ్రిగేటర్. వార్తా పత్రిక, ఐటంల విశ్వసనీయతే ఆ లింకు విశ్వసనీయత అవుతుంది. అగ్రిగేటర్ కేవలం వార్తలు అక్కడ కూర్చుతుంది, ఆ కూర్చడంలో ఏ కలుపూ చేర్చుతున్నట్టు మనకి ఆధారాల్లేవు. కాబట్టి సమస్యలేదు. ఇక నవతెలంగాణ, ఆంధ్రభూమి విషయమై ఏ సమస్యలూ లేవు. ఒకే మూలాలు అన్ని వ్యాసాల్లోనూ ఇవ్వడం తప్పెందుకు కాదంటే రిలవెన్సు ఉంది. ఆయన అర్జున గారికి ఇచ్చిన సమాధానంలో అసహనం, కాస్త అవమానకరమైన ధోరణి ఉంది. ఆ ముక్క మొక్క మానయ్యేలోగా మనం వివరించాలి. ఇక్కడ తప్పనిసరిగా గారు, మీరు వంటి భాషే వాడాలని, అవతలివారిది తప్పే అనుకున్నా సదుద్దేశంతో చేస్తున్నారని భావించాలని వెళ్ళేకొద్దీ మనం చెప్పాలి. కానైతే మిగతా అంశాలన్నిటిలోనూ ఆయన ఉద్దేశపూర్వకంగా కానీ, తెలియక కానీ ఏ పొరబాటూ చేసినట్టు కనిపించడం లేదు. ఆయన పని స్పామ్ ధోరణిలోకి రాదు. మేలే చేస్తున్నారు.--పవన్ సంతోష్ (చర్చ) 07:47, 26 మార్చి 2019 (UTC)
- ఈ విషయమై అర్జున రావు గారు ఆ సభ్యుడికి హెచ్చరిక జారీ చేశారు. అందుకు సమాధానంగా అతను నేను మార్పులు చేయడమే ఎక్కువ. అసలు ఏం చేయమంటారు అంటూ అసహనం వ్యక్తం చేయడం చూశాను. వికీలో ఏదో మార్పులు చేద్దామని వచ్చే వారిని సరైన మార్గం చూపించడం మన కర్తవ్యం అని భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:37, 25 మార్చి 2019 (UTC)
పెండింగు పనులు
[మార్చు]తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో రెండు పేజీల తొలగింపు ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. నిర్వాహకులు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోగలరు. __చదువరి (చర్చ • రచనలు) 08:25, 26 మార్చి 2019 (UTC)
- నేను ఒకటి తొలగించాను. ఇంకొకదాని చర్చాపేజీలో వ్యాఖ్య రాశాను. --అర్జున (చర్చ) 07:07, 2 మే 2019 (UTC)
తెలుగు వికీపీడియా ని నాశనం చేస్తున్న వైరస్ లను బ్లాక్ చెయ్యండి
[మార్చు]తెలుగు వికీపీడియా లో మ్యాటర్ ను ఒక ID తొలగిస్తున్నట్లు గా నేను గమనించాను. ఈ రెండు ఐడి లు తెలుగులో నాశనం చేస్తున్న వైరసులు ani అనుమానిస్తున్నాnu. ఇంకో విషయం దేవుడి మతం పేర్లు వికీపీడియాలో అనుమతించబడవు. దేవుని పేరు జీసస్ దేవుడు పేర్లను వికీపీడియాలో బ్లాక్ చేసి vunnaru. ఇది వరకు ఆ లింక్ ని పంపుచున్నాను. కాబట్టి మీరు ID లను బ్లాక్ చెయ్యండి. కారణాలు ఒకటి bad virus. రెండు దేవుడి పేరు గా ఐడి క్రియేట్ చేసుకోవడం.
Bonadea అనే పేరు దేవుని పేరు. వికీపీడియా రూల్స్ ప్రకారం దేవుని పేరువికీపీడియా అకౌంట్ కు పెట్టుకోకూడదు.ఈ విషయం అందరికీ తెలుసు . సరిపడా లింక్స్ నేను పెడుతున్నాను.Bonadea,Bonadeav అనే పేర్లు పై అకౌంట్లు ఓపెన్ చేస్తున్న ఈ రెండే అకౌంట్లను డిలీట్ చేసి ,బ్లాక్ చేయమని కోరుచున్నాను
https://en.m.wikipedia.org/wiki/Bona_Dea
The below god name was blocked for user name policy.The policy for all wikimedia foundation wikies
https://en.m.wikipedia.org/wiki/User:Jesus100
https://en.m.wikipedia.org/wiki/User:Jesus1000
https://en.m.wikipedia.org/wiki/User:Jesus12
Please block following ID s
Bonadeav and Bonadea
(Trsnxine (చర్చ) 06:45, 2 మే 2019 (UTC)).
సాక్ పప్పెట్లు
[మార్చు]గత రెండు రోజుల్లో కొన్ని కొత్త ఖాతాలు చేరాయి. వాటిలో కొన్ని సాక్ పప్పెట్లని నాకు సందేహంగా ఉంది. అ ఖాతాల వివరాలు కింద ఇస్తున్నాను.
- వాడుకరి:Trsnxine, వాడుకరి:Suneetharaani, వాడుకరి:Shilpika342 - ఒక సెట్టు
- వాడుకరి:Bonadeau, వాడుకరి:Bonadeav, వాడుకరి:BO3NADEA9, వాడుకరి:BO4NADEA9 - మరొక సెట్టు
పై ఖాతాలన్నీ కూడా వాడుకరి:Bonadea అనే సార్వత్రిక ఖాతాపై దాడి చేస్తున్నాయి. ఈ ఖాతా ఎన్వికీలో 2006 నుంచి ఉంది. రోల్‌బ్యాక్ అనుమతులు కలిగిన ఖాతా అది. ఎడిటర్ ఆఫ్ ది వీక్ పురస్కారం పొందిన ఖాతా కూడా. ఎన్వికీలో ఎవరో Bonadea5, Bonadephane, Bonadeaeaea లాంటి అనేక పేర్లతో ట్రోల్ ఖాతాలను సృష్టించుకుని వేధిస్తోంటే, ఆ ఖాతాలను నిషేధించారని గమనించాను. అక్కడ నిషేధానికి గురైన వారు ఇక్కడికి వచ్చి అలాగే ట్రోల్ ఖాతాలను సృష్టించుకున్నట్లుగా అనిపిస్తోంది. ఈ ఖాతాలన్నీ కూడా సదరు ఎన్వికీ వాడుకరిని ట్రోల్ చేస్తున్నాయి. అందులో భాగమే ఈ పేజీలోని పై విభాగంలోని చర్చ అయి ఉండవచ్చు. పై ఖాతాల పేర్లతోటే అర్జున గారికి, రవిచంద్ర గారికీ కూడా వారి చర్చా పేజీల్లో ఈ విషయాన్ని లేవనెత్తినట్లుగా గమనించాను. ఈ ఖాతాలను సాక్ పప్పెట్లని నిర్ధారించుకుని వీటిపై తగు చర్య తీసుకోవాలని నా అభిప్రాయం. తోటి నిర్వాహకులు పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 11:23, 3 మే 2019 (UTC)
- నాకు కూడా అదే అనుమానంగా ఉందండీ. చదువరి గారూ, వాడుకరి:Ambika kumarii కూడా మొదటి సెట్టుకే చెంది ఉంటుందని నా ఊహ. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి మనం ఎక్కడ నివేదించాలి? రవిచంద్ర (చర్చ) 13:09, 3 మే 2019 (UTC)
వాడుకరి:Chaduvari sir,
స్పందించినందుకు ధన్యవాదములు.నమస్కారములు
Bonadea కి ఒక అలవాటు ఉంది .Bonadea పేరు మీద అనేక నకిలీ అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఉంటాడు..ఆ నేరాన్ని కొత్త వాళ్ల మీద నెట్టేస్తూ ఉంటాడు. Bonadea 2010 year లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసాడు అనడానికి సాక్ష్యం.
ఈ విషయాన్ని తెలుసుకున్న అడ్మినిస్ట్రేటర్ వార్నింగ్ ఇచ్చారు చూడండి కింద లింక్
Bonadea కు అడ్మినిస్ట్రేటర్ Huon వార్నింగ్ ఇచ్చారు చూడండి.Bonadea 2010 year లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసాడు అనడానికి సాక్ష్యం.
https://en.m.wikipedia.org/wiki/Special:MobileDiff/885826310
https://en.m.wikipedia.org/wiki/User:Bomadea
https://en.m.wikipedia.org/wiki/User:Bunadea
Bonadea blocked evidence
https://m.mediawiki.org/wiki/Topic:Uys55dxth3cnxq93
ఎవరో దాడి చేస్తున్నారు అనే అపవాదు తప్పు సార్
ఎందుకంటే 2010లో Bonades పేరుమీద ఎకౌంట్ ఎలా వచ్చాయి.
అడ్మినిస్ట్రేటర్ Bonadea ni ఎందుకు తిట్టారు.
Bonadea మీడియావికీ లో ఎందుకు బ్లాక్ అయింది.
చర్చ లేకుండా Afd tag remove cheyyadam తప్పని తెలిసి కూడా Bonadea ఎందుకు చేసినట్టు.
(Shilpika342 (చర్చ) 13:28, 3 మే 2019 (UTC)).
- ఈ వాడుకరి, ఈ వాడుకరి] మీరు చెబుతున్న వ్యక్తి సాక్ పప్పెట్లు కావు. వేరే ఖాతాకు సంబంధించినవి. మీ ఖాతాలు కూడా మేము సాక్ పప్పెట్లా కాదా అనేది నిర్ధారిస్తాము. అంతదాకా వేచి ఉండండి. అసలు Bonadea అనే వాడుకరి ఇప్పటి దాకా తెలుగు వికీలో ఒక్క వ్యాసంలో కూడా మార్పులు లేదా వాండలిజం చేసినట్లు కనిపించడం లేదు. అది నిరూపితమయ్యే దాకా ఆ ఖాతాను ఏమీ చెయ్యం. రవిచంద్ర (చర్చ) 14:25, 3 మే 2019 (UTC)
- ఈ accounts ni Bonadea ఓపెన్ చేసిందని కాబట్టే అడ్మినిస్ట్రేటర్ తిట్టారు మీరు ఒకసారి వార్నింగ్ ఇచ్చిన లింకు చూడండి
Bonadea కు అడ్మినిస్ట్రేటర్ Huon వార్నింగ్ ఇచ్చారు చూడండి.Bonadea 2010 year లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసాడు అనడానికి సాక్ష్యం.
https://en.m.wikipedia.org/wiki/Special:MobileDiff/885826310
- I providing the admin warning copy...
నిర్వాహకుల నోటీసు బోర్డు (block log • active blocks • global blocks • autoblocks • contribs • deleted contribs • abuse filter log • creation log • change block settings • unblock)
Request reason:
Decline reason:
If you want to make any further unblock requests, please read the guide to appealing blocks first, then use the {{unblock}} template again. If you make too many unconvincing or disruptive unblock requests, you may be prevented from editing this page until your block has expired.
- నకిలీ అకౌంట్లు ఓపెన్ చేయొద్దని అడ్మినిస్ట్రేటర్
Huon
Bonadea ki వార్నింగ్ ఇచ్చారు. క్లియర్ గా చెప్పారు.
(Shilpika342 (చర్చ) 14:47, 3 మే 2019 (UTC)).
Shilpika గారు అడిగిన నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరుచున్నాను .
అంతేకాకుండా పై లింక్ ని బట్టి Bonadea Socks ni తయారు చేస్తున్న విషయాన్ని నేను నమ్ముతున్నాను.
Admin Huon confirmed that Bonadea is Sock of User:Bunadea,User:Bomadea.
(Ambika kumarii (చర్చ) 15:48, 3 మే 2019 (UTC)).
- రవిచంద్ర గారూ, మీ అనుమానం సరైనదేననిపిస్తోంది. ఆ ఖాతాను కూడా జాబితాలో చేర్చాను. పోతే, గతంలో ఎన్వికీలో ఇలాఅంటి పేర్లే కలిగిన సాక్ పప్పెట్లు కొన్ని ఎన్వికీలోని వాడుకరిని, ఇతరులనూ ట్రోల్ చేసినందుకు గాను, అక్కడ విచారణ జరిగి సదరు ఖాతాలను లాక్ చేసిన 168 ఉదంతాలు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ రచ్చ చేస్తున్న ఖాతాలు అప్పుడు అక్కడ చేసినవాటికి సంబంధించినవే అయి ఉండవచ్చు. ఈ అనుమానిత ఖాతాలు తెవికీలో చేసిన కొన్ని దిద్దుబాట్ల వివరాలు కింద చూపిన మూడు లింకుల్లో ఉన్నాయి.
- ఈ ఖాతాలను పరిశోధించమని మనం మెటాలో అడగవచ్చు. నేను మెటాలో గమనించినదేంటంటే.. Nsmutte అనే వాడుకరిపై User:Bonadea మెటాలో రిపోర్టు చేసారు. ఆ వాడుకరే మన దగ్గ్గర కూడా ట్రోలింగు చేస్తున్నారని Bonadea ఉద్దేశం. __చదువరి (చర్చ • రచనలు) 16:26, 3 మే 2019 (UTC)
- రవిచంద్ర గారూ, లింకు ఇవ్వడం మర్చిపోయాను. మెటా లోని ఈ పేజీలో రిపోర్టు చెయ్యవచ్చు. మీరూ ఒకసారి పరిశీలించండి. రిపోర్టు చెయ్యదలిస్తే చేసెయ్యండి. నన్ను చెయ్యమంటే నేను చేస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 16:32, 3 మే 2019 (UTC)
User:Chaduvari Sir .Please answer my question ?
- Why did Administrator Huon has given warning to Bonadea for creating socks?
(Ambika kumarii (చర్చ) 16:42, 3 మే 2019 (UTC)).
- Ambika kumarii గారూ, పై చర్చను మీరు చదివే ఉంటారనుకుంటాను. మీ ఖాతాతో సహా మరి కొన్ని ఇతర ఖాతాల కార్యక్రమాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. బహుశా నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది. అప్పటి వరకూ మీరు ఓపిక పట్టండి. ఈ విషయాన్ని పక్కన పెట్టండి. ప్రధాన పేరుబరిలో మీకు ఆసక్తి గల వేరే ఏదైనా పేజీలో పని చెయ్యండి. ధన్యవాదాలు. __చదువరి (చర్చ • రచనలు) 17:02, 3 మే 2019 (UTC)
కొన్ని కొత్త ఖాతాలు
- అసలేం జరుగుతుంది. తెలుగు వికీపీడియాలో మూడు ఎడిట్లు చేసిన వాడుకరి గురించి, తెలుగు వికీపీడియాలో ఎలాంటి దిద్దుబాట్లు చేయని కొన్ని కొత్త ఖాతాలు ఫిర్యాదు చేయడం ఏంటి?ఈ వ్యవహారం గత రెండు మూడు రోజులుగా సభ్యులను ఇబ్బంది పెడుతుంది. వాడుకరి:Bonadeav ఎవరో మనకు తెలియదు. వాడుకరి:Trsnxine, వాడుకరి:Suneetharaani, వాడుకరి:Shilpika342 లు కేవలం ఆ వాడుకరిని ట్రోలు చేయడానికే ఖాతాలు తెరిచారు. పైగా ఈ మూడు పేర్లు ఎప్పుడు వినలేదు కూడా. ఇదంతా ఎవరో ఒకరే చేస్తున్నారని నా అనుమానం. వాడుకరి:Trsnxine, వాడుకరి:Suneetharaani, వాడుకరి:Shilpika342 గారులు మీకు తెలుగు వికీలో రాయాలని అస్తకి ఉంటే చదువరి గారు చెప్పినట్టుగా వేరే ఏదైనా పేజీలో పని చెయ్యండి. వాడుకరి:Bonadeav గురించి నిర్వాహకులు చూసుకుంటారు. ఎవరో ఒకరిద్దరు వచ్చి ఒక వాడుకరిని నిరోధించమంటే, నిరోధించడానికి ఇది వ్యక్తిగత బ్లాగు కాదు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:41, 6 మే 2019 (UTC)
- Pranayraj1985 అవును ! కొత్తగా వచ్చి ఈ కొత్త ఎడిటర్ గురించి డిస్కస్ చేస్తున్న ఈ కొత్త వారిని అందర్నీ బ్లాక్ చేయండి .ఒక్కో రోజు ఒకో సమస్య సీరియల్ కదా లాగా వుంది .నిన్న ఏమో IP కధ .
. అసలు ఈ బోనాడీ ఎవరు ? స్వీడన్ కి చెందిన ఈ కొత్త ఎడిటర్ ఇక్కడ ఎందుకు ఎడిటింగ్ చేసినట్లు ?. మధ్య లో ఈ IP గోల ఏమిటి ?. స్వీడన్ IP ఇక్కడ ఎందుకు ఎడిటింగ్ చేసినట్లు ?ఈ కథని ముగింపు చెయ్యండి .(Kakammaa (చర్చ) 21:13, 6 మే 2019 (UTC))
- ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నిర్వాహకులు చూసుకుంటారు. ఇలా మీరు ఒక్కోసారి ఒక్కో ఖాతాతో రావడం మాత్రం మంచిదికాదు. ముందు మీరు తెవికీలో రాయడం చేయండి. ఆ తరువాత మిగతావి మాట్లాడుకుందాం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 03:52, 7 మే 2019 (UTC)
మనం చేసిన ఫిర్యాదును స్టీవార్డులు విచారించి, సదరు ఖాతాలన్నిటినీ లాక్ చేసారు. అయితే, ఇకముందు మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. __చదువరి (చర్చ • రచనలు) 02:22, 8 మే 2019 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారు. అలాగే చేద్దాం Pranayraj Vangari (Talk2Me|Contribs) 21:22, 8 మే 2019 (UTC)
పాత EDITORS మాత్రమే చర్చ పూర్తి చేయండి
[మార్చు]
• 03:16, 27 July 2018 diff hist +92 N User:Balagoovi ←Created page with ' I believe pillars of Wikipedia' (Copy from english wikipeida)
(Balagoovi (చర్చ) 17:50, 5 మే 2019 (UTC))
- Balagoovi, దయచేసి ఈ నోటీసు బోర్డులో చెత్త నింపడం ఆపండి. లేదంటే తక్షణమే మీ మీద నిరోధం విధించవలసి ఉంటుంది. Bonadea ఖాతా పై మేము తీసుకోబోయే నిర్ణయం స్టీవార్డుల ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. అప్పటి దాకా మీ సమయాన్ని వేరే విషయాల్లో వెచ్చిస్తే బాగుంటుంది. మా విలువైన సమయాన్ని కూడా గౌరవించినట్లవుతుంది. రవిచంద్ర (చర్చ) 18:22, 5 మే 2019 (UTC)
- క్క్షమించండి.. (Balagoovi (చర్చ) 18:55, 5 మే 2019 (UTC))
వికీపీడియా లో తెలుగు టైపు చెయ్యడానికి అతి సులభ మార్గం
[మార్చు]గూగుల్ ప్లే స్టోర్ లో "తెలుగు వాయిస్ టైపింగ్" అనే ఆప్స్ ఉంటాయి .డౌన్లోడ్ చేసుకుని మాట్లాడండి ....అదే తెలుగు లో టైపు చేస్తుంది .తరువాత కాపీ బటన్ నొక్కండి .వికీపీడియా లో పేస్ట్ చెయ్యండి .సింపుల్ ఇప్పుడు నేను ఇలానే చేసి ఇక్కడ ఈ టాపిక్ పెట్టాను .ఈ విషయం చాల మందికి తెలియదు అని నా ఉద్దేశ్యం .
(అరుణ (చర్చ) 04:12, 6 మే 2019 (UTC))
- అరుణ గారి సలహాకు ధన్యవాదాలు. పూర్తి వ్యాసం సవరించటానికి ప్రయత్నించి మీ అనుభవాలు తెలియజేయండి. మొబైల్_ఫోన్_కీ_బోర్డు లో మరింత సమాచారము మూలాలతో చేర్చండి. --అర్జున (చర్చ) 05:00, 8 మే 2019 (UTC)
- అర్జున గారు,"నోట్ పేడ్" లేదా "మైక్రో సాఫ్ట్ వర్డ్" ను డౌన్ లోడ్ చేసుకుని వుంచు కోవాలి ."తెలుగు వాయిస్ టైపింగ్" అనే అప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో దొరుకుతాయి .ఈ ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి . .తరువాత ఆ అప్ ఓపెన్ చేసి "స్టార్ట్" బట్టన్ నొక్కాలి ....మనం మాటలు ఆడిన మాటలు టైపు అవుతాయి ఆటోమేటిక్ గా . ఈ ఆప్ పైన కాపీ బటన్ నొక్కాలి . ఈ తెలుగు మేటర్ ని నోట్ పాడ్ లో పేస్ట్ చెయ్యాలి . ఆ తరువాత మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుని డైరక్ట్ గా తెలుగు వికీపీడియా లో పేస్ట్ చెయ్య వచ్చు . అత్యంత సులభ మార్గం . ఫాస్ట్ గా చెయ్యొచ్చు . ఇప్పుడు నేను ఈ మ్యాటర్ కూడా ఇదే విధం గా చేసాను .
- తెలుగు వికీపీడియా లో సినిమా ఆర్టికల్ వ్రాయాలి అనుకుంటున్నాను . "2018" లో సూపర్ హిట్ అయి 50 /100 రోజులు ఆడిన తెలుగు సినిమా లు లిస్ట్ " అనే హెడ్డింగ్ తో ఆర్టికల్ రాయ వచ్చునా ? నాకు సలహా ఇస్తే ఆర్టికల్ పోస్ట్ చేస్తాను. (అరుణ (చర్చ) 13:41, 8 మే 2019 (UTC))
- మీ చొరవకు ధన్యవాదాలు. వర్గం:సినిమా జాబితాలు చూడండి. చాలా సినిమాల వ్యాసాలు తెలుగులో ఉన్నాయి. వాటిని సరైన మూలాలతో విస్తరించండి. --Rajasekhar1961 (చర్చ) 15:20, 8 మే 2019 (UTC)
- అరుణ గారికి, మీరు టైపింగ్ గురించిన వివరం బాగుంది. మూలాలతో సంబంధిత వ్యాసాలను అభివృద్ధి చేయండి. మొబైల్ లేక టేబ్లెట్ లో తెర పరిమితి దృష్ట్యా వికీపీడియాలో పనిచేయటానికి కొంత ఇబ్బందులు ఉంటాయి. అయినా ఉపయోగంగా వుంటుందనకున్నవారు వాడుకుంటారు. వికీపీడియాలో జాబితాలు చేర్చవచ్చు. తగిన మూలాలతో వ్రాసి, ఆయా సినిమాల పేజీలకు లింకులు చేర్చండి.--అర్జున (చర్చ) 23:27, 8 మే 2019 (UTC)
- తెలుగు వికీపీడియా లో సినిమా ఆర్టికల్ వ్రాయాలి అనుకుంటున్నాను . "2018" లో సూపర్ హిట్ అయి 50 /100 రోజులు ఆడిన తెలుగు సినిమా లు లిస్ట్ " అనే హెడ్డింగ్ తో ఆర్టికల్ రాయ వచ్చునా ? నాకు సలహా ఇస్తే ఆర్టికల్ పోస్ట్ చేస్తాను. (అరుణ (చర్చ) 13:41, 8 మే 2019 (UTC))
పెండింగు పనులు
[మార్చు]తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో తొలగింపు ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. నిర్వాహకులు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోగలరు. __చదువరి (చర్చ • రచనలు) 04:55, 11 జూలై 2019 (UTC)
- చర్య తీసుకొన్నాను.అర్జున (చర్చ) 04:50, 3 ఆగస్టు 2019 (UTC)
తొలగింపు కొరకు ప్రతిపాదనలను ముగించడం
[మార్చు]తొలగింపు కొరకు ప్రతిపాదించిన వ్యాసాలకు పేజీకి అనుబంధంగా ఒక ఉపపేజీ లింకు తయారౌతుందని మనకు తెలుసు. ప్రతిపాదించిన వారు ఆ లింకుకు వెళ్ళి అక్కడ తమ కారణాన్ని రాసి పేజీని సృష్టించాలి. ఇక దానిపై చర్చ జరగడానికి ఇది దోహద పడుతుంది. అయితే చర్చ జరిగాక, ఫలితాన్ని ప్రకటించడం, చర్చను ముగించడం వగైరాలకు ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతి, మనలో కొంతమంది నిర్వాహకులు, అధికారులూ పాటించడం లేదని నేను గమనించాను. బహుశా ఈ పద్ధతి గురించి మరచిపోయి ఉండవచ్చు. దాన్ని గుర్తు చెయ్యడమే నా ఉద్దేశం. నమూనా వ్యాసం అనే పేజీ తొలగింపు ప్రతిపాదనను ఎలా ముగించాలో చూద్దాం. ఆ ప్రతిపాదనపై చర్చ వికీపీడియా:తొలగింపు_కొరకు_వ్యాసాలు/నమూనా వ్యాసం పేజీలో జరిగింది. ఈ చర్చకు పైన, కిందా రెండు మూసలను చేర్చాలి -ఇలా:
- పైన: {{subst:వ్యాతొలపైన}} '''ఫలితం'''.
~~~~
- అడుగున: {{subst:వ్యాతొలకింద}}
ఆ తరువాత..
- ఆ పేజీని వికీపీడియా:తొలగింపు_కొరకు_వ్యాసాలు/పాతవి పేజీలో {{వికీపీడియా:తొలగింపు_కొరకు_వ్యాసాలు/నమూనా వ్యాసం}} అని ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి.
- వికీపీడియా:తొలగింపు_కొరకు_వ్యాసాలు పేజీలో "తాజా చేర్పులు" విభాగంలో (తొలగింపును ప్రతిపాదించినపుడు దీన్ని చేర్చి ఉండాలి) [[వికీపీడియా:తొలగింపు_కొరకు_వ్యాసాలు/నమూనా వ్యాసం]] అనే లింకును తీసెయ్యండి.
వివరాలకు వికీపీడియా:తొలగింపు_పద్ధతి#తొలగింపు_కొరకు_వ్యాసాలు_పేజీ చూడండి.
లైంగికాంశాల వ్యాసాల సంరక్షణ
[మార్చు]User:chaduvari గారు లైంగికాంశాల వ్యాసాలను అజ్ఞాత సభ్యులు దిద్దకుండా సంరక్షించారు. (ఉదా:https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AD%E0%B0%82%E0%B0%97%E0%B0%82&diff=prev&oldid=2713045) . ఈ విషయంపై గుర్తింపుతో రాసేవారు తక్కువే వుంటారని నా అంచనా. ఎవరైనా విధ్వంసం చేస్తుంటే వారిపై IP నిరోధకాల లాంటి చిన్నతరహా ప్రతిబంధకాలు కొద్దికాలం వరకు విధించితే మంచిదనిపిస్తోంది. --అర్జున (చర్చ) 04:35, 26 ఆగస్టు 2019 (UTC)
- @Arjunaraoc: అంచనాలు ఎందుకు గానీ, సంభోగం వ్యాసంలో ఈ మార్పులు చూడండి. అన్నీ అజ్ఞాత వాడుకరి చేసినవే. చాలా అసభ్యంగా ఉన్నాయి. నిన్ననే వీటన్నిటినీ ప్రణయ్‌రాజ్ వచ్చి ఆరోజే మీరు చేసిన మార్పుల వరకూ తిప్పికొట్టాడు. ఈ అంశంపై గుర్తింపుతో రాసేవారు తక్కువే ఉంటే గుర్తింపు లేకుండా రాసేప్పుడు విశృంఖలంగా చెలరేగి రాసేవారు మరింత ఎక్కువమంది ఉంటారన్నది తెలియంది కాదు. ఇలాంటి సంరక్షణలు చేయకపోతే తెవికీని మరో బూతు సైట్‌గా తయారుచేసి కూచోబెడతారు.
- ఈ సమస్య కేవలం అజ్ఞాత వాడుకరుల వల్లనే కాదు, కొత్తగా ఖాతాలు ఉద్దేశపూర్వకంగా ఇందుకే సృష్టించుకున్నవారి వల్ల కూడా ఉంటుంది. గతంలో ఈ అంశంపై నేను చర్చ లేవనెత్తగా సముదాయం చర్యలు తీసుకోవడం చూడవచ్చు. ఇది సంబంధిత చర్చ లింకు. కాబట్టి, ఆటోకన్ఫర్మ్ కానీ, అంతకన్నా ఎక్కువ స్థాయి కానీ ఉన్న వాడుకరులే మార్పులు చేసేలా సంరక్షణను పెంచడం సరైన చర్య అని నా ఉద్దేశం. ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా తోటి సభ్యులను కోరుతున్నాను. ఈ సందర్భంలో పైన ఇచ్చిన చర్చ లింకు చదివి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 07:33, 26 ఆగస్టు 2019 (UTC)
- తెవికీలో మంచి చేసే వాళ్లకంటే పవన్ సంతోష్ గారు పైన ఉదహరించినట్లు చెడగొట్టే వాళ్లు ఎక్కువుగా ఉన్నందున ఇలాంటి చర్యలు తీసుకోవటంలో ఎలాంటి ఇబ్బందిలేదనేది నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 18:52, 27 ఆగస్టు 2019 (UTC)
- పవన్ సంతోష్,యర్రా రామారావు గార్ల స్పందనలకు గత చర్చల లింకులకు ధన్యవాదాలు. నా ఇటీవల నిర్వహణలో, ఈ విధ్వంసం ప్రతి నెల జరుగుతున్నట్లుగా అనిపించలేదు, అందుకని నిరవధికంగా చేయటం మంచిది కాదేమో. మీ అనుభవంలో ప్రతినెల విధ్వంసం జరుగుతుంటే, వాటిని వ్యక్తిగత నిరోధకాలతో సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతే కొంత దీర్ఘకాలం పాటు నిరోధించడం మంచిదే. నిరవధికంగా చేయటం భవిష్యత్తులో నిర్వహణ చేసే వారికి నిర్ణయంచేసే అవకాశం నుండి వమ్ము చేయడమే అవుతుందని, ఒకవేళ ఈ విషయాలపై ఆసక్తి వుండే మంచి వ్యాసాలు అనామకంగా వ్రాయాలనుకునేవారి స్వాతంత్ర్యాన్ని హరించినట్లవుతుందని నా అభిప్రాయం. దీనిపై చర్చ పెద్దగా పొడిగించే ఆసక్తి నాకు లేదు. --అర్జున (చర్చ) 11:38, 29 ఆగస్టు 2019 (UTC)
- సద్భావం ప్రతీదానికి మొండిప్రాతిపదిక కాదు. సద్భావం అన్నదాన్ని మనం మనసులో ఉంచుకుంటూనే పెద్ద స్థాయి సమస్యలు ఎదురవుతాయేమో అన్నది కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించక తప్పదు. పైన లింకులో నేనిచ్చిన పదజాలం అనామక వాడుకరి వాడింది ఎంత అసభ్యమంటే ఎవరైనా సామాన్యమైన పాఠకుడు చూస్తే తెవికీని బూతు సైట్ అనుకోక మానడు. తరచుదనం గురించి మీరు మాట్లాడుతున్నారు సరే, మన తెవికీలో నిర్వాహకులు ఎందరు సచేతనంగా ఉంటారో తెలియని స్థితి అని మీరే పలుమార్లు అన్నారు. తెలుగు వికీపీడియా ప్రస్తుతం ఉన్న స్థితిలో మనకున్న కాస్త మంచి పేరు చెడకుండా చూసుకోవడం ఒక ముఖ్యమైన అంశం అయితే, భారతదేశంలోని పోర్నోగ్రఫీ వ్యతిరేక చట్టాన్ని గౌరవించడం మరో ముఖ్యమైన అంశం. సున్నితమైన అంశాలకు మినహాయింపులు ఎక్కడైనా తప్పవు. కాబట్టి, చర్చ పొడిగింత మీకు ఇష్టం లేకపోయినా ఈ అంశాలు ప్రస్తావించడం తప్పట్లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 06:33, 30 ఆగస్టు 2019 (UTC)
- ఎవరైనా వాడుకరులు ఈ వ్యాసాల్లో పనిచేయదలుచుకుంటే మారుపేర్లతో మార్పులు చేయవచ్చును కదా. అసలు పేరు కాకపోయినా ఖాతా అని ఏదైనా ఉంటే సదరు వాడుకరులతో చర్చించడం సులువుగా ఉంటుంది. ఐ. పీ అడ్రసులు అయితే అది కుదరదేమో. రవిచంద్ర (చర్చ) 12:07, 30 ఆగస్టు 2019 (UTC)
- రవిచంద్ర గారూ, నిజానికి సమస్య రెండు రకాల వాడుకరులతో. ఈ పేజీల్లో అశ్లీలమైన మార్పులను: 1. ఐపీ ఖాతాల మాటున. 2. కొత్తగా మారుపేర్లు పెట్టుకుని చేసేవారు. మొదటి రకం జనాలను ఐపీ ఖాతాలతో రాసే వీల్లేకుండా చేయడంతో నిరోధించాం. రెండో రకం వారితో ప్రస్తుతానికి మార్పులు చేసేవారిని నిరోధించడం వరకే చేస్తున్నాం. సమస్యలు ఎదురైనట్టైతే కనీస అనుభవం కలిగినవారు (500 మార్పులనుకుంటా) తప్ప మార్పుచేర్పులు చేయలేని విధంగా సంరక్షణలో మార్పుచేసుకోవచ్చు. ఇదీ నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 12:15, 30 ఆగస్టు 2019 (UTC)
- పవన్ సంతోష్, ప్రస్తుతానికి రెండో రకం వాడుకరులని కూడా స్వేచ్ఛగా మార్పులు చేయనిద్దాం. అర్జున రావు గారు చెప్పినట్లుగా సమస్య తీవ్రతరం అయినప్పుడు రెండో అంచె భద్రత అమల్లోకి తీసుకురావచ్చు. రవిచంద్ర (చర్చ) 12:30, 30 ఆగస్టు 2019 (UTC)
- నేనన్నదీ అదే రవిచంద్ర గారూ. --పవన్ సంతోష్ (చర్చ) 13:44, 30 ఆగస్టు 2019 (UTC)
- పవన్ సంతోష్, ప్రస్తుతానికి రెండో రకం వాడుకరులని కూడా స్వేచ్ఛగా మార్పులు చేయనిద్దాం. అర్జున రావు గారు చెప్పినట్లుగా సమస్య తీవ్రతరం అయినప్పుడు రెండో అంచె భద్రత అమల్లోకి తీసుకురావచ్చు. రవిచంద్ర (చర్చ) 12:30, 30 ఆగస్టు 2019 (UTC)
- రవిచంద్ర గారూ, నిజానికి సమస్య రెండు రకాల వాడుకరులతో. ఈ పేజీల్లో అశ్లీలమైన మార్పులను: 1. ఐపీ ఖాతాల మాటున. 2. కొత్తగా మారుపేర్లు పెట్టుకుని చేసేవారు. మొదటి రకం జనాలను ఐపీ ఖాతాలతో రాసే వీల్లేకుండా చేయడంతో నిరోధించాం. రెండో రకం వారితో ప్రస్తుతానికి మార్పులు చేసేవారిని నిరోధించడం వరకే చేస్తున్నాం. సమస్యలు ఎదురైనట్టైతే కనీస అనుభవం కలిగినవారు (500 మార్పులనుకుంటా) తప్ప మార్పుచేర్పులు చేయలేని విధంగా సంరక్షణలో మార్పుచేసుకోవచ్చు. ఇదీ నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 12:15, 30 ఆగస్టు 2019 (UTC)
- ఎవరైనా వాడుకరులు ఈ వ్యాసాల్లో పనిచేయదలుచుకుంటే మారుపేర్లతో మార్పులు చేయవచ్చును కదా. అసలు పేరు కాకపోయినా ఖాతా అని ఏదైనా ఉంటే సదరు వాడుకరులతో చర్చించడం సులువుగా ఉంటుంది. ఐ. పీ అడ్రసులు అయితే అది కుదరదేమో. రవిచంద్ర (చర్చ) 12:07, 30 ఆగస్టు 2019 (UTC)
- సద్భావం ప్రతీదానికి మొండిప్రాతిపదిక కాదు. సద్భావం అన్నదాన్ని మనం మనసులో ఉంచుకుంటూనే పెద్ద స్థాయి సమస్యలు ఎదురవుతాయేమో అన్నది కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించక తప్పదు. పైన లింకులో నేనిచ్చిన పదజాలం అనామక వాడుకరి వాడింది ఎంత అసభ్యమంటే ఎవరైనా సామాన్యమైన పాఠకుడు చూస్తే తెవికీని బూతు సైట్ అనుకోక మానడు. తరచుదనం గురించి మీరు మాట్లాడుతున్నారు సరే, మన తెవికీలో నిర్వాహకులు ఎందరు సచేతనంగా ఉంటారో తెలియని స్థితి అని మీరే పలుమార్లు అన్నారు. తెలుగు వికీపీడియా ప్రస్తుతం ఉన్న స్థితిలో మనకున్న కాస్త మంచి పేరు చెడకుండా చూసుకోవడం ఒక ముఖ్యమైన అంశం అయితే, భారతదేశంలోని పోర్నోగ్రఫీ వ్యతిరేక చట్టాన్ని గౌరవించడం మరో ముఖ్యమైన అంశం. సున్నితమైన అంశాలకు మినహాయింపులు ఎక్కడైనా తప్పవు. కాబట్టి, చర్చ పొడిగింత మీకు ఇష్టం లేకపోయినా ఈ అంశాలు ప్రస్తావించడం తప్పట్లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 06:33, 30 ఆగస్టు 2019 (UTC)
- పవన్ సంతోష్,యర్రా రామారావు గార్ల స్పందనలకు గత చర్చల లింకులకు ధన్యవాదాలు. నా ఇటీవల నిర్వహణలో, ఈ విధ్వంసం ప్రతి నెల జరుగుతున్నట్లుగా అనిపించలేదు, అందుకని నిరవధికంగా చేయటం మంచిది కాదేమో. మీ అనుభవంలో ప్రతినెల విధ్వంసం జరుగుతుంటే, వాటిని వ్యక్తిగత నిరోధకాలతో సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతే కొంత దీర్ఘకాలం పాటు నిరోధించడం మంచిదే. నిరవధికంగా చేయటం భవిష్యత్తులో నిర్వహణ చేసే వారికి నిర్ణయంచేసే అవకాశం నుండి వమ్ము చేయడమే అవుతుందని, ఒకవేళ ఈ విషయాలపై ఆసక్తి వుండే మంచి వ్యాసాలు అనామకంగా వ్రాయాలనుకునేవారి స్వాతంత్ర్యాన్ని హరించినట్లవుతుందని నా అభిప్రాయం. దీనిపై చర్చ పెద్దగా పొడిగించే ఆసక్తి నాకు లేదు. --అర్జున (చర్చ) 11:38, 29 ఆగస్టు 2019 (UTC)
- తెవికీలో మంచి చేసే వాళ్లకంటే పవన్ సంతోష్ గారు పైన ఉదహరించినట్లు చెడగొట్టే వాళ్లు ఎక్కువుగా ఉన్నందున ఇలాంటి చర్యలు తీసుకోవటంలో ఎలాంటి ఇబ్బందిలేదనేది నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 18:52, 27 ఆగస్టు 2019 (UTC)
తొలగింపు సహకారం
[మార్చు]నేను తొలగింపు ప్రతిపాదనలు పరిశీలించాను. వీటిలో చాలావాటిని ప్రతిపాదించిన యర్రా రామారావు , వాడుకరి:రహ్మానుద్దీన్, వాడుకరి:K.Venkataramana, వాడుకరి:Chaduvari గార్లకు ధన్యవాదాలు. కొన్నిసార్లు సంబంధిత వాడుకరి చర్చాపేజీలో హెచ్చరిక చేరటంలేదు. లేక దానిపై కృషిచేసిన సభ్యులకు హెచ్చరిక తెలియుటలేదు. ఈ కారణంగా ప్రతిపాదనలు పెండింగ్ లో పడుతున్నాయి. అందుకని హెచ్చరిక చేర్చేటప్పుడు,twinkle తో చేర్చండి. ఆ ట్వింకిల్ మూసలో సూచించినట్లు సభ్యుని పేజీలో హెచ్చరిక లేక, వ్యాస చర్చాపేజీ ఆ పేజీకి కృషి చేసిన వారిని పేర్కొనండి. గ్రామ పేజీలకు తొలగింపు మూసలు పెట్టటం వలన పని ఎక్కువవుతుంది. కావున విధాన నిర్ణయానికి ప్రయత్నించి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టటం మంచిది. ఇప్పటికే వున్న గ్రామపేజీలలో తొలగింపు గురించి తదుపరి చర్చ లేక చర్య యర్రా రామారావు గారు తీసుకుంటే బాగుంటుంది. --అర్జున (చర్చ) 11:34, 29 ఆగస్టు 2019 (UTC)
- అర్జున గారూ, గతంలో ప్రతిపాదించిన తొలగింపులను ముగింపుకు తీసుకెళ్ళాలని మీరు పని మొదలుపెట్టారు, సంతోషం. ధన్యవాదాలు. ప్రతిపాదిత పేజీలో పనిచ్సిన వాడుకరులకు తెలియజెప్పడం బానే ఉంటుంది. అయితే ప్రతిపాదించగానే, సంబంధిత చర్చాపేజీని తెరిచి, ఆ చర్చాపేజీ లింకును తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో చేర్చడం చెయ్యాలి. నిర్వాహకులు నోటీసుబోర్డును చూస్తారు కాబట్టి, కనీసం వాళ్ళైనా చర్చలో పాల్గొంటారు. తొలగింపు పద్ధతిని అందరూ పాటించాలి. మీరైనా ఈ ప్రతిపాదనలను వికీపీడియా:తొలగింపు_కొరకు_వ్యాసాలు పేజీలో తాజా చేర్పులు విభాగంలో చేర్చాల్సింది. అలాగే చర్చ ముగిసి నిర్ణయం ప్రకటించిన వాటిని తాజాచేర్పుల నుండి తీసేసి, వికీపీడియా:తొలగింపు_కొరకు_వ్యాసాలు/పాతవి పేజీలో చేర్చాలి. గమనించండి.__చదువరి (చర్చ • రచనలు) 02:25, 30 ఆగస్టు 2019 (UTC)
- చదువరి గారికి, మీరు చెప్పినది సరైనదే. నేను వీటిని ఈ పేజీలో తొలిగావున్న తొలగింపు వర్గాల ద్వారంగా చేరాను కాబట్టి, మీరు చెప్పిన వికీపీడియాపేరుబరిలోని వ్యాసాలలో మార్పులు చేయలేదు. నిర్వహణ సమర్ధవంతంగా జరగకపోవడానికి, ఇలా రెండు చోట్ల మార్పులు చేయవలసి రావటం లాంటి క్లిష్టమైన పద్ధతులొక కారణం. ఈ పద్ధతి ఎకో సూచనల వ్యవస్థలేని కాలంలో , ఆంగ్ల వికీపీడియాలో బాట్ల సాయంతో నడిచినది. మన తెలుగువికీలో కొత్త పద్ధతి ప్రవేశపెట్టాలి. ప్రస్తుతం తెలుగు వికీసోర్సు లో కొత్త పద్ధతి ప్రయోగంలో వుంది. దానిని మీరు కూడా చూసి వీలైతే వాడి స్పందిస్తే దానిని మెరుగుచేసిన తరువాత, తెవికీలో ప్రవేశపెట్టవచ్చు. --అర్జున (చర్చ) 00:14, 1 సెప్టెంబరు 2019 (UTC)
- అర్జున గారూ, ఆ కొత్త పద్ధతి ఏదో ఇక్కడ కూడా ప్రవేశపెట్టండి. ఆ పరీక్షలేవో ఇక్కడే చేద్దాం. మళ్ళీ అక్కడ చెయ్యడం దేనికి? ఇక్కడైతే పనిలో పనిగా అయిపోతుంది కదా.__చదువరి (చర్చ • రచనలు) 04:13, 7 సెప్టెంబరు 2019 (UTC)
- చదువరి గారికి, మీరు చెప్పినది సరైనదే. నేను వీటిని ఈ పేజీలో తొలిగావున్న తొలగింపు వర్గాల ద్వారంగా చేరాను కాబట్టి, మీరు చెప్పిన వికీపీడియాపేరుబరిలోని వ్యాసాలలో మార్పులు చేయలేదు. నిర్వహణ సమర్ధవంతంగా జరగకపోవడానికి, ఇలా రెండు చోట్ల మార్పులు చేయవలసి రావటం లాంటి క్లిష్టమైన పద్ధతులొక కారణం. ఈ పద్ధతి ఎకో సూచనల వ్యవస్థలేని కాలంలో , ఆంగ్ల వికీపీడియాలో బాట్ల సాయంతో నడిచినది. మన తెలుగువికీలో కొత్త పద్ధతి ప్రవేశపెట్టాలి. ప్రస్తుతం తెలుగు వికీసోర్సు లో కొత్త పద్ధతి ప్రయోగంలో వుంది. దానిని మీరు కూడా చూసి వీలైతే వాడి స్పందిస్తే దానిని మెరుగుచేసిన తరువాత, తెవికీలో ప్రవేశపెట్టవచ్చు. --అర్జున (చర్చ) 00:14, 1 సెప్టెంబరు 2019 (UTC)
Please block. -- CptViraj (చర్చ) 07:06, 7 ఏప్రిల్ 2020 (UTC)
- CptViraj, Thanks for bringing it to our notice. I have warned the user about his actions o his discussion page, if he still continue doing these changes, we will block him. రవిచంద్ర (చర్చ) 07:41, 7 ఏప్రిల్ 2020 (UTC)
- No problem, thankyou :) -- CptViraj (చర్చ) 07:50, 7 ఏప్రిల్ 2020 (UTC)
వైవిఎస్‌రెడ్డి గారితో ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం
[మార్చు]మొలకల విషయమై, మూలాల విషయమై వైవిఎస్ రెడ్డి గారితో ప్రస్తుతం జోరుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.., గత రెండు మూడు రోజుల్లో రెండు కొత్త ఖాతాలు తెరుచుకోవడం నేను గమనించాను. 1. వాడుకరి:REDDY GARI VYASALU 2. వాడుకరి:రెడ్డి గారి వ్యాసాలు ఆ పేర్లను బట్టి చూస్తే ఈ ఖాతాలను సదుద్దేశంతో పెట్టలేదేమోననే సందేహం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితిని వాడుకుని అనవసరమైన వివాదాలకు దారితీసే రాతలు రాసే అవకాశం ఉండొచ్చు. ఈ ఖాతాల రాతలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని నిర్వాహకుల దృష్టికి తెస్తున్నాను. సాక్ పపెట్ల దర్యాప్తు ఇప్పుడే చేయించవచ్చు. అయితే ఈ ఖాతాల రాతలను పరిశీలించాక, వీటికి తోడుగా ఇతర ఖాతాలు కూడా ఉన్నాయేమో దర్యాప్తు చేయించవచ్చు నని నా అభిప్రాయంగా ఉంది. __చదువరి (చర్చ • రచనలు) 08:31, 19 మే 2020 (UTC)
- అంతేగాదు.ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఈ వ్యాసాన్ని YVSR గారే ఈ 183.82.142.225 Net Id తో సృష్టించి, దానిని కొన్ని మార్పులు Net ID తో, కొన్ని సవరణలు YVSREDDY పేరుతో సవరణలు సాగించుచున్నాడు.ఇది గూడా గమనించగోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:46, 19 మే 2020 (UTC)
- చదువరి గారూ, కొత్తగా సృష్టించిన ఖాతాలు దురుద్దేశంతో కూడుకున్నవనే నాకు అభిప్రాయం కలుగుతుంది. కానీ మీరన్నట్లు ఆ ఖాతాలతో ఏమి చేయదలుచుకున్నారో వేచి చూడవచ్చు. ఈలోగా సాక్ పప్పెట్ల దర్యాప్తు మొదలుపెట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను. మనం ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా వ్యాసాలు పునఃసృష్టి చేస్తున్నారు కాబట్టి ముందుగా నిరోధం గురించి ఆలోచించడం సబబేమో. రవిచంద్ర (చర్చ) 08:50, 19 మే 2020 (UTC)
- రవిచంద్ర గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:10, 19 మే 2020 (UTC)
- వై.వి.యస్.రెడ్డి గారు కొత్తవారేమీకాదు. వారి రచనలు వికీ శైలిలో లేవు. వాటిని నెమ్మదిగా తొలగించడం ఒక్కటే మార్గం. కొన్ని వ్యాసాలు, పేజీలు అసహజంగా ఉన్నాయి.--Rajasekhar1961 (చర్చ) 10:01, 19 మే 2020 (UTC)
- చదువరి గారూ, కొత్తగా సృష్టించిన ఖాతాలు దురుద్దేశంతో కూడుకున్నవనే నాకు అభిప్రాయం కలుగుతుంది. కానీ మీరన్నట్లు ఆ ఖాతాలతో ఏమి చేయదలుచుకున్నారో వేచి చూడవచ్చు. ఈలోగా సాక్ పప్పెట్ల దర్యాప్తు మొదలుపెట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను. మనం ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా వ్యాసాలు పునఃసృష్టి చేస్తున్నారు కాబట్టి ముందుగా నిరోధం గురించి ఆలోచించడం సబబేమో. రవిచంద్ర (చర్చ) 08:50, 19 మే 2020 (UTC)
- రవిచంద్ర గారూ, ఈ కొత్త ఖాతాలను ఎవరు సృష్టించారనేది ఇప్పుడు చెప్పలేం కాబట్టి ఈ ఖాతాలు ఏంచేస్తాయో వేచి చూడాలనేది నా ఉద్దేశం. అవి చేసే పనులను పరిశీలించాక సాక్ పపెట్ దర్యాప్తు అడుగుదామని నా ఉద్డేశం అంతే.
వైవిఎస్ రెడ్డి గారిపై చర్య తీసుకోవడం గురించి
[మార్చు]- పోతే వైవిఎస్ రెడ్డి గారిపైచర్య గురించి.. సభ్యులు ఆయనపై చర్య తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారని ఈ చర్చను బట్టి, వాడుకరి చర్చ:YVSREDDY/తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలోని చర్చను బట్టి, చర్చ:శిలాజ ఇంధనం పేజీలో చర్చను బట్టీ మనకు తెలుస్తోంది. మనం ఇప్పటికే ఆయనకు తగినన్ని సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు, హెచ్చరికలు అన్నీ చేసి ఉన్నాం. అవన్నీ అయ్యాకనే ఆయన "వ్యాసాల తొలగింపు చర్చలనే నేను అంగీకరించను, వ్యాసాలను తొలగించడానికి నేను ఎలా అంగీకరిస్తాను." అనే వ్యాఖ్య చేసారు. అక్కడితో ఆగకుండా, దానికి కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు కూడా. చర్యకు దారి తీయగల ఎర్ర బటన్లను నొక్కుకుంటూనే పోయారాయన. నాకు తెలిసినంతలో కనీసం ఏడుగురు వాడుకరులు (నిర్వాహకేతరులతో సహా, నాతో సహా) ఈ మధ్య కాలంలో ఆయనకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గానీ సలహాలిచ్చేందుకు, సంస్కరించేందుకూ ప్రయత్నించారు. ఆయన దేన్నీ పట్టించుకున్నట్టుగా కనబడలేదు.
- గత చర్చలను పరిశీలిస్తే, రెడ్డిగారు సముదాయం పట్ల, తన రచనలపై సలహాలిచ్చినవారిపట్లా సుహృద్భావంతో వ్యవహరించినట్లు కనబడదు. గతంలో కూడా ఇలాంటి విషయమై ఆయనకు సోము బల్లా అనే వాడుకరితో చర్చా ఘర్షణ జరిగినట్లుగా కూడా నేను గమనించాను. రెడ్డి గారి ధోరణి అప్పటినుండి అలాగే ఉందో కొద్దిగా ఏమైనా మారారో లేదో తెలీదు గానీ.., ప్రస్తుతం మాత్రం ఆయన ధోరణి సామరస్య పూర్వకంగా లేదు అని నాకు అనుభవమైంది. చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- పైన ఉదహరించిన గత చర్చలో రెడ్డి గారికి అత్యంత పటిష్ఠమైన సమర్ధకుడుగా నిలిచిన వాదుకరి ఇలా అన్నారు: "ఈ వివాదాన్ని స్వస్తి పలకడానికి ఏకైకమార్గం రెడ్డిగారికి ప్రస్తుతమున్న చిన్న వ్యాసాలు వృద్ధిపర్చడానికి వీలుకల్పిస్తూ కొత్త వ్యాసాలు సృష్టించరాదని తెలియపర్చడమే." సమర్ధకుడు కూడా ఆయన కొత్త వ్యాసాలను సృష్టించవద్దని చెప్పారు, పాత వాటిని వృద్ధి చెయ్యమనీ చెప్పారు.
- ఏడేళ్ళ తరువాత ఇప్పుడు కూడా నిర్వాహకులు అదే చెప్పారు. (ప్రస్తుత చర్చ కొత్తగా మళ్ళీ మొదలైంది. పాత చర్చకు కొనసాగింపు కాదు.) అన్ని సలహాలనూ ఆయన పెడచెవిని పెట్టారు.
- ఇప్పటి విడత చర్చల్లో, నేను గమనించినంతలో ఆయనకు మద్దతుగా ఎక్కడా, ఎవరూ మాట్టాడలేదు. కాబట్టి ఈ విషయంపై ప్రత్యామ్నాయ దృక్కోణం, ఆలోచనలూ అభిప్రాయాలూ ఏమీ లేనట్టే కూడా. కాబట్టి చర్య తీసుకోవాలని వివిధ సందర్భాల్లో పెద్దలు చెప్పినదానితో నేను కూడా ఏకీభవిస్తున్నాను.
- Rajasekhar1961 గారు ఇక్కడి చర్చలో పాల్గొన్నారు గానీ, రెడ్డిగారిపై చర్య విషయం గురించి ఏం మాట్లాడలేదు. ఆ విషయం గురించి కూడా ఆయన అభిప్రాయం చెప్పాలని కోరుతున్నాను.
__చదువరి (చర్చ • రచనలు) 11:19, 19 మే 2020 (UTC)
- 2-3 ఖాతాలు సృష్టించుకొని నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుంటే; నిరోధించడం ఒక్కటే మార్గము.--Rajasekhar1961 (చర్చ) 11:45, 19 మే 2020 (UTC)
- కొత్త వ్యాసాలు సృష్టించకుండా వాడుకరి:YVSREDDY గారి ఖాతాను నిరోధిస్తేనే మంచిదని నా అభిప్రాయం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:02, 19 మే 2020 (UTC)
- కొంతకాలం నిరోధించటానికి నేనూ ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 05:15, 20 మే 2020 (UTC)
- వారం రోజుల పాటు నిరోధించాలి. తర్వాత దుశ్చర్యలు ఆపకపోతే నెలరోజులు. తర్వాత కూడా ఆపకపోటే శాశ్వత నిరోధం విధించాలి. ఇదీ నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 05:40, 20 మే 2020 (UTC)
- రవిచంద్ర గారి అభిప్రాయం వెలిబుచ్చినాక నాకు ఒక సందేహం కలుగుతుంది.లోగడ ఏమైనా నిరోధం విధించి ఉంటే ఈ నిరోధం రెండవదిగా పరిగణించాలి.--యర్రా రామారావు (చర్చ) 05:56, 20 మే 2020 (UTC)
- అవును గతంలో విధించిన నిరోధాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:55, 20 మే 2020 (UTC)
- రవిచంద్ర గారి అభిప్రాయం వెలిబుచ్చినాక నాకు ఒక సందేహం కలుగుతుంది.లోగడ ఏమైనా నిరోధం విధించి ఉంటే ఈ నిరోధం రెండవదిగా పరిగణించాలి.--యర్రా రామారావు (చర్చ) 05:56, 20 మే 2020 (UTC)
రచ్చబండలో ఇవ్వాళ తాను మొదలుపెట్టిన చర్చతో, వైవిఎస్ రెడ్డి గారు తన తప్పులను ఒప్పుకునేందుకు, తగు విధంగా మారేందుకూ సిద్ధంగా లేరని నాకు అర్థమైంది. పైగా నిర్వాహకులపై అనుచితమైన వ్యాఖ్యలు చేసారు. అందుచేత, తన తప్పులను తెలుసుకుంటారనే ఆశతో ఆయనపై వారం పాటు నిరోధం విధించాను. (2013 ఫిబ్రవరిలో వికీనియమాల ఉల్లంఘన కారణంగా Rajasekhar1961 గారు ఆయనపై 1 రోజు నిషేధం విధించారు.) __చదువరి (చర్చ • రచనలు) 18:59, 20 మే 2020 (UTC)
ఇంకో సాక్ పప్పెట్ విచారణ
[మార్చు]నాకు వాడుకరి:దేవుడు ఒక సాక్ పప్పెట్ అని అనుమానంగా ఉంది. ఈయన వాదనలు చూస్తుంటే వికీలో ఇంతకు మునుపే ఇలాంటి వాదనలు చేసిన ఇంకొక వాడుకరి గుర్తొచ్చారు. చదువరి గారూ, ఈ అభ్యర్థన చేయడానికి వీలవుతుందా? - రవిచంద్ర (చర్చ) 05:50, 20 మే 2020 (UTC)
- వికీలో ఏదేనీ వాడుకరులతో చర్చల వివాదాలు తలెత్తినప్పుడి ఇలాంటి కొత్త వాడుకరులు పుట్టుకొస్తున్నారు. ఈ వాడుకరికి వికీ నియమావళి తెలుసు. అనుభవమున్న వికీపీడియనులా ఉన్నాడు. చర్చలలో వాదనలు చూస్తుంటే అతను పూర్వపు వాడుకరి అయి ఉంటారని అనుకుంటున్నాను. నాకు కూడా అతను సాక్ పప్పెట్ అని అనుమానంగా ఉంది. కె.వెంకటరమణ (చర్చ) 06:17, 20 మే 2020 (UTC)
- రవిచంద్ర గారూ, కె.వెంకటరమణ గారూ, వాడుకరి:దేవుడు తో పాటు, మీరు ఏ వాడుకరుని (వాడుకరులను) ఉద్దేశించి సాక్ పప్పెట్లు అంటున్నారో నాకు తెలియలేదు. ఆ వివరాలు ఇక్కడ చెబితే, ఇతర వాడుకరులు దానిపై చర్చించే వీలుంటుంది. పోతే.., ఈ విషయాన్ని m:Steward requests/Checkuser వద్ద చెప్పి దర్యాప్తు చెయ్యమని అడగవచ్చు. అయితే దానికి ముందు ఇక్కడ, ఈ పేజీలో మనం చర్చిస్తే బాగుంటుంది. ఏయే ఖాతాలపై (కనీసం రెండు ఖాతాలైతే ఉండాలి కదా) అనుమానం ఉందో, ఆ అనుమానం ఎందుకు కలిగిందో (వీలైతే.. వాళ్ళు చేసిన ఏయే దిద్దుబాట్లు అనుమానాన్ని కలిగిస్తున్నాయో) ఇక్కడ చర్చించి, ఆ చర్చను మన రిపోర్టులో చెబితే బాగుంటుంది. గతంలో మనం చేసిన ఒక రిపోర్టుపై వాళ్ళు చేసిన దర్యాప్తును, దాని ఫలితాన్నీ ఇక్కడ చూడొచ్చు.__చదువరి (చర్చ • రచనలు) 06:57, 20 మే 2020 (UTC)
- నాకు ప్రత్యేకించి ఏ వాడుకరికి సాక్ పప్పెట్టో తెలియదండి. అతని పరిణితి చెందిన రాతలు, వాదనలు చూస్తుంటే ఎవరైనా పాత వాడుకరి అని అనుమానమొస్తుందంతే. కె.వెంకటరమణ (చర్చ) 07:08, 20 మే 2020 (UTC)
- కె.వెంకటరమణ గారూ, సాక్ పపెట్ దర్యాప్తు చెయ్యాలీ అంటే కనీసం రెండు ఖాతాలను లేదా ఐపీ అడ్రసులను ఇవ్వాలి. పోల్చడానికి కనీసం రెండుండాలి కదా! __చదువరి (చర్చ • రచనలు) 07:13, 20 మే 2020 (UTC)
- చదువరి గారు, మీరు కనుక్కుంటారనుకున్నానండీ! :-) ముసుగులో గుద్దులాట ఎందుకు? నేనే చెప్పేస్తాను. నాకు ఈ వాడుకరిని చూస్తే జెవిఆర్కె ప్రసాద్ గారు లాగా అనిపించింది. నాకు ఎందుకు అలా అనిపించిందంటే వీళ్ళు చేసే చర్చలు ఒక పట్టాన తేల్చరు. అసలు విషయాన్ని వదిలేసి ఎమోషనల్ బ్లాక్ మెయిలు చేసినట్లుంటుంది. అవతలి వాళ్ళను బాగా విసిగిస్తారు. వికీ నియామల మీద నమ్మకం ఉండదు. సొంత వ్యాసాల సంఖ్య, దిద్దుబాట్లును పెంచుకోవడం దాని గురించి గొప్పలు చెప్పుకోవడం, చర్చలో అవసరం లేకపోయినా వాటిని తీసుకురావడం. ఈ విషయాలు నా అనుమానానికి కారణాలు. -రవిచంద్ర (చర్చ) 07:29, 20 మే 2020 (UTC)
- రవిచంద్ర గారూ, :-). ఈ చర్చలో మీరు రాసినది చదవగానే నాకు స్ఫురించిన పేర్లలో అదీ ఒకటి. మీరు చెప్పిన అంశాలను చదివాను. మీరు చెప్పినదానిలో నిజం ఉంది. అయితే..
- ప్రసాదు గారి రాతల కంటే దేవుడు గారి తెలుగు (చర్చల్లో రాసే తెలుగు గురించి మాట్టాడుతున్నాను) మెరుగ్గా ఉందని నా అభిప్రాయం. ప్రసాదు గారి వాక్యం ఏ ధోరణిలో మొదలౌతుందో అదే ధోరణిలో సాగదు, ఆ ధోరణిలో ముగియదు. [సముదాయం మొత్తానికీ ఒక విన్నపం - ప్రసాదు గారిని కించపరచే ఉదేశం నాకు లేశమాత్రం కూడా లేదు. కేవలం అవసరార్థం ఒక వాస్తవాన్ని చెబుతున్నానంతే. ఎవరికైనా అవసరమైతే నేను చెప్పిన వాస్తవాన్ని నిరూపించే ఋజువులను చూపించగలనని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మచ్చుకు ఒక వాక్యం: వికీపీడియాలో ఇంతకాలం పనిచేస్తూ, నాకుగా నేను ఇతరులతో ఎలా మాట్లాడి ప్రవర్తించాలో అర్థంకాక, తెలుసుకోలేక తెలిసోతెలియకో నేను వికీ గురించి తెలియక మరియు మీతో నా ప్రవర్తనలో తప్పులు జరిగి ఉండవచ్చునన్న ఉద్దేశ్యంతో బాధ్యత తీసుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున, తోటి వికీపీడియన్లు పేరుపేరున ప్రతిఒక్కరూ మీరు నన్ను మన్నించండి .] ఇతర సభ్యులు ఏమంటారో చూడాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:16, 20 మే 2020 (UTC)
- చర్చలన్నీ చూశాను. దేవుడు అనే వాడుకరి సమస్య నాకు అర్థమైనంతలో ఏమంటే - ఆయనకు నిర్వహణా కృషి పట్ల సరైన దృక్పథం ఏర్పడలేదు.
- ఇంత చర్చ చేసేకంటే మీరే దిద్దవచ్చు కదా, నాకు చెప్పే కంటే మీరే దిద్దవచ్చు కదా అన్నది కదా ధోరణి. అదీ ప్రధానమైన సమస్య. నిజానికి మనమే దిద్దేస్తే అదే వాడుకరి మరికొన్ని వందల వ్యాసాల్లో అవే తప్పులు చేస్తారు, చెప్పి చేయించగలిగితే ఆ వ్యక్తి శైలి మెరుగుపడి శాశ్వతమైన మేలు కలుగుతుంది. ఉదాహరణకు చెప్పడానికి 2 గంటల సమయం, దిద్దడానికి పావు గంట సమయం పట్టిందనుకుందాం. ఆయన మరో ఏడాదికి 50 వ్యాసాల్లో అవే తప్పులు చేస్తే వెనుక దిద్దుకుంటూ పోయేవారికి తేలిగ్గా ఓ పది గంటల సమయం వృధా అవుతుంది. ఈ పద్ధతిలో మరో ఐదుగురు తయారైతే ఇక నిర్వాహకులు/అనుభవం కల వాడుకరులు అదే పని చేయాల్సివుంటుంది.
- డిలీషన్ ట్యాగ్ పట్ల ఆయన ధోరణి కూడా అలానే ఉంది. నోటబుల్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా సృష్టించిన వాడుకరికి ఉంటుంది. అది నోటబుల్ అని భావించే ప్రతి ఒక తోటి వాడుకరికీ ఉంటుంది. చేసుకోకపోతే వ్యాసం తీసేస్తారు. అదేమీ వ్యక్తి మీద అగౌరవం కాదు.
- తెలుగుకు సేవ చేద్దామని తాను వచ్చానని, ఉడతా భక్తిగా తానేదో సేవ చేయదలిస్తే తొలగింపు మూస ఏమిటన్న హుంకరింపు కూడా ఇదే కోవలోనిది. సేవ కావచ్చు, పనే కావచ్చు చేద్దామని అనుకున్నప్పుడు అందులోని నియమాలు తెలుసుకునే చేయాలి తప్పించి తోచింది చేసుకుంటూ పోకూడదు. ఆ నియమానుగుణంగా పనిచేస్తున్నామా లేదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సేవ చేస్తున్నాను అన్నది సమాధానం కాదు, ఆమాటకి వస్తే ఆ ప్రశ్న వేసినవారూ సేవ చేస్తున్నవారే. ఇదే కొత్తవారికీ వర్తిస్తుంది.
- ఇప్పుడు ఇది వదిలి సాక్ పప్పెట్ విషయానికి వస్తే ఈయన జేవీఆర్కే ప్రసాద్ గారి సాక్ పప్పెట్ కాదని నాకు కరాఖండీగా తెలుసు. పైన చదువరి గారు చెప్పిన ఉదాహరణతో పాటుగా చర్చ చేసే పద్ధతిని బట్టి కూడా చెప్పవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 06:53, 21 మే 2020 (UTC)
- అసలు పేరు పక్కన పెట్టి, దేవుడు అని పేరు పెట్టుకుని వాడుకరిగా చేరి, చర్చల పేరుతో సమయాన్ని మింగేస్తూ నేను ముసుగు వీరుడ్ని కాదు ఆయన అంటూంటే నమ్మడానికి నా చెవిలో పూలు పెట్టుకోలేదు. :-) ఇది ఖచ్చితంగా వికీ గురించి బాగా తెలిసిన వ్యక్తి పనే. నేను అనుమానించిన వాళ్ళు కాకపోతే ఇంకొకరు. కానీ పవన్ చెప్పినట్లు నేను ఆయనచేతనే వ్యాసాన్ని సంస్కరించాలని చూశాను. నా వల్ల కాలేదు. ఈలోపు వెంకటరమణ గారు వచ్చి మేం చర్చించిన సగం సమయంలో వ్యాసాన్ని మొత్తం తిరరరాసేశారు. అది ఆయన సాధుస్వభావానికి నిదర్శనం. కానీ ఇలాంటి ప్రవర్తన మాత్రం సహించకూడదు. నేను చెత్త రాసుకుంటూ పోతాను మీరు శుభ్రం చేసుకుంటూ రండి అనడం చాలా ప్రమాదకరమైన ధోరణి. -రవిచంద్ర (చర్చ) 07:20, 21 మే 2020 (UTC)
- చర్చలన్నీ చూశాను. దేవుడు అనే వాడుకరి సమస్య నాకు అర్థమైనంతలో ఏమంటే - ఆయనకు నిర్వహణా కృషి పట్ల సరైన దృక్పథం ఏర్పడలేదు.
- చదువరి గారు, మీరు కనుక్కుంటారనుకున్నానండీ! :-) ముసుగులో గుద్దులాట ఎందుకు? నేనే చెప్పేస్తాను. నాకు ఈ వాడుకరిని చూస్తే జెవిఆర్కె ప్రసాద్ గారు లాగా అనిపించింది. నాకు ఎందుకు అలా అనిపించిందంటే వీళ్ళు చేసే చర్చలు ఒక పట్టాన తేల్చరు. అసలు విషయాన్ని వదిలేసి ఎమోషనల్ బ్లాక్ మెయిలు చేసినట్లుంటుంది. అవతలి వాళ్ళను బాగా విసిగిస్తారు. వికీ నియామల మీద నమ్మకం ఉండదు. సొంత వ్యాసాల సంఖ్య, దిద్దుబాట్లును పెంచుకోవడం దాని గురించి గొప్పలు చెప్పుకోవడం, చర్చలో అవసరం లేకపోయినా వాటిని తీసుకురావడం. ఈ విషయాలు నా అనుమానానికి కారణాలు. -రవిచంద్ర (చర్చ) 07:29, 20 మే 2020 (UTC)
- కె.వెంకటరమణ గారూ, సాక్ పపెట్ దర్యాప్తు చెయ్యాలీ అంటే కనీసం రెండు ఖాతాలను లేదా ఐపీ అడ్రసులను ఇవ్వాలి. పోల్చడానికి కనీసం రెండుండాలి కదా! __చదువరి (చర్చ • రచనలు) 07:13, 20 మే 2020 (UTC)
- నాకు ప్రత్యేకించి ఏ వాడుకరికి సాక్ పప్పెట్టో తెలియదండి. అతని పరిణితి చెందిన రాతలు, వాదనలు చూస్తుంటే ఎవరైనా పాత వాడుకరి అని అనుమానమొస్తుందంతే. కె.వెంకటరమణ (చర్చ) 07:08, 20 మే 2020 (UTC)
- వాడుకరి:దేవుడు నాకు తెలిసినంత వరకు వికీకి కొత్తవాడుకరి కాదు. అతను రాసే పద్దతి, లింకులు ఇచ్చే పద్ధతి, నిర్వాహకులతో అనవసర వివాదాలు చూస్తుంటే అతనికి వికీపట్ల అనుభవం ఉందని తెలుస్తుంది. ఎవరొ పాత వాడుకరి అజ్ఞాతంగా కొన్ని సందర్బాలలో పేర్లు మార్చుకుని ఇలాంటి చర్చలు చేస్తారని అనుకుంటున్నాను. "వికీలో JVRKPRASAD గారి నిర్వాహక హోదా రద్దు ప్రతిపాదన" ను చేసినప్పుడు వాడుకరి:తెగించినోడు ప్రవేశించి అనేక సూచనలు, చర్చలు చేసి ఆ ప్రతిపాదన చర్చ ముగిసిన క్షణం నుండి కనుమరుగైనాడు. అదే విధంగా ప్రస్తుతం మొలకల తొలగింపు పనులు, తొలగింపు చర్చలు జరుగుతున్న సందర్భంగా ఆ మొలకలను, దోషభూయిష్టమైన అనువాద వ్యాసాలు తొలగించకూడదని నిర్వాహకులతో వాదనలకోసం ఈ "దేవుడు" వాడుకరి సృష్టి జరిగిందని నా అభిప్రాయం. అతను మొదటి పుట చర్చలో కూడా తొలగింపుల గూర్చి అడిగాడు. ఇలాంటి వాదనలు చేసే వాడుకరులు తెవికీలో ఎక్కువకాలం పనిచేయలేరని చరిత్ర చెబుతుంది. కె.వెంకటరమణ (చర్చ) 07:21, 21 మే 2020 (UTC)
- @రవిచంద్ర: గారూ, @K.Venkataramana: గారూ, సందేహించడాన్ని నేనేమీ తప్పుపట్టడం లేదు. అట్లాగే, ఆ వాడుకరి చేసిన చర్చలో అవగాహనా రాహిత్యాన్నీ, దురుసు మాట ధోరణిని నేనూ వ్యతిరేకిస్తూనే పైన రాశాను. కాకపోతే, చదువరి గారు అభిప్రాయం చెప్పమన్నారు కాబట్టి నాకు తెలుసును కాబట్టి ఆ వాడుకరి సాక్ పప్పెట్ కాదన్నాను అంతే. అయితే, సాక్ పప్పెట్ కానంత మాత్రాన అతను చేసిన చర్చ ఒప్పు అయిపోదు కదా. ఉద్దేశపూర్వకంగా పదే పదే భాషాదోషాలతో వ్యాసాలు సృష్టించడం, వాడుకరులపై వ్యక్తిగత దాడికి పాల్పడడం వంటి విషయాలు చర్చకు తెచ్చి, నిరూపణ అయినట్టైతే చర్యలు చేపట్టవచ్చు. అంతేకాదు, వాడుకరులు ఇప్పటికీ ఆ వాడుకరి సాక్ పప్పెట్‌యే అని నమ్ముతూ ఉన్నట్టైతే తప్పనిసరిగా విచారణకు ఆదేశించనూ వచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే నా ఈ అభిప్రాయాలు అతని వ్యవహారశైలిని సమర్థించట్లేదు, వ్యతిరేకిస్తూనే ఉన్నవి. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 08:39, 21 మే 2020 (UTC)
- పైన పవన్ చెప్పిన వివరణ చూస్తుంటే, ప్రస్తుతానికి సాక్ పప్పెట్ విచారణ అవసరం లేదనిపిస్తున్నది. పైగా రెండో వారు ఎవరో మనకు ఖచ్చితంగా తెలీడం లేదు. ఈ సభ్యుడి నుంచి దురుసు ప్రవర్తన మళ్ళీ పునరావృతం అయితే తగిన చర్య తీసుకుందాము. -రవిచంద్ర (చర్చ) 09:17, 21 మే 2020 (UTC)
- @రవిచంద్ర: గారూ, @K.Venkataramana: గారూ, సందేహించడాన్ని నేనేమీ తప్పుపట్టడం లేదు. అట్లాగే, ఆ వాడుకరి చేసిన చర్చలో అవగాహనా రాహిత్యాన్నీ, దురుసు మాట ధోరణిని నేనూ వ్యతిరేకిస్తూనే పైన రాశాను. కాకపోతే, చదువరి గారు అభిప్రాయం చెప్పమన్నారు కాబట్టి నాకు తెలుసును కాబట్టి ఆ వాడుకరి సాక్ పప్పెట్ కాదన్నాను అంతే. అయితే, సాక్ పప్పెట్ కానంత మాత్రాన అతను చేసిన చర్చ ఒప్పు అయిపోదు కదా. ఉద్దేశపూర్వకంగా పదే పదే భాషాదోషాలతో వ్యాసాలు సృష్టించడం, వాడుకరులపై వ్యక్తిగత దాడికి పాల్పడడం వంటి విషయాలు చర్చకు తెచ్చి, నిరూపణ అయినట్టైతే చర్యలు చేపట్టవచ్చు. అంతేకాదు, వాడుకరులు ఇప్పటికీ ఆ వాడుకరి సాక్ పప్పెట్‌యే అని నమ్ముతూ ఉన్నట్టైతే తప్పనిసరిగా విచారణకు ఆదేశించనూ వచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే నా ఈ అభిప్రాయాలు అతని వ్యవహారశైలిని సమర్థించట్లేదు, వ్యతిరేకిస్తూనే ఉన్నవి. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 08:39, 21 మే 2020 (UTC)
దేవుడు ఎవరు
[మార్చు]అందరికీ నమస్కారం. నేను ఇక్కడ పని చేయటం మాని చాలాకాలం అయ్యింది. నేను https://www.smule.com/JVRKPRASAD నందు అప్పటి నుంచి పాటలు పాడుకుంటూ ఉన్నాను. సామాజిక సైట్స్ నందు కూడా నా హాజరు తగ్గించుకున్నాను. ఈరోజు వరకు నామీద కొంతమంది సభ్యులకు సదభిప్రాయం లేదు. ఆ కారణాలు వారికే తెలియాలి. ఈరకంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. నన్ను అనవసరంగా అంటే నేను అంటాను అని చాలా మందికి అనుభవమే. నన్ను అన్న వ్యక్తులే సాక్ పప్పెట్లు కాదా అని ఆలోచించాలి. ఆ "దేవుడు" అనే మాయమనిషి నాకు కూడా మంచి మాటలు, పొగడటం ఇది వరకు జరిగింది. మంచి మాటాలతో మాయగాళ్ళు బయటకు రారు. అడ్డమైన మాటలంటే ఎవరో బయట పడతారు. ఎవరైనా ఆపని చేయండి. మీరు చెయ్యనంటే నేను బండబూతులు తిడతాను. ఆ మనిషి బయటకు వస్తాడు, లేదా మళ్ళీ ఇక్కడకు ఆ పేరుతో రాడు. అంతేకాని, నామేద పిచ్చి రాతలు వ్రాయవద్దు. నేను మరోపేరుతో ఇక్కడకు వచ్చి వ్రాయావలసిన దరిద్రం, నాకు లేదు. ఏదైనా ఎంత పెంటైనా వ్రాయాలనుకుంటే నాపేరుతోనే వ్రాస్తాను. ముందు వాడుకరులు అది తెలుసుకుంటే మంచిది. ఇక దొంగరాతగాళ్ళు ఎవరో (ఎవడో) బయట పెట్టండి. నన్ను కెలికిన వారి మీద చర్యలకు, నిర్వాహక, అధికారులు నాకు మీ సమాధానం ఇవ్వండి.JVRKPRASAD (చర్చ) 07:22, 30 మే 2020 (UTC)
తొలగింపు చేసే పద్ధతి గురించి మళ్ళీ మరోసారి
[మార్చు]తొలగింపు చెయ్యడం అనేది, ఒక పేజీని తొలగించడంతో అయిపోదు. తొలగింపు చర్చను ముగించాలి, తదనంతరం చెయ్యాల్సిన పనులను కూడా చెయ్యాలి. గతంలో కూడా ఈ విషయం గురించి చెప్పుకున్నాం. అయినప్పటికీ, కొందరు అనుభవజ్ఞులైన నిర్వాహకులు కూడా ఈ పనులు చెయ్యడం లేదు. ఈ పని ఇతర నిర్వాహకులకు వదిలేస్తున్నారు. చేసే పని సంపూర్ణంగా చేస్తే బాగుంటుంది. దీనిలో నిర్వాహక, అధికార హోదాలో వున్నవారు మరింత బాధ్యత వహించాలి. ఉదా: వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎల్ ఈ డీ __చదువరి (చర్చ • రచనలు) 09:33, 10 ఆగస్టు 2020 (UTC)
- చదువరి గారు, మీ గమనింపుకు ధన్యవాదాలు. ఇప్పుడే చూశాను. నేను ఆ పనులను చేద్దామనుకునేంతలో User:Pranayraj1985 గారు చేశారు. మీ వ్యాఖ్యా చూడక ముందలే మిగతా చోట్ల అవసరమైన వాటికి నేను చేశాను. గమనించగలరు. అర్జున (చర్చ) 10:14, 10 ఆగస్టు 2020 (UTC)
- అర్జున గారూ, హై మోరల్ గ్రౌండ్ తీసుకుని - మరీ ముఖ్యంగా తామందుకు తగుదుమో లేదో చూసుకోకుండా - ఎవరూ ఇతరులకు ప్రవచనాలు చెప్పకూడదని నా ఉద్దేశం. ఆ సంగతి గుర్తు చెయ్యడానికే అలా రాసాను. నిజానికి అలా రాయడం నా పద్ధతి కాదు, కేవలం ప్రతిస్పందన అంతే. నేనిక్కడ సూపర్వైజర్ని, ఇతరుల చేత చేయించడమే నా పని, ఇతరులకు వారివారి పనుల గురించి చెప్పాల్సిన అవసరమూ బాధ్యతా నాకున్నాయి, నాకు నిర్ణయాలు తీసుకోవడం రాకపోయినా, నిర్ణయాలు తీసుకునే పద్ధతి కూడా తెలీకపోయినా పర్లేదు, అవతలి వాళ్లకి ప్రవచనాలు మాత్రం చెప్పేసెయ్యొచ్చు అని నేను అనుకోను. ఇతరులు కూడా అలా అనుకోకూడదని నేను కోరుకుంటాను. __చదువరి (చర్చ • రచనలు) 10:37, 10 ఆగస్టు 2020 (UTC)
- చదువరి గారు , మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. వికీసముదాయంలో అనుభవమున్న వ్యక్తిగా, తెవికీ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా సందర్భాన్నిబట్టి నేను ఏమి చెప్పవచ్చునో, ఏమి చెప్పకూడదో నాకు తెలుసుననుకుంటాను. మీలాగా, కొందరు వాటిని ప్రవచనాలనుకుంటే నేను చేయగలిగింది ఏమీలేదు. ఇతరులైన సరైన దృక్కోణంతో వాటిని గమనిస్తారు అనుకుంటాను. --అర్జున (చర్చ) 10:47, 10 ఆగస్టు 2020 (UTC)
- చదువరి గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ఇప్పుడు అదే పద్దతి జరుగుతుంది.కష్టపడి వికీలో పనిచేసే నిర్వాహకులను తప్పుగా అర్థం చేసుకోవద్ధని నామనవి.నిర్వాహకులు అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ భావన అనేది ఉండకూడదు.ఈ మధ్య చర్చలలో ప్రత్యేకించి అవసరంలేకపోయినా అలాంటి వాఖ్యలుతో కొందరు నిర్వాహకులు అభిప్రాయాలు కనపర్చుచున్నారు. వికీలో వారు చేయకపోగా చేసే వాళ్ల ను అసంతృప్తికి గురి చేస్తున్నారు.ఇది మంచిగా లేదనిపిస్తుంది.--యర్రా రామారావు (చర్చ) 11:08, 10 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారు, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. మీరు మీ వ్యాఖ్యలో కొందరు నిర్వాహకులు అనటం వలన ప్రయోజనం లేదు. నేను చేసిన వ్యాఖ్యలు అమర్యాదగా, పెత్తనం చెలాయించేటట్లుగా వుంటే నేరుగా ఆ వ్యాఖ్యను పేర్కొంటు, నా పేరు వుటంకించండి, తెలపండి. నావరకు నేను ఆత్మ విమర్శ చేసుకొని అటువంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడతాను. ఇంకా నేను వికీలో నిర్వాహక, అధికార హోదాకు తగను అనుకుంటే ఆ విధంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. --అర్జున (చర్చ) 11:14, 10 ఆగస్టు 2020 (UTC)
- నా అభిప్రాయం అందరూ గమనించాలనే భావన.--యర్రా రామారావు (చర్చ) 11:24, 10 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారు, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. మీరు మీ వ్యాఖ్యలో కొందరు నిర్వాహకులు అనటం వలన ప్రయోజనం లేదు. నేను చేసిన వ్యాఖ్యలు అమర్యాదగా, పెత్తనం చెలాయించేటట్లుగా వుంటే నేరుగా ఆ వ్యాఖ్యను పేర్కొంటు, నా పేరు వుటంకించండి, తెలపండి. నావరకు నేను ఆత్మ విమర్శ చేసుకొని అటువంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడతాను. ఇంకా నేను వికీలో నిర్వాహక, అధికార హోదాకు తగను అనుకుంటే ఆ విధంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. --అర్జున (చర్చ) 11:14, 10 ఆగస్టు 2020 (UTC)
- అర్జున గారూ, హై మోరల్ గ్రౌండ్ తీసుకుని - మరీ ముఖ్యంగా తామందుకు తగుదుమో లేదో చూసుకోకుండా - ఎవరూ ఇతరులకు ప్రవచనాలు చెప్పకూడదని నా ఉద్దేశం. ఆ సంగతి గుర్తు చెయ్యడానికే అలా రాసాను. నిజానికి అలా రాయడం నా పద్ధతి కాదు, కేవలం ప్రతిస్పందన అంతే. నేనిక్కడ సూపర్వైజర్ని, ఇతరుల చేత చేయించడమే నా పని, ఇతరులకు వారివారి పనుల గురించి చెప్పాల్సిన అవసరమూ బాధ్యతా నాకున్నాయి, నాకు నిర్ణయాలు తీసుకోవడం రాకపోయినా, నిర్ణయాలు తీసుకునే పద్ధతి కూడా తెలీకపోయినా పర్లేదు, అవతలి వాళ్లకి ప్రవచనాలు మాత్రం చెప్పేసెయ్యొచ్చు అని నేను అనుకోను. ఇతరులు కూడా అలా అనుకోకూడదని నేను కోరుకుంటాను. __చదువరి (చర్చ • రచనలు) 10:37, 10 ఆగస్టు 2020 (UTC)
నిర్వాహక పదవి నుండి స్వచ్ఛంద విరమణ
[మార్చు]వివిధ కారణాల వల్ల నిర్వాహకుడిగా నా బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేనందు వల్ల నేను ఆ పదవి నుండి తప్పుకుంటున్నాను. ఇంత వరకు సహకరించిన వాడుకరులందరికీ ధన్యవాదాలు--స్వరలాసిక (చర్చ) 16:29, 8 అక్టోబరు 2020 (UTC)
- స్వరలాసిక గారు, నిర్వాహక హోదానుండి విరమించడం పదవి నుండి తప్పుకున్నారు. వికీపీడియాకు మీరు ఎంతో సేవ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఉద్యోగరీత్యా మీ వ్యక్తిగత కారణాలు మీకు ఉంటాయి. కాదనలేము కానీ నిర్వాహక బాధ్యత నుండి తప్పుకోవాల్సిన అవసరం లేదు. అని నా భావన, ఉన్న నిర్వాహకులు ఇప్పుడున్న వారు చాలా బాగా చురుకుగా ఉన్నారు ఇద్దరు, ముగ్గురు మినహాయించి, మరి మీరు ఉదాహరణకి ఇప్పటికీ చాలా చురుకుగా బాలసుబ్రమణ్యం లాంటి పేజీలు ప్రతిరోజు వికి కి సమయం చాలా కేటాయిస్తున్నారు, నాకే కనుక పూర్తి ఒక స్పీకర్ అంతా ఏదో ఒక ఫార్మెట్లో పవర్ ఉంటే మీ రాజీనామాను తిరస్కరించే వాడిని సరే... రాజీనామా చేశారు అయిపోయింది. నిర్వాహకులుగా ఇన్నాళ్లు వికీకి చేసిన మీ సేవకు గాను అందరి తరపున మీకు ధన్యవాదాలు నమస్తే సార్. ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 08:41, 10 అక్టోబరు 2020 (UTC)
- స్వరలాసిక గారూ, మీరు నిర్వాహక పదవి నుండి తప్పుకోవాలనే నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నిర్వాహక బాధ్యతలు సరిగా నిర్వహించలేదేమో అని మీరు ఒకవేళ అనుకుంటూ ఉంటే అందుకోసం చింతించనవసరం లేదు ఎందుకంటే వ్యాసాల్లో చేస్తున్న కృషి అపారం. మీ ఆసక్తి ఎక్కువ వ్యాసాల మీదనే ఎక్కువ అని నాకు అనిపిస్తుంది కాబట్టి మీ పూర్తి స్థాయి సమయం దానికే కేటాయించండి. అలాగే నిర్వాహకత్వం అనేది పదవి లేకపోయినా దాదాపు ఆ పనులన్నీ సాధారణ సభ్యులుగా కూడా చేయవచ్చు. వికీలో మీ కృషికి ధన్యవాదాలు. - రవిచంద్ర (చర్చ) 10:32, 10 అక్టోబరు 2020 (UTC)
- @స్వరలాసిక: గారూ! మీరు తెవికీకి చేస్తున్న, చేసిన సేవల పట్ల ఎంతగానో గౌరవం ఉన్నవాడిని నేను. గతంలో మీతో కలిసి ఎన్నో ప్రాజెక్టుల్లో, కార్యక్రమాల్లో పనిచేశాను. మీరు చేసిన వ్యాస రచనా కృషిపైన నాకు అపారమైన గౌరవం ఉంది. మీ నిర్ణయాన్ని గౌరవిస్తూనే మీకు ఈ సందర్భంగా నావైపు నుంచి కృతజ్ఞతలు చెప్పుకోదలిచాను. --పవన్ సంతోష్ (చర్చ) 11:16, 10 అక్టోబరు 2020 (UTC)
- స్వరలాసిక గారూ, మీరు నిర్వాహక పదవి నుండి తప్పుకోవాలనే నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నిర్వాహక బాధ్యతలు సరిగా నిర్వహించలేదేమో అని మీరు ఒకవేళ అనుకుంటూ ఉంటే అందుకోసం చింతించనవసరం లేదు ఎందుకంటే వ్యాసాల్లో చేస్తున్న కృషి అపారం. మీ ఆసక్తి ఎక్కువ వ్యాసాల మీదనే ఎక్కువ అని నాకు అనిపిస్తుంది కాబట్టి మీ పూర్తి స్థాయి సమయం దానికే కేటాయించండి. అలాగే నిర్వాహకత్వం అనేది పదవి లేకపోయినా దాదాపు ఆ పనులన్నీ సాధారణ సభ్యులుగా కూడా చేయవచ్చు. వికీలో మీ కృషికి ధన్యవాదాలు. - రవిచంద్ర (చర్చ) 10:32, 10 అక్టోబరు 2020 (UTC)
కామన్సులోకి తరలించాల్సిన బొమ్మలు
[మార్చు]ఇటీవల వాడుకరి:Vmakumar అన్న వాడుకరి కొన్ని బొమ్మలను వికీమీడియా కామన్స్‌లోని మ్యాప్‌ల ఆధారంగా తయారుచేసి తెవికీలో చేర్చారు. ఇక్కడ చూడొచ్చు. వాటిలో కొన్ని ఇప్పటికే కామన్సులో ఉన్నవాటికి నకలుగానూ, మరికొన్ని కొన్ని అవసరమైన మార్పుచేర్పులు చేసి పెట్టినవిగానూ ప్రాథమికంగా గమనించాను. ఇది కాక ఆయనే గతంలో పబ్లిక్‌డొమైన్‌లో విడుదల చేసిన స్వంత ఫోటోలు కూడా తెవికీలోనే ఉన్నాయి.
ఏ విధమైన కాపీహక్కుల పరిధిలో లేని కృతులైనా వికీమీడియా కామన్స్‌లో ఉంచడమే మంచిదన్నది సూత్రమూ, మనం అలా ఎక్కించే కాపీహక్కుల పరిధిలో లేని ఫోటోలన్నీ అక్కడే ఎక్కిస్తున్నామూ కనుక వీటిని కామన్స్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ఎందుకన్నది చూస్తే "Unfortunately, importing files from the source wiki (te.wikipedia.org) is not yet possible because there is no configuration for the wiki in the configuration file list. For information about setting up a configuration file for the wiki, review FileImporter's configuration file documentation page." అంటూంది. ఈ విషయమై మనం సాంకేతికంగా ఏం చేయాలో తెలిసినవారిని సూచించమనీ, పని వస్తే తామే స్వయంగా చేయమనీ కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 08:34, 13 అక్టోబరు 2020 (UTC)
అర్థం లేని వాక్యాలను గుర్తించేందుకు మూస కావాలి
[మార్చు]ఇటీవల నేనొక కృత్రిమ అనువాద పాఠ్యం ఉన్న వ్యాసాన్ని అనువదించేప్పుడు ఒక అవసరాన్ని గమనించాను. అదేమంటే, సైటేషన్ నీడెడ్ లేక మూలాలు కావాలి అన్న మూసలాంటిదే "కృత్రిమంగా అనువదించిన వాక్యం" అన్న చిన్న పాఠ్యం ఇచ్చే మరో మూస కావాలి మనకు. ఎందుకంటే - ఒక వ్యాసం మొత్తంలో ఓ పది పదిహేను అలాంటి వాక్యాలు ఉన్నప్పుడు, నాబోటి వ్యక్తి దాన్ని మెరుగుపరుద్దామని అనుకున్నప్పుడు ఆ వాక్యం ఏమిటో అర్థం కూడా కావట్లేదు. ఉదాహరణకు హాన్ చైనీస్ వ్యాసంలో ఈ వాక్యం చూడండి "ఈ లో, పదం 'హాన్' ఉపయోగించబడుతుంది కోసం పదం Kshirmarg (మా గెలాక్సీ ) లో పురాతన చైనీస్ పురాతన చైనా పీపుల్స్ స్వర్గం యొక్క నది 'కాల్ ఉపయోగిస్తారు ఇది, (天河, టియాన్ అతను)." దీన్ని అనువదించివాళ్ళు చూసి కూడా ఉండకుండా ప్రచురించారనే చెప్పాలి. ఇప్పుడు నాకు అర్థం కావాలంటే అసాధ్యం. అలాగని అది వదిలేసి ముందుకు వెళ్ళిపోలేం. ఆ వ్యాసం సృష్టించినవారికే దాన్ని ఎక్కడ నుంచి తెచ్చామో, తెలిసే కొద్దిపాటి అవకాశం ఉంది. కావున, నాలాంటి వాడు టాగ్ చేసి ముందుకుపోవడానికి వీలుగా సైటేషన్ నీడెడ్ తరహాలో ఓ టాగ్ కావాలి. దయచేసి మూసలు తయారుచేయడం వచ్చినవారు చేసిపెట్టగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:07, 13 నవంబరు 2020 (UTC)
- పవన్ సంతోష్ గారూ, భాషా నాణ్యతపై దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు. మూస:కృతకవాక్యం ను పరిశీలించండి.
- అలాంటి కృతక వాక్యాలున్న వ్యాసంలో ఈ మూస నుంచడమే కాకుండా, చరిత్ర ద్వారా ఆ వాక్యాన్ని రాసినదెవరో పరిశీలించి, వారి చర్చ పేజీలో కూడా దీని గురించి రాస్తే బాగుంటుంది. అది కొంత శ్రమే.. కానీ ఆయా వాడుకరులు భవిష్యత్తులో మరింత మెళకువగా ఉండేందుకు దోహద పడుతుందది. __చదువరి (చర్చ • రచనలు) 07:34, 13 నవంబరు 2020 (UTC)
- చదువరి గారూ, నేను ఈ మూసనీ వాడాను, మీరు చెప్పినట్టే వాడుకరికి సూచన చేసే ఆలోచననీ పాటించాను. అడిగిన తడవునే చేసి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 14:19, 16 నవంబరు 2020 (UTC)
Hi. Sorry for posting this in English. The user is spamming, can someone please take a look? Thanks! -- CptViraj (చర్చ) 09:46, 28 నవంబరు 2020 (UTC)
- @CptViraj, ఆయన చర్చ పేజీలో అలా చెయ్యవద్దని రాసానండి. కొత్త కాబట్టి బహుశా తెలియక అలా చేసి ఉండవచ్చు. ఇక ఆపేస్తారులెండి.__ చదువరి (చర్చ • రచనలు) 16:24, 28 నవంబరు 2020 (UTC)
ఈ వారం బొమ్మ నిర్వహణ
[మార్చు]చాలా సంవత్సరాలుగా వికీపీడియా మొదటి పేజీలోని ఈ వారం బొమ్మ శీర్షికను అధికభాగం ఆదిత్యమాధవ్ గారు నిర్వహించారు. గత కొన్ని నెలలుగా బొమ్మలను చేర్చడం లేదు. వ్యక్తిగతంగా ఈ మెయిల్ చేసి సహాయాన్ని అభ్యర్థించాను. బహుశా తనకు సమయం లేదేమో స్పందించడం లేదు. ఈ సంవత్సరం నుండి సభ్యులు/నిర్వాహకులలో ఆశక్తి గలవారు ఎవరో ఒకరు "ఈ వారం బొమ్మ" శీర్షికను బాద్యతగా తీసుకొని నిర్వహించవలసినదిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా లో అన్నీ ఎర్రలింకులులే కనిపిస్తున్నాయి. – K.Venkataramana – ☎ 01:08, 6 జనవరి 2021 (UTC)
- వెంకటరమణ గారూ, నేను వీలున్నప్పుడల్లా చేర్చడానికి ప్రయత్నిస్తాను. రవిచంద్ర (చర్చ) 05:20, 6 జనవరి 2021 (UTC)
- రవిచంద్ర గారు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు.నేనూ చేర్చడానికి ప్రయత్నిస్తాను యర్రా రామారావు (చర్చ) 06:22, 6 జనవరి 2021 (UTC)
- రవిచంద్ర, యర్రా రామారావు గార్లకు ధన్యవాదాలు. వికీలో అప్పుడప్పుడూ రాస్తూ కూడా నిర్వాహక పనులు చెయ్యని నిర్వాహకులు కొందరున్నారు. వారెవరైనా ఈ పని స్వీకరిస్తారేమోనని భావించాను. నిజానికి వికీ నిర్వాహకపనుల్లో మళ్ళీ చురుగ్గా పాల్గొనేందుకు వారికిదొక సదవకాశం. అయితే వారెవరూ ఈ పనికి ముందుకు రాలేదు, ఈ అవకాశం తీసుకోలేదు. __చదువరి (చర్చ • రచనలు) 04:40, 8 జనవరి 2021 (UTC)
- రవిచంద్ర గారు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు.నేనూ చేర్చడానికి ప్రయత్నిస్తాను యర్రా రామారావు (చర్చ) 06:22, 6 జనవరి 2021 (UTC)
వాడుకరి:YVSREDDY గారి అనుచిత ప్రవర్తన
[మార్చు]వాడుకరి:YVSREDDY గారు మళ్ళీ వాడుకరులపై వక్తిగత దాడి చేసారు. రచ్చబండలో రాస్తూ ముగ్గురు వాడుకరులను వారి పేర్ల మొదటి అక్షరాలను కలిపి పెట్టిన పేరుతో దూషించారు. వాళ్ళు వికీలో పనులకు అడ్డుపడుతున్నారని నిరాధారమైన ఆరోపణలు కూడా చేసారు. ఆ పేరాలో ఆధారాలు చూపని ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత నిందల కారణంగా ఆయనకు గతంలో రెండు సార్లు నిరోధం విధించారు. మూడవసారి నలుగురు వాడుకరులను నిందించినందుకు గాను 2 వారాల నిరోధం గురించి హెచ్చరించడం జరిగింది. అప్పట్లో నలుగురు వాడుకరులు ఆ ప్రతిపాదనను సమర్ధించగా ఒక్కరు వ్యతిరేకించారు. ఏ నలుగురినైతే ఆయన దూషించారో వాళ్ళలో ఒకణ్ణైన నేను చర్య తీసుకోవడం బాగుండదని అప్పట్లో నేను వెనక్కి తగ్గాను. కానీ అప్పుడు హెచ్చరించడం మాత్రం జరిగింది. ఇప్పుడు సరిగ్గా అదే పద్ధతిలో ముగ్గురు వాడుకరులను దూషించారు. గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు కాబట్టి, ఆ విషయాన్ని ఆయన చర్చ పేజీలో రాసి, వెంటనే నిరోధం విధించాను. దీన్ని నిర్వాహకుల దృష్టికి తెస్తూ దీని గురించి, తదుపరి చర్యల గురించీ అభిప్రాయాలు చెప్పమని కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 17:42, 19 ఏప్రిల్ 2021 (UTC)
- చదువరి గారు, సత్వరమే స్పందించి సరియైన చర్య గైకొన్నందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:57, 20 ఏప్రిల్ 2021 (UTC)
- వైవిఎస్ రెడ్డి గారు పలు సభ్యులు వివరించి చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. అకారణ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ చర్య సబబైందేనని భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 11:25, 20 ఏప్రిల్ 2021 (UTC)
- వైవిఎస్ రెడ్డి గారిపై సరైన చర్య తీసుకున్నందుకు ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 11:53, 20 ఏప్రిల్ 2021 (UTC)
- ఆయనతో పరిచయం ఉన్న వాడుకరులెవరైనా ఫోన్ చేసి మాట్లాడగలిగితే మార్పు రావచ్చునేమో..లేదూ ఎలాగూ ఇలాంటి చర్యలు తప్పవు...B.K.Viswanadh (చర్చ) 18:24, 20 ఏప్రిల్ 2021 (UTC)
- వైవిఎస్ రెడ్డి గారిపై సరైన చర్య తీసుకున్నందుకు ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 11:53, 20 ఏప్రిల్ 2021 (UTC)
- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.
Googlehelps అనే వాడుకరి ఖాతా గురించి
[మార్చు](గమనిక: నేను కింది సందేశాన్ని ఏప్రిల్ 26 న రాసాను. కానీ, వైవిఎస్ రెడ్డి గారిపై ఉన్న నిరోధం ముగిసాక రాస్తే, ఆయన కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంటుందని భావించి అప్పటికి ప్రచురించడం ఆపి, ఇప్పుడు ప్రచురిస్తున్నాను. ఇప్పుడు ప్రచురించే ముందు దీన్ని తాజాకరించకుండా అప్పుడు రాసినది అలాగే ప్రచురిస్తున్నాను.) వాడుకరి:Googlehelps అనే ఖాతా గురించి కింది వాస్తవాలను నిర్వాహకుల దృష్టికి తెస్తున్నాను:
- వాడుకరి:Googlehelps అనే ఖాతాను సృష్టించిన తేదీ: 2020 డిసెంబరు 25
- ఆ వెంటనే, 13 నిమిషాల తరువాత, "సెలబ్రిటీ" అనే పేజీని సృష్టించారు. ఈ రెండు వివరాలను చిట్టాలో చూడవచ్చు.
- ఆ తరువాత "సెలబ్రిటీ" అనే ఆ పేజీని 2021 జనవరి 2 న నిర్వాహకులు తొలగించారు. తొలగించే సమయానికి ఆ పేజీలో ఉన్న పాఠ్యాన్ని ఇక్కడ చూడవచ్చు.
- ఆ తరువాత Googlehelps చేసిన మార్పు చేర్పులు చూడండి.
ఇపుడు కింది వివరాలను కూడా చూదండి:
- తొలగించిన సెలబ్రిటీ పేజీని 2021 ఏప్రిల్ 19 న వాడుకరి:YVSREDDY గారు తిరిగి సృష్టించారు.
- సెలబ్రిటీ అనే పేజీకి ఉన్న ఇన్‌కమింగు లింకులను పరిశిలిస్తే రెండే లింకులున్నై. ఒకటి తొలగింపు చర్చ పేజీ నుండి, రెండవది వాడుకరి:YVSREDDY గారి పేజీ నుండి. వాడుకరి:Googlehelps గారు సెలబ్రిటీ పేజీని సృష్టింఛే నాటికి ఈ రెండు లింకులు కూడా లేవని కొంత ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఒక కొత్త వాడుకరి ఏ ఎర్ర లింకు నుండి కాకుండా నేరుగా ఆ పేజీ పేరు కొట్టి కొత్త పేజీని సృష్టించినట్లుగా అర్థమౌతోంది (ఆ నాటికి ఏదో పేజిలో ఎర్ర లింకు ఉండి దాన్నుండి పేజీని సృష్టించి ఉండవచ్చు గదా? ఆ తరువాత ఈ పేజిని తొలగించాక, ఆ లింకును కూడా తీసేసి ఉండవచ్చు గదా? అవును అలా జరిగి ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఆ అవకాశం తక్కువ)
- వాడుకరి:Googlehelps ఇటీవల చేసిన దిద్దుబాట్లు ఐదు (2 వ్యాసాల్లో, 2 సంబంధిత తొలగింపు చర్చ పేజీల్లో): పారాలింపిక్ క్రీడలు, టెన్నిస్ ఫర్ టు అనే పేజీలు తొలగింపు ప్రతిపాదనలో ఉండగా, ఆ పేజీల్లో దిద్దుబాట్లు చేసి తొలగింపును ఆపమని కోరారు. ఆ రెండు పేజీలను సృష్టించినది వాడుకరి:YVSREDDY గారే.
- ఒక కొత్త వాడుకరి, ఖాతా సృష్టించుకున్నాక చేసిన దిద్దుబాట్లు 6. అందులో ఒకటి ఖాతా సృష్టించిన వెనువెంటనే చేసినది కాగా మిగతావి నాలుగు నెలల తరువాత చేసినవి. ఆ ఐదూ కూడా వాడుకరి:YVSREDDY గారు నిరోధంలో ఉన్న సమయంలో చేసినవే, అన్నీ కూడా రెడ్డి గారు సృష్టించిన పేజీలకు సంబంధించినవే.
ఇవన్నీ విడివిడిగా చూస్తే పట్టించుకోనక్కర్లేదు గానీ, అన్నీ కలిపి చూస్తే, పై వాస్తవాల ప్రకారం, వాడుకరి:Googlehelps అనే ఖాతా, వాడుకరి:YVSREDDY అనే ఖాతా - ఈ రెండూ ఒక్కరేనేమో అనే సందేహం నాకు కలిగింది. నా సందేహం నిజమని నేను నమ్మడం లేదు, అది తప్పు కావచ్చు కూడా. తోటి నిర్వాహకులు పరిశీలించవలసినది.
పై వాస్తవాలను పరిశీలించే సమయంలో కింది వివరణలను కూడా గమనంలో ఉంచుకోవలసినదిగా మనవి:
- నేను ఎవరినీ నిందించడం లేదు, ఎవరిపైనా అసంబధ్దమైన ఆరోపణలు చెయ్యడం లేదు. కేవలం నాకు కలిగిన సందేహాన్ని ఇక్కడ పెడుతున్నానంతే.
- దుశ్చర్య ఏదో జరిగిందనో, ఫలానా వారు చేసారనో నేను ఆరోపించడం లేదు.
దుశ్చర్య జరగనపుడు ఈ సందేహం ఎందుకు రాస్తున్నారు అని ఎవరైనా అడగవచ్చు. దానికి వివరణ ఇది:
- ఎవరైనా వికీలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు పెట్టినపుడు ఆ సంగతి చెప్పవలసి ఉంటుంది. ఆ ఖాతాలు ఎందుకు పెట్టారో, ఎందుకు వాడుతారో, ఎందుకు వాడరో చెప్పాల్సి ఉంటుంది.
- ఈ విషయాన్ని నమోదు చేసుకుని ఉంచితే, ఒకవేళ భవిష్యత్తులో ఈ ఖాతాలు సందేహాస్పదమైన ఉద్దేశాలతో దిద్దుబాట్లేమైనా చేస్తే, నిర్వాహకులకు ఈ చర్చ గమనంలో ఉంటుంది. తదనుగుణంగా అప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది.
తోటి నిర్వాహకులు దీనిపై అభిప్రాయాలను కింది విభాగంలో చెప్పవలసినదిగా మనవి. __చదువరి (చర్చ • రచనలు) 15:10, 4 మే 2021 (UTC)
ఈ అంశంపై అభిప్రాయాలు
[మార్చు]చదువరి
[మార్చు]- ఎవరైనా ముందుకు వచ్చి ఈ ఖాతా నాదే అని ప్రకటిస్తే, ఈ అంశాన్ని పక్కన పెట్టెయ్యొచ్చు. ఎందుకంటే 1) దుశ్చర్య ఏమీ జరగలేదు, 2) బహిరంగంగా ప్రకటించారు కాబట్టి మరో ఖాతా ఉండడంలో తప్పేమీ లేదు.
- అలా ఎవరూ ప్రకటించని పక్షంలో ఈ ఖాతాలను స్టీవార్డులకు నివేదించి వారిచ్చిన నివేదికను బట్టి చర్యలు తీసుకోవచ్చు.
__చదువరి (చర్చ • రచనలు) 15:36, 4 మే 2021 (UTC)
యర్రా రామారావు
[మార్చు]- వికీలో ఒకటికిమించి ఎక్కువఖాతాలున్నప్పుడు స్వచ్చందంగా తెలుపవలసిన బాధ్యత ఆ వాడుకరికి ఉంది.
- సందేహం వచ్చినప్పుడు నివృత్తి చేసుకోవలసిన బాధ్యత నిర్వాహకులపై ఉంది.
కావున ఎవరూ ప్రకటించని పక్షంలో పైన వివరించిన ఖాతాలను స్టీవార్డులకు నివేదించి వారిచ్చిన నివేదికను బట్టి చర్యలు తీసుకోవటానికి చదువరి గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:09, 5 మే 2021 (UTC)
మిగిలిన నిర్వాహకుల అభిప్రాయాలు
[మార్చు]ఈ చర్చ మొదలుపెట్టి 8 రోజులైంది. యర్రా రామారావు గారు తప్ప మరెవరూ ఈ విషయంపై అభిప్రాయం చెప్పేందుకు ముందుకు రాలేదు. మిగతా నిర్వహకులు కూడా తమతమ అభిప్రాయాలు చెప్పవలసినదిగా కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 17:15, 12 మే 2021 (UTC)
- చదువరి గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.➠ కె.వెంకటరమణ⇒చర్చ 17:28, 12 మే 2021 (UTC)
- ఒకటికికంటే ఎక్కువ ఖాతాలున్నప్పుడు ఆ విషయం గురించి సముదాయానికి చెప్పాలి. అలా జరగనపుడు, ఆ ఖాతాలను స్టీవార్డులకు నివేదించి వారిచ్చిన నివేదికను బట్టి చర్యలు తీసుకోవటానికి చదువరి గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:30, 13 మే 2021 (UTC)
- 20 రోజులు దాటిపోయింది ఈ చర్చ మొదలై. మొత్తం వికీలో ఉన్న 12 మంది నిర్వాహకుల్లోనూ, నిర్వాహకుల కోసమే ప్రత్యేకించిన ఈ పేజీలో ఇన్నాళ్ళలో ఈ చర్చలో పాల్గొన్నది నాతో కలిపి నలుగురమే. మిగుఇలిన వాళ్లలో ఒక్కరు తప్ప మిగతావారంతా ఈ 20 రోజుల్లో కనీసం ఒక్కసారన్నా వికీకి వచ్చినవారే. కానీ ఇక్కడ మాత్రం రాయలేదు - ఈ పేజీని చూడడంలేదేమో మరి.
- ఒకటికికంటే ఎక్కువ ఖాతాలున్నప్పుడు ఆ విషయం గురించి సముదాయానికి చెప్పాలి. అలా జరగనపుడు, ఆ ఖాతాలను స్టీవార్డులకు నివేదించి వారిచ్చిన నివేదికను బట్టి చర్యలు తీసుకోవటానికి చదువరి గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:30, 13 మే 2021 (UTC)
చర్చలో తమ అభిప్రాయం చెప్పినవారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, దీనిపై చర్య తిసుకోవాలనే ఏకాభిప్రాయం వచ్చిందని ప్రకటిస్తున్నాను. ఇకముందు ఈ ఖాతాలు చేసే దిద్దుబాట్లను పరిశీలిస్తూ, అవసరమనిపించినపుడు చర్య తీసుకుందామని నా అభిప్రాయం. నమస్కారం. __చదువరి (చర్చ • రచనలు) 14:34, 25 మే 2021 (UTC)
చదువరి, పవన్ సంతోష్ ల వేధింపులు / పొరపాట్లు
[మార్చు]- గత కొన్ని సంవత్సరాలుగా చర్చలను ఎవరైనా పరిశీలించండి, బాగా ఆలోచించండి. చర్చలలో చదువరి మరియు పవన్ సంతోష్ లేంత వేధింపులున్నాయో అందరికీ అర్థమౌతోంది. చర్చ అంటే చర్చ లాగా ఉండాలి అంతేకాని వెక్కిరింపులు, హేళనలు, భయభ్రాంతులకు, వేధింపులకు గురిచేయడం కాదు. కాని గత కొన్ని సంవత్సారాలుగా వీరిద్దరి ప్రవర్తన ఏ మాత్రం సమంజసం లేదు, రోజురోజుకు అధికమౌతోంది తప్ప తగ్గడం లేదు..
- తప్పులపై తప్పులు చేసికూడా ఎదుటివారిదే తప్పు అన్నట్లుగా ప్రవర్తించడం, ఎదుటివారు తప్పుచేయకున్నానూ తప్పుచేసినట్లుగా గోబెల్స్ ప్రచారం చేసి సమూహానికి తప్పుడు సందేశాన్నివ్వడంలో వీరు సిద్ధహస్తులు.
- అసలు వీరిద్దరికీ తెవికీ నిర్వహణ ఏ మాత్రం రాదు. చేతిలో నిర్వాహకహోదా ఉన్నదని కొత్త సభ్యులపై నిరోధం విధించమొక్కటే తెలుసు. ఈ విధంగా నిర్వాహకహోదాను నిష్కారణంగా దుర్వినియోగం పర్చెవారికి నిర్వాహక, అధికార పదవులెందుకు? సభ్యులు తగు చర్చ తీసుకొని పదవులు ఊడదీయాలి.
- వీరిద్దరి వల్లనే తెవికీ మొత్తం నాశనమైంది. అదే విషయం తెవికీని పరిశీలించే భాషాభిమానులంటున్నారు. వారు చెప్పినది నేను తెవికీలో ఉటంకించానంతే. తెవికీ చచ్చిపోయిందనీ నేను చెప్పానని వేధింపులకు గురిచేయడమేంటీ?
- చదువరి తెవికీలో పునఃప్రవేశం తర్వాతే తెవికీ ఘోరమైన దశకు చేరిందని అందరికీ తెలుసు. ఈ ఘోరమైన దస రావడానికిపవన్ కూడా కారకుడే. అంతవరకు సాఫీగా నడిచిన తెవికీ, ఎందరెందరో తెవికీ యోధుల మూలంగా తెలుగు పాఠకులకు నాణ్యమైన వ్యాసాలు అందుబాటులో ఉన్న తెవికీ ఆ తర్వాత క్రమేణా ప్రభకోల్పోయి, పాఠకాదరణ కోల్పోయి నిస్స్సత్తుగా మిగిలిపోయింది. దీనికి కొందరి నిర్లక్ష్యపూర్వక ధోరణే కారణం.
- అజ్ఞాత వడుకరి తిడితే నెను అతన్ని బలపర్చినదేమీలేదు, కాకుంటే ఇద్దరి నిర్వాహకుల పొరపాటు అనీ, అది స్వయం కృతాపరాధం అని చెప్పాను. నేను చెప్పినది సరైనదే. నిర్వాహకలదే మొదటి తప్పు. నిర్వాహకులై ఉండి కూద చర్చకు చర్చ సమాధానం ఉవ్వకుండా నిర్వాహకహోదాను దుర్వినియోగపర్చి నిరోధం విధించడం ముమ్మాటికీ పొరపాటే. పైగా మళ్ళీ నన్ను తప్పు పట్టడమా! సదరు నిర్వాహకుడు ఇలా చిన్న దిస్సుబాట్లు మానవీయంగా చేయడం పొరపాటెనని చెప్పియుంటే ఆ సమస్య అంతటితో ఆగిపొయేది. అతిచిన్న సమస్యను పరిష్కర్రించకుండా మళ్ళీ ఇంత రాద్ధాంతమా?
- తెవికీలో కొందరు సభ్యుల పనితీరును చాలాచాలా అధికం చేసి మాట్లాడితే నేను దాన్నిసరిచేశాను. అందుకంటే తెవికిలో ఎవరెలా పనిచేస్తున్నారు. తెవికీ తరఫున పనిచేస్తున్నట్లుగా చేస్తూ వారి అసలు లక్ష్యమేమిటో నాకు బాగా తెలుసు. అలాంటివారి గురించి నాకు చెప్పే అవసరం లేదు. వారి అసలు పని గురించి బయటపెడితే నాపై వేధింపులా?
- తెవికీలో చదువరి ఇటీవలి నిర్వాహక హోదా పనితీరు గురించే నేను చెప్పాను కాని ఎప్పుడో సభ్యుడిగా చేసింది కాదు. ఇటీవలి నిర్వాహక తీరు మాత్రం సమంజసంగా లేదని తెవికీని బాగా పరిశీలించే వారందరికీ తెలుసు. JVRKPRASAD, YVSREDDY తదితదులను ఎంతగా వేధించాడో, పీడించాడో జగమెరిగిన సత్యం. బాగా పనిచేస్తున్న వారిద్దరినీ బయటకు పంపించాడంటే అందుకు గాను తెవికీ ప్రగతి ఆగిపోయిందంటె దానికి చదువరి బాధ్యుడుకాడా!
- అర్జున ప్రతిపాదించే ఏ ప్రతిపాదన అయిననూ గుడ్డిగా విమర్శించడం, ఆ ప్రతిపాదనను అటకెక్కించడం చదువరి, పవన్ లకు అతిసాధారణమైంది. ఈ విషయం ఇటీవలి కాలంలో చురుకుగా ఉన్న వారందరికీ తెలుసు. తెవికీ అభివృద్ధి దృష్ట్యా కాకుండా కేవలం సభ్యులను మాత్రమే దృష్టిలో ఉంచుకొని తెవికీ అభివృద్ధిని అడ్డుకోవడం దారుణమైన విషయం.
- తెవికీ ఇప్పటివరకు జరిగిన అత్యధిక పెద్ద చర్చలు చిన్న లేదా సునాయాస దిద్ద్దుబాట్లకు సంబంధించినవే. ఆ విషయం తెల్సి కూడా చిన్న దిద్దుబాట్లకు అవకాశం కల్పించి ఇప్పుడు నన్నే తప్పుపట్టడమేమిటీ?
- చదువరి వేధింపులు, తిట్లు రచ్చబండలోనే ఉన్నాయి. దానికి ఆధారాలు చూపించాలట! తాను తిట్టిన తిట్లు తనకు గుర్తు లేదా? అంటే టైపుకొచ్చినట్లు తిట్టడమేనా? దానికి ఆధారాలు నేను చూపించడమేంటీ?
- నాకు అజ్ఞాతతో కలిసి ముడివేస్తున్నారు. తెవికీలో జరుగుతున్న పొరపాటును ధైర్యంగా బయటపెట్టిన వాడిగా నేను అజ్ఞాతను అభినందించాల్సిన అవసరం ఉంది. నేనేకాదు తెవికీ అభివృద్ధిని కాంక్షించే ఎవరైన ఇదేపనిచేస్తారు. దీనికీ ఇంత రాద్ధాంతమా?
- పొరపాట్లు చేసే సభ్యులకు మద్దతునివ్వడం, తెవికీ నిబద్ధతతో కృషిచేసేవారిని వెళ్ళగొట్టడం నిత్యకృత్యమైపోయింది. దీనికి కారకులెవరో తెవికీని పరిశీలించేవారికే తెలుసు.
- తెవికీలో రచనలు చేసేది మనకోసం కానేకాదు. మన దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవడం కారాదు, మన స్వార్థ ప్రయోజనాలకోసం కారాదు. మనం చెసేది తెలుగు ప్రజానీకం కోసం. ఇదో బృహత్కార్యం. కాబట్టి బయటి భాషాభిమానుల అభిప్రాయాలను కూడా పట్టించుకోవడం అవసరం. తెవికీ జరుగుతున్న అన్ని పరిణామాలు బయట తెలుగు భాషాభిమానులు చూస్తున్నారు. సమావేశాలలో తెవికీ గురించికూదా వాస్తవంగా చెబుతున్నారు. ఇప్పటి తెవికీ వాస్తవ పరిస్థితి గురించి వారు చెబితె నాపై ఆరోపణలా? తెవికీ చచ్చిపోయిందన్న భాషాభిమానుల అభిప్రాయం సరైనది కాదా! ఈ పరిస్థితి నుంచి నేను చక్కదిద్దుతా అని అంటున్నా పదవులు పట్టుకు వేలాడమేంటీ? తెవికీకంటే పదవులే ముఖ్యమైనప్పుడు తెవికీలో ఉండి ప్రయోజనమేంటో? ఇది సభ్యులందరూ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం.
- అర్జున / వెంకటరమణల నాయకత్వంలో రవిచంద్ర, స్వరలాసిక, మరికొందరు కొత్త సభ్యుల కృషితో తెవికీ మళ్ళీ పూర్వవైభవం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న నిర్వాహక, అధికార హోదాలను ఇద్దరు త్యజించి వెంకటరమణకు కొత్తగా అధికార హోదా మరొకరికి నిర్వాహక హోదా ఇవ్వాలి. కొత్త నాయకత్వానికి తెవికీ అభివృద్ధికిగాను నా వంతు కృషి అందించగలను.
- కొత్తగా, క్రొంగత్తగా మళ్ళీ తెవికీ స్వర్ణయుగానికి బాటలు వేద్ద్దాం, చేతులు చేతులు కలపండి, పొరపాట్లు చేసే వారిని వదిలేద్దాం, తెవికీకై పాటుపడేవారిని పిలుద్దాం, తెలుగువారికై ఒక మంచి విజ్ఞాన సర్వస్వాన్ని అందిద్దాం. తెవికీ కంటే ముందే నాకు తెలుగువారికై ఒక విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచేయాలనే అలొచన ండేది. ంకు విజ్ఞాన సర్వస్వం బ్లాగు కూడ ఉంది. అది నాణ్యతతో ఉన్నదని భాషాభిమానులు చెప్పిన విషయాన్ని ఇఅక్కడ చేబితే సహించలేకపోతున్నారు. తెవికీని అభివృద్ధిపర్చనీయరు, స్వయంగా రూపొందించి తెలుగువారికై అందుబాటులో ఉన్న సమాచారాన్ని చూసి జడుసుకుంటున్నారు.
(ఇంకా ఉంది) పై వేధింపులు, పొరపాట్లను పరిశీలించి ఇరువురిపై తగు చర్యతో పాటు నిర్వాహక/అధికార హోదాలు రద్దు చేయవల్సిందిగా తెవికీ సభ్యులకు విన్నపం. సి. చంద్ర కాంత రావు- చర్చ 02:33, 22 జూన్ 2021 (UTC)
ఈ ప్రతిపాదనపై జరిగిన చర్చలో కూడా వేధింపులను, వ్యక్తిగత దాడులను, నిందలను కొనసాగించడం, రెండు సార్లు ఒకరోజు నిరోధాలు విధించిన తరువాత కూడ్ కొనసాగించడంతో వాడుకరి:C.Chandra Kanth Raoపై నిరవధిక నిరోధం విధించబడింది.
- కింది చర్చ ముగిసింది. ఇక దానిలో మార్పుచేర్పులు చెయ్యకండి. ఇకపై చెయ్యదలచిన వ్యాఖ్యానాలను సముచితమైన చర్చ పేజీలో చెయ్యాలి.
చంద్రకాంతరావు గారి వ్యక్తిగత దాడులు, వేధింపులు
[మార్చు]గత వారం రోజులుగా చంద్రకాంతరావు గారు తెలుగు వికీపీడియాలో చేస్తున్న వ్యక్తిగత దాడులు, నిరాధారమైన నిందలు, వేధింపులు, ఇతర వికీపీడియా నియమాల ఉల్లంఘనలు ఇలా ఉన్నాయి:
- వ్యక్తిగత దూషణలకు ప్రోత్సాహం
- అజ్ఞాత వాడుకరి చదువరి గారిని, నన్ను అసభ్యమైన భాష ఉపయోగించి తిట్టారు. "అరేయ్, ఒరేయ్" అంటూ సూటిగా అవమానించారు. "సభ్యుడిపై ఒళ్ళుమండి ఇలా చేశాడనుకుంటాను.", "అజ్ఞత వాడుకరి రాసినది చెత్త కానేకాదు." అని ప్రారంభించి అజ్ఞాత ఇలా వ్యక్తులను అసభ్యకరమైన భాష వాడడాన్ని, అవమానించడాన్ని వాడుకరి:C.Chandra Kanth Rao గారు సమర్థించారు. ఈ సమర్థన అన్నది ఆయన దాదాపు 14 తేదీ నుంచి 21 తేదీ వరకూ రకరకాలు వ్యాఖ్యల్లో చేశారు. "తిట్లు తినడం మీ స్వయంకృతాపరాధం.", "స్వయంగా కల్పించికున్న స్వయంకృతాభిరామమిది" (స్వయంకృతాపరాధం?) అంటూ రకరకాలుగా ఆ తిట్లను ప్రోత్సహించారు.
- సమాజంలోని ప్రతీవ్యక్తికీ గౌరవం పొందే కనీస హక్కు ఉంటుంది. వికీపీడియాలో చూసినా మూలస్తంభాల్లో తోటి సభ్యులను గౌరవించడమన్నది ఒకటి. చంద్రకాంతరావు గారు కూడా అవి తిట్లేనని అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు వికీపీడియాలో "వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి.", "వివాదాలేమైనా తలెత్తితే, సరైన చర్చాపేజీలో మృదువుగా చర్చించండి." అంటూ ఉన్న తెలుగు వికీపీడియా మూలస్తంభానికి తిట్లు నేరుగా వ్యతిరేకం అని ఆయనకు ఒక మాజీ నిర్వాహకునిగా తెలిసినప్పుడు. ఇలా ఒక అజ్ఞాత చేసిన తిట్లదాడిని, దూషణను సమర్థించడం వికీపీడియా విధానాలకు సర్వధా విరుద్ధం. అసలు ఇవన్నీ పక్కనపెడితే సమాజంలో ప్రతీ వ్యక్తికీ గౌరవం పొందే అర్హత ఉంటుంది. అలానే మా ఇద్దరికీ కూడా ఉంది. కాబట్టి, ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన.
- వ్యక్తిగత దాడులు, సభ్యులను అవమానించడం
- "ప్రణయ్ రాజ్, ఏమిటీ చెప్పేది?", "యర్రా! ఏమిటీ చెప్పేదీ?", "అబ్బబ్బో రామారావు బాగా పనిచేస్తున్నాడా? ఇది ప్రపంచపు ఎన్నో వింతనో అది కూడా చెబితే బాగుండేది." ఇవన్నీ చంద్రకాంతరావు గారు చర్చల్లో పాల్గొన్న వాడుకరి:Pranayraj1985, వాడుకరి:యర్రా రామారావు గార్లను న్యూనపరుస్తూ, కించపరుస్తూ, అవమానిస్తూ వాడిన భాష.
- ప్రణయ్ రాజ్ గారిని "అసలు నిర్వాహకుడిగా మీ తెవికి సేవలేంటీ? అస్తమానం మీ రికార్డులే ధ్యాసే తప్ప నిర్వహణ గురించి ఏమైనా పట్టించుకున్న దాఖలాలున్నాయా?" అని నిరాధారమైన నింద వేశారు. ప్రణయ్ రాజ్ గారు తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం నిర్వహణా చర్యలు ఎక్కువ తీసుకున్నవారిలో 5వ స్థానంలో నిలిచిన వ్యక్తి. తన నిర్వహణా సమీక్ష క్రమం తప్పకుండా చేసుకుంటున్నారు. ఇవన్నీ చంద్రకాంతరావు గారికి చూపించినా కూడా ఆయన నిరాధారమైన నిందలు వేయడం కొనసాగించారే తప్ప మానలేదు. ఇలాగ అవాస్తవాలు మాట్లాడుతూ, ప్రణయ్ రాజ్ గారి మీద లేనిపోని నిందలు వేస్తున్నారు.
- "చదువరి కృషి గుండుసున్నా." అంటూ చదువరి గారిని చంద్రకాంతరావు గారు న్యూనపరిచారు, అవమానించారు. ఇది ఆధారం చూపడానికి కూడా అవకాశం లేని ఆరోపణ. ఆయన ఆధారం చూపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది అసంబద్ధమైన, చాలా అన్యాయమైన వ్యాఖ్య అయినా కూడా నిరూపించాలి కనుక చదువరి గారి వాడుకరి పేజీలోని "నేను చేసిన కొన్ని ఎన్నదగ్గ పనులు" విభాగం చూడవచ్చు.
- "తెవికీ తరఫున లాభదాయక పదవులు పొంది లక్షల్లో జీతం పొందిన పవన్ కూడా నిర్లక్ష్యపూర్వక ధోరణిలో ఉండుట శోచనీయం." - అని చంద్రకాంతరావు గారు నామీద అత్యంత నిర్లక్ష్యపూరితమైన, తప్పుదోవపట్టించే వ్యాఖ్య చేశారు. ప్రభుత్వోద్యోగంలో ఎంతో అనుభవం ఉండి కూడా పదవికీ, ఉద్యోగానికి తేడా తెలియకుండా వ్యాఖ్య చేయడం ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టించడానికే. నేనెప్పుడూ లాభదాయకమైన పదవి చేపట్టలేదు. (వికీలో కానీ బయట కానీ) చాలామందిలాగానే గౌరవప్రదమైన, నా నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు చేశాను. 2015-2019 మధ్యకాలంలో వికీమీడియా ఫౌండేషన్ నుంచి గ్రాంట్ స్వీకరించే ఒక సంస్థలో తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల మెరుగుదలకు ప్రణాళికలు రూపొందించి, అమలుచేసే బాధ్యతలతో కూడిన ఉద్యోగం ఎప్పుడూ రహస్యమూ కాదు, పైపెచ్చు ప్రపంచంలో ఏ ఉద్యోగంలోనూ లేనంత పబ్లిక్‌గా వివరాలు ఉన్నాయి. తెలుగు వికీపీడియాలోనే నా ఆ ఉద్యోగ బాధ్యతల్లో ఏమేమి చేశానన్న వివరాలు ఉన్నాయి. ఉద్యోగం చేసినవాడు జీతం తీసుకుంటాడు. చంద్రకాంతరావు గారు కూడా ప్రభుత్వంలో ఉద్యోగం ఒకటి చేస్తూ జీతం పుచ్చుకుంటారు. ప్రపంచంలో ఎంతమందిమో ఉద్యోగాలు చేస్తున్నాం జీవితాలు సాగిస్తున్నాం. అదే తప్పు అన్నట్టు, అంతమాత్రాన ఉద్యోగం మానేశాకా కూడా నన్ను నోటికి వచ్చిందల్లా మాట్లాడడానికి లైసెన్సు అన్నట్టు మాట్లాడడం అత్యంత అవమానకరం, పూర్తి అనైతికం.
- ఇక అత్యంత ముఖ్యమైన సంగతి. నా జీతం ఎప్పుడూ లక్షల్లో లేదు. (ఒకవేళ ఉన్నా చంద్రకాంత రావుగారు నోటికి వచ్చిందల్లా అనడానికి హక్కు ఇచ్చినట్టు కాదు.) ఆ జీతం ఎంతో ఇప్పటికీ మెటా-వికీలో పబ్లిక్‌గానే ఉంది. ఇలా నోటికి వచ్చిన అవాస్తవమల్లా చెప్పడం కేవలం నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికే. నిజానికి నేను ఈ వివరాలన్నీ బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే - తమ తమ జీతాలు ఎంతో చంద్రకాంతరావు గారు చెప్తారా? ఏమైనా కనీస మర్యాద ఉందా ఆయన మాటలకు? కానీ, ఎందుకు చెప్పానంటే అబద్ధానికి నోరెక్కువ. ఆయన అబద్ధాలను ప్రచారంలో పెట్టే పనిలో ఉన్నారు. కాబట్టి, నేను నిజాలు చెప్పాల్సిందే.
- వికీపీడియాలో పనిచేయవద్దని నిరుత్సాహపరచడం
- చంద్రకాంతరావు గారు, ఆ అజ్ఞాత మొట్టమొదట ఎత్తుకున్న అంశమే యర్రా రామారావు గారు చేస్తున్న దిద్దుబాట్లను ఆపించాలన్న ప్రయత్నం. "సునాయాస లేదా చిన్న దిద్దుబాట్లు చేస్తూ ఇటీవలి మార్పులు మొత్తం ఇతరులకు చికాకుగా కలిగించడమే అసలుకారణం." అంటారు చంద్రకాంతరావు గారు. దీనికి సరళంగా రవిచంద్ర గారు సమాధానం ఇచ్చారు ఇలాగ: "సునాయాసమైన చిన్న దిద్దుబాట్లైనా వ్యాసానికి మేలు చేసే దిద్దుబాట్లే కదా చేస్తున్నారు. ఒకవేళ ఇటీవల మార్పుల్లో ఆయన మార్పులు కనిపించకుండా ఉండాలంటే ఎవరైనా ఒక వడపోత సృష్టించుకోవచ్చు. అది పెద్ద పనే కాదు. ఒకవేళ యాంత్రిక పనులు చేయవలసి వచ్చినా అందుకు సమయం పడుతుంది, పైగా అది చేసే వాళ్ళకు ఆ పనిపైన ఆసక్తి ఉండాలి. అర్జున గారు చేయగలిగినా ఆయనకు ఆసక్తి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రామారావు గారు మాన్యువల్ గా చేస్తే తప్పేమిటి?". ఈ మాటకు చంద్రకాంతరావు గారి నుంచి ఇప్పటికీ సమాధానం లేదు. అంటే ఎలాగైనా ప్రస్తుతం యర్రా రామారావు గారిని పనిచేయనీకుండా ఆపడం మౌలిక లక్ష్యం. అందుకోసం ఆయన చేస్తున్న పనిలో లోపం లేకపోయినా ఉందన్న భ్రమ కల్పించే విఫల యత్నం చేశారు. ప్రపంచంలో ఏ క్రౌడ్ సోర్సింగ్ ప్లాట్ ఫారమూ, వికీపీడియాతో సహా, "మేలుచేసే కంట్రిబ్యూషన్లు" చేస్తున్నవారిని పని మానమని చేసే వ్యాఖ్యలను సహించదు. ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన.
- తెలుగు వికీపీడియాలో ఆయనకు వ్యక్తిగతంగా నచ్చని నిర్వాహకులందరినీ కూడా బాధ్యతల్లోంచి దింపేయాలన్నది ఆయన మరో అజెండా. "ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్వాహకులందరూ రాజీనామా చేసి వెళ్ళిపోతే" - అని ఆ అజెండా ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పారు. కానీ ఎందుకు రాజీనామా చేయాలన్నది మాత్రం చెప్పలేకపోయారు. "గత కొన్ని సంవత్సరాలలో ఇద్దరు సభ్యుల చర్చను పరిశీలిస్తే వారు తెవికీ నిరోధకులుగా ఉన్నట్లుగా ప్రస్పుటంగా కనిపిస్తోంది.", "కేవలం పదవులపై మాత్రమే ధ్యాస ఉంచుకొని, సభ్యులపై నిష్కారణంగా నిరోధాలు విధిస్తూ, నిర్వాహకహోదాను దువినియోగపర్చే వారు తెవికీకి చెడ్డ పెరు తెచ్చేవారు నిర్వాహకులుగా ఉండతగరు.", "తెలుగు భాషాభిమానులు ఇద్దరిపై మండిపడుతున్నారు." ఇవీ ఆయన చేసే సారం లేని, ఆధారం లేని ఆరోపణలు. ఇప్పుడు పైన నేను చంద్రకాంతరావు గారు చేస్తున్న దాడుల గురించి ఒక్కొక్క వ్యాఖ్య ఎత్తిరాసి, లింకులు ఇచ్చి చెప్తున్నాను కదా. మరి చంద్రకాంత రావు గారు మాత్రం "ప్రస్ఫుటంగా కనిపిస్తోంది", "దువినియోగపర్చే వారు", ఎవరో భాషాభిమానులు ఎక్కడో మండిపడుతున్నారు - ఇలా ఏ ఆధారం ఇవ్వకుండా రాయడం ఏమిటి? ఇది కేవలం తెవికీ చర్చలపట్ల ఆయనకున్న కొంచెంభావం తప్ప మరేమీ కాదు. ఏదైనా రాయవచ్చు, ఎలాంటి ఆరోపణ అయినా చేయవచ్చు చెల్లుతుంది అని విశ్వసిస్తున్నారని ఈ వారంరోజుల ఆరోపణల్లో దేనికీ ఆధారాలు ఇవ్వకపోవడంతో తెలుస్తోంది.
- నిర్ణయాలను, విజ్ఞప్తులను, హెచ్చరికలను, విధానాలను తృణీకరించడం
- చంద్రకాంతరావు గారు, అజ్ఞాత కలసి చేస్తున్న ఈ దాడులు, ఉల్లంఘనలు సహ సభ్యులు గమనించి ఈ వేధింపులు, వ్యక్తిగత దాడులు ఆపమని విజ్ఞప్తులు చేశారు, హెచ్చరించారు, తుదకు దీనిపై నిర్ణయం కూడా చేశారు. ఆయా సభ్యులు చేసిన ఈ అన్ని ప్రయత్నాలకూ పూచికపుల్ల విలువ కూడా ఇవ్వలేదాయన. ఉదాహరణకు:
- రాజశేఖర్ గారు ఈ దాడుల తీవ్రతను గమనించి "చంద్రకాంతరావు గారు. మీరు ఈవిధంగా ప్రతిసారి పురోగతిలో పాల్గొంటున్న వారందరి మీద; ప్రస్తుతం చదువరి మరియు యర్రా రామారావు గారి మీద నిందలు వేస్తున్నారు." అని ప్రారంభించి, "ముఖ్యంగా చదువరి గారి మీద నిషేధం విధించాల్సిన పొరపాటు ఏమీ ఇక్కడ జరగలేదని నా అభిప్రాయం." అని విశ్లేషించి, "ఇక చంద్రకాంతక్రావుగారి (నిర్వాహక హోదా నుండి ఆయనే తప్పుకొన్న తర్వాత మరియు ముందు) వలన పెద్దగా తెవికీలో సమాచారం పెద్దగా ఏమీ చేరలేదు." అని పేర్కొని, "వికీపీడియా విస్తృత పరిధిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పోవడం మంచిదనీ, దీన్ని నిర్ణయంగా భావించి మన్నించాలని" తేల్చారు. ఆ తర్వాత చంద్రకాంతరావుగారు ఆయన రాసినదానికి ఏ రకంగానూ ప్రత్యుత్తరం ఇవ్వకుండా, ఆయన నిర్ణయాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ దాడులు చేయడం కొనసాగిస్తూనే పోతున్నారు. (ఇప్పటికీ ఆగలేదు)
- "చంద్రకాంతరావు గారు దయచేసి ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి." అని వాడుకరి:రవిచంద్ర గారు, "అజ్ఞాత చేసిన ప్రతిపాదకు పాత సభ్యులు మద్దతు పలకడం సరైన చర్య కాదు. అజ్ఞాత చేసిన ఆరోపణలలో ఒకటైనా ఆధారాలతో చూపించాడా?" అంటూ వాడుకరి:K.Venkataramana గారు ఈ కువిమర్శలు, నిరాధార నిందలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీళ్ళకు కూడా సమాధానం ఇవ్వలేదు. వీళ్ళ విజ్ఞప్తిని గౌరవించనూ లేదు.
- నేను "నిరాధారమైన నిందలు, వ్యక్తిగత దాడులు మానుకోండి. వేధింపు ధోరణి వదులుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటికే రాజశేఖర్ గారు వెలువరించిన నిర్ణయాన్ని కనీసం గౌరవించండి. మీరు ఆ నిర్ణయాన్ని గౌరవించినంత మాత్రాన మీకున్న విలువ తగ్గిపోదు, నిజం చెప్పాలంటే కాస్తో కూస్తో పెరుగుతుంది." అంటూ చాలా మర్యాదగా, విజ్ఞాపనపూర్వకంగా సలహా ఇచ్చాను. "ఇలా నిందించడం తప్పని ఇంతమంది చెబుతున్నప్పటికీ మీరు ఆపలేదు. వీటిపై వికీనియమాల ప్రకారం తగు చర్య తీసుకునే అవకాశం ఉంది, గమనించగలరు. దయచేసి ఇకనైనా ఆపండి." అని చదువరి గారు హెచ్చరిక జారీచేశారు. చంద్రకాంతరావు గారు తిరిగి దుమ్మెత్తిపోశారే తప్పించి సలహాలను పాటించిందీ లేదు, హెచ్చరికను మన్నించిందీ లేదు.
- తెవికీని కూడా ఆధారాలు చూపకుండా తృణీకరించడం
- "ఇప్పుడు తెవికీ చచ్చిపోయింది.", "భాషాభిమానులు తెవికీ చచ్చిపోయిందనీ తీర్మానించారు కూడా.", "ఇప్పుడు పనిచేస్తున్న వారి కృషి ఎలాగూ పనికిరాదు.", "తెవికీని పాతాళంలోకి దిగజార్చిన అపకీర్తిని సొంతం చేసుకోవడం" - ఇవీ ఆయన వాడిన పదజాలం. దీనికి ఆయన ఇచ్చిన ఆధారాలు శూన్యం. తెవికీలో పనిచేస్తున్నవారి కృషి పనికిరాదని ఏ ఆధారం లేకుండా అనడం మొత్తం తెవికీనే తృణీకరించడమే!
ఇన్ని రకాల ఉల్లంఘనలు చేసిన చంద్రకాంత రావు గారిమీద ఇప్పటికైనా ఆయన ఉల్లంఘనలు అన్నిటికీ తగ్గ, గట్టి చర్యలు తీసుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 19:36, 21 జూన్ 2021 (UTC)
అంగీకారం
[మార్చు]- చంద్రకాంతరావు గారు తోటి వాడుకరులపై నిరాధారమైన, నిర్హేతుకమైన నిందలు వేయడం గత రెండేళ్ళుగా జరుగుతోంది. మొదట్లో ఆయనకు ఆధారాలతో సహా వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసాను. అయితే వాటిని ఆయన సముచితమైన ధోరణిలో తీసుకోలేదు. తన నిర్హేతుకమైన నిందలను కొనసాగిస్తూనే పోయారు. వాటిపై చర్చిస్తే సమయం వృథా తప్ప తెవికీకి గాని, నాకు గానీ ప్రయోజనమేమీ లేదు కాబట్టి నేను ఆ తరువాత ఆయనతో చర్చల్లో కలగజేసుకోనే లేదు. ఆ విధంగా నైనా ఆయన దాడులు ఆపుతారని భావించాను. కానీ ఆయన ఆపలేదు -గత వారం రోజులుగా రచ్చబండలో నాపైన ఇతరుల పైనా అనేకానేక నిర్హేతుక నిందలు వేసారు. తెవికీ చచ్చిపోయిందని అన్నారు. కానీ ఒక్కదానికి కూడా ఆధారాలను చూపలేదు. ఆయన నిందలకు నేను మాత్రం - ఆధారాలతో సహా - సమాధానాలిచ్చాను. అయినా తన నిందలు అపలేదు. ఏడెనిమిది మంది సహసభ్యులు వారిస్తున్నా లెక్కచెయ్యలేదు. ఆయనపై చర్య తీసుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితిని ఆయనే కల్పించారు. తోటి సభ్యులను వేధిస్తున్నందుకు గాను, తెవికీ ప్రగతిని అడ్డుకుంటున్నందుకు గాను ఆయన్ను కనీసం వారం రోజుల పాటు ఆయనపై నిరోధం విధించాలని నా అభిప్రాయం. __చదువరి (చర్చ • రచనలు) 03:07, 22 జూన్ 2021 (UTC)
- వికీలో నేను గత 4 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను.ఈ నాలుగు సంవత్సరాల వ్యవధిలో రచ్చబండ చర్చలలో ప్రత్యేకంగా పనిగట్టుకుని చంద్రకాంతరావు గారు, చదువరి, పవన్ సంతోష్ గార్లపై ఆధారాలు లేకుండా, నిందలు మోపటం, ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత దూషణలు చేస్తూ దాడులు చేయటం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాను.తాను ఈ నాలుగు సంవత్సరాలలో వికీలో ఎటువంటి అభివృద్ధికి పాటుపడపోగా, "తెవికీ చచ్చిపోయింది" ని సంస్థను అగౌరవపరుస్తూ, ఇప్పటివరకు తెవికీలో పనిచేసిన గౌరవ వికీపీడియన్లను అందరిని అవమానపరుస్తూ, నిర్వాహకులపై తప్పుడు ఆరోపణలుచేస్తూ నీచప్రవర్తనతో వికీలో మసులుకోవటం చాలా హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను.పవన్ సంతోష్, చదువరి గారలను నిందించటకోసం చర్చలుకు దూరంగా ఉన్నవారిని తన స్వార్ధ ప్రయోజనాలు కోసం రెచ్చగొడుతున్నట్గు గత చర్చలలో నేను గమనించాను. ఇలాంటి పరిస్థితిలలో నిర్వాహకులు సమర్ధవంతగా పనిచేయలేరు.వారి ఆత్మస్తైర్యం కోల్పోయి గత వారం రోజులనుండి వికీలో నిర్వాహకులపనులకు అంతరాయం ఏర్పడిందని అందరికీ తెలుసు. ఇలాంటివి ఇంకా కోకొల్లుగా ఉన్నవి.ఆయనపై చర్య తీసుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితిని ఆయనే కల్పించారు. తోటి సభ్యులను వేధిస్తున్నందుకు గాను, తెవికీ ప్రగతిని అడ్డుకుంటున్నందుకు గాను చంద్రకాంతరావు గారిపై ఒక వారం రోజులుపాటు ప్రధమ హెచ్చరికగా నిషేధం విధించటానికి అంగీకరిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 04:35, 22 జూన్ 2021 (UTC)
- తెవికీలో కృషి చేస్తున్న వాడుకరుల మీద నిరాధారమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నందుకు ఆయన మీద నిషేధం విధించవచ్చని అభిప్రాయపడుతున్నాను. - రవిచంద్ర (చర్చ) 04:57, 22 జూన్ 2021 (UTC)
- గతంలోనూ, గతవారం రోజులుగా తెవికీ సముదాయ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు, దాడులు చేస్తూవుంటే ఆయన నైజం, స్వభావం అలాంటిదేమోనన్న అభిప్రాయంతో ఇంతకాలం ఉన్నాను. 'ఇప్పుడు తెవికీ చచ్చిపోయింది' అని ఎప్పుడైతే అన్నారో ఆయనకు తెవికీ మీద సదుద్దేశ్యం లేదని అనిపించింది. అంతేకాకుండా ఆయన చర్యల వల్ల సముదాయ సభ్యులకు, తెవికీకి అంతరాయం ఏర్పడుతోంది. వికీ నియమాలను ఉల్లంఘన చేసిన కారణంగా అందుకు తగ్గ, గట్టి చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదనకు నేను అంగీకారం తెలుపుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:20, 22 జూన్ 2021 (UTC)
వ్యతిరేకం
[మార్చు]చర్చ
[మార్చు]నేను చేసెవి నిందలు కానేకావు, అవన్నీ వాస్తవాలు. సీనియర్ సభ్యులకు ఆధారాలు చూపించే పనేమీ ఉండదు. నాకుసభ్యహోదా మినహా ఎలాంటి ఇతర హోదాలు లేవు. వారం రోజుల పాటు సభ్యహోదాపై నిషేధం విధించిననూ నాకు జరిగే నష్టమేమీ లేదు. అనవసరంగా నాపై కెలకడం, రెచ్చగొట్టడం ఆపివేస్తే వారం కాదు రెండు వారాలు నేనే స్వయంగా తెవికీకి దూరంగా ఉండగలనని మాటిస్తున్నాను. ఎందుకంటే నాకు తెవికీపై గౌరవం ఉంది. నన్ను అనవసరంగా రెచ్చగొట్టితే మాత్రం నిషేధాలపై నిషేధాలు విధించిననూ అవి నన్నేమీ చేయలేవు సరికదా తెవికీకీ నష్టం జరుగుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 03:43, 22 జూన్ 2021 (UTC)
- తనపై చర్య తిసుకుంటే తెవికీకి నష్టం జరుగుతుందని చంద్రకాంతరావు గారు బెదిరిస్తున్నారు. తన వాదనను మరింత నిమ్న స్థాయికి తీసుకెళ్ళారు.
- రావుగారిపై చర్య ప్రతిపాదనలో ముఖ్యమైన సంగతేంటంటే.. ఆయన తెవికీ పురోగతిని అడ్డుకోకుండా ఉండడం, తోటి వాడుకరులను వేధించకుండా ఉండడం. అంతే తప్ప ఆయన్ను తెవికీకి దూరంగా పెట్టడం కానే కాదు. ఆయన అది తెలుసుకోవాలి. పై బెదిరింపుతో రావుగారి ఆలోచనాధోరణి మరింతగా స్పష్టమౌతోంది.
- అంతేకాదు, పవన్ గారు ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టాక, 5 గంటల తరువాత, రావుగారు తన ప్రతిపాదన (చదువరి, పవన్ సంతోష్ ల వేధింపులు) రాసారు. తెవికీ పద్ధతి ప్రకారం అది పవన్ ప్రతిపాదన కింద రావాలి. కానీ ఆయన దాన్ని తీసుకెళ్ళి పైన రాసారు. రావు గారి ఆలోచనా ధోరణిని ఇది కూడా సూచిస్తోందని నా అభిప్రాయం (తెవికీ పద్ధతులను పట్టించుకోకపోవడం వగైరా).
- మరొక సంగతేంటంటే.. నిరోధాలకు గురైన వాడుకరులు మళ్ళీ అలాంటి చర్యలకు పాల్పడితే మరిన్ని నిరోధాలు జరుగుతాయి. తీవ్రత పెరుగుతూ పోతుంది. కాబట్టి, నిరోధం విధించాక నష్టం జరుగుతుందనే బెదిరింపులను ఆపవలసినదిగా ఆయన్ను కోరుతున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 04:15, 22 జూన్ 2021 (UTC)
- "సీనియర్ సభ్యులకు ఆధారాలు చూపించే పనేమీ ఉండదు." అన్నారు ఇప్పుడు చంద్రకాంత రావు గారు. ఇది పూర్తిగా అబద్ధం, వికీ నియమాలకు పూర్తి విరుద్ధం. "వ్యక్తిగత ప్రవర్తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చెయ్యడం ఎంతమాత్రమూ ఆమోదం కాదు. తీవ్రమైన అభియోగాలకు తీవ్రమైన ఆధారాలు ఉండాలి." అని "వ్యక్తిగత దాడులు కూడదు" అన్న విధానం చెప్తోంది. నిందలు వేయడమే తప్ప ఆధారాలు చూపించలేదనీ, చూపించనని ఒప్పుకున్నట్టు అవుతోంది. "నిరాధారమైన నిందలు, వ్యక్తిగత దాడులు" చేశారన్నమాటను ఈ విధంగా ఆయనే అంగీకరించినట్టు అయింది. అలానే ఈ ప్రతిపాదనకు ఆయనే ఈ విధంగా బలం కల్పిస్తున్నారు. --పవన్ సంతోష్ (చర్చ) 07:14, 22 జూన్ 2021 (UTC)
- నేను ఏమి చెప్పిననూ బెదిరిస్తున్నాననీ చెప్పడం చదువరికి నిత్యకృత్యమై పోయింది. సముదాయాన్ని తనకు అనుకూలంగా మరల్చుకోవడానికి పాపం పడరాని పాట్లు పడుతున్నాడు. అయినా ఫలితం దక్కడం లేదు. తెవికీ చచ్చిపోయిందనీ భాషాభిమానులన్న విషయాన్ని నేను తెవికీలోఉటంకిస్తే సహించలేకపోతున్నాడు. ఇంకనూ వారు ఎమన్నారంటే తెవికీ త్రిమూర్తులలో వైజాసత్య, కాసుబాబులలో పాటు చంద్రకాంతరావు పేరు జతపరిస్తే, తెవికీ రాక్షసులలో చదువరి, పవన్ సంతోష్ పేర్లు ప్రకటించారు. దీనిపై ఎంతగా ఎగురుతారో చూడాల్సిందే!
- [అనుచితమైన, నిందలతోకూడిన బయటిలింకును తీసేసాను]__చదువరి (చర్చ • రచనలు) 02:27, 14 జూలై 2021 (UTC)
- నేను ఏమి చెప్పిననూ బెదిరిస్తున్నాననీ చెప్పడం చదువరికి నిత్యకృత్యమై పోయింది. సముదాయాన్ని తనకు అనుకూలంగా మరల్చుకోవడానికి పాపం పడరాని పాట్లు పడుతున్నాడు. అయినా ఫలితం దక్కడం లేదు. తెవికీ చచ్చిపోయిందనీ భాషాభిమానులన్న విషయాన్ని నేను తెవికీలోఉటంకిస్తే సహించలేకపోతున్నాడు. ఇంకనూ వారు ఎమన్నారంటే తెవికీ త్రిమూర్తులలో వైజాసత్య, కాసుబాబులలో పాటు చంద్రకాంతరావు పేరు జతపరిస్తే, తెవికీ రాక్షసులలో చదువరి, పవన్ సంతోష్ పేర్లు ప్రకటించారు. దీనిపై ఎంతగా ఎగురుతారో చూడాల్సిందే!
- రెండు వారాలు తెవికీకి దూరంగాఉంటానన్ననూ ఎలాంటి ప్రతిస్పందన రానందున మళ్ళీ రాయాల్సివస్తోంది, తప్పడం లెదు. చర్యలు తీసుకున్ననూ తెవికీలో రాయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. శాశ్వత నిరోధం విధిచిననూ నా దిద్దుబాట్లను ఎవరూ ఆపలేరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:51, 22 జూన్ 2021 (UTC)
- ఒక వైపున రావుగారు చేస్తున్న వ్యక్తిగత దాడులు, దుర్భాషలు వగైరాల మీద చర్య తీసుకునే విషయమై చర్చ జరుగుతూండగానే, ఆయన ఈ చర్చలోకి వచ్చి, పవన్ గారిని నన్నూ "రాక్షసులు" అని తిట్టారు. ఇది తీవ్రమైన దాడి. ఆయన మారే అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. ఈ చర్చను సరిగ్గా జరగనిచ్చేట్టు లేరాయన. ఈ దుర్భాషలకు గాను ఆయన్ను హెచ్చరిస్తూ ఒక రోజు నిరోధం విధించవలసినదిగా ఇతర నిర్వాహకులను కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 16:05, 22 జూన్ 2021 (UTC)
- "సీనియర్ సభ్యులకు ఆధారాలు చూపించే పనేమీ ఉండదు." అన్నారు ఇప్పుడు చంద్రకాంత రావు గారు. ఇది పూర్తిగా అబద్ధం, వికీ నియమాలకు పూర్తి విరుద్ధం. "వ్యక్తిగత ప్రవర్తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చెయ్యడం ఎంతమాత్రమూ ఆమోదం కాదు. తీవ్రమైన అభియోగాలకు తీవ్రమైన ఆధారాలు ఉండాలి." అని "వ్యక్తిగత దాడులు కూడదు" అన్న విధానం చెప్తోంది. నిందలు వేయడమే తప్ప ఆధారాలు చూపించలేదనీ, చూపించనని ఒప్పుకున్నట్టు అవుతోంది. "నిరాధారమైన నిందలు, వ్యక్తిగత దాడులు" చేశారన్నమాటను ఈ విధంగా ఆయనే అంగీకరించినట్టు అయింది. అలానే ఈ ప్రతిపాదనకు ఆయనే ఈ విధంగా బలం కల్పిస్తున్నారు. --పవన్ సంతోష్ (చర్చ) 07:14, 22 జూన్ 2021 (UTC)
- సముదాయ సభ్యులిద్దరిని "రాక్షసులు" అని తిట్టడం, సముదాయ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలతో తీవ్రమైన దాడి చేస్తున్న కారణంగా చంద్రకాంతరావు గారిపై ఒకరోజు నిరోధం విధించాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 16:41, 22 జూన్ 2021 (UTC)
- ఇక్కడ చంద్రకాంతరావు గారు రాసిన దుర్భాషలనే అజ్ఞాతలు రావుగారి చర్చ పేజీలోను, ప్రణయ్ గారి చర్చ పేజీలోను, నా చర్చ పేజీలోనూ రాసారు. ప్రణయ్ రాజ్‌ను, నన్నూ నిందించారు. అంచేత ఆ ఇద్దరు అజ్ఞాతలను వారం పాటు నిరోధించాను. __చదువరి (చర్చ • రచనలు) 01:10, 23 జూన్ 2021 (UTC)
- చదువరీ, నీకు నిషేధం విధించడం మినహా వేరే ఏమొస్తుంది చెప్పు!! తప్పులపై తప్పులు మరియు నిర్వాహక హోదాను దుర్వినియోగం పర్చే అసలు నివ్వే ముందు నిర్వాహక, అధికారి హోదాల నుంచి తప్పుకొని ఇతరులకు మార్గదర్శిగా నిలువు. అలా చేస్తే నేనే ప్రశంసిస్తాను. తెవికీకి ఒక పీడా పోతుంది. తెవికీపై నీకు మమకారం ఉంటే గనుక ఈ పనిచేస్తావ్. లేకుంటే మళ్ళీ మళీ నా పై వేధింపులు చేయడమైనా ఆపేసేయ్. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:16, 23 జూన్ 2021 (UTC)
- @C.Chandra Kanth Rao గారూ, తోటి వాడుకరులతో మర్యాదగా వ్యవహరించడమనేది వికీపీడియాలో చాలా ముఖ్యమైన ప్రవర్తనా నియమం. దాని విషయంలో వికీ నియమాలు చాలా కట్టుదిట్టంగా ఉంటాయి. మీకు తెలియని విషయమేమీ కాదు. కానీ మీరు దాన్ని పాటించడం లేదు. మీరు గత పది రోజులుగా రచ్చబండలో గానీ, ఇక్కడ గానీ మాట్లాడిన తీరుకు, తోటి వాడుకరులపై వ్యక్తిగత నిందలకు గాను మిమ్మల్ని నిరవధికంగా నిరోధించి ఉండాల్సింది. కానీ అలా చెయ్యలేదు. తోటి వాడుకరులంతా మీతో ఎంతో అనునయంగా వ్యవహరించారు. ఆ విషయాన్ని గ్రహించగలరు. __ చదువరి లిప్యంతరీకరణ(చర్చ • రచనలు) 00:57, 24 జూన్ 2021 (UTC)
ప్రణయ్ రాజ్ నివ్వు నిర్వాహకుడివా? చదువరి చప్రాసీవా>
[మార్చు]తెలుగు వికీపీడియాను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న ప్రణయ్ రాజ్! ఇంతకీ తెవికీలో నీ పనేంటీ? నిర్వాహకహోదాను పటిష్టంగా ఉపయోగించుకున్న దాఖలాలు ఎలాగూలేవు. ఇప్పుడు నిష్కారణంగా నాపై నిరోధం విధించావు. చదువరి మరియు పవన్ లను తెవికీ రాక్షసులుగా అభివర్ణించినవారు తెలుగు భాషాభిమానులే. అదే విషయం నేను తెవికీలో రాశానే తప్ప అది ఏకంగా నేను చెప్పినది కానేకాదు. ఏమీ తెలీకుండా చదువరి నిరోధం విధించమని చెప్పగానే పనిచేయడమేనా? తెవికీ నిర్వాహకుడిగా, ఆలోచించి బాధ్యతతో వ్యవహరించాల్సి ఉండాల్సింది. అలా కాకుండా కేవలం చదువరి చప్రాసీ మాదిరిగా బాధ్యత నిర్వహించబట్టే నాకీఅనుమానం. ఎప్పటినుంచి ఈ కొత్త విధులు? మరి ఆ చదువరి సరాసరిగా పనిచేయకుండా ఇతరులను ఎందుకు కాళ్ళావేళ్ళా పడుతున్నాడో ఇప్పటికైనా అర్థమైందా? దాని అసలు లక్ష్యం ఇతరులను తిట్లు తినిపించడం. చదువరి పనేమిటంటే తిట్లుతిట్టడం, తిట్లు తినిపించడం, అంతే. సరాసరిగా చేసి ఆయన డైరెక్టుగా బండబూతులు తిన్న సంగతులు కూడా ఉన్నాయ కాని ఇప్పుడిప్పుడే కొద్దిగా బుద్ధి వస్తోంది! సి. చంద్ర కాంత రావు- చర్చ 18:22, 23 జూన్ 2021 (UTC)
- ప్రణయ్, నీవు నిర్వాహకత్వ లక్షణాలు నిర్వహించే స్థితిలో ఏమీ లేనప్పుడు నిర్వాహక హోదాను ఎందుకు పట్టుకొని వేలాడుతున్నావ్! రాజీనామా చేసేయ్. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 23 జూన్ 2021 (UTC)
- @C.Chandra Kanth Rao గారూ, ఒక రోజు నిరోధం తరువాత కూడా మీలో మార్పు రాలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎవరో భాషాభిమానులు అనుకుంటున్నారు అంటూ రాక్షసులని తిట్టారు. అది నేరుగా తిట్టినట్టే. ఇక అజ్ఞాతకూ మీకూ తేడా ఏముంది? ఇదే పద్ధతిలో మిమ్మల్ని కూడా ఎవరైనా తిడితే, ప్రణయ్ గారు వాళ్ళపై కూడా చర్య తీసుకుని ఉండేవారు. మీరు తిట్టినది నన్ను కాబట్టి నేను చర్య తీసుకోకుండా ఎవరైనా తీసుకోండని కోరాను. అది ఒక సంప్రదాయం, అంతే. ప్రణయ్ గారు ఆ చర్య తీసుకున్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకవేళ ఎవరూ చర్య తీసుకోకపోయి ఉంటే నేనే తీసుకుని ఉండేవాణ్ణి.
- ఈ చర్య తీసుకున్నందుకు గాను ప్రణయ్ గారిని మీరు తీవ్రంగా దుర్భాషలాడారు. ఆయనను చప్రాసీ అని అనడాన్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. ఇది తీవ్రమైన వ్యక్తిగత దాడి. వికీ నియమాలకు విరుద్ధం. ఎందుకోసమైతే ప్రణయ్ గారు మీపై చర్య తీసుకున్నారో ఆ ఫలితం లభించలేదని మీ ఈ దుర్భాషలను బట్టి అర్థమౌతోంది. ఇలాంటి వ్యక్తిగత నిందల కారణంగా ఈ చర్చకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఇకనైనా ఇలాంటి వ్యక్తిగత నిందలు వెయ్యకుండా ఉంటారనే ఉద్దేశంతో, మీపై మళ్ళీ నిరోధం విధిస్తున్నాను. అయితే, ఈసారి మీలో మార్పు వస్తుందనే ఉద్దేశంతో నిరోధం అవధిని పెంచకుండా మళ్ళీ ఒక్కరోజే విధిస్తున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 01:13, 24 జూన్ 2021 (UTC)
- చదువరీ, నీకు ఎన్ని సార్లు చెప్పిననూ నీ ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అనవసరంగా నన్ను టార్గెట్ చేసుకుంటున్నావు. తప్పంతా నీ లోనె ఉంది. తెవికీ చచ్చిపోయిందనీ తెలుగు భాషాభిమానులే నీ పై చిందులు తొక్కుతున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి వైజాసత్య, కాసుబాబు, చంద్రకాంతరావు, దేవా, అర్జున, పాలగిరి, వెంకటరమణ లాంటి వారి వల్ల అభివృద్ధి చెందిన తెవికీని సర్వనాశనానికి కారకుడివి నువ్వేనని ఏకముక్తంగా తెలుగు భాషాభిమానులు మొన్న ఆదివారం సమావేశంలో తీర్మానించారు. నేను ప్రణయ్ ను ఏమీ దుర్భాషలాడలేను. అతను నిర్వాహకుడై ఉండి కూడా విచక్షణతో బాగా ఆలోచించి స్వతంత్ర నిర్ణయంతో నిర్వాహక పని చేయక ఎవరొ ఒక తింగరి చెప్పిన పని చెయడమేంటీ? ఆ తింగరి పైనే నిషేధం విధిస్తే సమస్త తెలుగు భాషాభిమానులందరూ హర్షాతిరేకాలు వ్యక్త్యం చేసేవారు. ఆకాశం నుంచి జయజయ ధ్వనులు వినిపించేవి. పువ్వుల వర్షం కురిసేది. తెవికీకి ఉజ్వల భవిష్యత్తు కనిపించేది. చదువరీ, తక్షణమె నిర్వాహక, అధికార హోదాలు వదిలిపెట్టి సెలవులోకి వెళ్ళిపో. తెవికీపై మమకారం ఉంటే కనుక వెంటనే ఈ పని చేసేయ్. ఎందుకంటే నివ్వు తెవికీలో ఉండి కూడా తెవికీనిక ఉద్ధరించేదీ ఏమీలేదు, నీ వల్ల కాదు కూడా. చచ్చిపోయిన తెవికిని ఇంకా కుళ్ళిపోయోలా చేస్తావేమోకానీ, పునర్వైభవానికి కృషి చేస్తావన్న నమ్మకం ఎవరికీ లేదు. చివరగా నేను చెప్పేదేమంటే నాపై మళ్ళీ నిషేధం గనుక విధిస్తే మళ్ళీ నీపై తప్పకుండా వాస్తవాలు రాయాల్సి ఉంటుంది. నిషేధం విధించకుండా వదిలేసి చూడు, నేనూ రాయడం వదిలేస్తా. ఆ మేరకు తెవికీ అభివృద్ధికి పాటుపడవచ్చు. ఇతర సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది. నిరోధం విధించిననూ ఐపి అడ్రస్ తోనైనా లేదా కొద్ద్ది మార్పుతో మరో సభ్యనామం సృష్టించుకొని రాయడానికి ఇబ్బంది ఏమీ ఉందదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 03:13, 25 జూన్ 2021 (UTC)
- @C.Chandra Kanth Rao గారూ, మీరు రాయడం మానేస్తే తెవికీ అభివృద్ధికి పాటుపడినట్టే అని మీ మనసులో మాటను చెప్పారు. ఎదటి మనిషి మిమ్మల్ని గౌరవంగా సంబోధిస్తున్నా, మీరు ఏకవచనంలో సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. అది అనుచితం. దాన్ని మానండి.
- నా గురించి వాస్తవాలు రాస్తానని రాసారు. గత పది రోజులుగా రాస్తూనే ఉన్నారు. ఒక్కదానికి, ఒక్కటంటే ఒక్కదానిక్కూడా ఆధారం చూపించలేకపోయారు.
- ఇకపోతే, ఎవరో ఏదో చెప్పారంటూ అజ్ఞాత రాసిన పుకార్లనే మీరూ రాసారు. మీ ఆగడాలు అతణ్ణి మించిపోయాయి. మీ తిట్లు ఆపలేదు. రెండు రోజుల పాటు నిరోధం విధించినా మీలో ఆవగింజంత అయినా మార్పు రాలేదు. తక్షణమే మిమ్మల్ని నిరోధించాల్సిన అవసరాన్ని మళ్ళీ కల్పించారు. నిషేధించకుండా వదిలేసి చూడమని రాసారు. ఎందుకు వదిలెయ్యాలి.. నన్ను తింగరి అని తిట్టినందుకా? పుకార్లు వ్యాపించజేసినందుకా? మీరు మళ్ళీ ఇక్కడ చేసిన తప్పులకు మిమ్మల్ని నిషేధించడం తప్పనిసరి -ఆ సంగతి మీకూ తెలుసు.
- ఇక మీరు మారతారని నాకు పెద్దగా నమ్మకం లేనప్పటికీ, మారుతారేమో నన్న కొద్దిపాటి ఆశ లేకపోలేదు. అలా మారేందుకు మీకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని అనిపించింది. ఒకవేళ మీరు మారితే ఆది వికీపీడియాకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ అవకాశాన్ని వదులుకోదలచలేదు నేను. అందుచేత ఇవ్వాళ మీరు రాసిన తిట్లదండకం ఆధారంగా చర్య తీసుకోవడం లేదు.
- మళ్ళీ ఎవరినైనా సరే.. ఏకవచనంతో సంబోధించినా, తిట్టినా, ఏ రకమైన వ్యక్తిగత నిందలు చేసినా, పుకార్లు వ్యాపింప జేసినా మీపై నిరవధిక నిరోధం విధించవలసి వస్తుంది. ఇది చివరి హెచ్చరిక. __ చదువరి (చర్చ • రచనలు) 04:44, 25 జూన్ 2021 (UTC)
- చదువరీ, నీకు ఎన్ని సార్లు చెప్పిననూ నీ ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అనవసరంగా నన్ను టార్గెట్ చేసుకుంటున్నావు. తప్పంతా నీ లోనె ఉంది. తెవికీ చచ్చిపోయిందనీ తెలుగు భాషాభిమానులే నీ పై చిందులు తొక్కుతున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి వైజాసత్య, కాసుబాబు, చంద్రకాంతరావు, దేవా, అర్జున, పాలగిరి, వెంకటరమణ లాంటి వారి వల్ల అభివృద్ధి చెందిన తెవికీని సర్వనాశనానికి కారకుడివి నువ్వేనని ఏకముక్తంగా తెలుగు భాషాభిమానులు మొన్న ఆదివారం సమావేశంలో తీర్మానించారు. నేను ప్రణయ్ ను ఏమీ దుర్భాషలాడలేను. అతను నిర్వాహకుడై ఉండి కూడా విచక్షణతో బాగా ఆలోచించి స్వతంత్ర నిర్ణయంతో నిర్వాహక పని చేయక ఎవరొ ఒక తింగరి చెప్పిన పని చెయడమేంటీ? ఆ తింగరి పైనే నిషేధం విధిస్తే సమస్త తెలుగు భాషాభిమానులందరూ హర్షాతిరేకాలు వ్యక్త్యం చేసేవారు. ఆకాశం నుంచి జయజయ ధ్వనులు వినిపించేవి. పువ్వుల వర్షం కురిసేది. తెవికీకి ఉజ్వల భవిష్యత్తు కనిపించేది. చదువరీ, తక్షణమె నిర్వాహక, అధికార హోదాలు వదిలిపెట్టి సెలవులోకి వెళ్ళిపో. తెవికీపై మమకారం ఉంటే కనుక వెంటనే ఈ పని చేసేయ్. ఎందుకంటే నివ్వు తెవికీలో ఉండి కూడా తెవికీనిక ఉద్ధరించేదీ ఏమీలేదు, నీ వల్ల కాదు కూడా. చచ్చిపోయిన తెవికిని ఇంకా కుళ్ళిపోయోలా చేస్తావేమోకానీ, పునర్వైభవానికి కృషి చేస్తావన్న నమ్మకం ఎవరికీ లేదు. చివరగా నేను చెప్పేదేమంటే నాపై మళ్ళీ నిషేధం గనుక విధిస్తే మళ్ళీ నీపై తప్పకుండా వాస్తవాలు రాయాల్సి ఉంటుంది. నిషేధం విధించకుండా వదిలేసి చూడు, నేనూ రాయడం వదిలేస్తా. ఆ మేరకు తెవికీ అభివృద్ధికి పాటుపడవచ్చు. ఇతర సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది. నిరోధం విధించిననూ ఐపి అడ్రస్ తోనైనా లేదా కొద్ద్ది మార్పుతో మరో సభ్యనామం సృష్టించుకొని రాయడానికి ఇబ్బంది ఏమీ ఉందదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 03:13, 25 జూన్ 2021 (UTC)
నిర్వాహకులందరికీ వినతి
[మార్చు]నిర్వాహకులందరికీ విజ్ఞప్తి: గత పది రోజులుగా రచ్చబండలో వాడుకరి:C.Chandra Kanth Rao గారు చేస్తూ ఉన్న వ్యక్తిగత నిందలను, వేధింపులనూ గమనించే ఉంటారు. ఇక్కడ ఆయనపై నిరోధాన్ని ప్రతిపాదించాక కూడా ఆయన అనేక నిందలకు పాల్పడ్డారు. రెండు సార్లు నిరోధం విధించాక కూడా ఇవ్వాళ మళ్ళీ నన్ను నిందించారు. అయినప్పటికీ ఆయనపై చర్య తీసుకోకుండా సంయమనం వహించాను. తిరిగి అలాంటి నిందలు, అమర్యాదగా మాట్లాడ్డం వంటివి చెయ్యవద్దని కోరాను. అలాంటివి చేస్తే నిరవధికంగా నిరోధిస్తానని కూడా హెచ్చరించాను. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని చెప్పవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 04:59, 25 జూన్ 2021 (UTC)
- ఎన్ని రోజులైననూ ఆయన చర్చా ధోరణిలో నాకు మార్పు కనిపించడం లేదు. ఆయన మాటల్లో వ్యక్తిగత ద్వేషమే కనిపిస్తుంది కానీ చర్చను సరైన దారిలోకి తీసుకుని వెళ్ళే ఉద్దేశ్యం కనిపించడం లేదు. నిరవధిక నిరోధం విధించడానికి నాకు అభ్యంతరం లేదు. రవిచంద్ర (చర్చ) 05:44, 25 జూన్ 2021 (UTC)
- ఇప్పటికే చాలా అవకాశం ఇచ్చాం అనిపిస్తోంది. ఈ తిట్లపురాణంతో ఆపట్లేదు, సాక్‌పప్పెట్లు సృష్టించుకుని దాడిచేస్తానని ఏ జంకూగొంకూ లేకుండా చెప్తున్నారు. ఇదంతా తెలుగు వికీపీడియా నిర్వహణను అపహాస్యం చేయడమే. ఇన్ని తిట్లు ఆయన తిడుతున్నా తిరిగి అదే భాషలో సమాధానం చెప్పకపోవడం మన అందరి నిబద్ధతను చాటి చెప్తోంది. ఆయనకు స్వంత బ్లాగ్ పట్ల ఉన్న ఆసక్తిలో ఏ వెయ్యోవంతు కూడా తెలుగు వికీపీడియా మీద లేదని ఈ ఐదేళ్ళలో ఆయన ప్రవర్తన, ఈ నెలలో నడచిన ఈ ప్రహసనం తేల్చిచెప్పాయి. ఇకపై ఆయన దాడులకు సమాధానాలిస్తూ మన సమయం వృధా చేసుకోవడం అనవసరం. ఆయనను నిరవధికంగా నిషేధించడం అత్యంత సబబు. --పవన్ సంతోష్ (చర్చ) 06:00, 25 జూన్ 2021 (UTC)
- చంద్రకాంత రావు గారు నిర్వాహకులపై చేయుచున్న తిట్లు, నిందలు, అపవాదులు, వ్యక్తిగత దాడులు, ఏకవచన సంబోధనలు, విషయంలో సముదాయం చాలా ఓర్పుతో ఇప్పటివరకు ఉపేక్షించింది.అయినా ఆయనలో ఇసుమంతైనా మార్పురాకపోగా ఇంకా ఎక్కువ అమర్యాదగా చర్చలుదోరణి సాగుతుంది.ఈ బెదిరింపులు దోరణి సరికాదు.ఇది వికీపీడియాకు చాలా నష్టం.ఈ కారణాలరీత్యా ఆయనపై శాశ్వత నిరోధం విధించటానికి నాకు ఎటువంటి అభ్యంతరంలేదు. యర్రా రామారావు (చర్చ) 07:25, 25 జూన్ 2021 (UTC)
- తెవికీలో ఏ విషయంలోనైనా విభేదిస్తే సామరస్య పూర్వకంగా చర్చించాలి. కానీ వ్యక్తిగత దాడులు కూడదు. దీనిని ఖండిస్తున్నాను. పదే పదే గౌరవ సభ్యులు చదువరి, పవన్ సంతోష్ లను తొలగించమని చెప్పడం, ఆధారాలు ఏవీ చూపించకుండా వారి నిర్వాహక పదవుల నుండి తప్పుకోమనడం సరైనది కాదు. ఇంతకాలం అజ్ఞాత, చంద్రకాంతరావు గార్లు చర్చలను సామరస్య పూర్వకంగా చేయకుండా నిరాధార ఆరోపణలు చేయడాన్ని, గౌరవ సభ్యులను అగౌరవపరిచే పదాలను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాను. తెవికీ అభివృద్ధికి పాటుపడిన ముఖ్యమైన, గుర్తింపు పొందిన వ్యక్తులలో చంద్రకాంతరావుగారు ఒకరు. అతను గత ఐదేళ్ళుగా వికీలో పనిచేయక పోయినా అతనిపై వ్యక్తిగత గుర్తింపు, గౌరవం ప్రస్తుత వికీ సమాజానికి ఉంది. ఆ గౌరవంతోనే ఇంతకాలం ఎటువంటి నిరాధార ఆరోపణలు చేసినా, వ్యక్తిగత నిందలు చేసినా, త్వరలో అతని ధోరణిలో మార్పు వస్తుందని భావించాను. మనం మనకున్న కొద్ది జీవితకాలంలో కొంతకాలమే తెవికీలో పనిచేస్తాము. తర్వాతి తరం వారు మన చర్చలు పరిశీలిస్తే మనం చేసే వనుల మూలంగా మన వ్యక్తిగత ప్రతిష్ట దిగజారిపోతుంది. తెవికీలో మనం ఉన్నా, లేకపోయినా వైజాసత్య, కాసుబాబు, పాలగిరి, వేమూరి వారిలా మనకు చిరస్థాయిగా గుర్తింపు ఉండాలి. మనం ఎంత జ్ఞానవంతులమైనా మనం చేసే చిన్న తప్పిదం మూలంగా మన ప్రతిష్ట ఒక్క సారి పోతుందని గమనించాలి. చర్చలు గౌరవప్రదంగా జరపాలి గానీ వ్యక్తిగత దూషణలతో కాదు. జరిగినది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా తెవికీలో పనిచేయడానికి మంచి అనుభవం ఉన్న చంద్రకాంతరావు తిరిగి వికీలో సేవలను కొనసాగించాలి. మీ సేవలతో విజ్ఞాన సర్వస్వం అధ్బుతంగా తయారవుతుందని భావిస్తున్నాను. సహసభ్యులకు ఇదే ధోరణిలో అనవసర ఆరోపణలు, అమర్యాదగా మాట్లాడ్డం వంటివి చెయ్యవద్దని మనవి. అలాంటివి చేస్తే నిరవధికంగా నిరోధించడానికి నాకు ఎటువంటి అభ్యంతరంలేదు. అతను తిరిగి అలా చేయరని భావిస్తున్నాను.➠ కె.వెంకటరమణ⇒చర్చ 14:59, 25 జూన్ 2021 (UTC)
- తెలుగు వికీపై, వికీ నిర్వాహకులపై వ్యక్తిగత ద్వేషంతో పదేపదే ఆరోపణలు చేస్తూ, దుర్భాషలాడుతున్నా కూడా ఆయన మీద గతంలో చర్యలు తీసుకోలేదు. ఇక ఆయన ప్రవర్తనలో మార్పు లేకపోతే శాశ్వత నిరోధం విధించటానికి నాకు ఎటువంటి అభ్యంతరంలేదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 18:05, 25 జూన్ 2021 (UTC)
- తెవికీలో ఏ విషయంలోనైనా విభేదిస్తే సామరస్య పూర్వకంగా చర్చించాలి. కానీ వ్యక్తిగత దాడులు కూడదు. దీనిని ఖండిస్తున్నాను. పదే పదే గౌరవ సభ్యులు చదువరి, పవన్ సంతోష్ లను తొలగించమని చెప్పడం, ఆధారాలు ఏవీ చూపించకుండా వారి నిర్వాహక పదవుల నుండి తప్పుకోమనడం సరైనది కాదు. ఇంతకాలం అజ్ఞాత, చంద్రకాంతరావు గార్లు చర్చలను సామరస్య పూర్వకంగా చేయకుండా నిరాధార ఆరోపణలు చేయడాన్ని, గౌరవ సభ్యులను అగౌరవపరిచే పదాలను ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాను. తెవికీ అభివృద్ధికి పాటుపడిన ముఖ్యమైన, గుర్తింపు పొందిన వ్యక్తులలో చంద్రకాంతరావుగారు ఒకరు. అతను గత ఐదేళ్ళుగా వికీలో పనిచేయక పోయినా అతనిపై వ్యక్తిగత గుర్తింపు, గౌరవం ప్రస్తుత వికీ సమాజానికి ఉంది. ఆ గౌరవంతోనే ఇంతకాలం ఎటువంటి నిరాధార ఆరోపణలు చేసినా, వ్యక్తిగత నిందలు చేసినా, త్వరలో అతని ధోరణిలో మార్పు వస్తుందని భావించాను. మనం మనకున్న కొద్ది జీవితకాలంలో కొంతకాలమే తెవికీలో పనిచేస్తాము. తర్వాతి తరం వారు మన చర్చలు పరిశీలిస్తే మనం చేసే వనుల మూలంగా మన వ్యక్తిగత ప్రతిష్ట దిగజారిపోతుంది. తెవికీలో మనం ఉన్నా, లేకపోయినా వైజాసత్య, కాసుబాబు, పాలగిరి, వేమూరి వారిలా మనకు చిరస్థాయిగా గుర్తింపు ఉండాలి. మనం ఎంత జ్ఞానవంతులమైనా మనం చేసే చిన్న తప్పిదం మూలంగా మన ప్రతిష్ట ఒక్క సారి పోతుందని గమనించాలి. చర్చలు గౌరవప్రదంగా జరపాలి గానీ వ్యక్తిగత దూషణలతో కాదు. జరిగినది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా తెవికీలో పనిచేయడానికి మంచి అనుభవం ఉన్న చంద్రకాంతరావు తిరిగి వికీలో సేవలను కొనసాగించాలి. మీ సేవలతో విజ్ఞాన సర్వస్వం అధ్బుతంగా తయారవుతుందని భావిస్తున్నాను. సహసభ్యులకు ఇదే ధోరణిలో అనవసర ఆరోపణలు, అమర్యాదగా మాట్లాడ్డం వంటివి చెయ్యవద్దని మనవి. అలాంటివి చేస్తే నిరవధికంగా నిరోధించడానికి నాకు ఎటువంటి అభ్యంతరంలేదు. అతను తిరిగి అలా చేయరని భావిస్తున్నాను.➠ కె.వెంకటరమణ⇒చర్చ 14:59, 25 జూన్ 2021 (UTC)
- నా మాటను మన్నించి నిషేధం అధించనందున ఈ రోజు చదువరి గారిపై ఏమీ వ్రాయదల్చుకోలేను. కాని మిగితా నిర్వాహకులు మాత్రం శాంతంగా లేరు. ఉన్న వాస్తవాలు రాస్తే దాడులు అని అనడం సరైనది కాదు. నేను ఎవరిపైనా అయిన నిష్కారణంగా నిరోధానికి వ్యతిరేకిని. అందులోనూ కొత్తవారికి మరీనూ. అలా చేయడం నిర్వాహకహోదాను దుర్వినియోగపర్చడమే అవుతుంది. అతి చిన్న సమస్య పెద్ద వివాదానికి దారితీయడానికి కారకుడెరరో స్పష్టాతిస్పష్టంగానే ఉంది. అదే యర్రా రామారావు పొరపాటు. అతను చిన్న పిల్లాడిగా ప్రవర్తిస్తూ చిన్న మరియు సునామాయా దిస్సుబాట్లు చేస్తూ, ఇటీవలి మార్పులలో తన పేరును చూసుకొని మురిసిపోయే చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నట్టుగా గోచరిస్తోంది. కనీసం అజ్ఞాత చెప్పిన తర్వాత అయినా ఆ పనికిమాలిన పని ఆపాడా అంటే అస్సలు లేదు. పైగా అజ్ఞాత రాసిన దిద్దుబాటును రద్దుచేయడం ఒక నిర్వాహకుడిగా తగనిపని. వెబ్‌సైట్ లింకులు కూడా తొలగించుకోమని అజ్ఞాత రాస్తే దాన్నీ రద్దుపర్చి కనిపించకుండా చేసి ఇతరులను జ్యోతిష్యులుగా, అజ్ఞాతతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ముడివేయడం దేనికి. వీటన్నింటికీ ఆధారాలేంటీ. కేవలం నేను చెప్పే వాటికే ఆధారాలు కావాలా? సి. చంద్ర కాంత రావు- చర్చ 01:22, 26 జూన్ 2021 (UTC)
- నేను ఒకప్పుడు తెవికీ అభివృద్ధికై విశేష కృషి చేశాను. అది నాకు గుర్తింపునిచ్చింది. భాషాభిమానులపై దాని ప్రభావం ఇప్పటికీ ఉంది. గతకొంతకాలంగా తెవికీ సెలవులో ఉంటూ కేవలం విమర్శకుడిగా మాత్రమే పనిచేస్తూ, నా బ్లాగు మరియు ఇతర సామాజిల మాధ్యమాలలో పనిచేస్తున్నాను. ఇలా చేయదనికి కారణం తెవికీ చర్చలు సామరస్య పూర్వకంగా జరుగకపోవడమే. గత కొన్ని సం.ల చర్చలన్నీ పవన్ అనే సభ్యుడి హేళనలు, వెక్కిరింపులు, శాపనార్థాలతో నిండిపోయాయి. ఇప్పుడేమో తెవికీ కంటే బ్లాగుపైనే ప్రేమ చూపిస్తున్నానని నాకు అనడమేంటీ? ఎవరిదీ పొరపాటు? భాషాభిమానులు కూడా తెవికీఓ ఉన్న సమాచారాన్నంతా కాపీ చేసుకొని ఎప్పటికప్ప్డు తాజాకరణ, నాణ్యత మెరుగుపరిస్తే తెలుగు పాఠకులకు ప్రయోజనకరంగా ఉంటుందనీ, బ్లాగును సైటుగా మారిస్తే ఇంకనూ బాగుంటుందనీ, అవసరమైతే సహకారం అందించగలమనీ చెప్పారు. ఇంకనూ వారేమీ చెప్పారంటే సిసికెరావు పీడియా ఉండగా తెలుగు వికీపీడియాగా దండగా అని. ఇది ఈ వాక్యం నేరుగా నేను చెప్పినది కాదు భాషాభిమానులు చెప్పినదే). సి. చంద్ర కాంత రావు- చర్చ 01:34, 26 జూన్ 2021 (UTC)
- @C.Chandra Kanth Rao గారూ, నిన్న మీకు ఒక హెచ్చరిక చేసాను, గమనించే ఉంటారు. ఏకవచన సంబోధన చెయ్యవద్దని, నిందించవద్దని ఆ హెచ్చరికలో ఉంది. అయినప్పటికీ మీరు పద్ధతి మార్చుకోలేదు.
- "అయినా.. .. పని ఆపాడా" అంటూ యర్రా రామారావు గారిని ఏకవచనంతో సంబోధించి కించపరచారు. మీ పద్ధతి మార్చుకునే ధోరణి కనిపించడం లేదు.
- ఆయన చేస్తున్న పని పనికిమాలిదని అరోపించారు. ఆయన చేస్తున్న పని సరైనదేనని గతంలో రచ్చబండలో ఇతర వాడుకరులు చెప్పారు. భిన్నాభిప్రాయం వచ్చింది. అలాంటపుడు మళ్ళీ మీ అభిప్రాయాన్ని చెప్పేటపుడు అది ఎలా చెయ్యాలో చెప్పాలి, చేసి చూపించాలి. మీరు ఆ పని చెయ్యలేదు. పైగ ఆయన ఆ పని గురించి సవివరంగా రచ్చబండలో రాసారు. రావుగారూ రండి కలిసి పనిచేద్దాం అని ఆయన మిమ్మల్ని ఆహ్వానించారు. ఏవో కారణాలు చెప్పి మీరు ఆ పనిలో పాల్గొనలేదు. మరెవరు ఆ పనిలో పాలుపంచుకున్నా నాకు అభ్యంతరం లేదు అని కూడా చెప్పారాయన. అంతేకాదు, ఎవరైనా ఆటోమాటిగ్గా ఆ పని చేసినా సహకరిస్తానని చెప్పారు. అయినప్పటికీ మీరు అదే నిందను కొనసాగించారు. ఇది వేధింపు.
- అజ్ఞాత రాసినదాన్ని రద్దు చేసారని అన్నారు. ఎక్కడ రద్దు చేసారాయన? ఎవరు రద్దు చేసారో ఎక్కడ రద్దు చేసారో కూడా చూసుకోకుండా మీరు ఆయన్ను నిందించారు.
- ఇప్పటివరకూ మీరు చేసిన నిరాధార, నిందాపూర్వక, వ్యక్తిగత దాడులకు కొనసాగింపుగానే ఇవన్నీ చేసారు. మీకు చేసిన చివరి హెచ్చరికను కూడా బేఖాతరు చేసారు. గత పది రోజులుగా మీరు చేస్తున్న దాడులను ఆపే ఉద్దేశం మీకు ఉన్నట్టు లేదని దీన్ని బట్టి తెలుస్తోంది. మీ పద్ధతి మార్చుకుంటారనే ఆశ పోయింది. వీటన్నిటి కారణంగా మిమ్మల్ని నిరవధికంగా నిరోధిస్తున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 02:34, 26 జూన్ 2021 (UTC)
- @C.Chandra Kanth Raoగాఅరూ, మరొక్క సంగతి.. మీ వాడుకరి చర్చ పేజీపై నిరోధం విధించలేదు. అక్కడ మీ నిరోధం గురించి ఏమైనా చెప్పదలిస్తే చెప్పవచ్చు. ఒకవేళ ఆ పేజీని కూడా వ్యక్తిగత దాడులకు, వేధింపులకూ వాడితే దాన్ని కూడా నిరోధంలో పెట్తవలసి వస్తుంది. గమనించగలరు. మీ నిరోధం గురించి మీరు వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష పద్ధతి ప్రకారం మీ నిరోధంపై ఆ సంఘ సభ్యులను సమీక్షించమని కోరవచ్చు. __
- __ చదువరి (చర్చ • రచనలు) 02:42, 26 జూన్ 2021 (UTC)
- పైన చంద్రకాంతరావు గారు చర్చలో "అతి చిన్న సమస్య పెద్ద వివాదానికి దారితీయడానికి కారకుడెరరో స్పష్టాతిస్పష్టంగానే ఉంది. అదే యర్రా రామారావు పొరపాటు. అతను చిన్న పిల్లాడిగా ప్రవర్తిస్తూ చిన్న మరియు సునామాయా దిస్సుబాట్లు చేస్తూ, ఇటీవలి మార్పులలో తన పేరును చూసుకొని మురిసిపోయే చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నట్టుగా గోచరిస్తోంది. కనీసం అజ్ఞాత చెప్పిన తర్వాత అయినా ఆ పనికిమాలిన పని ఆపాడా అంటే అస్సలు లేదు. పైగా అజ్ఞాత రాసిన దిద్దుబాటును రద్దుచేయడం ఒక నిర్వాహకుడిగా తగనిపని" అనే అభిప్రాయం వెల్లడించారు.నాపై అజ్ఞాత వాడుకరి 11 న అభియోగం చేసినరోజున నేను తూర్పు గోదావరి జిల్లా మండలాలలో సవరణలు చేస్తున్నాను.మద్యలో అసంపూర్తిగా ఉన్నందున నేను 13 వరకు సవరణలు చేసాను. రచ్చబండ దీనిమీద చర్చలు సాగుతున్నందున అభియోగం చేసే వారిని రెచ్చగొట్టినట్లుగా నా ప్రవర్తన ఉండకూడదని ఈ రోజువరకు ఆ సవరణలను తాత్కాలికంగా ఆపాను.అది గమనించకపోవటం దురదృష్టకరం.మండలాలలో, గ్రామాలలో అవి తప్పనిసరిగా చేయాల్సిన పనులు అని, ఈ రోజుకూడా ఈ సందర్బంగా ఉటంకిస్తున్నాను. ఇదే విషయం రచ్చబండలో
- "వాటిలో చేయాల్సిన అవసరమైన నిర్మాణాత్మకమైన సవరణలు అలానే ఉన్నాయి.ఆ ఉద్ధేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ప్రతి మండలం, ఆ మండలంలోని ప్రతి గ్రామం పరిశీలించి, కనీసం చేయవలసిన సవరణలు గుర్తించి, అది ఇది అని కాకుండా సవరణలు చేస్తున్నాను.కేవలం ఆ సవరణలు నేను ఏదో గణాంకాలు పెంపొందించుకోవటానికి చేస్తున్నట్లు ఇటీవల కొంత మందికి అపోహలు కలిగినవి.ఎవరు చేసినా ఆ సవరణలు తప్పని సరిగా చేయవలసిన అవసరం మాత్రం ఉంది.ఆ పని ఆపేదేమీ కాదు. నేనే చేస్తే, నా అంచనా ప్రకారం సుమారు ఇంకా ఒక సంవత్సర కాలం పట్టవచ్చు. అందుకు గాను ఈ దిగువ అభిప్రాయాలు సముదాయం ముందు పెడుతున్నాను.
- కేవలం నేనే చేయాలనే అభిప్రాయం నాకు ఎ మాత్రం లేదు.గ్రామ వ్యవస్థమీద నాకున్న అభిమానంతో ఆలోపాలు నేను గుర్తించాను, కాబట్టి పూర్తిచేయలనే సంకల్పంతో నేను సవరించుట జరుగుతుంది.
- ఆ సవరణలు ఏదైనా "ఆటో బాటు" లేదా "సెమీ బాటు" ద్వారా చేయటానికి ఎవరైనా ముందుకువస్తే, వారితో నేను పూర్తిగా సహకరిస్తాను.పై రెండిటితో ఈ సవరణలు చేసేంత పరిజ్ఞానం నాకు లేదు.నాకు చేత కాదు
- లేదూ, ఆ పనికి ఎవరూ ముందుకురాని పక్షంలో, మానవవీయంగా చేయటానికి గౌరవ వికీపీడియన్లు ఎవరైనా ముందుకువస్తే, వారితో కలసి పనిచేస్తాను.నాకు తెలిసినంతవరకు నా సహకారం పూర్తిగా అందిస్తాను.
- మానవీయంగా చేయాలిసివస్తే ముఖ్యంగా ఈ విషయంలో చంద్రకాంతారావు గారు ఈ పనులలో పాలుపంచుకుంటే, నేను ఆయనతో కలసిపని చేస్తాను.ఎవరికి కుదిరినా, కుదరక పోయినా ఆపని ఆగటానికి వీలులేదు.నా శక్తిమేరకు సవరణలు చేస్తూనే ఉంటాను.నా ఆలోచనలకు తగ్గట్టుగా ఆ సవరణలు పూర్తిచేయటం నాధ్యేయం." అని సముదాయం దృష్టికి 2021 జూన్ 20 న తీసుకు వెళ్లాను.దీనికి చంద్రకాంతరావు గారు స్పందిస్తూ ఇలా అన్నారు."ఈ విషయంలో కలిసి పని చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఒకప్పుడు అందరూ కలిసి తెవికీని అభివృద్ధిపర్చినట్లుగా మళ్ళీ పూర్వవైభవం తీసుకువద్దాం, తెవికీని తెలుగు పాఠకుల ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళదాం. అయితే ముందుగా తెవికీ ప్రక్షాళన జరగాలి. గత కొన్ని సంవత్సరాలుగా తెవికీని దారుణంగా దెబ్బతీసిన ఇద్దరు సభ్యుల నిర్వాహక/అధికార హోదాలు రద్దుచేయాలి." అని స్పందించారు.దీనినిబట్టి పొంతనలేని కంఢిషన్ పెట్టినందున చంద్రకాంతరావు గార్కి మనస్పూర్తిగా ఆ సవరణలో పాలుపంచుకోవలనే అభిప్రాయం లేనట్లుగా నాకు అర్థమైంది.
- సరే ఇక సవరణలు విషయానిక వస్తే సముదాయంలో నేను చర్చకుపెట్టి వారం రోజులు కావస్తుంది. "ఆటో బాటు" లేదా "సెమీ బాటు" ద్వారా చేయటానికి గౌరవ వికీపీడియన్లు ఎవ్వరూ ఇంతవరకు స్పందించలేదు.మానవీయంగా చేయాల్సిన పరిస్థితి తప్పేటట్లు లేదు.మానవీయంగా చేయాటానికి ఎవరైనా ముందుకు వస్తే వారితో నేను కలిసి పనిచేస్తూ,వారికి సహకరించటానికి నాకేమీ ఎటువంటి అభ్యంతరంలేదు.నేను చేసే సవరణలు గౌరవ వికీపీడియన్లు ఎప్పుడైనా పరిశీలించవచ్చును,సవరణలలో ఏమైనా లోపాలుంటే నేరుగా నాకు తెలిపితే సంతోషంగా స్వీకరించి సవరించుకుంటాను.చాలా ఎక్కువ రాసి విసుగించినందుకు క్షమించాలి.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 04:25, 26 జూన్ 2021 (UTC)
- ఇంకొక విషయం నా చర్చాపేజీలో అజ్ఞాత వాడుకరి అనుచిత వ్యాఖ్యలతో రాసినందున ఆ దిద్దిబాటును రద్దు చేసుకోవటం తప్పుకాదని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 04:33, 26 జూన్ 2021 (UTC)
- ఇన్ని చర్చలూ చదివాక నాకున్న అభిప్రాయాన్ని రాస్తున్నాను. ప్రస్తుతం తెవికీలో అంత చురుగ్గా లేని చాలామంది నిర్వహకులూ, వాడుకరులూ కూడా మిగతా మాద్యమాల్లో చురుగ్గానే ఉన్నారు. కాని తెవికీలో సేవలు నిలిపివేసారు లేదా...అప్పుడప్పుడూ మనసూరుకోక వస్తారు, చూస్తారు కానీ స్పందించరు అనీ అనుకుంటాను. అలాగే ఎందుకు ఇలా అనీ అనిపిస్తుంది. దీనిపై నా అభిప్రాయం తప్పో ఒప్పో వారికివారుగావచ్చి రాస్తే తప్ప తెలియదు. చంద్రకాంతరావుగారి వాదనలూ చర్చలూ చదివాక నాకు మొదటగా అనిపించింది. అసలు సమస్య అంతా... ప్రతి ఒక్కరికీ తెలుగుపై, ఆపై వికీపై అభిమానం, ప్రేమ ఎక్కువగా ఉండటం............. జె.వి.ఆర్.కె, వై.వి.ఎస్.రెడ్డి గార్ల విషయంలో వాడుకరుల స్పందించినపుడు తరువాత పునరాలోచించుకున్నపుడు నాతో సహా కొంచెం అతిగా చేసామా?... వారిని దూరం చేసామా?... అనిపించింది.. అంటే మరికొంత ఆలోచించినా లేదా..వారి వ్యక్తిగత అభిప్రాయాలకు కొంత విలువిచ్చినా వారు ఇంకా కొనసాగి వికీకి సేవలు అందిస్తూ ఉండేవారేమో..వాళ్ళకు నిజంగా తెలుగుపై, తెవికీపై అభిమానం, ప్రేమ ఉన్నపుడు వారిని వికీకి దూరం చేయడం ద్వారా వారిలో అసహనం, కోపం, మనపై ద్వేషం పెరుగుతూపోతుంటే..... వికీ నియమాలకు కట్టుబడిన వారి విచక్షణ ఎవరినీ ఏమీ అనలేని అసహయత...కాని జరుగుతున్న పరిణామాలపై అడ్డుకోలేక ఆక్రోశం ఆపుకోలేక కొద్దిగా శ్రితిమించడం జరిగుతుంటే... దానిపై అందరూవాళ్లకు నియమాలను గుర్తుచేస్తూ ఇది తప్పు అది తప్పు అంటూ వారి వ్యాసాలపై లేదా చర్చలతో చెడుగుడు ఆడుతూ ఉంటే ఇంకా ఎక్కువగా వత్తిడి పెరుతూ పోయి ఇక వాడకూడదు అనుకుంటూనే కొన్ని పదాలను వదిలేస్తారని అనుకుటాను.. దానితో నిషేధానికి గురిఅవుడం, ఇక నిషేదం తరువాత వారిలో ఆగ్రహం పెరుగుతూపోవడమ్. ఆపై ముందుగా మనం చెప్పుకున్నట్టు దానికి భాద్యులపై దాడిగా మొదలౌతుంది. నిజానికి అది దాడిగా అనుకోనక్కరలేదు తెవికీపై ప్రేమ, సేవలు చేయలేకపోతున్నఅసహనం.... .పరిస్థితి ఎందుకు ఇలా..దీనిని మార్చుకోలేమా.. మనలో మానసికంగా మార్పులు సాధించుకోలేమా ? ఈ సమస్యలు ఎప్పుడూ ఉండేవే కదా అని ఇలాగే కొనసాగించాలా...? అసలు తెలుగు వికీని ఆంగ్ల వికీలా ఎందుకు చూడాలి?, ఆంగ్ల వికీలో నియమాలను మక్కికి మక్కి ఎందుకు అమలుచేయాలి ?, ఆంగ్లవికీలా ప్రతి ఒక్క విషయంలో ఎందుకు జరగాలి?. తమిళ వికీలా మన నేటివిటీకి తగినట్టు మార్పులు చేసుకొని నిర్వహించుకోలేమా..? వాడుకరులను ప్రోత్సహించుకోలేమా. దూరమైన వారిని మళ్ళీ తిరిగి రాసేలా చేయలేమా..? టాపిక్ డైవర్ట్ చేయడం నా ఉద్దెశ్యం కాదు కాని మూలం ఏమిటో తెలుసుకుంతే చద్రకాంతరావుగారో, మరొకరో, ఇలా ఎందుకు అంటున్నారు అనేదానిపై స్పష్టత వస్తుందని అనుకుంటాను... దీనిపై మీ ప్రతిస్పందనలు తెలియచేయగలరు... ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ) 12:51, 28 జూన్ 2021 (UTC)
- ఇంకొక విషయం నా చర్చాపేజీలో అజ్ఞాత వాడుకరి అనుచిత వ్యాఖ్యలతో రాసినందున ఆ దిద్దిబాటును రద్దు చేసుకోవటం తప్పుకాదని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 04:33, 26 జూన్ 2021 (UTC)
- చంద్రకాంత రావు గారు నిర్వాహకులపై చేయుచున్న తిట్లు, నిందలు, అపవాదులు, వ్యక్తిగత దాడులు, ఏకవచన సంబోధనలు, విషయంలో సముదాయం చాలా ఓర్పుతో ఇప్పటివరకు ఉపేక్షించింది.అయినా ఆయనలో ఇసుమంతైనా మార్పురాకపోగా ఇంకా ఎక్కువ అమర్యాదగా చర్చలుదోరణి సాగుతుంది.ఈ బెదిరింపులు దోరణి సరికాదు.ఇది వికీపీడియాకు చాలా నష్టం.ఈ కారణాలరీత్యా ఆయనపై శాశ్వత నిరోధం విధించటానికి నాకు ఎటువంటి అభ్యంతరంలేదు. యర్రా రామారావు (చర్చ) 07:25, 25 జూన్ 2021 (UTC)
నా ఖాతాపై దొంగదాడి
[మార్చు]ఈ రోజు నాకు ఒక వికీ నోటిఫికేషను వచ్చింది. ఓ కొత్త పరికరం నుండి నా ఖాతా లోకి లాగినయ్యేందుకు 3 విఫల యత్నాలు జరిగాయని చెబుతూ కట్టుదిట్టమైన సంకేత పదాన్ని పెట్టుకొమ్మని ఆ సందేశంలో ఉంది. నేను ఈసరికే నా కంప్యూటరు లోను, నా మొబైల్లోనూ కూడా లాగినై ఉన్నాను. కొత్తగా మరే ఇన్స్ట్రుమెంటు లోనూ లాగినయ్యే ప్రయత్నం నేను చెయ్యలేదు. దీన్నిబట్టి నా ఖాతా లోకి దొంగతనంగా చొరబడడానికి ప్రయత్నం జరిగినట్టు దీని ద్వారా స్పష్టం అవుతోంది. ఎవరు చేసారో నకు తెలియదు.
గత పది రోజులుగా నాపైన దాడి జరుగుతూ ఉన్న సంగతి విదితమే. నేను తప్పుకోవాలని, నేను వికీకి చేస్తున్న పనేమీ లేదనీ, గుండు సున్నా అనీ, వికీని నాశనం చేసాననీ పరిపరి విధాలుగా, నిరాధారంగా దూషించారు. వ్యక్తిగతంగా పలు నిందలు వేసారు. ఏదో రకంగా నన్ను వికీ నుండి తప్పించాలని ప్రయత్నం చేసారు. ఈ నేపథ్యం లోనే ఇది జరిగిందన్నది స్పష్టం. సముదాయం దృష్టికి తెస్తున్నాను. నాకు వచ్చిన నోటిఫికేషను తెరపట్టును కూడా చూపుతున్నాను. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 10:18, 25 జూన్ 2021 (UTC)
- ఇప్పుడు మీపై జరుపుచున్న వ్యక్తిగత దాడులకు, దీనికి సంబంధం ఉన్నట్లుగా అనుమానించవలసి వస్తుంది.దీనిమీద అందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరముంది.ఇది నిదానంగా వెలుగులోకి రాకమానదు.ఈ నీచస్థితికి దిగజారడం దురదృష్ట్టకరం యర్రా రామారావు (చర్చ) 10:29, 25 జూన్ 2021 (UTC)
- నేరుగా చర్చలు చేయలేక దొంగతనంగా ఖాతాలలోకి ప్రవేశించడానికి చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నాను. మీపై వ్యక్తిగత దాడులు చేసేవారే ఇలా చేసి ఉండవచ్చని భావిస్తున్నాను. ఇలాంటి చర్యలకు పాల్పడం దురదృష్టకరం. ➠ కె.వెంకటరమణ⇒చర్చ 15:02, 25 జూన్ 2021 (UTC)
- ఇలాంటి పనులు చేసి వారి ప్రతిష్ఠను వారే దిగజార్చుకుంటున్నారు. ఇవన్నీ ఉద్దేశ్యపూర్వకంగానే జరుగుతున్నాయనిపిస్తోంది. తెవికీలో ఇటువంటివి జరగడం దురదృష్టకరం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 18:12, 25 జూన్ 2021 (UTC)
- నేరుగా చర్చలు చేయలేక దొంగతనంగా ఖాతాలలోకి ప్రవేశించడానికి చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నాను. మీపై వ్యక్తిగత దాడులు చేసేవారే ఇలా చేసి ఉండవచ్చని భావిస్తున్నాను. ఇలాంటి చర్యలకు పాల్పడం దురదృష్టకరం. ➠ కె.వెంకటరమణ⇒చర్చ 15:02, 25 జూన్ 2021 (UTC)
- చదువరి గారూ, ఇదే సంగతి స్టివార్డులకు నివేదించి ఆ ఐపీ ఏ వాడుకరి దగ్గర నుంచి వస్తున్నదో కనుక్కోండి. అది ఎవరో నాకు తెలియక కాదు. సాంకేతికంగా మనకు నిరూపణ అయినట్లుంది. అవసరమైతే వారి పన్న చర్య తీసుకోవచ్చు.- రవిచంద్ర (చర్చ) 23:01, 25 జూన్ 2021 (UTC)
- తెవికీ గురించి పూర్తిగా తెలిసిన వారు ఇలాంటి పనిచేయరు. ఎందుకంటే ఇది సత్ఫలితాన్నివ్వదు. స్టీవార్డులను నివేదిస్తే ఏ ఐపి అడ్రస్ నుంచి లాగిన్ ప్రయత్నాలు జరిగాయో కూడా సునాయాసంగా తెలుస్తుంది. ధైర్యంగా చెప్పేవారు ఇలాంటి పనులు అస్సలు చేయ్రరు. అయినాసరే స్టీవార్డులకు ఫిర్యాదు చేయండి. ఇలాంటి దొందదాడులు ఈ వివాదం ప్రారంభం కాగానే మొదటి నా సభ్యపేజీపై, నా మెయిల్ అడ్రస్ పైనే జరిగింది. ఇదే విషయం మొదటగా సమూహం దృష్టికి తీసుకువచ్చాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 01:08, 26 జూన్ 2021 (UTC)
- చంద్రకాంతరావు గారూ, మీరు కూడా మీ ఖాతాల మీద దాడి జరిగిందని చెబుతున్నారు కాబట్టి, మీరు కూడా ఓ నివేదన పెట్టవచ్చు మీకు ఇష్టమైతేనే. ఎవరో తెలిసిపోతుంది. మీ మనసులో ఏదైనా అపార్థాలు ఉంటే తొలగిపోతాయి. ఇది కేవలం నా సలహా మాత్రమే. నిర్ణయం మీరే తీసుకోవచ్చు.- రవిచంద్ర (చర్చ) 17:01, 26 జూన్ 2021 (UTC)
- తెవికీ గురించి పూర్తిగా తెలిసిన వారు ఇలాంటి పనిచేయరు. ఎందుకంటే ఇది సత్ఫలితాన్నివ్వదు. స్టీవార్డులను నివేదిస్తే ఏ ఐపి అడ్రస్ నుంచి లాగిన్ ప్రయత్నాలు జరిగాయో కూడా సునాయాసంగా తెలుస్తుంది. ధైర్యంగా చెప్పేవారు ఇలాంటి పనులు అస్సలు చేయ్రరు. అయినాసరే స్టీవార్డులకు ఫిర్యాదు చేయండి. ఇలాంటి దొందదాడులు ఈ వివాదం ప్రారంభం కాగానే మొదటి నా సభ్యపేజీపై, నా మెయిల్ అడ్రస్ పైనే జరిగింది. ఇదే విషయం మొదటగా సమూహం దృష్టికి తీసుకువచ్చాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 01:08, 26 జూన్ 2021 (UTC)
- ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన సహ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఆ నోటిఫికేషన్ను చూసిన వెంటనే నా సంకేతపదాన్ని మార్చుకున్నాను. ప్రస్తుతం నా ఖాతా కట్టుదిట్టంగానే ఉంది. టు ఫ్యాక్టర్ ఆథెంటికేషను కూడా పెట్టుకుంటాను (గతంలో దీన్ని ఒకసారి పెట్టుకుని కాస్త ఇబ్బందిగా అనిపించి తీసేసాను. మళ్ళీ పెట్టాలి). రవిచంద్ర గారూ, మీరు అన్నట్టు స్టీవార్డులకు నివేదిస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 03:18, 26 జూన్ 2021 (UTC)