వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అసద్ అలీ ఖాన్
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : వ్యాసం శుద్ధి చేయబడినందున ఉంచెయ్యాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 07:02, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంగ్ల వికీపీడియా పాఠ్యాన్ని గూగుల్ ట్రాన్సులేట్ లో యాంత్రికనువాదం చేసి, ఆ పాఠ్యంతో వ్యాసం ప్రచురించారు. అందువల్ల యాంత్రికనువాద మూస చేర్చితే, వ్యాసాన్ని సరిదిద్దకుండానే మూస (రెండుసార్లు) తొలగించారు. జూన్ 21లోగా వికీకి అనుగుణంగా మార్చకపోతే వ్యాసాన్ని తొలగించాలి.- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 10:45, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- సార్ నేను ఇప్పుడిప్పుడే వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్నాను,నేర్చుకుంటున్నాను.ఇవాళ అసద్ అలీ ఖాన్ అనే వ్యాసాన్ని రాశాను.ఈ వ్యాసాన్ని అందరికీ అర్థం అయ్యేటట్టు రాశాను అని అనుకుంటున్నాను.ఈ వ్యాసం లో పెట్టిన మూసను తెలియకుండానే తొలగించాను.తర్వాత ప్రణయ్ రాజ్ సార్ చెప్పిన తర్వాత వ్యాసాన్ని సవరించాను.తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాను.దయచేసి కొత్తగా నేర్చుకునే వాళ్లకు సలహాలు ఇవ్వగలరని కోరుతున్నాను.తెలుగు భాష అభివృద్ధి కోసం వికీపీడియా లో నా వంతు కృషి చేస్తాను.అయినను వికీపీడియా నిబంధనను ఉల్లంఘించి నట్లయితే ఈ వ్యాసాన్ని తొలగించండి.
ధన్యవాదములు.
- వాడుకరి:KINNERA ARAVIND గారూ, 2019 జూన్ 19-26 మధ్యకాలంలో మీరు 'అనువాద టూల్' ఉపయోగించి 5 (రీతు కరిదళ్, తేజస్వి సూర్య, వి.నానమ్మల్, శ్రీ రామ చంద్ర మిషన్, అనురాధ టికె) వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలు బాగున్నాయని నిన్నే మీ వాడుకరి చర్చాపేజిలో కూడా రాసాను. రాసిన వ్యాసాల్ని చూస్తే 'మీరు తెవికీకి కొత్తవారు కారని' అర్థం అయింది. అంతే కాకుండా 'వికీపీడియా 45 రోజుల ట్రైనింగ్ ను విజయవంతం గా పూర్తిచేశాను' అని మీ వాడుకరి పేజీలో రాసుకున్నారు కూడా.
- రెండేళ్ళ కిందట అనువాద టూల్ ఉపయోగించి 5 వ్యాసాలు రాసిన మీరు 'నిన్న ఆంగ్ల వికీపీడియా పాఠ్యాన్ని గూగుల్ ట్రాన్సులేట్ లో యాంత్రికనువాదం చేసి, ఆ పాఠ్యంతో (మూలాల నెంబర్లతో సహా)' వ్యాసం ప్రచురించారు. రెండవ దిద్దుబాటులో 'మరియు' అనే పదాలు మాత్రమే తీసేసారు. దాన్నిబట్టి చూస్తే 'ఇది తెలియక చేసింది కాదని' అర్థం అవుతోంది. యాంత్రికనువాదం మూస పెట్టి, వికీకి అనుగుణంగా వ్యాసంలో మార్పులు చేయాలని వ్యాసం చర్చాపేజీలో, మీ వాడుకరి చర్చాపేజిలో రాసాను. అప్పుడు మీరు 'మూలాల నెంబర్లను తొలగించి వాటి స్థానంలో మూలాల లింకులు' మాత్రమే చేర్చి, వ్యాసంలో 'యాంత్రికనువాదం మూస'ను తొలగించారు.
- 'వికీకి అనుగుణంగా వ్యాసాన్ని మార్చకుండా యాంత్రికనువాద మూస తొలగించవద్దని, వ్యాసంలో మార్పులు చేసి, ఆ విషయాన్ని అక్కడ రాస్తే, ఇతర వికీపీడియన్లు వ్యాసాన్ని పరిశీలించి మూసను తొలగిస్తారని' వ్యాసం చర్చాపేజీలో రాశాను. దాంతో ఏవో చిన్నచిన్న మార్పులు చేసి, మళ్ళీ మూసను తొలగించారు. ఇలా చేయడం వల్ల తొలగింపు ప్రతిపాదన చేయవలసి వచ్చింది.
- 'వ్యాసాన్ని అందరికీ అర్థం అయ్యేటట్టు రాశాను అని అనుకుంటున్నాను' అని అంటున్నారు. ఒకసారి వ్యాసాన్ని పరిశీలించండి. వ్యాసం మెదటి లైనులో 'భారతదేశంలో ఉత్తమ జీవన రుద్ర వీణ ఆటగాడిగా ది హిందూ పత్రిక అభివర్ణించింది' అని రాశారు. 'Khan performed in the style dhrupad and was described as the best living rudra veena player in India by The Hindu' అని ఆంగ్ల వికీలో ఉన్న పాఠ్యానికి గూగుల్ ట్రాన్సులేట్ తెలుగు అనువాదం అది. 'rudra veena player' అనే పదాలను రుద్ర వీణ ఆటగాడిగా అని రాశారు. కాని అక్కడ 'రుద్ర వీణ వాయిద్యకారుడిగా' అని మార్చాలి. దాన్ని అలాగే వదిలేసారు. ఇక వ్యాసంలో మరోచోట 'దీనిని భారత అధ్యక్షుడు ప్రతిభా పాటిల్ ప్రదానం చేశారు' అని రాశారు. 'which was awarded by Indian President Pratibha Patil' అని ఆంగ్ల వికీలో ఉన్న పాఠ్యానికి గూగుల్ ట్రాన్సులేట్ తెలుగు అనువాదం అది. 'Indian President Pratibha Patil' అనే పదాలను భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అని రాస్తామేకానీ, భారత అధ్యక్షుడు ప్రతిభా పాటిల్ అని రాయం. చివరికి వ్యాసాన్ని పరిశీలించగా మీరు రాసిన వ్యాసంలోని సమాచారం 90% గూగుల్ ట్రాన్సులేట్ లో యాంత్రికనువాదంను చూపిస్తోంది. ఇక్కడ నాకు అర్థంకాని విషయం ఏంటంటే "2019 జూన్ లో వికీలో చేరిన తొలిరోజుల్లో 'అనువాద టూల్' ఉపయోగించి 5 వ్యాసాలు అనువాదం చేసిన మీరు, రెండేళ్ళ తరువాత వికీపీడియా 45 రోజుల ట్రైనింగ్ ను విజయవంతం గా పూర్తిచేసి కూడా గూగుల్ ట్రాన్సులేట్ లో యాంత్రికనువాదం చేసి యాధాతదంగా ఎలా ప్రచురించారు" అని.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 03:15, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ యాంత్రిక అనువాద వ్యాసంలోని వాక్యాలను సరైన రీతిలో శుద్ధి చేసి, విస్తరించినందున తొలగించవలసిన అవసరం లేదు.➠ కె.వెంకటరమణ⇒చర్చ 07:01, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- 'వ్యాసాన్ని అందరికీ అర్థం అయ్యేటట్టు రాశాను అని అనుకుంటున్నాను' అని అంటున్నారు. ఒకసారి వ్యాసాన్ని పరిశీలించండి. వ్యాసం మెదటి లైనులో 'భారతదేశంలో ఉత్తమ జీవన రుద్ర వీణ ఆటగాడిగా ది హిందూ పత్రిక అభివర్ణించింది' అని రాశారు. 'Khan performed in the style dhrupad and was described as the best living rudra veena player in India by The Hindu' అని ఆంగ్ల వికీలో ఉన్న పాఠ్యానికి గూగుల్ ట్రాన్సులేట్ తెలుగు అనువాదం అది. 'rudra veena player' అనే పదాలను రుద్ర వీణ ఆటగాడిగా అని రాశారు. కాని అక్కడ 'రుద్ర వీణ వాయిద్యకారుడిగా' అని మార్చాలి. దాన్ని అలాగే వదిలేసారు. ఇక వ్యాసంలో మరోచోట 'దీనిని భారత అధ్యక్షుడు ప్రతిభా పాటిల్ ప్రదానం చేశారు' అని రాశారు. 'which was awarded by Indian President Pratibha Patil' అని ఆంగ్ల వికీలో ఉన్న పాఠ్యానికి గూగుల్ ట్రాన్సులేట్ తెలుగు అనువాదం అది. 'Indian President Pratibha Patil' అనే పదాలను భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అని రాస్తామేకానీ, భారత అధ్యక్షుడు ప్రతిభా పాటిల్ అని రాయం. చివరికి వ్యాసాన్ని పరిశీలించగా మీరు రాసిన వ్యాసంలోని సమాచారం 90% గూగుల్ ట్రాన్సులేట్ లో యాంత్రికనువాదంను చూపిస్తోంది. ఇక్కడ నాకు అర్థంకాని విషయం ఏంటంటే "2019 జూన్ లో వికీలో చేరిన తొలిరోజుల్లో 'అనువాద టూల్' ఉపయోగించి 5 వ్యాసాలు అనువాదం చేసిన మీరు, రెండేళ్ళ తరువాత వికీపీడియా 45 రోజుల ట్రైనింగ్ ను విజయవంతం గా పూర్తిచేసి కూడా గూగుల్ ట్రాన్సులేట్ లో యాంత్రికనువాదం చేసి యాధాతదంగా ఎలా ప్రచురించారు" అని.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 03:15, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.