వికీపీడియా:డేటాబేసు జల్లెడ
స్వరూపం
వికీపీడియా గణాంకాలను చూసేందుకు వివిధ వెబ్సైట్లు ఈసరికే ఉన్నాయి. వికీపీడియా లోని గణాంంకాల పేజీల్లో తెలుగు వికీపీడియాకు సంబంధించిన అనేక గణాంకాలను చూడొచ్చు. దాన్ని మించి మరిన్ని గణాంకాలను చూడాలంటే ఎక్స్ టూల్స్, వికీమీడియా గణాంకాలు వంటి సైట్లను చూడవచ్చు. ఇంగ్లీషు వికీపీడియా లోని గణాంకాల పేజీకి వెళ్తే అక్కడ మరిన్ని గణాంకాల పేజీలకు లింకులను చూడవచ్చు. వీటితో కూడా గణాంకాల దాహం తీరకపోతే నేరుగా డేటాబేసులో వెతికి తగు గణాంకాలను వెలికి తీసుకోవచ్చు. అయితే అందుకోసం డేటాబేసు నుండి డేటాను వెలికితీసే sql భాష తెలిసి ఉండాలి. ఆ భాష తెలియని వారి కోసం కొన్ని లింకులను కింద ఇచ్చాం. ఆ లింకులకు వెళ్ళి, డేటాబేసు నుండి మరిన్ని గణాంకాలను వెలికి తీయవచ్చు. ఈ గణాంకాలకు సంబంధించిన ప్రశ్నలను, సందేహాలనూ ఇక్కడి చర్చ పేజీలో రాయండి.
- 2020 లో వివిధ చిట్టాల్లోకి చేరిన మొత్తం చర్యల జాబితా
- 2005 నుండి సంవత్సరం వారీగా, చిట్టాల్లోకి చేరిన వివిధ చర్యల జాబితా
- తొలగించిన మూసలను ఎన్ని పేజీల్లో ట్రాన్స్క్లూడు చేసి ఉన్నాయో చూపించే జాబితా
- సృష్టించిన వాడుకరి వారీగా తొలగించిన పేజీల సంఖ్య -అన్ని పేరుబరుల్లోను
- పదేపదే సృష్టించడం, పదేపదే తొలగించడం జరిగిన పేజీలు (4 సార్లు అంతకు మించి తొలగింపులు జరిగినవి). ఈ జాబితాను అనుసరించి నిర్వాహకులు ఆయా పేజీలను సంరక్షించే చర్యలు తీసుకోవచ్చు.