వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 27
స్వరూపం
- 1838: వందేమాతర గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ జననం (మ.1894). (చిత్రంలో)
- 1880: అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారధిగా ప్రపంచ స్థాయిలో పేరొందిన హెలెన్ కెల్లర్ జననం (మ.1968).
- 1939: ప్రజల నేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. హేతువాది బొజ్జా తారకం జననం (మ.2016).
- 1967: ఇంగ్లాండు లోని ఎన్ఫీల్డ్ నగరంలో మొట్టమొదటి ఎ.టి.ఎం యంత్రాన్ని ప్రవేశపెట్టారు.
- 2008: సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్ మానెక్షా మరణం (జ.1914).
- 1978: సహకార రంగానికి ఎనలేని సేవచేసిన జవ్వాది లక్ష్మయ్యనాయుడు మరణం (జ.1901).
- 1980: తెలుగు రంగస్థల నటి సురభి ప్రభావతి జననం.
- 2009: న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి ఏరాసు అయ్యపురెడ్డి మరణం.