వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 18
స్వరూపం
- 1983 : అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం)
- 1858 : ప్రముఖ మహిళోద్ధారకుడు, భారతరత్న పురస్కార గ్రహీత ధొండొ కేశవ కర్వే జననం (మ.1962).
- 1859 : తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు మరణం (జ. 1814).
- 1880 : ప్రముఖ విమర్శకులు మరియు పండితులు టేకుమళ్ళ అచ్యుతరావు జననం (మ.1947).
- 1923 : అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
- 1930 : భారత స్వాతంత్ర్యోద్యమములో సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు.
- 1951 : వినోబా భావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు.
- 1955 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరణం (జ. 1879). (చిత్రంలో)
- 1958 : వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మాల్కం మార్షల్ జననం (మ.1999).