వికీపీడియా:ఇతర ప్రశ్నలు
స్వరూపం
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు యొక్క భాగము |
ప్రశ్నల పేజీలు... |
చూడండి... |
ఇతర ప్రశ్నావళు లలో దొరకని ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇక్కడ దొరుకుతాయి. వికీపీడియా కు లింకు ఎలా ఇవ్వాలి, వికీపీడియా ఎలా పనిచేస్తుంది వంటివి ఈ ప్రశ్నల్లో కొన్ని.
వికీపీడియా లోగో గురించి చెప్పండి
[మార్చు]- లోగో వివరాలు లోగో వద్ద లభిస్తాయి.
- ఈ లోగో ను ఎంపిక చేసిన పద్ధతి గురించి అంతర్జాతీయ ఎంపిక మరియు విభిన్న లోగోలు చూడండి.
- మరిన్ని వివరాల కొరకు లోగోలూ నినాదాలు మరియు ఇదివరకటి లోగోల కొరకు లోగో చరిత్ర చూడండి.
అభిమాన అంశాల్లోను, షార్ట్ కట్స్ లోను వాడే ఐకన్ ఎక్కడ లభిస్తుంది?
[మార్చు]- ఇదిగో ఇక్కడ: favicon.ico
పేజీలు దిద్దటానికి ఎవర్ని పడితే వాళ్ళని అనుమతించడం మంచిదేనా? ప్రజలపై బురద చల్లడానికి వాడుకోవచ్చు; దాంతో సంస్థకు న్యాయపరమైన చిక్కులు వస్తాయి కదా.
[మార్చు]- ఇప్పటి వరకూ అటువంటి సమస్య రాలేదు, కాబట్టి ప్రస్తుతానికి అది ఊహా జనితమే. వాస్తవానికి చట్టవ్యతిరేకమైనది ఏదైనా చాలా త్వరగా వికీ నుండి తొలగిస్తాము. ఈ చర్చ ను చూడండి.
- చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వికీపీడియా కు చాలా బెదిరింపులు వచ్చాయి, కాని ఒక్కటి కూడా ఆచరణలో జరగలేదు.
వేరే సైటు నుండి వికీపీడియా కు లింకు ఎలా ఇవ్వాలి?
[మార్చు]- బహుళ భాషా వికీపీడియా మొదటి పేజీ URL - http://www.wikipedia.org. పాత URL - http://www.wikipedia.com - ఇంకా పనిచేస్తూంది కాని, దానిని ఓ పక్కన పెట్టాము. తెలుగు వికీపీడియా కు లింకు కావ డానికి URL - http://te.wikipedia.org.
- ప్రస్తుతం అమలులో ఉన్న భాషా సంకేతాలను ఇటీవలి మార్పులు పేజీ లో చూడండి. S అక్షరానికి మాత్రం మినహాయింపు ఉంది; దీన్ని http://simple.wikipedia.org/ కొరకు వాడాము.
లింకుగా వాడటానికి వికీపీడియా బానర్లు గానీ, బొమ్మలు గాని ఉన్నాయా?
[మార్చు]- కొందరు సభ్యులు అవి తయారు చేసారు. వాటి కొరకు బానర్లూ మీటలు పేజీ లో చూడండి. మా లోగో ను కూడా వాడవచ్చు. మీరే వికీపీడియా బొమ్మలు తయారు చేస్తే, (దయచేసి చెయ్యండి!) వాటిని అప్లోడు చేసి బానరు పేజీ నుండి లింకు పెట్టండి.
"రోజుకో వ్యాసం" జాబితా ఎక్కడ ఉంది? దానిలో చేర్పులు చెయ్యవచ్చా?
[మార్చు]- "రోజుకో వ్యాసం" అనేది వికీపీడియా వ్యాసాలను ఈ-మెయిల్ ద్వారా పంపే ఒక విశేషం. దీనిని ఆపేసి, గొప్ప గద్యం ను ప్రవేశపెట్టాము. "రోజుకో వ్యాసం" అనేది ప్రదర్శిత వ్యాసం గా పునర్జన్మ ఎత్తింది.
స్థిరత్వం గురించి బెంగగా ఉంది. ఇక్కడ ఏమి జరుగుతున్నదో అసలేమీ తెలియని కొత్తవాళ్ళు వికీపీడియా ను ముంచెత్తి ఇష్టం వచ్చినట్లు కెలికేస్తే ఎలా?
[మార్చు]- కొత్తవారిని ఆదరించి, వారి రచనలను సరిదిద్ది, వారికి అవసరమైన మార్గదర్శకత్వం చెయ్యడానికి అంకిత భావంతో పనిచేసే ఔత్సాహికులు వికీపీడియా లో ఉన్నారు. మా సాఫ్ట్వేర్, పేజీ కి సంబంధించిన చర్తాన్ని జాగ్రత్త చేస్తుంది కాబట్టి పొరపాటునో, కావాలనో నష్టం కలిగించినా మళ్ళి వెంటనే సరిజేయవచ్చు. వికీపీడియా లో ఎన్నోసార్లు ట్రాఫిక్కు వెల్లువెత్తింది, మేము ఆ ట్రాఫిక్కును సమరధవంతంగా ఎదుర్కొన్నాము.
కొత్త వ్యాసాల కొరకు ఎక్కడ అడగాలి?
[మార్చు]- మూడు చోట్ల అడగవచ్చు:
- సంప్రదింపుల కేంద్రం ఒక గ్రంధాలయం గా పని చేస్తుంది: ఏ విషయం పైనైనా ప్రశ్నలు అడగవచ్చు. అక్కడ మీరు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వదలచు కున్నారా? అయితే మరి ఆలస్యం ఎందుకు?
- అభ్యర్ధించిన వ్యాసాలు పేజీలో ఒక నిర్దిష్టమైన వ్యాసం కావాలని అడగవచ్చు. అభ్యర్ధించిన బొమ్మలు కూడా చూడండి.
- అత్యవసరమైన పేజీల లో వ్యాసం నుండి లింకులు ఉండీ, ఉనికిలో లేని వ్యాసాల జాబితా ఉంటుంది.
ఉన్న సమాచారాన్ని "సమ స్థాయి" వారిచే పరిశీలన జరిపించే పద్ధతి ఏమైనా ఉందా?
[మార్చు]- మనమందరం సమ స్థాయి వారమే, ఒకరి వ్యాసాలను మరొకరు పరిశీలిస్తూనే ఉంటాము.
- ఒక పద్ధతి ప్రకారం సమస్థాయి పరిశీలన చెయ్యడం గానీ, వ్యాసానికి ప్రమాణ పత్రం ఇవ్వడం గాని, చేసే విషయమై కొందరు ఆలోచిస్తున్నారు. అది ఆచరణలోకి రాగానే తెలియజేస్తాము.
వికీపీడియా ను ఎలా బాకప్ చేస్తారు? ఏదన్నా ప్రమాదం జరిగి మొత్తం సమాచారమంతా పోయే అవకాశం ఉందా?
[మార్చు]- వారానికో సారి డాటాబేసును దిగుమతి చేస్తాము, ఒక స్లేవ్ సర్వరులో డాటాబేసు కాపీ నడుస్తూ ఉంటుంది. సైటు కాంఫిగరేషను ఫైల్ల బాకప్ కూడా అపాయంలో ఉపాయాలు లో ఒక భాగం. ఎవరైనా కావాలనుకుంటే, డాటాబేసును దిగుమతి చేసుకుని జాగ్రత్త చేసుకోవచ్చు.
కొన్ని పేజీలు పసుపు రంగులోను కొన్ని తెల్ల గాను ఎందుకు ఉంటాయి?
[మార్చు]- మామూలు విజ్ఞాన సర్వస్వం పేజీలు తెల్లగా ఉంటాయి. క్లాసిక్ తొడుగు లో ఇతర పేజీలు (చర్చ పేజీ లు, సభ్యుని పేజీ లు) వేరే రంగులతో ఉంటాయి. అవి విజ్ఞాన సర్వస్వం పేజీలు కావని గుర్తు.
- వివిధ తొడుగులకు వివిధ రంగులు ఉంటాయి, కాని ప్రస్తుతం ఉన్న తొడుగు లో వివిధ నేం స్పేసు ల మధ్య రంగుల తేడాలు లేవు.
ఒక వ్యాసం లోని మొలక టెంప్లేటును ఎప్పుడు తొలగించవచ్చు?
[మార్చు]- అది మొలక కాదని మీరు ఎప్పుడనుకుంటే, అప్పుడు తొలగించవచ్చు. మరింత సమాచారం కొరకు మొలకను సరిదిద్దండి చూడండి.
మొట్టమొదటి వ్యాసం ఏది?
[మార్చు]మొదటి దిద్దుబాటు Jimbo చేసారు. వికీపీడియా లోని అతి పురాతన వ్యాసం లో నమోదయిన ప్రకారం, UuU అనేది అన్నిటి కంటే పాత వ్యాసం. దానిని Eiffel.demon.co.uk అనే సభ్యుడు 16 January 2001, 21:08 UTC న రాసారు. అది వికీపీడియా ప్రారంభం అయిన రెండో రోజు.