Jump to content

వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/ప్రదీపు

వికీపీడియా నుండి

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (మార్చి 13, 2008) ఆఖరి తేదీ : (మార్చి 20, 2008)
మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లు) - తెలుగు వికీపీడియాతో నాకు గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఇందులో సగం సమయం వ్యాసాలకు పోతే మిగిలిన సమయమంతా నిర్వహణాపరమైన కార్యక్రమంలో పాల్గొనటానికే కేటాయించాను. తెలుగు వికీలో ఇప్పటికే ఉన్న అధికారులకు తోడుగా మరి కొంత మంది ఉంటే సభ్యుల హక్కుల నిర్వహణకు భంగం వాటిల్లకుండా చూసుకోవచ్చు. ఈ క్రమంలో నేను కూడా ఆ భాద్యతలను స్వీకరించడానికి ముందుకొస్తున్నాను. సభ్యులు తమ మద్దతును క్రింద తెలియచేయగలరు. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:19, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఓటింగు ఇంతటితో ముగిసింది. తత్ఫలితంగా ప్రదీపు తెవికీ అధికారలయ్యారు --వైజాసత్య 15:16, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతిచ్చేవారు

[మార్చు]
  1. మూడు సంవత్సరాల నుంచి తన సహకారాన్ని అందిస్తూ తెలుగు వికీ పురోగతికి పాటుపడుతున్న ప్రదీపు గారికి అధికారికి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. వికీ విధివిధానాలు, మెటావికీ. బాటులపై పూర్తి పట్టు ఉన్న ప్రదీపు గారికి అధికారి హోదాకై నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:56, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నిస్సందేహంగా ప్రదీప్ ఈ బాధ్యతను తీసికోవాలి అని నా అభిప్రాయం. సాధారణంగా వ్యాసాలు వ్రాయడంతోబాటు ప్రదీప్ నిర్వహిస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు (1) బాట్ల ద్వారా కొన్ని క్లిష్టమైన పనుల యాంత్రికీకరణ (2) బొమ్మల కాపీ హక్కుల విషయమై ప్రత్యేక శ్రద్ధ (3) వ్యాసాల వర్గీకరణపై దృష్టి. - ఇవన్నీ తెలుగు వికీపీడియా నాణ్యతను పెంచే దిశలో చాలా ముఖ్యమైన పనులు. అధికారి బాధ్యత కోసం ప్రదీప్‌కు నా మద్దతు తెలుపుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:47, 14 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  3. తెవికీని నడిపించుటలో ప్రధాన భూమికను నిర్వహించే ప్రదీప్ అధికారిక బాద్యతలను సక్రమంగా నిర్వహించి, తెవికీ ఉన్నతికి పాటు పడగలడు. ఆయన ఈ పదవికి తప్పక అర్హుడు కావున ఆయన అభ్యర్ధిత్వానికి నా సంపూర్ణ మద్దతు తెలియచేయుచున్నాను.--విశ్వనాధ్. 03:12, 15 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  4. తెవికీలోని సభ్యులలో సాంకేతికం పై బాగా అవగాహన ఉన్నవారిలో ప్రదీప్ గారు ఒకరు. అధికారి భాద్యతకు 100% అర్హులు. రవిచంద్ర(చర్చ) 12:31, 17 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  5. δευ దేవా 19:33, 18 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  6. తెవికీలో విశేష కృషి చేస్తున్న ప్రదీపు గారి అధికారహోదా విజ్ఞప్తికి నా మద్దతు తెలియచేస్తున్నాను.

--t.sujatha 04:17, 19 మార్చి 2008 (UTC)

  1. ప్రదీపు అధికార బాధ్యతలు చక్కగా నిర్వర్తించగలరన్న నమ్మకం నాకుంది. నా మద్దతు కూడా --వైజాసత్య 15:14, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకించేవారు

[మార్చు]

తటస్థులు

[మార్చు]