వింధ్యాశక్తి
వింధ్యాశక్తి | |
---|---|
మొదటి వాకాటక రాజు | |
పరిపాలన | సుమారు 250 – 270 సిఈ |
ఉత్తరాధికారి | మొదటి ప్రవరసేన |
వంశము | మొదటి ప్రవరసేన |
రాజవంశం | వాకాటక రాజవంశం |
వాకాటక సామ్రాజ్యం 250 సిఈ – 500 సిఈ | |
వింధ్యాశక్తి | (250–270) |
మొదటి ప్రవరసేన | (270–330) |
ప్రవరాపుర–నందివర్థన శాఖ | |
మొదటి రుద్రసేన | (330–355) |
మొదటి పృధ్వీసేన | (355–380) |
రెండవ రుద్రసేన | (380–385) |
ప్రభావతిగుప్త (రిజెంట్) | (385–405) |
దివాకరసేన | (385–400) |
దామోదరసేన | (400–440) |
నరేంద్రసేన | (440–460) |
రెండవ పృధ్వీసేన | (460–480) |
వత్సగుల్మ శాఖ | |
సర్వసేన | (330–355) |
వింధ్యసేన | (355–400) |
రెండవ ప్రవరసేన | (400–415) |
తెలియదు | (415–450) |
దేవసేన | (450–475) |
హరిసేన | (475–500) |
వింధ్యాశక్తి (క్రీ.పూ. 250 - సి. 270 సిఈ) వాకాటక సామ్రాజ్యం రాజవంశ స్థాపకుడు. అతని పేరు వింధ్య దేవత పేరు నుండి తీసుకోబడింది. వింధ్యాశక్తి గురించి దాదాపు ఏమీ తెలియదు. వాకాటక రాజవంశం [8] అనేది భారతీయ ఉపఖండంలోని రాచరిక బ్రాహ్మణ రాజవంశం. [1] అజంతా యొక్క గుహ 26 శాసనంలో, అతను వాకాటక యొక్క కుటుంబం, ఒక ద్విజుడుగా పతాక శీర్షిక (బ్యానర్) గా వర్ణించబడింది. ఈ శిలాశాసనంలో అతను గొప్ప శక్తితో పోరాడటం ద్వారా తన అధికారాన్ని జోడించాడు, అతను పెద్ద అశ్వికదళం కలిగి ఉన్నాడు. కానీ ఈ శాసనంలో అతని పేరుకు ముందు రాజసంబంధమైన. టైటిల్ లేదు. పురాణాల ప్రకారం అతను 96 సంవత్సరాలు పాలించాడు. అతను డెక్కన్, మధ్యప్రదేశ్, మాల్వాలలో వివిధ ప్రదేశాలలో ఉంచబడ్డాడు. ఝాన్సీ జిల్లాలోని బగత్ అనే ప్రాంతం వాకాటకులు నివాసంగా కే.పీ. జైస్వాల్ పేర్కొన్నాడు. కానీ వాకటకాస్ యొక్క ఉత్తర నివాసము గురించి సిద్ధాంతమును ఖండించిన తరువాత, అమరావతి వద్ద ఒక స్తంభంలో ఒక శిలాశాసనంపై కనిపించే వాకాటక అనే పేరు యొక్క మొట్టమొదటి ప్రస్తావన సంభవిస్తుంది. ఇది గృహపతి (గృహస్థుడు), అతని ఇద్దరు భార్యలు వాకాటక బహుమతిని నమోదు చేస్తుంది దీనిని వి.వి. మిరాషి ఎత్తి చూపారు. ఈ సంభావ్యతలో ఈ గృహపతి వింధ్యాశక్తికి పూర్వీకుడు. విదిష ప్రాంతమునకు (ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో) వింధ్యాశక్తి ఒక పాలకుడు అని పురాణాల నుండి కనిపిస్తుంది. కానీ ఇది సరైనది కాదు. [2] డాక్టర్ మిరాషి ప్రకారం, సముద్రగుప్తపు అలహాబాద్ స్తంభము యొక్క శాసనం నందు రుద్ర సేనా I తో రుద్ర దేవా గుర్తింపును తిరస్కరించాడు. అతను వాకాటక యొక్క నాణేలు లేవని, ఉత్తరాన వింద్య ప్రాంతాలలో వారి యొక్క శాసనాలు లేవని అతను ఎత్తి చూపాడు. అందువల్ల, వాకాటకులు యొక్క ప్రాంతం దక్షిణం నివాసం సరైనది. ఏదేమైనా, ఈ ప్రదేశాల్లో కొన్నింటిని వారు పాలించినట్లు అన్నది మాత్రం నిజం అనేది మధ్య ప్రదేశ్ శిలాశాసనాలలో అందుబాటులో ఉన్నాయి.
వాకాటక రాజవంశం (సుమారుగా 250 - క్రీస్తుశకం 500 సిఈ)
[మార్చు]- వింధ్యాశక్తి (250-270)
- మొదటి ప్రవరసేన (270-330)
ప్రవరాపుర–నందివర్థన శాఖ
- మొదటి రుద్రసేన (330–355)
- మొదటి పృధ్వీసేన (355–380)
- రెండవ రుద్రసేన (380–385)
- ప్రభావతిగుప్త (రిజెంట్) (385–405)
- దివాకరసేన (385–400)
- దామోదరసేన (400–440)
- నరేంద్రసేన (440–460)
- రెండవ పృధ్వీసేన (460–480)
వత్సగుల్మ శాఖ
- సర్వసేన (330–355)
- వింధ్యసేన (355–400)
- రెండవ ప్రవరసేన (400–415)
- తెలియదు (415–450)
- దేవసేన (450–475)
- హరిసేన (475–500)
మూలాలు
[మార్చు]- ↑ Ghurye, Govind Sadashiv (1966). Indian Costume. Popular Prakashan. p. 43. ISBN 978-8-17154-403-5.
- ↑ Mahajan V.D. (1960, reprint 2007) Ancient India, New Delhi: S.Chand, ISBN 81-219-0887-6, pp.587-8