Jump to content

వాలీ హమ్మండ్

వికీపీడియా నుండి
వాలీ హమ్మండ్
1930లో వాలీ హమ్మండ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వాల్టర్ రెజినాల్డ్ హమ్మండ్
పుట్టిన తేదీ(1903-06-19)1903 జూన్ 19
డోవర్, కెంట్, ఇంగ్లండ్
మరణించిన తేదీ1965 జూలై 1(1965-07-01) (వయసు 62)
క్లూఫ్, నాటాల్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతివాటం మీడియం ఫాస్ట్
పాత్రమిడిల్ ఆర్డర్ బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 227)1927 డిసెంబరు 24 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు1947 మార్చి 25 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1920–1946
1951
గ్లౌసెస్టెర్‌షైర్ కంట్రీ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 85 634
చేసిన పరుగులు 7,249 50,551
బ్యాటింగు సగటు 58.45 56.10
100లు/50లు 22/24 167/185
అత్యధిక స్కోరు 336* 336*
వేసిన బంతులు 7,969 51,573
వికెట్లు 83 732
బౌలింగు సగటు 37.80 30.58
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 22
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 3
అత్యుత్తమ బౌలింగు 5/36 9/23
క్యాచ్‌లు/స్టంపింగులు 110/– 820/3
మూలం: CricketArchive, 2009 జనవరి 8

వాల్టర్ రెజినాల్డ్ హమ్మండ్ (1903 జూన్ 19 - 1965 జులై 1) ఇంగ్లీష్ ఫస్ట్-క్లాస్ క్రికెటర్, 1920 నుండి 1951 కొనసాగిన తన కెరీర్‌లో గ్లౌసెస్టర్‌షైర్ తరపున ఆడాడు. ప్రధానంగా మిడిల్-ఆర్డర్ బ్యాటర్ అయిన ఇతను ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా పనిచేశాడు.[1][2] ప్రొఫెషనల్‌గా కెరీర్ ప్రారంభించి, తరువాత అతను అమెచ్యూర్‌గా మారాడు.[3] విజ్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ ఇతని సంస్మరణలో ఇతన్ని క్రికెట్ చరిత్రలో నలుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేర్కొంది.[4] వ్యాఖ్యాతలు, తోటి క్రీడాకారులు ఇతన్ని 1930లలో అత్యుత్తమ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌గానూ, అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్‌లలో ఒకడని పరిగణించారు.[5] హమ్మండ్ ప్రభావవంతమైన ఫాస్ట్-మీడియం పేస్ బౌలర్. అతనికి బౌలింగ్ పట్ల అయిష్టం లేకపోయివుంటే అతను బంతితో ఇంకా ఎక్కువ సాధించగలిగేవాడని అతని సమకాలీకులు నమ్మేవారు.[6][7]

85 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో, అతను 7249 పరుగులు చేసి, 83 వికెట్లు తీశాడు. హమ్మండ్ నాయకత్వం వహించిన 20 టెస్టుల్లో ఇంగ్లండ్ నాలుగు గెలిచింది, మూడు ఓడిపోయింది, 13 డ్రా చేసుకుంది. అతని కెరీర్ మొత్తంలో సాధించిన పరుగులు 1970లో కోలిన్ కౌడ్రే అధిగమించే వరకు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా అతన్ని నిలిపాయి; 2012 డిసెంబరులో అలిస్టర్ కుక్ అధిగమించే వరకు అతని మొత్తం 22 టెస్ట్ సెంచరీలు ఇంగ్లీష్ జట్టులో రికార్డుగా మిగిలిపోయాయి.[a] 1933లో అతను అజేయంగా 336 పరుగులు సాధించి అత్యధిక వ్యక్తిగత టెస్ట్ ఇన్నింగ్స్‌ రికార్డు సృష్టించాడు. దీన్ని 1938లో లెన్ హట్టన్ అధిగమించాడు. మొత్తం ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతను 50,551 పరుగులు, 167 సెంచరీలు సాధించాడు. అతని పరుగుల రికార్డు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఏడవ అత్యధికం కాగా సెంచరీల రికార్డు మూడవ అత్యధికం.[8]

హమ్మండ్ తన కెరీర్‌ను 1920లో ప్రారంభించినప్పటికీ, గ్లౌసెస్టర్‌షైర్‌కు ఆడేందుకు అతని అర్హత సవాలుకు గురికావడంతో 1923 వరకూ వేచిచూసి ఆ తర్వాత పూర్తికాలం ఆడడం మొదలుపెట్టాడు.[9] అతని సామర్ధ్యానికి వెంటనే గుర్తింపు లభించింది.[10] మూడు పూర్తి సీజన్ల తర్వాత 1925-26లో వెస్టిండీస్‌ పర్యటనలో మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ టూరింగ్ పార్టీలో సభ్యునిగా అతన్ని ఎంపిక చేశారు.[11] కానీ, అతను పర్యటనలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు.[12] 1927లో అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత భారీ స్కోర్ చేయడం ప్రారంభించి, ఇంగ్లండ్ జట్టుకు ఎంపికయ్యాడు.[13] 1928-29లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అతను 905 పరుగులు చేశాడు. అప్పట్లో ఒక టెస్ట్ సీరీస్‌లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఇదే.[14] అతను తన ఆటతీరుతో 1930లలో కౌంటీ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించాడు. టెస్ట్ క్రికెట్లో దశాబ్ది మధ్యలో అతను కొంత ఫామ్ కోల్పోయినప్పటికీ,[15] 1938లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా నియమింపబడ్డాడు.[16] రెండవ ప్రపంచ యుద్ధం పూర్తై క్రికెట్ మళ్ళీ ప్రారంభం అయ్యాకా ఇంగ్లండ్ కెప్టెన్‌గా కొనసాగాడు.[17] కానీ, అతని ఆరోగ్యం క్షీణించడంతో 1946-47లో ఒక విజయవంతం కాని ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[18] అతను 1950ల తొలినాళ్ళలో మరో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో కనిపించాడు.[19]

హమ్మండ్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. అతనికి చాలా వివాహేతర సంబంధాలుండేవన్న పేరుంది.[20] గొడవలు, సమస్యలు, అప్పటికే తను చేసుకోబోయే రెండవ భార్యతో అఫైర్ వంటివాటి మధ్య తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.[21] ఇతర ఆటగాళ్లతో అతనికి అంత మంచి సంబంధాలు లేవు; సహచరులకు, ప్రత్యర్థులకు కూడా అతనితో స్నేహం చేయడం, కలవడం కష్టసాధ్యంగానే ఉండేది.[22][23] అతను వ్యాపార లావాదేవీలలో విజయవంతం కాలేదు. క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత విజయవంతమైన కెరీర్‌ను ఏర్పాటుచేసుకోలేకపోయాడు.[24] హమ్మండ్ వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నంలో 1950లలో దక్షిణాఫ్రికాకు వెళ్లాడు, కానీ ఇది ఫలించలేదు.[25] దీంతో హమ్మండ్ కుటుంబం ఆర్థికం సమస్యల్లో చిక్కుకుంది.[26] నాటాల్ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా కెరీర్ ప్రారంభించిన కొద్దికాలానికే, అతనికి 1960లో భారీ కారు ప్రమాదం జరిగింది.[27][28] అది అతనిని బలహీనపరిచింది. హమ్మండ్ 1965లో గుండెపోటుతో మరణించాడు.[29]

గమనికలు

[మార్చు]
  1. తర్వాతి సంవత్సరాల్లో ఈ రికార్డును అతను కోలిన్ కౌడ్రే, జెఫ్రీ బాయ్‌కాట్, ఇయాన్ బెల్లతో పంచుకున్నాడు. చివరకు కెవిన్ పీటర్సన్ అధిగమించాడు.

మూలాలు

[మార్చు]
  1. Frindall, Bill, ed. (1986). The Wisden Book of Cricket Records. London: MacDonald Queen Anne Press. p. 366. ISBN 0-356-10736-1.
  2. This can be ascertained by perusing the scorecards available at CricketArchive. "Player Oracle WR Hammond". CricketArchive. Retrieved 22 July 2010.
  3. Foot, pp. 232, 235–36.
  4. "Wally Hammond player profile (Wisden obituary)". ESPNCricinfo. Retrieved 24 December 2009.
  5. Foot, p. 131.
  6. Foot, p. 131.
  7. Swanton, p. 112.
  8. "Statistics / Statsguru / WR Hammond / Test matches / Hundreds". ESPNcricinfo. Retrieved 27 March 2019.
  9. Hammond, p. 20.
  10. Howat, p. 23.
  11. Foot, pp. 26–27.
  12. Hammond, pp. 28–29.
  13. "Wally Hammond". Wisden Cricketers' Almanack. John Wisden & Co. 1928. Retrieved 21 December 2009.
  14. "Wally Hammond player profile (Wisden obituary)". ESPNCricinfo. Retrieved 24 December 2009.
  15. Howat, p. 57.
  16. Frindall, Bill, ed. (1986). The Wisden Book of Cricket Records. London: MacDonald Queen Anne Press. p. 366. ISBN 0-356-10736-1.
  17. Foot, pp. 209–10.
  18. Foot, p. 223.
  19. Foot, p. 224.
  20. Foot, pp. 172–85.
  21. Foot, pp. 189–92.
  22. Foot, pp. 7, 50–51.
  23. Gibson, p. 171.
  24. Foot, pp. 230–31.
  25. Howat, p. 129.
  26. Foot, pp. 239–40.
  27. Foot, pp. 241–43.
  28. Foot, pp. 244–45.
  29. Howat, p. 141.

గ్రంథ పట్టిక

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]