వాడుకరి చర్చ:Vu3ktb
|
తెలుగు పతకం
[మార్చు]తెలుగు మెడల్ | ||
విభిన్న అంశాలపై తెవికీ విస్తృతిని, వాసిని పెంచి విజ్ఞానసర్వస్వానికి విశేష కృషిచేస్తున్న శివరామప్రసాదు గారికి తెవికీ సభ్యులందరి తరఫున తెలుగు పతకాన్ని సమర్పించుకుంటున్నాను --వైజాసత్య |
- శివ కృతజ్ఞతలు
సత్య గారూ! నమస్తే. నాకు సభ్యుల తరఫున మీరు ఇచ్చిన 'తెలుగు పతకం' అనందంతో తలమునకలవుతూ వినమ్రంగా స్వీకరించాను. నేను వ్రాసిన, వ్రాస్తున్న వ్యాసాలకు ఇది ఒక ఊహించని ఆదరణ, ఒక అద్భుతమైన ప్రోత్సాహపూర్వమైన ప్రేరణ. ధన్యవాదములు.--SIVA 05:07, 3 నవంబర్ 2008 (UTC) --S I V A 07:47, 4 జనవరి 2009 (UTC)
- కొత్త సందేశాలను పేజీలో క్రింది భాగాన వ్రాయండి. :)
- శివగారూ! అభినందనలు, రెండు తెలుగు మెడల్స్ అందుకున్నందుకు. మీరు మళ్ళీ ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చాక చురుకుగా వ్యాస రచన చేసి మళ్ళీ తెలుగు మెడల్ సాధిస్తారని ఆశిస్తున్నాను. δευ దేవా 10:56, 4 ఏప్రిల్ 2009 (UTC)
కొలరావిపు ప్రశంసాపత్రం
[మార్చు]కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
శివరామకృష్ణ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో కార్టూనిస్టుల వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
వివరణల అవసరం
[మార్చు]వైజా సత్యగారూ నమస్తే. చాలా కాలం తరువాత మళ్ళీ ఇంటినుండి వికీలో వ్రాయగలుగుతున్నాను. నేను వికీలోకి వచ్చిన తరువాత మీరు మరియు కాసుబాబుగారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మీరిచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను అనేక వ్యాసాలు, దిద్దుబాట్లు చెయ్యగలిగాను, చెయ్యటానికి ఉత్సాహం వచ్చింది. కాని, ఈ మధ్య జరిగిన (అతి చిన్న విషయం మీద)జరిగిన సంఘటన(ఎంత కాదని మర్చిపోదామన్నా) చాలా చీకాకు పరుస్తున్నది, మళ్ళీ వ్రాయటానికి మనస్కరించటంలేదు. అందువలన దయచేసి, నాకు కొన్ని వివరణలు ఇవ్వగలరా.
- ఈ వారం బొమ్మగా ఒక బొమ్మను పెట్టటానికి ఎన్ని రోజులు, గంటలు,నిమిషాలు, సెకండ్లు వేచి చూడాలి లేదా వ్యవధి ఉండి తీరాలి. అలాంటి నియమం గనుక ఉంటే ఆ నియమం ఆ పుటలోనే ఎందుకు పొందుపరచలేదు. ఆపైన ఈ పని నిర్వాహకులే చెయ్యనక్కర్లేదు, సభ్యులెవరైనా చొరవగా చెయ్యచ్చు అని ఎందుకు వ్రాశారు.
- వెరొకరి చర్చా పుటలో మరొక సభ్యుడు వ్యాఖ్య వ్రాసేప్పుడు, ఇక్కడే వ్రాయాలని (కిందనే) అని నియమేమన్నా ఉన్నదా? ఉంటే ఆ నియమం ఎక్కడ వ్రాసి ఉన్నది?
- నేను పైన ఉదహరించిన వాటిగురించి లిఖిత నియమాలు లేక పోతే,ఎవరైనా సభ్యుడుగాని, నిర్వాహకుడుగాని లేని నియమాన్ని ఉదహరిస్తే సామాన్య సభ్యుని పరిస్థితి ఏమిటి.
- ఏదైనా విషయం గురించి ఇతర సభ్యులు వ్రాయదలచుకొన్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన చర్చా పుటలో కాకుండా, నేరుగా ఆ సభ్యుని చర్చా పుటలో వ్రాయవచ్చునా లేక నిర్వాహకులకు అటువంటి ప్రత్యేక అధికారాలు ఏమన్న ఉన్నాయా. ఉంటే, వికీ నియమాలలో ఎక్కడ ఉన్నాయి.
- విషయానికి సంబంధించిన చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్య, నాకు సంబంధించిన చర్చా పుటలో వ్రాస్తే, ఆ వ్యాఖ్య నా చర్చా పుటలో నేను అనవసరం అని బావిస్తే ఆ మాటే వ్రాసి నేను తొలగించకూడదా
- చిన్న అభిప్రాయ భేదం వస్తే నిర్వాహకుడైనవారు(ఆ సభ్యునితో ఏమాత్రం చనువు లేని), సభ్యుని వెంటనే "నువ్వు" "నీవు" అని సంభొదించవచ్చునా(మనం వ్యాసాలలో ఎంత గొప్పవారి గురించైనా అతను అని వ్రాయటానికి ఈ విషయం ఒకే గాటన కట్టలేమని నా మనవి), ఒక చిన్న విషయానికి "సభ్యత" వంటి మాటలు వ్రాయవచ్చా.
నేను ఈ వివరణలు అడగటానికి కారణం, భవిష్యత్తులో నేను గాని, ఇతర నాలాంటి సామాన్య సభ్యులెవరైనా గాని, ధాష్టీకానికి, పిడివాదానికి గురికాకుండా ఉండాలని మాత్రమే.
ఈ విషయాలకు మీరు గాని, కాసుబాబుగారుగాని (వారి చర్చా పుటలో కూడ ఈ వ్యాఖ్యని కాపీ చేస్తున్నాను) నాకు వివరించగలరు. ఈ వ్యాఖ్యలు నేను వ్రాయటానికి పురికొల్పిన సంఘటనకు కారణమైన వారు దయచేసి కలుగ చేసుకొనవద్దు--S I V A 03:05, 26 ఏప్రిల్ 2009 (UTC)
- వికీలో చాలా నియమాలు అభివృద్ధి క్రమబద్దీకరించడానికి అభివృద్ధి చెందుతున్న కొద్ది ఏర్పరచుకొన్నవే. మీకో చిన్న ఉదాహరణ ఇస్తాను ఒక ఊళ్లో ఒక కాలిబాట ఉందనుకోండి అందులో ఎవరిష్టం వచ్చినట్టు వస్తూ వెళుతూ ఉంటారు. అప్పుడు ట్రాఫిక్ సిగ్నల్లు, రైట్ అఫ్ వేలు, ఏడమవైపునే నడవటాలు ఇవన్నీ ఉండవు. కానీ ఆ కాలిబాటలో రద్దీ ఎక్కువై అది అభివృద్ధి చెందే కొద్ది కాస్త ఆ విషయం ఆలోచన చేసిన వ్యక్తి వచ్చి బాటలో నడిచేవాళ్లందరూ ఎడమవైపున నడుస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అంటాడు. చాలామంది ఏదో ఒక పద్ధతి బాగానే ఉంది అనుకుని ఆయన చెప్పింది పాటించడం మెదలెడతారు. అదే కాలక్రమంలో మరింత ధృడమై ఒక నియమం అవుతుంది. అలా ఏర్పడే తొలి దశలోనే కొందరు ఎడమ వైపు ఎందుకు నడవాలి కుడివైపున నడిస్తే ఏం పోయింది అని ప్రశించవచ్చు. నష్టమేం లేదు అలాగే నిక్షేపంగా నడవవచ్చు. అలా నియమాలు ఏర్పడే ముందస్తుగా కొంత ఇబ్బంది ఎదురౌతుంది దానికి అనుగుణంగానే కాస్త ఇలా చేస్తే బాగుంటుందేమో ఎవరో ఒకరు ముందుకొచ్చి ప్రతిపాదిస్తారు.
- ఇక అసలు విషయానికొస్తే బొమ్మ చేర్చిన ఎన్ని ఘడియలు, విఘడియలకు అది ఈ వారం బొమ్మగా పెట్టగలమో ఇప్పటివరకు తెలుగు వికీలో నియమమేమి లేదు. ఇక్కడ చిన్న ఇబ్బంది ఎదురైంది కాబట్టి ఇప్పుడే మనం కలిసి ఒక నియమం సృష్టిద్దాం. ఒక బొమ్మను ఈ వారం బొమ్మగా పెట్టే ముందు దాన్ని ఈ వారం బొమ్మ పరిగణన అన్న మూస తగిలించి దిన్నీ మొదటి పేజీలో పెట్టాలనుకుంటున్నాం అని తెలియజేయటం కొన్నాళ్ళుగా నడిస్తున్న సంప్రదాయామే. అది కొత్తేమీ కాదు. అలా చేయటం వలన అది ప్రదర్శించడానికి ఇతర సభ్యులకేమైనా అభ్యంతరాలు కానీ ఇతర చర్చలు కానీ చేయటానికి కొంత సమయం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఈ వారం బొమ్మ పరిగణన మూస అంటించిన తర్వాత కనీసం ఒక నెల రోజులైనా ఆగి దాన్ని మొదటి పేజీలో ప్రదర్శిస్తే బాగుంటుంది. మీరు ప్రదర్శించాలనుకున్న బొమ్మకు ఎవరూ అభ్యంతరపెడతారని కాదు, ఒక పద్ధతి కోసమని అంతే. మీకు ఇతర సూచనలు, ఇతర పద్ధతులు కానీ తొచితే అలాగే చేద్దాం.
- ఎవరైనా ఒక పద్ధతిని ప్రతిపాదిస్తే కాలిబాట విషయంలో జరిగినట్టు మొదట ఆ పద్ధతినే ఎందుకు పాటించాలి అని కొంతమందికి అనిపించవచ్చు. అది సహజం. ఎడమవైపే వెళ్ళాలని ప్రతిపాదించిన వ్యక్తిని అలానే ఎందుకు చేయాలో అడిగి తెలుసుకోవచ్చు. అది నచ్చకపోతే ప్రత్యామ్నాయ పద్ధతిని మీరూ ప్రతిపాదించవచ్చు. నియయాలు చేయటానికి నిర్వాహకులకు ప్రత్యేక అధికారమేమీ లేదు. చాలా మందికి సభ్యులకు ఏది సబబుగా అనిపిస్తే అదే నియమమౌతుంది. ఉదాహరణకు నాతో పాటు కొందరు నిర్వాహకులు, సభ్యులకు తెవికీ వ్యాసాల్లో ఏకవచనమే ఉపయోగిస్తే బాగుంటుందని అనిపించింది. దాన్ని రచ్చబండలో చర్చించాం. ఆ నియమానికి మద్దతుగా కొన్ని విషయాలను సేకరించి నేను ఒక నియమపు పేజీ వ్రాశాను. రాజశేఖర్ గారితో పాటు కొందరు సభ్యులకు ఆ నియమాన్ని పాటించడం సబబుగా అనిపించలేదు. అందుకే ఆయన వ్రాసేవి ఆయన బహువచనంలోనూ, నేను వ్రాసేవి ఏకవచనంలోనూ ఉంటాయి. చివరకు ఏ పద్ధతి ఎక్కువమంది సభ్యులు పాటిస్తే అదే నెగ్గుతుంది. ఇలాంటి పద్ధతుల్లో తేడా ఉన్నా అందరం కలిసి పనిచేయటానికి ఏనాడూ అడ్డురాలేదు. అయితే మీరు ప్రత్యామ్నాయ పద్ధతిని ప్రతిపాదిస్తే దాన్ని గల కారణాలు వివరిస్తే చాలా మంది సభ్యులు ఆ పద్ధతి ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
- క్రిందనే వ్రాయాలని నియమేమీ లేదు. అదో ఆనవాయితీ మాత్రమే. కొత్త సందేశం వచ్చిందనగానే వెతుక్కోకుండా క్రిందనే ఉంటుందనే ఒక సౌకర్యం. ఆంగ్ల వికీలో నియమంగా ఉందో లేదో కానీ మర్యాదపూర్వకంగా పాటిస్తుంటారు. మీరు పైనే ఎందుకు వ్రాయాలో అని వివరించండి అది బాగుందనుకుంటే అలాగే వ్రాద్దాం ( కాలిబాట ఉదాహారణ లాగా కుడో, ఎడమో ఏదో ఒకటి పద్ధతుంటే బాగుంటుంది). చంద్రకాంతరావు ఇప్పటివరకు ఉపయోగంలో ఉన్న పద్ధతి చెప్పారంతే. నిజానికి వికీలో ఖచ్చితంగా అమలుపరచే నియమాలు ఐదే ఉన్నాయి. మిగిలినవి మార్గదర్శకాలు మాత్రమే.
- ఒక వ్యాసం గురించి చర్చను సాధారణంగా ఆ వ్యాసం చర్చా పేజీలోనూ, వెంటనే దానికి సంబంధించిన సభ్యులు కూడా చూడాలనుకుంటే ఆ సభ్యుల చర్చా పేజీల్లోనూ వ్రాస్తారు. ఇది కూడా ఒక పద్ధతి మాత్రమే.
- చర్చా పేజీలలో విషయం ఆ సభ్యుని చెందుతుందా, వికీకి చెందుతుందా అన్ని విషయం ఆంగ్ల వికీలో సుదీర్ఘమైన తాత్విక చింతన జరిగింది. దాని పర్యవసానంగా సభ్యుల చర్చాపేజీలను వారు తొలగించమని అడిగినా పూర్తిగా తొలగించకూడదని నిర్ణయం తీసుకున్నారు. తెవికీలో దీని గురించి చర్చించలేదు కానీ, చర్చా పేజీలను తొలగించడం అంతమంచి పద్ధతి కాదు. దానికి అనేక హేతువులున్నాయి. అవి తర్వాత వ్రాస్తాను. మీరు పైన వ్రాసిన పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అవలంబిగలరనుకుంటే ఇది మొదటిది కావాలని నా కోరిక.
- నువ్వు, మీరు అన్నదాని గురించి నేను చర్చించలేను. అది మీ దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. రాయలసీమలోనూ, తెలంగాణలోనూ నువ్వు అనటం పెద్ద అగౌరవసూచకంగా భావించరు అని మాత్రం చెప్పగలను. వికీ చాలా ప్రత్యక్ష మాధ్యమం కాబట్టి అవతలి వ్యక్తికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి వదిలెయ్యండి. ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగానో, ఫోన్లోనో అయితే రెండు నిమిషాల్లో అనుకున్నదనుకున్నట్టు వివరంచగలిగి ఉండేవాడిని అయితే ఒక పేజీ మొత్తం టకటకలాడించినా మీకు సరైన అర్ధంలో స్ఫురిస్తుందో లేదో తెలియదు. చంద్రకాంతరావు గారు ఇప్పటిదాకా ఉన్న పద్ధతులను వివరించే ప్రయత్నం చేశారనుకుంటాను. అది ఆ స్పిరిట్ తోనే తీసుకొని వదిలెయ్యండి.
- చివరిమాటగా వికీలో పట్టూ విడుపూ రెండూ ఉంటాయి. అందరూ ఎవరి పద్ధతిని వారు వెళితే ఇది హైదరాబాదు రోడ్డవుతుంది. కానీ మార్గదర్శకాలు చేయటానికి, వాటిని ప్రభావితం చేయటానికి ప్రతి సభ్యునికి అధికారం ఉంది. నిర్వహకులకు ప్రత్యేక అధికారమేమీ లేదు. వికీ పద్ధతులలో అనుభవమున్న వాళ్ళు కొత్తవాళ్లకు మార్గదర్శకం చేస్తూ ఉండటం సాధారణమే దానికి నిర్వాహకుడే కానక్కర్లేదు.
వైజాసత్య 04:25, 26 ఏప్రిల్ 2009 (UTC)
లైట్ తీసుకోండి.
[మార్చు]శివా! విషయాన్ని దాటవేస్తున్నందుకు చిరాకుపడవద్దు. ఇది చాలా స్వల్ప విషయం అని మీరే అన్నారు గదా! మీరు ప్రస్తావించినవి ప్రధానంగా దృక్కోణపు వైవిధ్యాలు అని భావిస్తాను. అవి నిర్వాహక నిర్ణయాలు అనుకోవద్దు. వివాదాన్ని అభిప్రాయ భేదాలుగా పరిగణించి లైట్ తీసుకోండి. తప్పొప్పులు తేల్చడం నిరుపయోగం. మిమ్ములను నొప్పించే వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను. విషయాన్ని పక్క దారి పట్టించడమే నా వుద్దేశం. ఆడుతూ పాడుతూ చేసే పనిలో ఉన్న మజా టెన్షన్‌తో చేస్తే రాదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:43, 26 ఏప్రిల్ 2009 (UTC)
ఫిర్యాదు
[మార్చు]సత్యాగారూ, నమస్తే. కాసుబాబుగారి చర్చాపుటలో ఈ క్రింది ఫిర్యాదు వ్రాశాను. దయచేసి, మీరు ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ లో పాలు పంచుకోమని మనవి.--S I V A 18:11, 29 ఏప్రిల్ 2009 (UTC)
కాసుబాబుగారూ, మీరు వ్రాసిన "లైట్‌గా తీసుకోండి" అన్న వ్యాఖ్య బాగానే ఉన్నది. ఈ మాట మీరు నాలాంటి సామాన్య సభ్యునికి చెపుతున్నారు. కానీ నేను విషయాన్ని మూడవ వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్ళి వివరణలు కోరుతుండగా(ఆ వివరణలో భాగంగా ఆ వివరణలు అడగవలసిన అవసరం కలిగించిన వ్యక్తి దయచేసి కలుగ చేసుకోవద్దని వ్రాసినప్పటికీ), నిర్వాహకుడైన ఈ వ్యక్తి తన సంయమనం కోల్పోయి ఇటువంటి (ఈ క్రింద కాపీ చేశాను)వ్యాఖ్యలు చెయ్యటం భావ్యమేనా. నిర్వాహకుడైన వారికి ఓర్పు, పరిణితి మరియు ముఖ్యంగా సంయమనం ముఖ్యం. వీరి వ్యాఖ్యలలో తెలిసిపోతొంది నన్ను కావాలని "నువ్వు" అని సంభోదించినట్టుగా. చంద్రకాతరావుగారి వ్యాఖ్యల కాపి ఈ కింద ఇవ్వబడినది ఏమిటీ దాష్టీకం, పిడివాదం సభ్యులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చేష్టలు చేయడం ఇంకా మానలేవా? చిన్న విషయానికి అనవసరంగా రెచ్చగొట్టి ఇంతవరకు లాగి, సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేస్తున్న నీ అసలు ఉద్దేశ్యం ఏమిటి? తెవికీ పాలసీలు, నియమాలు, సంప్రదాయాలు గురించి తెలియకుంటే తెలుసుకోవాలి, అంతేకాని తెలిపిన సభ్యుల వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటి? "సామాన్య సభ్యుల దాష్టీకం, పిడివాదం" అంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తున్నావు, తెవికీలో కొత్త సభ్యులకు కూడా ఎన్నో విషయాలు చెప్పాను, వారు సంతోషంగా నా వ్యాఖ్యలను స్వీకరించారే కాని నీలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేరు. నాచే "నువ్వు" అని అనిపించుకున్న సభ్యులలో నీవు రెండో వాడివి. సాధారణంగా నేనెవరికీ వ్యక్తిగతంగా విమర్శించను గౌరవంగానే చూస్తాను. ఇది తెవికీలో అందరికీ తెలుసు, నాకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకొనేది లేదు, ఈ సంగతి కూడా అందరికీ తెలుసు. తెవికీలో ఎవరికి వారు తమకు నచ్చిన పద్దతులు పాటించడం కాదు, అమలులో ఉన్న పద్దతులనే పాటించాల్సి ఉంటుంది. ప్రవేశించిన కొత్త సభ్యులు ఒక్కక్కరు ఒక్కో పద్దతి పాటిస్తే తెవికీ గమ్యం తప్పుతుంది. అనవసరపు ప్రశ్నలు అడిగి చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నావు. అసలు ప్రశ్నలు నా వద్ద ఉన్నాయి. పరిస్థితిని బట్టి మునుముందు వెల్లడిస్తా. -- C.Chandra Kanth Rao-చర్చ 20:47, 26 ఏప్రిల్ 2009 (UTC)
"http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Vu3ktb" నుండి వెలికితీశారు
ఇంతవరకు జరిగిన సంఘటనలు
- నేను ఒక మంచి బొమ్మను(ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన కార్టూన్ పాత్ర సామాన్యవ్యక్తి విగ్రహం) వికీలోకి ఎక్కించి, నలుగురికీ బాగా తెలియాలన్న సంకల్పంతో, వెంటనే ఈ వారపు బొమ్మ మూస తగిలించి, అప్పటికే ఉన్న బొమ్మల వరసలో చివరగా ఉంచాను. నేనేమి ఉన్న వరుస చెదర్చలేదు, ఈ బొమ్మకు ప్రాధాన్యమిచ్చి ఇతర బొమ్మలను వెనుకకు తొయ్యలేదు. ఒక నిర్వాహకుల వారు, ఈ బొమ్మ ఏమిటి? బొమ్మ ప్రాశస్త్యమేమిటి? అన్న విషయాలను అసలు పరిగణలోకి తీసుకోకుండా ఈ వారపు బొమ్మ పుటలో లేని నియమాలను ఉట్టంగిస్తూ బొమ్మ ను ఈ వారపు బొమ్మల వరుసలోనుండి తొలగించారు. ఆపైన ఆ బొమ్మ చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్యను నా చర్చా పుటలో వ్రాశారు. అటువంటి వ్యాఖ్య నా చర్చా పేజీలో ఉండటం అనవసరం అని తోచి, అదే మాట వ్రాసి తొలగించాను.
- దీనికి ఈ నిర్వాహకులవారు మళ్ళీ నా చర్చా పుటలో "ఇది సభ్యత కాదు" అన్న హెడ్డింగు పెట్టి ఎమేమో వ్రాసి తన అక్కస్సును వెళ్ళగక్కారు. ఇంత చిన్న విషయానిమి సభ్యత వంటి మాటలు వ్రాసి ఆవతలి వారిని క్యారెక్టర్ అస్సాసినేషన్ చేయటం భావ్యం కాదని తలచి, నేను ఆ నిర్వాహకుని పుటలో హెడ్‌మాస్టర్ లాగ ప్రవర్తించవద్దని, సభ్యులను నిరుత్సాహపరచవద్దని నా వ్యాఖ్యలు వ్రాశాను. దానికి వారుకూడ తన చర్యలను సమర్ధించుకుంటూ తాను వ్రాయగలిగినది వ్రాశారు. నేనుకూడ సామరస్యపూర్వకంగ స్పందిస్తూ విషయాన్ని ముగించాను.
- ఈలోగా దేవాగారు, ఈ నిర్వాహకులవారి చర్చాపుటలో సహనం పాటించమని వారిని కోరుతూ రెండు వ్యాక్యాలువ్రాస్తే, దానికి వీరు దాదాపు పేజీడు వ్యాఖ్యవ్రాసి అందులో చాలా ఇండైరెక్టుగా వ్యాఖ్యలు చేశారు. ఇది చూసిన నాకు అనిపించింది, అసలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, నియమాలు ఏమిటి తెలుసుకుందామని.
- కాబట్టి మన వికీ రూల్స్ ప్రకారం మూడవ వ్యక్తులను (వైజా సత్య గారిని, కాసుబాబుగారిని)వివరణ కావాలని అడిగాను. ఈ నిర్వాహకుడి తొందరపాటుతనం ఇంతకుముందే తెలుసు కనుక, నేను వివరణలు అడగటానికి పురికొల్పిన సంఘటనలకు కారణమైన వారు దయచేసి కలుగచేసుకొనవద్దు అనికూడ చివరలో వ్రాశాను(వారి పేరును ఎక్కడా కూడ వ్రాయలేదు).
- వైజా సత్యగారు ఎంతో పెద్దమనిషి తరహాలో నాకు కొంత సంయమనపరచటానికి చల్లటి మాటలతో నా చర్చా పేజీలో వ్యాఖ్య వ్రాశారు. కాసుబాబుగారు, లైట్ తీసుకోండి అన్నారు. నేను సత్యా గారు వ్రాసిన పాయింట్లకు నా పక్కనుండి కొన్ని సూచనలు (వారు వారి వ్యాఖ్యలో కోరిన ప్రకారం)వ్రాద్దామనుకున్నాను.
- ఈలోగా, ఈ నిర్వాహకులవారు తన తోటి నిర్వాహకులైన సత్యాగారు, కాసు బాబుగారు వ్రాసిన వ్యాఖ్యలు లెక్క చెయ్యకుండా(వీరి వ్యాఖ్యలకిందే ఈ నిర్వాహకులవారు వ్రాశారు) ఎక్కడలేని తామసాన్ని ప్రదర్శిస్తూ, నన్ను ఏకవచన ప్రయోగం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసారు(పైన కాపీ చేసినవి). ఇప్పటికి కూడ నేను నా సభ్యతను కోల్పోకుండా వారిని గౌరవంగానే సంభోదిస్తున్నాను.
నిర్వాహకుడైనటువంటివారికి తామసం పనికిరాదు. ఓర్పు అవసరం అసహనం పనికిరాదు. విషయం విలువ పట్టించుకోకుండా ఎక్కడా వ్రాతలో కనపడని నియమాలు బోధించటానికి ప్రయత్నించటం,తాను చెప్పినదే వేదమన్నట్టుగా వ్యవహరించటం, దురుసైన భాష, పిడివాదం కాక మరేమవుతుంది. సామాన్య సభ్యులమీద కోప తాపాలు చూపటం, అనుచిత భాష వాడటం, తటాలున (at the drop of a hat, with least provocation)ఆవతలి వ్యక్తిని ఏకవచన ప్రయోగం చెయ్యటం, సభ్యత అంటూ వారి కారెక్టర్ గురించి వ్యాఖ్యలు చెయ్యటం ధాష్టీకం కాక ఏమిటి. వికీ అంటే ఈ నిర్వాహకుల వారు తమ సొంత జాగీర్దారు అనుకుంటున్నారా. మాట్టాడితే నేను గమనిస్తున్నాను, నేను గమనిస్తున్నాను అని వ్యాఖ్యలు. సామాన్య సభ్యులు కూడ గమనిస్తూనే ఉంటారు వారు చేస్తున్న పనులు, చేస్తున్న వ్యాఖ్యలు. వారు వ్రాసిన ప్రతి మాటలోను తాను నిర్వాహకుడినన్న అహంకారం తొణికిసలాడుతూ ఉంటుంది. నేను వికీలో చేరినది మొదలు కాసుబాబు, వైజాసత్య, రాజశేఖర్ గార్లు తదితర నిర్వాహకులు ఎంతో చక్కగా తోటి సభ్యులను ప్రోత్సహిస్తూ, అవసరమైన చోట సున్నితంగా చక్కటి ఆహ్లాదకరమైన భాషలో వారిని సరిచేస్తూ చెప్తూంటారు. వారెక్కడ, ఈ నిర్వాహకులవారెక్కడ
నేను కూడ ఘాటుగా స్పందించగలను, కానీ నేనుకూడ నా సంయమనాన్ని కోల్పోతే సరికాదు అన్న విషయాన్ని తెలిసినవాడినై,ఈ విషయంలో నేను వివరణలుగా కోరిన విషయాలను, మరియు నేను పైన ఉదహరించిన విషయాలను నా ఫిర్యాదుగా తీసుకుని, పైన కాపీ చేయబడిన చంద్రకాతరావుగారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వారి మీద తగిన చర్య తీసుకొనమని కోరుతున్నాను. ఇదే విషయం వైజా సత్యగారి చర్చా పుటలో కూడ వ్రాస్తున్నాను. ఈ dispute resolution ప్రక్రియ జరుగుతుండగా, శ్రీ చంద్రకాంతరావుగారిని ఈ విషయం మీద ఎక్కడా కూడ వ్యాఖ్యలు చెయ్యకుండా (డిస్ప్యూట్ రిజల్యూషన్ లో భాగంగా తప్పితే) కట్టడి చెయ్యమని మనవి, భరించలేకుండా ఉన్నాను వారి అనుచిత వ్యాఖ్యల భాష.
నాకు సాహిత్యం మీద ఉన్న అభిరుచి నన్ను వికేలోకి ఆకర్షించింది. అమరావతి కథలు, చందమామ వ్యాసం విస్తరణ, ఇల్లాలి ముచ్చట్లు, చలం వ్యాసం విస్తరణ, కార్టూనిస్టుల మీద వ్యాస పరంపర వ్రాశాను, ఇప్పటివరకు రెండు పతకాలను సంపాయించుకున్నాను. అటువంటి వికీ లో నేను ఇటువంటి ఫిర్యాదు వ్రాయవలసి రావటం దురదృష్టకరం.--S I V A 17:58, 29 ఏప్రిల్ 2009 (UTC)
కలగజేసుకుంటున్నందుకు క్షమించండి
[మార్చు]శివగారూ! మీరు ఏమీ అనుకోనంటే చిన్న మనవి చేస్తాను. మీకు నా మాటలు నచ్చకపోవచ్చు, కానీ ఒక సాధారణ వికీ సభ్యుడిగా (నేనేమీ నిర్వాహకుడిని కాదు, అయినా చొరవ తీసుకుంటున్నాను), తెలుగు వికీ వీరాభిమానిగా మిమ్మల్ని ఫిర్యాదు వెనక్కి తీసుకోమని కోరుతున్నాను. నేను ఒకే ఒక్క విషయం చెప్పదలచుకున్నాను, ఏకవచనం తెలంగాణాలో సర్వసాధారణం, పెద్దవారిని కూడా నువ్వు అని సంభోదిస్తారు. కొంచెం ఆవేశంలో ఉన్నప్పుడు మాటలు తడబడవచ్చు, కానీ ఉద్దేశ్యం అది కాకపోవచ్చు. ఇది ఒక విన్నపం మాత్రమే! మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. ముందుగా కృతజ్ఞతలతో! δευ దేవా 17:42, 30 ఏప్రిల్ 2009 (UTC)
పునఃస్వాగతం
[మార్చు]శివగారూ! నా విన్నపాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు.δευ దేవా 17:38, 6 మే 2009 (UTC)
- మీరూ, చంద్రకాంత్ గారూ మళ్ళీ ఉత్సాహంగా రచనలు చేస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు జరిగిన విషయం మర్చిపోయి మళ్ళీ మీరిరువురూ సహృద్భావంతో రచనలు చేస్తారని ఆశిస్తున్నాను. δευ దేవా 17:42, 6 మే 2009 (UTC)
శివ నుండి సందేశం
[మార్చు]సత్యాగారూ! నమస్తే. చాలాకాలానికి మళ్ళీ వికీలోకి వచ్చాను. నేను ఇచ్చిన ఫిర్యాదు మీద ఏమాత్రం స్పందించకపోవటం శోచనీయం.మీ సమాధానంకోసరం ఎదురు చూస్తూనే ఉన్నాను. తరువాత ఒకసారి 20 వారంనికి ఈవారం బొమ్మని చూడండి. బొమ్మ అద్భుతంగా ఉన్నది ఆ బొమ్మ ఈ వారం బొమ్మగా పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఫొటో తీసినవారికి, ఈ వారం బొమ్మగా పెట్టినవారికి నా అభినందనలు . కాని, నాకు ఒక సందేహం. వ్రాసి ఉన్న నియమాలు (బొమ్మ ఏదో ఒక వ్యాసంలో ఉండి తీరాలి)కాక వ్రాసిలేని, ఊహాజనిత నియమాలు, నాకు ఉపదేశించటానికి ప్రయత్నించబడిన నియమం(బొమ్మ కొన్నళ్ళు ఊరగాయలాగ ఊరాలి) కూడ ఈ బొమ్మ ఈవాబొ గా పెట్టటంలో పాటించలేదు. నేను ఈ వ్యాఖ్య చేయటంలో ఉద్దేశ్యం ఈ బొమ్మ ఈవాబొ గా పెట్టటం ఎద్దేవా చెయ్యటం ఎంతమాత్రం కాదు. నియమాలు ఉండాలి కాని వాటికి మినహాయింపులుకూడ ఉండాలి,బొమ్మ విలువని బట్టి. నా వాదన 20 వ వారం బొమ్మ తొ సరైనదని తేలుతున్నది.
ఏది ఏమైనా నిర్వాహకుడైన వారు అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం, దురుసుగా ప్రవర్తించటం తగదు (సామాన్య సభ్యులు చెయ్యచ్చు అని కాదు నా అభిప్రాయం). అందుకనే నా ఫిర్యాదు. మీరు తగిన విధంగా స్పందించగలరు, మళ్ళినేను ఉత్సాహంగా వికీలో వ్యాసాలు వ్రాయటానికి ప్రొత్సాహాన్ని అందించగలరు.--S I V A 12:48, 4 జూన్ 2009 (UTC)
- మీ ఫిర్యాదుకు త్వరలోనే స్పందిస్తాను. ఆలస్యానికి క్షమించండి. ఏకబిగిన రెండు పేజీలు వ్రాయటానికి ఉత్సాహము, ఓపిక, సమయం లేకే ఇన్నాళ్ళూ బద్దకించాను. ఈ వారాంతంలోపు వ్రాస్తాను. --వైజాసత్య 13:13, 4 జూన్ 2009 (UTC)
- సత్యాగారూ!క్షమించటం వంటి పెద్ద మాటల అవసరం లేదండీ. మనం ఇక్కడకు వచ్చి వ్రాయటానికి ప్రయత్నించేది మనదగ్గరున్న సమాచారాన్ని నలుగురితో పంచుకోవటానికి కాని, ముక్కూ మొహం తెలియనివారితో మాటలు పడటానికి కాదుకదా. నా ఉద్దేశ్యంలో, నియమాలు ఏమయినా సరే వ్రాతలో నే ఉండాలి, సంప్రదాయం, ఆచారం లాంటివి అనవసర వివాదాలకు అపార్ధాలకు దారి తీస్తాయి. వ్రాసిన నియమాలను అవసరమైన మినహాయింపులు సమయానుకూలంగా చేస్తూ ఉండాలి. మన రాజ్యాంగమే అందుకు మంచి ఉదాహరణ (అనేక సార్లు మార్చబడిన వ్రాసి ఉన్న రాజ్యాంగం).ఈ వివాద పరిష్కారం మీకే ఒదిలిపెడుతున్నాను.--S I V A 12:08, 6 జూన్ 2009 (UTC)
శివ గారి ఫిర్యాదుకు నా సమాధానం
[మార్చు]ఇది చాలా చిన్న విషయం. చిలికి చిలికి గాలివాన చేశారు. ఇందులో ఇరుపక్షాలకూ బాధ్యత ఉంది అని నేను భావిస్తున్నాను. శివ గారు సగటు మనిషి బొమ్మను అప్లోడు చేసి ఉత్సాహంతో దాన్ని ఈ వారం బొమ్మ మూస తొడిగి వరుసలో ఉంచారు. అది హఠాత్తుగా అక్కడ చేరటం సాంప్రదాయనికి విరుద్ధంగా ఉంది అని చంద్రకాంతరావు గారు దాన్ని తొలగించి, అందుకు కారణాన్ని వివరిస్తూ శివ గారి సభ్యుల పేజీలో వ్యాఖ్యను వ్రాశారు. దాన్ని ఈ దిద్దుబాటు లింకులో చూపినట్టు దాన్ని శివగారు అనవసర వ్యాఖ్యగా దిద్దుబాటు మార్పులో వ్రాసి తొలగించారు. అది శివగారు తొలగించాల్సింది కాదు. అది తొలగించినా అనవసర వ్యాఖ్యగా కొట్టివేయాల్సిన అవసరం అసలు లేదు. ఇంతకు ముందు కూడా నేను ఈ విషయంపై ఆయనకు జవాబిస్తూ వ్రాసినట్టూ, మనల్ని విమర్శించడం, మన వ్రాతల్ని విమర్శించడం చాలా భిన్నమైన విషయాలు. ఎదుటి వ్యక్తి మంచిమనసుతోనే ఏదైనా మార్పు చేశాడని భావించడం వికీ మర్యాదల్లో ఒకటి. అది శివగారికి తెలుసో, తెలియకో ఉల్లంఘించారు. కానీ ఆ తర్వాత చంద్రకాంతరావు గారు "ఇది సభ్యత కాదు" అన్న వ్యాఖ్యలో శివగారిని వ్యక్తిగతంగా విమర్శించారు. ఇక్కడ చంద్రకాంతరావు గారు, శివగారికి తనపై కోపం వచ్చి ఆ వ్యాఖ్యను తొలగించారని అన్వయించి ఏకవచన ప్రయోగం ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారు. ఆ తర్వాత మరోచోట ఏకవచన ప్రయోగం అగౌరపూర్వకం కాదని సమర్ధించుకున్నారు. కానీ అదే వ్యాఖ్యలో కావాలనే ఏకవచన ప్రయోగం ఉపయోగించినట్టు ఆయనే ఒప్పుకున్నారు.[1]. ఇక్కడ మళ్లీ లక్షన్నొక్కసారి మనవి చేసుకునేదేవిటంటే వికీ అప్రత్యక్ష మాధ్యమం. అవతలి వారి అంతరంగాన్ని ఇక్కడ చర్చా పేజీల వ్రాతల్లో చాలామటుకు పట్టలేం కాబట్టి వీలైనంత ఎదుటి వారికి బెనిఫిట్ ఆఫ్ డౌటివ్వాలి. చంద్రకాంతరావు గారికి ఈ విషయం తెలుసనే నేను భావిస్తున్నాను. కానీ దీన్ని విస్మరించడం శోచనీయం. దీన్ని ఇంతటితో శివగారు కూడా ఆపలేదు. ఆయనా చంద్రకాంతరావు గారి మీద పిడివాదం, కొత్త సభ్యుల దాష్టీకం అంటూ వ్యక్తిగత దాడికి దిగారు. ఇంతకంటే వివరణాత్మకంగా ఈ విషయంలో వెళ్ళటం అనవసరం అని అనుకుంటాను. శివగారు, ఈ వ్యాఖ్యలోని ఆరవ పాయింటులో అన్నట్టు ఇది చిన్న అభిప్రాయ భేధమే. ఇద్దరిలో ఏ ఒక్కరైనా సంయమనం పాటిస్తే విషయం ఇంతదాకా వచ్చేది కాదు. ఈ ఇద్దరూ తమదైనా శైలిలో తెలుగు వికీ అభివృద్ధికి ఎంతగానో కృషిచేసినవారే. మీ ఇరువురి అవసరం తెవికీకి ఉన్నది. ఇద్దరూ పరస్పరం క్షమాపణలు చెప్పుకొని విబేధాల్ని మరచిపోయి అంతర్జాలంలో తెలుగు పతాకాన్ని మరింత ఎత్తుకు ఎగురవేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనందరం చేరింది ఒక తరతరాలకు నిలిచిపోయే ఒక మహోన్నత కార్యం కోసమని గుర్తుంచుకోవాలి. పెద్దపెద్ద దేశాల్లో చిన్న చిన్న సంగతులు జరుగుతూనే ఉంటాయి లైట్ తీసుకోండి బ్రదర్స్. --వైజాసత్య 05:58, 8 జూన్ 2009 (UTC)
వైజా సత్యగారికి శివ సమాధానం
[మార్చు]సత్యా గారూ, ఇక్కడ జరిగిన ఒక వ్యక్తి చేసిన దురదృష్ట వ్యాఖ్యలవల్ల వికీలో వ్రాయటం మానేశాను. ఇక వ్రాయటమనేది జరుగక పోవఛ్ఛు. చాలా కాలం తరువాత ఇక్కడకు వచ్చాను మీ వ్యాఖ్య ఛూసి ఆశ్ఛర్య పొయాను. ఒక పక్క డిస్ప్యూట్ రిజల్యూషన్ కు నేను విషయాన్ని విన్నవించినప్పుడు ఘనత వహించిన ఆయన గారు చేసిన "ఛెత్త" వ్యాఖ్య చూడగలరు
తాను ఎంతమందిని "నువ్వు" అన్నాడో కూడ లెక్కపెట్టుకునే మనిషిని ఏమనాలి?
నేను ఒకపక్క డిస్ప్యూట్ రిజల్యూషన్ కు విషయాన్ని మీకు విన్నవించి ఉండగా అతగాడు పై విధంగా వ్యాఖ్యలు ఛెయ్యటం ఎంతవరకూ వికీ సాంప్రదాయాల ప్రకారమో మీరే నిర్ణయిఛి అతగాడికి తెలియఛెయ్యండి. నాకు మీరు చేసిన డిస్ప్యూట్ రిజల్యూషన్ నచ్చలేదు. నా ఫిర్యాదు అలాగే ఉన్నది. నా ఫిర్యాదును వాపసు తీసుకోను. ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు ఛేస్తూ చురుకుగా వ్యాసాలు వ్రాసే వారిని నిరుత్సాహపరచటమే అతగాడి ధ్యేయంగా కనపడుతున్నది. తాను తప్ప ఇతరులెవరూ వ్రాయకూడదనేమో. ఇన్ని ఎక్కడా కనపడని నియమాలు ఛెప్పే మనిషి తనపేరుకు అన్ని రంగులు ఎందుకో, దానికేమీ నియమాలు లేవా??
ఈ వారం బొమ్మ పెట్టటంలో ఉన్న నిబంధనలు ఎక్కడ వ్రాసి ఉన్నాయి, ఇన్నాళ్ళ తరువాత మాత్రమే .బొమ్మను ఈ వారపు బొమ్మగా పెట్టాలి అన్న నియమం ఎక్కడ ఉన్నది చూపించండి. అలాంటి లిఖిత నియమం లేకపోతే నేను పెట్టిన బొమ్మను తీసేయటమే కాకుండా నా చర్చా పేజీకి వచ్చి వ్యాఖ్య చేయటం ఎంతవరకు సమంజసం? నేను ఛురుకుగా లేని సభ్యుణ్ణని ఒకకుంటి సాకు! ఒక అరుదైన బొమ్మను ఈ వారపు బొమ్మగా పెట్టి అందరికీ తెలియఛేద్దామన్న నా ఉత్సాహానికి ప్రతిగా ఇంత అల్లరా పైగా అటువంటి అల్లరి ఒక నిర్వాహకుడి వల్లనా?
ఇంతకు ముందు చెప్పినట్టుగా వికీలోకి వచ్చి నేను వ్రాయటం నాకు తెలిసినది చెప్పటానికే కాని ఇతరుల మీద ధాష్టీకం ఛెయ్యటానికి పిడివాదాలు వినిపించటానికి కాదు. అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడటానికి అంతకంటే కాదు. మొదట్లో కాసుబాబుగారి పరిచయం అవ్వటం వల్ల నేను కొన్ని వ్యాసాలు వ్రాయటం జరిగింది. నేను చేసిన కృషికి రెండు పతకాలు కూడ ఇవ్వబడ్డాయి. మొదట్లోనే ఇలాంటి దురుసైన, మర్యాద తెలియని మనిషి ఎదురుపడితే రెండో రోజే తెలుగు వికీకి రావటం మానేసేవాణ్ణి. ఇలాంటి వాడి వల్ల ఇంకెంతమంది ఝడుసుకుని వెళ్ళిపోయారో/వెళ్ళి పోతున్నారో చూసుకోండి.
మీరు నా ఫిర్యాదును సవ్యంగా పరిష్కరింఛినా లేకపోయినా నేను వికిలో మళ్ళి వఛ్ఛి వ్రాయటం అనేది జరుగదు. ఈ దురుసైన వ్యక్తి వల్ల ఇక్కడ వ్రాయటం అంటే అసహ్యం వేసిపోయింది. ఇప్పుడు వచ్చి ఈ మాత్రం వ్రాయటమే నాకు బాగాలేదు. శలవు.
క్షమాపన
[మార్చు]శివరామ ప్రసాదు గారికి, మీకు జరిగిన మనస్తాపానికి క్షమించండి. వికీపీడియా ఏ ఒక్కరిదో కాదు మనందరిదీ. ఒక వ్యక్తి చేసిన పొరపాటుకు మొత్తం సంస్థనే వెలివేయడం సబబనిపించడం లేదు. విజ్ఞత గల మీలాంటి వారు మాకెంతో అవసరం. మన తెలుగువారం గర్వించదగ్గ భాషా సేవ వికీద్వారా జరుగుతున్నది. అందులో మీరందించిన సమాచారం చాలా విలువైనది. కాలం ఇప్పటికీ మీ కోపాన్ని కొంత తగ్గించివుంటుందని, మల్లీ మీరు వికీలో చేరి మాకందరికీ మార్గదర్శకంగా ఉంటారని మనసారా కాంక్షిస్తూ, ప్రార్ధిస్తున్నాను. కొత్త సంవత్సరం పాతకాలంలో జరిగిన చేదు జ్ఞాపకాల్ని మరచి, కొత్త ఆలోచనలతో ముందుకు సాగుదాము.Rajasekhar1961 12:15, 31 డిసెంబర్ 2011 (UTC)
- రాజశేఖర్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. --అర్జున 13:05, 31 డిసెంబర్ 2011 (UTC)
శివ స్పందన
[మార్చు]రాజశేఖర్ గారూ మీ సందేశానికి కృతజ్ఞతలు. అర్జున్ గారూ థాంక్యూ.
వికీ సాంప్రదాయమ్ ప్రకారం ఎవరన్నా ఒక సభ్యుడు సవ్యంగా ప్రవర్తింఛనప్పుడు, ఆ సభ్యుని వల్ల మనస్థాపానికి గురైన ఇతర సభ్యులు ఫిర్యాదు ఛేసుకునే సౌకర్యం ఉన్నదని నేను వ్రాసే రోజుల్లో అనుకున్నాను. కాని అడ్మినిస్ట్ట్రేటర్గా ఛెప్పుకునే ఒక వ్యక్తి తప్పు ఛేస్తే ఫిర్యాదులు తీసుకోరని, తీసుకున్నా వాటిమీద ఛర్య ఉండదని తరువాత బాధా పూర్వకంగా తెలుసుకున్నాను. మర్యాద తెలియని ఎడ్మినిస్ట్రేటర్లు ఉండే ఈ వికీ పీడియాలో వ్రాసి మనస్థాపానికి గురవటం నాకు ఇష్టం లేదు. అందుకనే దూరం గా ఉండి, నా బ్లాగులో నేను వ్రాయదలుఛుకున్నవి వ్రాస్తున్నాను. ఇన్నాళ్ళ తరువాత కూడా ఆ వ్యక్తి ఛేసిన దురుసు ప్రవర్తన తలుఛుకుంటే, మొత్తం వికీ అంటేనే అసహ్యం కలిగింఛాడు. ఎంతమాత్రం మర్యాద అన్న మాటకు అర్ధం తెలియని వ్యక్తికి అతనికి తెలియని విషయాన్ని ఛెప్పలేని అసహయ స్థితిలో ఉన్న వికీ మీద జాలి తప్ప నాకు మరేమీ లేదు.
రాజశేఖర్ గారూ, అర్జున్ గారూ మీరు ఛొరవ తీసుకుని నాకు సందేశం ఇఛ్ఛినందుకు ధన్యవాదాలు.
- మీరు రచించిన వ్యాసాలు మాకెంతో ఉపయోగకరంగా ఉన్నాయి. తెలుగు కార్టూన్లు ఉన్నతంగా ఉండడానికి కారకులైన వారి గురించి చాలా మందికి తెలియవు. మరిన్ని మంచి వ్యాసాలు మీద్వారా తయారవ్వాలని మా అందరి కాంక్ష.
AngajalaARS 04:55, 1 జనవరి 2012 (UTC)
- ధన్యవాదాలు అంగజాల గారూ. కానీ ఇక్కడ వ్రాయటానికి అనువైన వాతావరణం ఉండాలి కదా! నియమాలు అనేవి ఉండాలి. కాని ఎవరి ఇష్టం వఛ్ఛినట్టుగా లేని నియమాలు ఛూపింఛి వ్రాసేవారిని నిరుత్సాహపరిఛే నిర్వాహకులు ఉంటే! ఎవరో ఒకరు హెడ్ మాష్టారు మిగిలిన వాళ్ళు కుర్రాళ్ళు వారి అధుపాజ్ఞలలోనే వ్రాయాలి, లేని నియమాలు నెత్తిన రుద్దే యత్నాలు. ఇలా ఐతే ఏమిటి వ్రాసేది?
మరల స్వాగతం
[మార్చు]తెవికీ అభివృద్ధిలో మీరు త్వరలో పాలుపంచుకోమని కోరుతున్నాను. --అర్జున 13:03, 2 జనవరి 2012 (UTC)
హైదరాబాదులో తెవికీ సమావేశం
[మార్చు]శివరామ ప్రసాదు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:47, 13 మార్చి 2013 (UTC)
శివ సమాధానం
[మార్చు]సుజాత గారూ. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.
ఒక దురుసు మనిషి ప్రవర్తన వల్ల అసహ్యం వేసి నేను వికీలో వ్రాయటం మానుకున్నాను. ఆ దురుసు మనిషి ప్రవర్తన కన్న మిగిలిన అడ్మినిస్ట్రేటర్ల చాతకానితనం ఆ దురుసు మనిషిని పరోక్షంగా వెనకేసుకు రావటం మరింత ఎక్కువ బాధించింది. నేను వికీలో సభ్యుణ్ణి అని నేను అనుకోవటం లేదు. అలా నేను అనుకునే వాతావరణాన్ని వికీ నిర్వాహకులు ఇవ్వలేకపొయ్యారని నేను దిగులుగా పేర్కొంటున్నాను. నేను ఇచ్చిన ఫిర్యాదును సవ్యంగా పరిశీలించి చర్య తీసుకోవాల్సిన వాళ్ళు కంటి నీటి తుడుపుగా తూ తూ మంత్రంగా రెండు వ్యాఖ్యలు వ్రాసి ఊరుకున్నారు. పేరుకి మాత్రమే ఫిర్యాదులు వంటివి తీసుకుని ఏదో అర్ధం పర్ధం లేని మాటలు చెప్పి ఊరుకుంటున్నారు అలా లక్ష్య శుధ్ధి లేని ఫిర్యాదు వ్యవస్థ నిర్వహించటం కంటే అది లేకపోవటమే మంచిది అని నా అభిప్రాయం.
వందమంది మంచి వికీపీడియన్లు చేసే మంచి కన్నా కన్నా, ఒక్క దురుసు మనిషి నిర్వాహకుడైతే ఎంతటి అపకారం చెయ్యగలడో ఆ దురుసు మనిషి నిరూపించాడు కాని ఈ విషయం తెలుగు వికీపీడియా తెలుసుకోలేని అసహాయ స్థితిలో ఉన్నది లేదా అలా ఉన్నట్టు నటిస్తున్నది. అటువంటి పరిస్థితులలో ఈ సమావేశానికి నేను ఎందుకు రావాలో నాకు అర్ధం కావటం లేదు.
Possibly unfree దస్త్రం:10jayadev 158 08.png
[మార్చు]A file that you uploaded or altered, దస్త్రం:10jayadev 158 08.png, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 05:13, 23 అక్టోబర్ 2013 (UTC)
Non-free rationale for దస్త్రం:VISWANATHA BY BAPU.png
[మార్చు]Thanks for uploading or contributing to దస్త్రం:VISWANATHA BY BAPU.png. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.
If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 03:56, 25 అక్టోబర్ 2013 (UTC)
Do not wish to receive any communication fm Wikipedia
[మార్చు]Arjunjee,
THANQ FOR YR MSG.
IN VIEW OF INSENSETIVE ADMINISTRATORS WHO DO NOT HAVE ANY COURAGE TO TAKE ACTION AGAINST A ROGUE ADMINISTRATOR , I DO NOT WISH TO BE ASSOCIATED WITH WIKIPEDIA. I MADE THIS VERY CLEAR ALREADY.
HOWEVWER, UNFORTUNATELY, IAM STILL RECEIVING MESSAGES FROM WIKIPEDIA. MESSAGE FM WIKI ONLY REMINDS ME THE UNRULY BEHAVIOUR OF "that" rogue administrator, AGAINST WHOM THE OTHER ADMINISTRATOR INCAPABLE OF TAKING ACTION DESPITE MY SPECIFIC COMPLAINT. MY COMPLAINT AGAINST THE ROGUE ADMINISTRATOR IS STLL PENDING.
PLEASE DO ME A FAVOU BY ENSURING THAT I DO NOT RECEIVE ANY MESSAGES FROM WIKIPEDIA ANYFURTHER. IAM THAT MUCH FEEL NAUSEATED ABOUT ENTIRE WIKI BECAUSE OF ONE ROGUE ADMINISTRATOR GOING BERSERK WITH ALL ARROGANCE.
Non-free rationale for దస్త్రం:VAPA012.jpg
[మార్చు]Thanks for uploading or contributing to దస్త్రం:VAPA012.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.
If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 07:32, 24 డిసెంబర్ 2013 (UTC)
<br=clearall>
అర్జున్నా గారికి జవాబు
[మార్చు]అర్జున్ గారూ. నేను చాలా రోజుల తరువాత ఇవ్వాళ లాగ్ ఇన్ అయ్యాను. నేను అప్లోడ్ చేసిన ఫోటోలలో ఏదన్నా డౌట్ ఉంటేతీసిపారెయ్యండి. ఇప్పుడు నేను కొత్తగా చేసేది ఏమీ లేదు. నేను ప్రసుతం వికీపీడియన్ అని అనుకోవటం లేదు... 2018-01-08T07:15:47 (Vu3ktb వ్యాఖ్య తేదీ, సమయం చరిత్రనుండి.)
కొలరావిపు ప్రశంసాపత్రం
[మార్చు]కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
శివరామకృష్ణ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో కార్టూనిస్టుల వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
ధన్యవాదాలు సత్య గారూ. నా పేరు సరిగ్గా వ్రాయమని మనవి
R k Laxman image related
[మార్చు]Hi ! I am NehalDaveND From sa.wikipedia.org. I want help fro sir R K Laxman's Image https://te.wikipedia.org/wiki/దస్త్రం:RK_LAKSHMAN_WIKIPEDIA.png. Can I took this image for our wikipedia ? Is this a copyright for that image ? What is the process to took this image ? Please help me... NehalDaveND (చర్చ) 07:18, 27 జనవరి 2015 (UTC)
స్వాగతం
[మార్చు]తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
చలం పుస్తకం
[మార్చు]మీరు ఆమె పెదవులు అన్న పేజీ ని సృష్టించారు. మీరు ఆ పుస్తకం చదివారా? ఆ పుస్తకం మీ దగ్గర వుందా?
2018-03-27T18:17:04(UTC) User:ChillarAnand
కప్పగంతు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసానికి మూలాలు లేవు. అయోమయ నివృత్తి పేజీ చేద్దామన్నా "కప్పగంతు" ఇంటి పేరుతో వ్యక్తులు కూడా వికీలో లేరు. గ్రామాలు లేవు. ఇచ్చిన విషయం కూడా మౌలిక పరిశోధన కలిగినది. సరైన ఆధారాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కప్పగంతు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. K.Venkataramana(talk) 14:44, 29 ఆగస్టు 2020 (UTC) K.Venkataramana(talk) 14:44, 29 ఆగస్టు 2020 (UTC)
నా జవాబు
[మార్చు]కప్పగంతు గ్రామం లేని మాట నిజమే. కానీ, ప్రతి ఇంటిపేరుకు ఒక గ్రామం పేరు ఉండాలి అని ఏమీ లేదు. ఆ వ్యాసం తీసెయ్యటానికి అదొక పెద్ద కారణం కాదు. కప్పగంతు, కప్పగంతుల ఇంటిపేరు గలవాళ్ళు వేలల్లో ఉన్నారు. వికీపీడియాలో ఎవరూ లేరు అనే మాట కరెక్ట్ కాదు. నేను ఉన్నాను కదా! ఆపైన వికీపీడియాలో ఎవ్వరూ లేరు అనే ఒక్క కారణం వ్యాసం తీసెయ్యటానికి ప్రామాణికం ఎలా అవుతుంది?
ఇంటిపేర్ల మీద ఆంధ్ర జ్యొతి వార పత్రికలో వ్యాస పరంపర వచ్చింది. నేను కప్పగంతు మా ఇంటి పేరు కాబట్టి చదివాను. ఇప్పుడు గుర్తు లేదు.
తరువాత, ప్రతి ఇంటి పేరుకూ ప్రామాణికం కావాలి అంటే దొరకటం కష్టం. అలా పట్టుపడితే గట్టిగా 0.5% ఇంటి పేర్లకు కూడా ప్రామాణికాలే కాదు అర్ధాలు కూడా దొరకవు.
సరే, వికీపీడియా చాదస్తానికి అవధులు లేవు. తీసెయ్యాలనుకుంటే తీసేసుకోండి. నేను వికీ పీడియాలో ఇప్పుడు ఏమీ వ్రాయటం లేదు,వ్రాయలనీ అనుకోవటం లేదు. నాకు మైలు వచ్చింది కాబట్టి ఈ స్పందన.
శలవు
పాస్ వర్డ్ మరచిన కారణాన లాగ్ ఇన్ అవ్వలేకపొయ్యాను. పాస్ వర్డ్ మరచాను సౌకర్యంలో నా మైలు వగైరా ఇచ్చాను కానీ, ఇంతవరకూ నాకు రిసెట్ లింకు రాలేదు. కాబట్టి లాగ్ ఇన్ అవకుండానే ఈ వ్యాఖ్య వ్రాయవలసి వచ్చింది.
Sivaramaprasad Kappagantu vu3ktb@gmail.com
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
[మార్చు]@Vu3ktb గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.
- File:Sati_anasuya.jpg
- File:PARVATI_KALYANAM.JPG
- File:Maya_bazar2.jpg
- File:SANTOSHAMLO_UNNA_BHAARYA.jpg
- File:AVM_CARTOONwikipedia_7.gif
- File:Mayabazar5.JPG
- File:KODAVATIGANTI_KUTUMBARAAO.jpg
- File:BABU_books_2.jpg
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
[మార్చు]@Vu3ktb గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)
2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు
[మార్చు]@Vu3ktb గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:59, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
- Not interested. 115.98.112.2 13:20, 16 డిసెంబరు 2023 (UTC)