తెలుగు వికీపీడియా 20 వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. ఈ 20 వార్షికోత్సవం జనవరి 26-28, 2024 న విశాఖపట్నంలో జరగబోతుంది.
తెలుగు వికీపీడియా 20 వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా విశాఖపట్నంలో 2024 జనవరి 26 నుండి 28 వరకు 2024 జరుగు వేడుకలో పాల్గొనుటకు ఉపకారవేతనాలు (స్కాలర్షిప్) పొందుటకు అర్హులైన వారి జాబితా. (తేది:31.12.2023)
ఈ వేడుకలో తెలుగు వికీ ప్రాజెక్టుల్లో ఏదో విధంగా కృషిచేసిన వారికి పాల్గొనే అవకాశం ఉంటుంది. వారిలో కొంతమందికి ఉపకారవేతనం అందజేయడానికి నిర్ణయించాము. ఈ ఉపకారవేతనం కోసం దరఖాస్తు చేయడానికి నిర్దేశించినది.
ఉపకార వేతనం పొందడానికి కొన్ని వివరాలు ప్రాతిపదికగా తీసుకుంటాము. అవి: వికీలో కనీసం గత 6 నెలలుగా క్రియాశీలకంగా ఉన్నవారు, చేరినప్పటి నుంచి ఇప్పటి దాకా 500-1000 మార్పులు చేసిన వారు, వికీలో సభ్యులుగా చేరి, పెద్దగా మార్పులు చేయకపోయినా, దీన్ని గురించి మరింత తెలుసుకుని ఆచరణలో పెడదామనుకుంటున్న వారూ ఇందులో పాల్గొనవచ్చు.
ఈ దరఖాస్తు 10 రోజుల పాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించాలి.