Jump to content

వాడుకరి చర్చ:Mpradeep/పాత చర్చ 6

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

హామ్ రేడియొ వ్యాసంలో బొమ్మ

[మార్చు]

ప్రదీప్ గారూ! నమస్తే. ఆ బొమ్మ ఒక ఇంటర్-నెట్ వెబ్ సైటులోనిది. మీ సూచన అనుసరించి, బొమ్మ ఏ వెబ్ సైటులో ఉన్నదో వివరాలు, బొమ్మ వివరాలలో పొందుపరచాను. దయచేసి ఆ బొమ్మ విషయం ఇంకా ఏమన్నా వివరాలు ఉంచాలా తెలియచేయగలరు--SIVA 17:27, 19 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదీప్ గారూ మీ మెయి ఐడి కావాలి కొన్ని వికీకి సంభందం కాని విషయాలు అడిగేందుకు. నామెయిల్ bkviswanadh@gmail కు పంపగలరు.కృతజ్నతలు.విశ్వనాధ్.


నేను మీరు చెప్పిన ప్రకారం నా అభిప్రాయం వ్రాశాను.--SIVA 04:05, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నాకొక సహాయం చెయ్యగలరా! నా చర్చాపేజీలో పాత చర్చల పేజీ మాయమయ్యింది. నేనే, ఏదో చెయ్యపొయ్యేసరికి అలా అయింది. దయచేసి, నా పాత చర్చల పేజీని పునరుద్దరించగలరా. సారీ ఫర్ ది ట్రబుల్.--SIVA 04
05, 1 మే 2008 (UTC)

బొమ్మ:Vijayanagaram.jpg లైసెన్సు వివరాలు ==

Mpradeepగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Vijayanagaram.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:38, 14 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఫోటోలు ఎగుమతి చేయడానికి కారణం(ఎక్కువని మీ ఉద్దేశం) వంద మాటలకంటే ఒక చిత్రం ఎక్కువ సమాచార

[మార్చు]

నేను ఫోటోకి పేరు మార్చకపోవటానికి కారణం, ఎగుమతి చేసిన ఫోటో దొరికిన సైట్,మూలం లో ఉన్న పేరే ఉండాలేమో అనే ఉద్దేశం.పేరు మారిస్తే అబ్యంతర పెడతారని అనుమానం.నేను ఫోటోలు ఎగుమతి చేయడానికి కారణం(ఎక్కువని మీ ఉద్దేశం) వంద మాటలకంటే ఒక చిత్రం ఎక్కువ సమాచారం ఇస్తుందని.ముందు అర్ధవంతమయిన చిత్రాలు కూర్చి వాటికి మరింత సమాచారం నాతో పాటు మిగతా వారు చేరుస్తారని ఒక ఆలోచన.వ్యాసం అత్యంత వివరంగా,విజ్ఞానంగా ఉండాలనే నాలుగు పేజీలుగా విభజించి వ్రాయటానికి కారణం.ముఖ్యంగా ఇది (ఫోటోషాప్) ఫోటోలు వాటి ఎడిటింగ్ గొడవ కాబట్టి ఫోటోలు ఎక్కువగా ఉంటాయి ప్రదీప్ గారు.ఉదా : ఈ సైట్ ఒక్క సారి చూడండి(http://inpics.net/tutorials/elements5/create2.html) అన్ని ఫోటోలతోనే ఫోటో షాప్ గురించి నేర్పిస్తున్నారు. రాజకీయాలు,సినిమాలు మొదలగు వాటి గురించి ఆయితే ఎంత కావాలంటే అంత వ్రాయవచ్చు.నిజంగా ఫోటోషాప్ గురించి పూర్తి వివరంగా వ్రాస్తే వంద పేజీలకు ఎక్కువ అవుతుంది కావున, మొత్తం సమయం దీని మీద వెచ్చించకుండా త్వరగా ఈ వ్యాసాన్ని ముగించి ఫోటోగ్రఫీ మీదకి వెళ్ళాలని నా ప్రయత్నం. వ్యాసం ఇంకా పూర్తి అవ్వలేదు కావున, పరవాలేదు ఈ వ్యాసం ఇంక చాలు అనుకున్నపుడు చివరిగా అవసరం లేని ఫోటోలు, లింకులు, సమాచారం వుంటే తీసివేయండి.
ఒక మంచి విషయం >>> మీరు చాల త్వరగా ప్రతిస్పందిస్తారు. ఈ సమాధానానికి మీ అభిప్రాయాని తెలుపండి.
PS:ఇక ఇప్పటి నుండి అర్ధవంత మయిన పేర్లు పెడతాను.vasu bojja 08:46, 9 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బాటుతో చిన్న సమస్య

[మార్చు]

ప్రదీప్ గారూ! మీరు మొదటి దశ పనులకు వాడిన బాటును నేను విక్షనరీలోని పదాలను వర్గీకరించడానికి వాడాను. బాటును రన్ చేస్తే ఈ క్రింది బొమ్మలో చూపిన విధంగా ఎర్రర్ వచ్చింది.దీని తగ్గట్లుగానే user-config.py ఫైలులో mylang='te' family='wiktionary' usernames[wiktionary][te]=u'Ravibot' అని మార్చాను. Ravibot అనే ఖాతా సరిగ్గానే పని చేస్తుంది. లాగిన్ అయ్యి చూశాను. విక్షనరీలోని పదాలను రీడ్ చెయ్యగలిగాను. కానీ write లోనే ఏదో సమస్య ఉందనిపిస్తోంది. దస్త్రం:Boterror.JPG

రవిచంద్ర(చర్చ) 11:29, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం సమైక్య కృషి

[మార్చు]

ప్రదీప్ గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు ప్రదీపు గారు. నేను ఇంక్‌స్కేప్ నేర్చుకోవడం ఇప్పుడే మొదలుపెట్టాను. ఒక సమస్య వస్తుంది. "తె" లేఖిని నుండి copy చేసి paste చేస్తే, సరిగా కనపడుటలేదు. అక్షరం, ఎత్వం వేర్వేరుగా కనబడుతున్నాయి. మీకేమైనా తెలుసా? సాయీ(చర్చ) 07:37, 23 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

థాంక్స్ ప్రదీప్ గారూ! నేను కూడా ఇప్పుడిప్పుడే ఇంక్‌స్పేస్ వాడడం మొదలెట్టాను. δευ దేవా 23:42, 23 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బోయింగ్ 747 వ్యాసంలో ఈ మూస ఎందుకో పనిచేయటం లేదు. కొంచం చూస్తారా? సాయీ(చర్చ) 10:06, 24 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎందుకు పనిచేయటం లేదు! పని చేస్తుంది కదా... en,fr మరియూ deల పక్కన నక్షత్రాలు కూడా కనపడుతున్నాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:40, 24 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు మాత్రం కనబడటం లేదు. ఇక్కడ చూడండి. సాయీ(చర్చ) 10:57, 24 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు మొదటగా ఇంగ్లీషు భాష వికీపీడియాలో ఈ నక్షత్రాలు కనపడుతున్నాయేమో చూడండి. అక్కడ మీకు నక్షత్రాలు కనిపిస్తుంటే గనక ఇంకో screenshot తీయగలరా... __మాకినేని ప్రదీపు (+/-మా) 16:33, 24 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంగ్ల వికీలో పనిచేస్తుంది. చూడండి చర్చసాయీరచనలు 02:19, 25 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యేక పేజీల మార్పు

[మార్చు]

ప్రత్యేక:Statisticsలో png బొమ్మ వాడుతున్నారు. దానికి బదులు svg బొమ్మ ఉంది. కాని మార్చు ట్యాబు లేదు. ఏలా మార్చాలి? చర్చసాయీరచనలు 06:21, 25 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యేక పేజీలలో మీడియావికీలో ఉన్న సందేశాలను తీసుకుని చూపిస్తూ ఉంటుంది. ఈ పేజీలలో ఉన్న సమచారాన్ని మార్చాలంటే మీడియావికీ నేంస్పేసులో ఉన్న సంబందిత ప్జీలను మార్చాల్సి ఉంటుంది. బొమ్మను నేను మార్చాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:07, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Can you move all the articles in వర్గం:విశేషవ్యాసాలు to వర్గం:విశేష వ్యాసాలు with the space. using your bot. చర్చసాయీరచనలు 09:59, 26 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎందుకు? __మాకినేని ప్రదీపు (+/-మా) 18:57, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Meta CheckUser

[మార్చు]

నాకు Gopikrishna123 (చర్చదిద్దుబాట్లు) మరియు మౌర్యుడు (చర్చదిద్దుబాట్లు) sockpuppets అని అనుమానం వచ్చి, మెటాలో CheckUser విజ్ఞప్తి చేసాను. ఒక సారి చూడండి. చర్చసాయీరచనలు 12:01, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ సభ్యనామాలు ఇంకొకరు నడుపుతున్న sockpuppets, అయ్యుండొచ్చు అయ్యుండకపోవచ్చు. కానీ ఎవరు నడిపారో తెలుసుకుని ఏం చేస్తారు? సాధారణంగా వికీపీడియా చర్చలలో ఎంతమంది ఫలానా విషయానికి మద్దతిస్తున్నారు అని చూసే బదులు, ఎంతమంది సరయిన కారణాలతో మద్దతిచ్చారు(లేదా ఇవ్వలేదో) చూస్తారు. దాని వలన వోటు ఎవరేవరు లేదా ఎంతమంది వేశారు అనే దానికన్నా, అలా వోటేస్తున్నందుకు వారిచ్చిన కారణాలకు ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సభ్యులు అప్పుడే వచ్చి కొత్తగా సభ్యత్వం తీసేసుకుని చర్చల్లో పాల్గొన్నట్లు అనిపిస్తుంది, కానీ ఎన్నో రోజుల నుండీ అజ్ఞాతంగా వికీతీరును పరిశీలిస్తూ ఉండి ఉండవచ్చు, లేదా వారు వికీలో ప్రవేశానికి సరైన సమయంకోసం ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:21, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేను సాయితో ఇప్పటిదాకా ఉన్న అనుభందాన్ని తెంచుకోలేక అలా విమర్శించవలసి వచ్చింది. అవి కూడా సరైన కారణాలని భావించడం వలన అలా చేశాను. అది తప్పు అని నాకు తెలియదు. దేవా,సాయి లాంటి ఉత్సాహవంతులు దురదృష్టవశాత్తూ జరిగిన ఇలాంటి సంఘటనల వలన తెవికీకి దూరం కారాదని క్షమాపణ కూడా చెప్పాను. తెవికీలో తిరిగి సుహృధ్బావ వాతావరణాన్ని నెలకొల్పడానికి దేనికైనా సిద్ధం. రవిచంద్ర(చర్చ) 09:21, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వివరణ

[మార్చు]

సాయి ముందు జరిపిన చర్చలను బట్టి, కొంచెం దూకుడుగా వ్యవహరిస్తున్నాడని తెలిసి, అతనికి నేను డైరెక్టుగా వ్యతిరేఖత తెలిపితే ఎక్కడ డిజప్పాయింట్ అవుతాడేమో అని ఎక్స్పెక్ట్ చేసి (రంగారావు గారి వ్యతిరేఖత గురించి ఎలా రియాక్ట్ అయ్యాడో అలా!), వేరే సభ్య నామంతో అతను మార్చుకోవలసిన కొన్ని లక్షణాల గురించి సున్నితంగానే తెలియజేశాను.అంతకు మునుపు కూడా అతనితో సామ్యంగానే మాట్లాడాను. వాటిని పాజిటివ్ గా తీసుకోవాల్సింది పోనిచ్చి, నాకు తెలియని ఆంగ్ల నియమాల ప్రకారం, వేరే సభ్యనామంతో ఓటింగ్ చేయడం పెద్ద తప్పిదమంటూ నన్ను దోషిగా చూడడం నాకూ భాధ కలిగించింది. నేనూ సున్నితమైన మనస్థత్వం కలవాడినే (ref:నేను నిర్వాహకుడైన వెంటనే నాకు మా కాలేజీలో ఇంటర్నెట్ కనెక్షన్ తీసేశారు. నిర్వాహకుడయ్యేవరకూ బాగా మార్పులు చేసి మీ అందరి అభిమానాన్ని చూరగొని నిర్వాహకుడనయిన తరువాత మార్పులు చేయలేమోనని భాధ పడి కాసుబాబు గారికి చంద్రకాంత రావు గారికీ ఒక సందేశాన్ని కూడా పంపించాను. వారి చర్చలను కూడా ఒకసారి చూడండి.), ఎవరినీ భాధపెట్టే నాకూ ఉద్దేశ్యం లేదు. ఇలాంటి విషయాల కోసం సరైన కారణం చెప్పి వేసే అనామక ఓట్లను మన పాలసిల్లో చేరిస్తే సంతోషిస్తాను.మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తుంటాను రవిచంద్ర(చర్చ) 12:21, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎందుకని?

[మార్చు]

నేను మీకు నా మనసులో ఉన్నది చెప్పేస్తున్నాను. మీకు నేను చేసే మార్పులు గానీ చర్చలు గానీ తప్పనిపిస్తే నాకు వెంటెనే ఎందుకు చెప్పలేదు? నేను వచ్చి 3 నెలలు అయ్యింది. ఒక్కరు కూడా నేను చేసినది తప్పు అని ఒక్క సారి కూడా చెప్పలేదు. ఎందుకని? చర్చసాయీరచనలు 15:04, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చేసిన వ్యాఖ్య మాత్రం సరైనదంటారా? అనామకుల ఓట్లను పరిగణలోకి తీసుకోవాలంటే అర్థం ఏమొస్తుంది. నాకు అర్థం అయినంతవరకు మీరు సమర్థిస్తున్నారని అనుకున్నాను. (ఏమో నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో మరి). మీరొకవేళ వారి ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా ఉందాం, మరియు ఉన్న 20 మందిలో అనామకులను కనిపెట్టి చేసేదేముంది, అంటే అయిపోయేదేమో! (విషయం ఒక్కటైనా చెప్పే పద్దతి ముఖ్యం. కాదంటారా!!) సభ్యులందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలనేదే నా ఉద్దేశ్యం. ఒకరికి రాజీ ధోరణిని అవలంభిస్తూ మరొకరిపై కటువుగా ప్రవర్తించడం అన్యాయం కాదంటారా? ప్రస్తుతం పట్టుకొని చేయగలిగిందేమీ లేదు (మరి ఈ లొల్లి అంతా ఎందుకని మీరడగవచ్చు). ఇలా చేస్తే గానీ ఇంకోసారి సభ్యులెవరూ ఆ పనికి పూనుకోరనేమో, మరియు ఆ సమస్య తీవ్రత సభ్యులకు తెలుస్తుందేమో!. δευ దేవా 20:50, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
Puppeteers పట్టుకోవటం ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు ఆంగ్లవికీలో ఒక నాలుగు వారాలు ఉండండి మీకే తెలుస్తుంది sock puppets అంటే ఏంటో. చర్చసాయీరచనలు 01:26, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మార్గదర్శకము

[మార్చు]

మార్గదర్శకము లొ డొనేటు అని ఉన్నచోట విరాళము అని మార్చడానికి కుదురుతుందా--బ్లాగేశ్వరుడు 20:10, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సరిచేసాను. ఆ పదాన్ని ఇప్పటికే అనువదించేసారు. కాకపోతే capital బదులుగా small అక్షరం రాయటం వలన వచ్చిన సమస్య అది. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:19, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాలసీలపై అభిప్రాయం

[మార్చు]

ప్రదీప్ గారు, వారం రోజులుగా తెవికీలో చాలా పరిణామాలు జరిగాయి. వాటన్నింటినీ పరిశీలించి నా అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తాను. వ్యక్తిగతంగా కూడా నేను బిజీగా ఉన్నాను. రెండు, మూడు రోజుల్లో పూర్తి అభిప్రాయాలు వెల్లడిస్తాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:23, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

లైసెన్సు వివరాలు

[మార్చు]

బొమ్మ:Nizamabad.jpg లో నేను పెట్టిన FAIR USE RATIONALE చూడండి. ఇది ఓకేనా! అలాగయితే మిగిలిన మండలాల బొమ్మలకు కూడా ఈ నోటీసు పెడదాము. (ఒక మూస ఉంటే మరీ మంచిది). మరో విషయం. ఈ వారం వ్యాసం ఈ మెయిల్ ద్వారా పంపడం నాకు సాధ్యం కావడం లేదు. అంటే దానిమీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. కనుక మీరే ఆ పని చేయవలసింది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:43, 14 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆటోమాటిక్ సభ్యులు

[మార్చు]

ఈ రెండుమూడు రోజుల్లోనూ చాలా మంది క్రొత్త సభ్యులు "Account created automatically" అన్న వ్యాఖ్యతో నమోదు అవుతున్నారు. దీని అర్ధం ఏమిటి? ఇదేమైనా స్పామ్ లాంటిదా? ఏమి చేయాలి? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:44, 27 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నెల్లూరు జిల్లా

[మార్చు]

ప్రదీప్!

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:06, 22 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఖ + ఒ ; క్ష సమస్య

[మార్చు]

ప్రదీపు గారూ నమస్తే, ఖ్+ఒ= ఒత్వముతో ఖ రావలెను, కానీ 'ఓత్వము' తో అనగా దీర్ఘముతో వస్తున్నది. ఉదాహరణకు, ఖోరాన్, ఖోరానా, ఖోరాసాన్ లాంటి పదాలలో "ఒత్వము" బదులు దీర్ఘముతో ("ఓత్వము") తో వస్తున్నది. ఇది కేవలం "ఖ" అక్షరానికే వస్తున్నది. అలాగే క్+ష= క్‌ష్+అ రావాలి, కాని 'క్ష' వస్తున్నది. ఉదాహరణకు, ఆక్షన్ action, రియాక్షన్ reaction, ప్రొడక్షన్ production, ఇంట్రోడక్షన్ introduction లాంటి పదాలు. మొదటి ఉదాహరణలో 'అచ్చు' రెండవ దానిలో 'హల్లు' యొక్క ఉచ్ఛారణ మారిపోతున్నది. దీనికి విరుగుడు ఏమైనా వున్నదా? ఉంటే కాస్త తెలుపగలరు. మిత్రుడు నిసార్ అహ్మద్ 15:08, 24 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఖ+ఒ సమస్యను సరి చేసాను మీ కాషేను ఒక సారి రిఫ్రెష్ చేసుకుని మళ్లీ ఒక సారి ప్రయత్నించండి. ksha కి 'క్ష' కాకుండా క్‌ష్ రాయటం కుదరటం లేదు, అది ఫాంటులో ఉన్న సమస్య అనుకుంటా!! దానిని ఇంకో సారి పరీశీలించాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:00, 25 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కంప్యూటరు → タチコマ robot

[మార్చు]

I own both accounts. This request is to unify all of my bot accounts for SUL. Thanks. -- Cat chi? 10:54, 11 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Done per m:Steward requests/Username changes. —Pathoschild 00:14:02, 06 సెప్టెంబర్ 2008 (UTC)

ధన్యవాదాలు

[మార్చు]

ప్రదీప్ గారూ! మీ అభిమానానికి ధన్యవాదాలు. అప్‌లోడ్ చేయడం ప్రారంభించగానే అభినందించినందుకు ధన్యవాదాలు. బాగా బిజీగా ఉన్నట్టున్నారు, మీరు అసలు కనిపించడం లేదు వికీలో! δευ దేవా 11:54, 15 సెప్టెంబర్ 2008 (UTC)

అవును ఒకేసారి అన్ని వైపులనుండీ బోలెడన్ని పనులు వచ్చేసాయి. మెలగా ఒక్కోదాని పూర్తిచేసి మళ్లీ ఇక్కడ కొంచెం ఎక్కువగా కనపడటానికి ప్రయత్నిస్తాను  :) . __మాకినేని ప్రదీపు (+/-మా) 03:09, 16 సెప్టెంబర్ 2008 (UTC)

ఆంగ్ల వికీ

[మార్చు]

డియర్ ప్రదీపు గారు, ఆంగ్ల వికీ లో నేను వ్రాసిన వ్యాసములు, పాత చర్చలు చదువుతుంటే మీరు (Mlpkr) 'దినేశ్ కన్నంబాడి' వ్యాసాలకు తయారు చేసిన పటాలు, బొమ్మలు, మొదలగు విషయాలు చూశాను (Mlpkr మీరే అని ఇపుడు గ్రహించాను). ఇతను, ఈతని స్నేహితులు సర్వజ్ఞ, గ్నానపితి, అమర్ వగైరా తెలుగు చరిత్రకు, తెలుగుకు సంబంధించిన వ్యాసాలకు ఎనలేని ద్రోహం చేశారు. నన్ను, 'తేజం', 'ఆల్ట్రూయిజం' అను వారిని ముప్పుతిప్పలు పెట్టారు. నన్ను, తేజం ఒకరే అని బ్లాకు చేయించారు (తేజం నేను పనిచేసే సంస్థలో తోటి తెలుగు వాడు). దక్షిణ భారత చరిత్ర అంతా కన్నడిగుల చరిత్ర అని పెక్కు వ్యాసాలు వ్రాశారు. ఆధారాలతో నేను చేసిన ప్రతి మార్పునూ ఏదో ఒక సాకుతో నలుగురూ కలిసి తొలగించేవారు. వీరి వ్యాసాలన్నీ రెండే రెండు పుస్తకాలు, వెబ్ సైట్లు (అవీ కన్నడిగులవి) ఆధారముగా వ్రాయబడ్డాయి. ప్రఖ్యాత ఆంగ్ల చరిత్రకారులను చులకనగా చూస్తారు. వారికి నచ్చకపోతే. అడ్లూరి గారిని పలు అవాకులు చవాకులు పేలారు. వారి 'తెలుగు భాషా చరిత్ర', లిపి పట్టిక వికీలోనుండి తొలగించేదాక నిద్ర పోలేదు. వారి భాషలో అహంకారము, అసహనము, దుర్భాషలు, అసూయ మున్నగు అవలక్షణాలు తొంగిచూసేవి. నేను వారితో చేసిన చర్చలు, వాదములు చూడగలరు. ఈ సందర్భములో ఎంతో మంది తెలుగు వారిని సహాయము అర్ధించాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. కొంతమంది వికీ వారు కూడ ఈ కూటానికి సహకరించేవారు. ముఖ్యముగా విజయనగర చరిత్ర, చాళుక్యులు, తెలుగు లిపి, ఆంధ్ర చరిత్ర వ్యాసాలలో వీరి పరభాషా దురభిమానము తెలుస్తుంది. ఇదంతా ఎందుకు వ్రాశానంటే మీరు అపాత్ర దానము చేశారని చెప్పడానికి. దయ చేసి అపార్ధము చేసుకోకండి. Kumarrao 11:01, 14 అక్టోబర్ 2008 (UTC)

నేను తెలుగు వికీలో అప్పుడెప్పుడో కొన్ని పటాలు తయారు చేసడం వలన, ఈ (Mlpkr), అనే సభ్యుడు కూడా పటాలు తయారు చేస్తుండడం వలనా, అతనూ నేనే ఇద్దరం తెలుగు వాళ్లమే అవటం వలననూ; మీరూ ఈ Mlpkr అనే సభ్యుడిని నేనే అని పొరపడినట్లున్నారు. నేను మొత్తం అన్ని వికీపీడియాలలోనూ Mpradeep అనే సభ్యనామంతోనే ఉంటాను. నాకు ఏ వికీపీడియాలోనూ Mpradeep అనే సభ్యనామం కాకుండా ఇంకో సభ్యనామం లేదు. ఇక ఆంగ్లవికీలో మీకు వచ్చిన సమస్యను అక్కడివారితోనే పరిశ్కరించుకోవాలి (నేను ఆంగ్లవికీలో పెద్దగా చేసింది ఏం లేదు.). అందుకు మీరు అక్కడి సమస్యలను పరిష్కరించే సమూహాన్ని సంప్రదించండి, ఏమయినా ఉపయోగం ఉంటుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 12:06, 17 అక్టోబర్ 2008 (UTC)

స్వాగతం స్క్రిప్టు

[మార్చు]

ప్రదీప్, ఒకసారి స్వాగతం స్క్రిప్టు నడపగలరా? చాలా స్వాగతాలు పెండిగులో ఉన్నట్టున్నాయి --వైజాసత్య 06:40, 11 డిసెంబర్ 2008 (UTC)

ఆ స్క్రిప్టు ఎక్కడో పోయింది! మళ్లీ రాసి నడుపుతాను ఒక సారి. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:18, 11 డిసెంబర్ 2008 (UTC)

ఈ వ్యాసమును నేనే ప్రారంభించితిని. ఆంగ్ల వికీలో గల వ్యాసమును అనువాదము చేయుచుంటిని (http://en.wikipedia.org/wiki/Persecution_of_Hindus#During_Islamic_rule_of_the_Indian_sub-continent). ఈ లోపు వ్యాస సంబంధిత చర్చలపై పది దినములు మారటొరియం విధించబడినది. ఈ సమయము పూర్తి అయిన పిదప వ్యాసమును వ్రాయువాడను. వికీ సభ్యులు కాని కొందరు సంబంధము లేని విషయములు వ్రాసి యున్నారు. వ్యాసమునకు తాళబంధము వేయ ప్రార్ధన.Kumarrao 12:55, 11 డిసెంబర్ 2008 (UTC)

TUSC token 47c2eb1db4f43d94fada2127d3cc8017

[మార్చు]

I am now proud owner of a TUSC account!