వాడుకరి:YVSREDDY/నానార్థాలు
నానార్థాలు అంటే ఒకే పదానికి వేరు వేరు అర్థాలు ఉండటం. ఉదాహరణకు నలుపు అనే పదం నలుపు రంగు, నలపడం అనే అర్థాలను సూచిస్తుంది. అలాగే తెలుపు అనే పదం తెలుపు రంగును, తెలపమనే అర్థాలను సూచిస్తుంది. నానార్థాలు పర్యాయపదాలకు విపర్యయం లాంటివి. నానార్థాలకు, పర్యాయపదాలకు పూర్తి వ్యత్యాసం వుంటుంది. పర్యాయపదాలలో ఒక దానిని సూచించేందుకు అదే అర్థానిచ్చే అనేక పదాలను ఉపయోగించడం జరుగుతుంది. కానీ నానార్థాలలోని ఒకే పదం అనేక అర్థాలను సూచిస్తుంది. తెలుగుభాషలో పదం ఒకటే ఉండి అనేక అర్థాలున్న పదాలు అనేకం ఉన్నాయి. ఈవిధంగా ఒకే పదానికి నానా అర్థాలు అంటే అనేక అర్థాలు ఉంటాయి, కాబట్టి అనేక అర్థాలనిచ్చే ఒకే పదాలను నానార్థాలు అంటారు. కవులు, రచయితలు వారి పద్యములలో, పాటలలో పదములకు నానార్థాలు ఉపయోగించి వారి ఖ్యాతిని ఇనుమడింపచేసుకునేవారు.
- వాడు అనే పదము ఉపయోగించే సందర్భమును బట్టి దాని అర్థము మారును
- కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు - ఈ వాక్యంలో వాడు అనే పదం సర్వనామముగా ఉపయోగించబడింది
- తిరుమల కొండపై పూచిన ప్రతి పువ్వు శ్రీవారి కొరకే వాడు - ఈ వాక్యంలో వాడు అనే పదం క్రియగా ఉపయోగించబడింది
భక్త కన్నప్ప సినిమాలో
[మార్చు]శివశివ శంకర భక్తవ శంకర శంభో హరహర నమో నమో పాటలోని ఒక చరణంలో
మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీసేవకు - అనే వాక్యంలో మారేడు నీవని అనగా మారాజు నీవని, మారేడు దళములు అనగా మారేడు చెట్ల ఆకులు అని అర్థం. ఈ వాక్యంలో మారేడు అను ఒకే పదం ఒక చోట రాజు అర్థాన్ని, మరొక చోట చెట్టు అనే అర్థాన్ని ఇచ్చింది.
కథానాయిక మొల్ల సినిమాలో
[మార్చు]కథానాయిక మొల్ల సినిమాలో తెనాలి రామకృష్ణుడు అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు అను మాటలకు వేరు అర్థములు వచ్చు విధంగా పద్యము చెప్పవలెనని కోరగా మొల్ల ఈ పదములకు వేరు అర్థములు వచ్చునట్లుగా ఒక పద్యం చెప్పేను.
అప్పుడు ఖ్యాతిగన్న మిథిలాఖ్యపురంబును చేరనేగి, నే
నిప్పుడు చేయు వింత నెవరేనియు జీవితకాలమందు తా
మెప్పుడుగాని చూడరని యెంతయు సంతసమార, ధీరుడై
చెప్పుచు రాఘవుండు విరిచెన్ శివకార్ముక మద్భుతంబు గాన్
నానార్థాలలో తెలుగు భాషకు, ఆంగ్ల భాషకు గల తేడాలు
[మార్చు]1. తెలుగులో ఏవిధంగా వ్రాస్తామో అదే విధంగా పలుకుతాము కాని ఆంగ్లంలో రాసినదానికి ఉచ్చారణలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
2. ఆంగ్ల భాషలో పెద్ద అక్షరాలని చిన్న అక్షరాలని వేరు వేరు అక్షరాలు ఉంటాయి. తెలుగు భాషలో పెద్ద అక్షరాలు చిన్న అక్షరాలు అని వేరు వేరుగా ఉండవు.
వికీపీడియాలో నానార్థాలు
[మార్చు]వికీపీడియాలో ఒకే పేరుతో రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నప్పుడు వాటికి అయోమయ నివృత్తి మూసను ఏర్పాటు చేసి అవసరమయిన పేజిని వెంటనే గుర్తించే విధంగా సూచనలను ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు వై.యస్, చుక్క (అయోమయ నివృత్తి)
చుక్క నక్షత్రం - ఇవి రాత్రులందు చీకటిలో ఆకాశంలో మెరుస్తూ కనిపిస్తాయి. పగలు కూడా ఉన్నప్పటికి మామూలు కంటికి కనిపించవు.
చుక్క అమ్మాయి - అందమైన అమ్మాయిని చక్కనైన చుక్క లేక చుక్క లాంటి అమ్మాయి అని వ్యవహరిస్తుంటారు.
చుక్క గుర్తు - ఏదైన ఒక గుర్తు కోసం పెట్టే చుక్కను గుర్తు అంటారు.
చుక్క ఫుల్ స్టాప్ - ఒక వాక్యం పూర్తయిన తరువాత ఉపయోగించే చుక్కను ఫుల్ స్టాప్ అంటారు. ఫుల్ స్టాప్ ను తెలుగులో విరామ బిందువు అంటారు.
చుక్క బొట్టు - అలంకరణలో భాగంగా కుంకుమ లేదా కాటుక వంటి వాటితో పెట్టుకునే చుక్కను బొట్టు అంటారు.
చుక్క మధ్యం - సారాయి, బ్రాంది వంటి మత్తు పానీయాలను చుక్క అంటారు.
చుక్క బిందువు - నీటి బొట్టును లేదా హిమ బిందువులను చుక్క అంటారు.
నానార్థాలు వచ్చే పదాలు మరికొన్ని ఉదాహరణలు ద్వారా తెలుసుకుందాం.
నానార్థాలు వచ్చే పదాల జాబితా
[మార్చు]- అంకిలి - ఆపద, క్షోభ.
- అంగుష్ఠం - బొటనవ్రేలు, అంగుళం.
- అండజయు - పాము, చేప, పక్షి,తొండ, కస్తూరి.
- అంతర్యామి: పరమాత్మ, జీవాత్మ.
- అంబరం = ఆకాశం, వస్త్రము, పాపము, అనుస్వారం
- అక్షము - బండి, ఇరుసు, కన్ను, సర్పం, జూదం, పాచిక
- అక్షరం - వర్ణం, రూపం, నాశనం లేనిది, పరబ్రహ్మం.
- అనలము - అగ్ని, కృత్తిక, నల్లజీడి, మూడు అంకె
- అనిమిషం - చేప, రెప్పపాటులేనిది
- అనృతం - అసత్యం, సేద్యం, వాణిజ్యం
- అరుణం - ఎరుపు, కాంతి, కుష్టు రోగం, బంగారం
- అశని - వజ్రము, పిడుగు
- అశని - వజ్రాయుధం, పిడుగు, మెరుపు.
- ఆదర్శము - అద్దము, నకలు, మాదిరి
- ఆర్యుడు: మంచివాడు, పూజ్యుడు.
- ఆళి: పంక్తి, తేలు, చెలికత్తె
- ఆశ - కోరిక, దిక్కు
- ఆశరుడు: రాక్షసుడు, అగ్ని.
- ఆస్తరణం - ఎఱ్ఱ కంబళి, పరుపు, ఆసనం, ఏనుగు మీద పరిచే ఎఱ్ఱ కంబళి
- ఇనుడు - సూర్యుడు, ప్రభువు, పోషకుడు, భర్త
- ఇల - బుధుని భార్య, ఆవు, మాట, భూమి
- ఇష్టి: కోరిక, యజ్ఞం, కత్తి
- ఈశుడు: రాజు, శివుడు, మన్మథుడు, సంపన్నుడు.
- ఉక్తి: సరస్వతి, మాట
- ఉచితము = తగినది, యుక్తము, పరిచితం, మితము
- ఉదాత్తుడు: గొప్పవాడు, ఇచ్చువాడు.
- ఉద్యోగం: పని, అధికారం,యత్నం.
- ఉపాద్యాయుడు - గురువు, పురోహితుడు
- ఉమ: పార్వతి, కాంతి, పసుపు.
- ఉల్క - నిప్పు కణం, కాగడా
- ఎద - హృదయం, భయం
- కంకణం = నీటిి కొట్టు, స్త్రీలు చేతికి ధరించే ఆభరణం, తోరం
- కంఠీరవం - సింహం, మత్తగజం, పావురం
- కదళీ - అరటి, ఏనుగు అంబారీ మీద టెక్కెం, ఇరవై అంగుళాల పొడవు ఉన్న లేడి
- కదురు = కండె, సన్నని కమ్మ, అతిశయించు
- కరము = చేయి, తొండము, మిక్కిలి, కప్పము
- కరి - నిదర్శనం, ఏనుగు, కోతి
- కల్యాణం - శుభము, బంగారం, పెండ్లి, అక్షయం
- కళ = చదువు, శిల్పం
- కాయం - శరీరం, సమూహం, స్వభావం
- కారు - నలుపు, అడవి, వర్షర్తువు
- కాలం = సమయం, నలుపు, చావు
- కుండలి = పాము, నెమలి, వరుణుడు
- కుడ్యం - గోడ, పూత
- కులం = వంశం, జాతి, ఇల్లు
- కులము - వంశము, ఇల్లు, శరీరము, దేశము, జాతి
- కులాయం = పక్షిగూడు, శరీరం, సాలెగూడు, స్థానం
- కుశ - తాడు, నీరు, దర్భ, ఒక ద్వీపం
- కేతనం - జెండా, ఇల్లు
- కేసరి: సింహం, గుర్రం, ఆంజనేయుని తండ్రి.
- కొమ్ము - ఏనుగు దంతం, శరీరం
- క్రియ = ధాతువు, పని, చికిత్స, చేష్ట, శ్రాద్ధము
- క్షేత్రము - భార్య, భూమి, వరి మడి, శరీరము, పుణ్య స్థలము
- ఖగము - పక్షి, బాణం, సూర్యుడు(గ్రహాలు), గాలి
- గగనము = ఆకాశం, సూన్యం, దుర్లభo
- గడ = స్తంభం, సమూహం, పొడుగటి వెెదురు కొట్టె
- గుడి = దేవాలయం, గుణింతంలో గుడి
- గుణము - దారము, వింటినారి, స్వభావము, విద్య, దయ
- గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, పురోహితుడు
- గ్రహణం = బుద్ధి, నేత్రం, ఆవరించుట
- ఘటం - కుండ, శిఖరం, పాడునూయి
- ఘన రసము = నీళ్లు, కర్పూరము, చిగురు, కషాయం
- ఘోషము = ఉరుము, ఆవులమంద, కంచు
- చరణం = కాలు, పద్యపాదం, తిరుగుట, పాటలో ఉండునది
- చిత్రము = బొమ్మ, మనోహరం, ఆశ్చర్యం, అద్భుత రసం
- జలం - నీరు, ఎఱ్ఱ తామర, ఎఱ్ఱ కలువ
- జిహ్వ - నాలుక, వాక్కు, జ్వాల
- తాత - బ్రహ్మ, తండ్రికి తండ్రి, తల్లికి తండ్రి.
- తార - నక్షత్రం, వాలి భార్య, కంటి పాప, ఓంకారం
- తీర్థం - పుణ్యనది, జలం, ఉపాధ్యాయుడు, మంత్రి
- తుండం - పక్షి ముక్కు, నోరు, ఖండం
- తుఛ్ఛం = చిన్నది, శూన్యం, దుఃఖం
- తుల - త్రాసు, రాశి
- తెలుపు - తెలుపు రంగు, తెలపడం
- దక్షిణ - ఒక దిక్కు, సంభావన
- దర్శనం - చూపు, కన్ను, అద్దం, బుద్ధి, శాస్త్రం
- దళము - గుంపు, ఆకు
- దాహం - దప్పిక, కాలుట
- దాహము - దప్పిక, కాలుట, మంట, పానీయం
- దిక్కు - దిశ, శరణం
- దృష్టి - చూపు, జ్ఞాపకం
- ధనం: విత్తం, ధనిష్ఠానక్షత్రం, ధనియాలు.
- ధర - వెల, భూమి, మెదడు, సంహారము
- ధర్మం - పుణ్యం, న్యాయం, ఆచారం, యజ్ఞం
- ధాత = బ్రహ్మ, రక్షించువాడు, ఒక సూర్యుడు, త్రాగు వాడు
- ధ్వని - శబ్దం, వ్యంగ్యార్థం
- నందనుడు - కొడుకు, సంతోషపట్టేవాడు
- నరుడు - మానవుడు, అర్జునుడు
- నరుడు - మానవుడు, అర్జునుడు
- నలుపు - నలుపు రంగు, నలపడం
- నవ - క్రొత్త, తొమ్మిది
- నిట్టవొడుచు = ఉప్పొంగు, రోమాంచితం, విజృంభించు
- పక్షం - వరుస, రెక్క, 15 రోజులు, వైపు
- పదము - చిహ్నము, పాదము, స్థలము, అడుగు
- పరిఘము - బాణం, గాజు, కుండ, దెబ్బ
- పస = చేవ, సారాంశము, పరిమళము, స్పురణ
- పాకం - పంట, వంట, నారికేళాది కావ్యపాకలు
- పాదం - ఆంపాదం, పద్యపాదం
- పావనం - జలం, గోమయం, రుద్రాక్ష, పవిత్రం
- పుండరీకం - పెద్దపులి, తెల్ల తామర, తెల్ల గొడుగు.
- పుణ్యము - పవిత్రము, ధర్మము, సుకృతము
- పృథ్వి - భూమి, సముద్రతీరము, ఇంగువ చెట్టు, వ్యక్తి పేరు
- ప్రళయం - మృత్యువు, కల్పాంతం, అపాయం
- ఫలం - పండు, సుఖం, ప్రయోజనం
- బంధం - ముడి, కలయిక, కట్టివేత
- బుధుడు - పండితుడు, బుధ గ్రహం, వేల్పు, వృద్ధుడు
- భవం - పుట్టుక, బ్రతుకు, ప్రపంచం.
- మిత్రుడు = సూర్యుడు, స్నేహితుడు
- ముద్ర - గుర్తు, ప్రభావము
- మేషం - మేక, రాశి
- యతి = పద్య విరమం, నియమము, సన్యాసి
- రాజు = ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు, చంద్రుడు
- రాశి - కుప్ప, అందం
- లావు = బలము, సమర్థత, గొప్పతనము
- లెస్స = శ్రేష్టం, యుక్తం
- వంశము = కులము, సమూహం
- వనం = తోట, అడవి, జలం
- వర్షము = సంవత్సరం, వాన, మబ్బు
- వస్రం - కోట, వరిమడి, తీరం
- వాసం - ఇల్లు, వస్త్రం, ఇంటి పైకప్పుకు అడ్డుగా వేసే కర్ర
- విద్య - జ్ఞానం, చదువు
- విధి = బ్రహ్మ, విధం, పని
- వివరం - రంధ్రం, దూషణ
- వీధి - త్రోవ, వాడ, పంక్తి
- వెల్లి = ప్రవాహం, పరంపర
- వేరు - వేర్పాటు, మూలం
- వ్యవసాయం: కృషి, పరిశ్రమ, ప్రయత్నం
- శిఖ - సిగ, కొన, కొమ్ము.
- శ్రీ - సంపద, లక్ష్మి, విషం, సాలెపురుగు
- సమయం - కాలం, శపథం
- సుధ - సున్నం, పాలు, అమృతం.
- సూత్రం - నూలుపోగు, జంధ్యం, ఏర్పాటు
- సౌరభం - సువాసన, కుంకుమపువ్వు, ఎద్దు.
- హరి - విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, సింహం, పాము