లోక్‌తాంత్రిక్ మోర్చా హిమాచల్ ప్రదేశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లోక్‌తాంత్రిక్ మోర్చా హిమాచల్ ప్రదేశ్[1] అనేది హిమాచల్ ప్రదేశ్ లోని రాజకీయ పార్టీ.[2] లోక్‌తాంత్రిక్ మోర్చా హిమాచల్ ప్రదేశ్ 2003లో రాజకీయ పార్టీగా నమోదు చేయబడింది. దీనికి హిమాచల్ వికాస్ కాంగ్రెస్ మాజీ మంత్రి, హిమ్ లోక్తాంత్రిక్ మోర్చా కన్వీనర్ అయిన మొహిందర్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు.

సింగ్ రాష్ట్రంలోని హెచ్‌విసి- భారతీయ జనతా పార్టీ (బిజెపి) క్యాబినెట్‌లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా ఉన్నారు. కానీ 1998 ఎన్నికల తర్వాత, బిజెపి శాసనసభ్యుల బృందం అవినీతి కారణంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. హిమాచల్ వికాస్ కాంగ్రెస్ నాయకుడు సుఖ్ రామ్ వారి డిమాండ్‌కు తలొగ్గవలసి వచ్చింది. సింగ్ హిమాచల్ వికాస్ కాంగ్రెస్ నుండి బహిష్కరించబడ్డాడు. తొలుత సింగ్ లోక్ జనశక్తి పార్టీలో చేరారు. 2003 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతను లోక్‌తాంత్రిక్ మోర్చా హిమాచల్ ప్రదేశ్ ని ఒక రాజకీయ పార్టీగా ప్రారంభించాడు. అసెంబ్లీలో దాని ఏకైక సభ్యునిగా ఎన్నికయ్యాడు. మొత్తంగా లోక్‌తాంత్రిక్ మోర్చా హిమాచల్ ప్రదేశ్ లో 14 మంది అభ్యర్థులు ఉన్నారు, వీరికి కలిపి 66,102 ఓట్లు (రాష్ట్రంలో 2,17% ఓట్లు) వచ్చాయి.[3]

2004 ఎన్నికలలో లోక్‌తాంత్రిక్ మోర్చా హిమాచల్ ప్రదేశ్ పార్టీ బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు మద్దతు ఇచ్చింది. ఎన్నికలకు ముందు బీజేపీలో విలీనంపై చర్చలు జరిగాయి, 2004లో ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 2007 ఎన్నికలలో అతను బిజెపి టిక్కెట్‌తో ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Loktantrik Morcha Himachal Pradesh (LMHP) : Financial Information (Donation & Income-Expenditure)". myneta.info. Retrieved 2021-09-21.
  2. Giffard, Philippe Valentin (2012-06-01). Loktantrik Morcha Himachal Pradesh (in ఇంగ్లీష్). International Book Market Service Limited. ISBN 978-613-6-40628-2.
  3. "Loktantrik Morcha to contest all Himachal seats | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Jun 22, 2002. Retrieved 2021-09-21.