లిటన్ దాస్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | లిటన్ కుమార్ దాస్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | దినాజ్‌పూర్, బంగ్లాదేశ్ | 1994 అక్టోబరు 13|||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Classy Litton,LKD | |||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 7 అం. (1.70 మీ.) | |||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | Right-handed | |||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Right-arm off-spin | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Wicket-keeper-batter | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 77) | 2015 10 June - India తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 14 June - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 117) | 2015 18 June - India తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 6 September - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 16 | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 46) | 2015 5 July - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 31 March - Ireland తో | |||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 16 | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2012–present | North Zone (Bangladesh) | |||||||||||||||||||||||||||||||||||
2012 | Dhaka Gladiators | |||||||||||||||||||||||||||||||||||
2011–present | Rangpur Division | |||||||||||||||||||||||||||||||||||
2016–17, 2022–23 | Comilla Victorians | |||||||||||||||||||||||||||||||||||
2018–19 | Sylhet Sixers | |||||||||||||||||||||||||||||||||||
2019 | Jamaica Tallawahs | |||||||||||||||||||||||||||||||||||
2019–20 | Rajshahi Royals | |||||||||||||||||||||||||||||||||||
2023 | Kolkata Knight Riders | |||||||||||||||||||||||||||||||||||
2023 | Surrey Jaguars | |||||||||||||||||||||||||||||||||||
2023 | Galle Titans | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 4 May 2023 |
లిటన్ కుమార్ దాస్ (జననం 1994 అక్టోబరు 13) బంగ్లాదేశ్ క్రికెటరు, అన్ని ఫార్మాట్లలో బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రస్తుత వైస్ కెప్టెన్. అతను కుడిచేతి వాటం బ్యాటరు వికెట్ కీపరు . [1] అతను 2015 జూన్లో బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (176) చేశాడు. [2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]లిటన్ కుమార్ దాస్ 1994 అక్టోబరు 13న దినాజ్‌పూర్‌లో జన్మించాడు.[3] [4] అతనికి ఇద్దరు సోదరులు. [5] అతను బంగ్లాదేశ్ క్రీడా శిఖా ప్రతిష్టాన్‌లో చదువుకుంటూ, వయో సమూహాల్లో క్రికెట్ ఆడాడు. 2019 జూలై 28న, అతను బంగ్లాదేశ్‌లోని మీర్పూర్‌లో వ్యవసాయవేత్త అయిన తన చిరకాల స్నేహితురాలు దేవశ్రీ బిస్వాస్ సోంచితను వివాహం చేసుకున్నాడు. [4]
2019 ఏప్రిల్లో దాస్, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. [6] [7] తన ప్రపంచ కప్‌లో తన తొలి ఆట వెస్టిండీస్‌పై ఆడి, అజేయంగా 94 పరుగులు చేశాడు. షకీబ్ అల్ హసన్‌తో కలిసి అజేయంగా 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌ను బంగ్లాదేశ్ 7 వికెట్లతో గెలుచుకుంది.[8] [9] [10]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]దాస్ 2015 జూన్ 10న భారత్‌పై టెస్టు రంగప్రవేశం చేశాడు [11] [12] 2015 జూన్ 18న భారతదేశంపైనే వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం కూడా చేశాడు. [13] 2015 జూలై 5న దక్షిణాఫ్రికాపై తన తొలి ట్వంటీ20ఐ ఆడాడు.[14]
2018 జూన్లో బంగ్లాదేశ్, రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు ట్వంటీ20 ఇంటర్నేషనల్‌ల కోసం వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్‌లలో పర్యటించింది. [15] [16] మొదటి టెస్ట్‌లో బంగ్లాదేశ్, టెస్టుల్లో తమ అత్యల్ప జట్టు స్కోరును నమోదు చేసింది.[17] దాస్ రెండంకెల స్కోరును నమోదు చేయగలిగాడు- 53 బంతుల్లో 25 పరుగులు చేసాడు.[17] వెస్టిండీస్‌తో జరిగిన మూడో T20 మ్యాచ్‌లో, అతను 24 బంతుల్లో తన మొదటి వైట్-బాల్ అర్ధ సెంచరీని సాధించాడు. 17 ఇన్నింగ్స్‌లలో అతని మొదటి 50-ప్లస్ స్కోరు అది. 61 పరుగులు చేసి చివరికి T20I సిరీస్‌ను 2-1తో ముగించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. [18]
2018 సెప్టెంబరు 28న, 2018 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌పై దాస్, 12 బౌండరీలు, 2 సిక్సర్‌లతో 121(117) పరుగులు చేసి, తన తొలి వన్‌డే సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్ ఆఖరి బంతికి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, అతను "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" గెలుచుకున్నాడు. [19]
2020 మార్చిలో, జింబాబ్వే బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు, మొదటి వన్‌డేలో, దాస్ 126 పరుగులు చేశాడు. వన్‌డేలో అది అతని రెండవ సెంచరీ. సిల్హెట్‌లో సెంచరీ చేసిన మొదటి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. [20] [21] 3వ వన్‌డేలో, అతను వన్‌డేల్లో తన 1000వ పరుగు సాధించాడు. ఆ తర్వాత తమీమ్ ఇక్బాల్‌తో కలిసి బంగ్లాదేశ్ తరపున వన్‌డేలలో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు (292 పరుగులు). [22] అలాగే తాను 143 బంతుల్లో 176 పరుగులు చేశాడు. వన్డేల్లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు అది.[23] ఆ వన్‌డే సిరీస్‌లో దాస్, 103.68 సగటుతో 311 పరుగులు చేశాడు. చివరికి తమీమ్ ఇక్బాల్‌తో కలిసి "ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్" గా ఎంపికయ్యాడు. [24]
జనవరి, 2022లో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటించినప్పుడు దాస్, మొదటి టెస్టులో 86 పరుగులు చేసి, న్యూజీలాండ్‌పై బంగ్లాదేశ్ మొట్టమొదటి విజయాన్ని, బే ఓవల్‌లో న్యూజిలాండ్‌పై మొట్టమొదటి టెస్టు విజయాన్నీ నమోదు చేయడంలో తోడ్పడ్డాడు. రెండవ టెస్టులో, రెండవ ఇన్నింగ్స్‌లో 114 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇది విదేశాల్లో జరిగిన మ్యాచ్‌లలో అతని మొదటి టెస్టు సెంచరీ. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2 మ్యాచ్‌ల్లో 196 పరుగులతో సిరీస్‌లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. [25]
2022 ఫిబ్రవరిలో, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన 3-మ్యాచ్‌ల వన్‌డే సిరీస్‌లో, అతను ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో సహా 223 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అతను దక్షిణాఫ్రికాపై సిరీస్‌లో 113 పరుగులు చేసి, వారిపై మొట్టమొదటి వన్‌డే సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 37.67 సగటుతో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మాత్రం, 4 ఇన్నింగ్స్‌లలో 81 పరుగులు మాత్రమే చేశాడు.
2022 మేలో, శ్రీలంకతో జరిగిన 2-మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో, అతను మూడు ఇన్నింగ్స్‌లలో 88, 141, 52 పరుగులు చేశాడు, ఇది అతనిని ICC పురుషుల టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో 724 రేటింగ్ పాయింట్లతో 12వ స్థానానికి చేర్చింది. అది, టెస్టు క్రికెట్‌లో ఓ బంగ్లాదేశ్ బ్యాటరు సాధించిన అత్యధిక పాయింట్లు. [26]
వైస్ కెప్టెన్‌గా (2022–ప్రస్తుతం)
[మార్చు]2022 మేలో, బంగ్లాదేశ్ శ్రీలంకతో జరిగిన 2-టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కోల్పోయిన తర్వాత టెస్టు కెప్టెన్ మోమినుల్ హక్, కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. 2022 జూన్ 2న, టెస్టు జట్టుకు దాస్ వైస్ కెప్టెన్‌గా ఉండగా, షకీబ్ అల్ హసన్ కెప్టెనయ్యాడు.[27]
2023 మార్చి 29న, ఐర్లాండ్‌తో జరిగిన 2వ T20Iలో, అతను కేవలం 18 బంతుల్లోనే తన యాభైకి చేరుకున్నాడు. T20Iలలో బంగ్లాదేశ్ క్రికెటరు చేసిన అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ అది. [28] అతను 41 బంతుల్లో 83 పరుగులు చేసి, రోనీ తాలూక్దార్‌తో కలిసి 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది T20Iలలో బంగ్లాదేశ్‌కు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.[29] ఇది ఐర్లాండ్‌ను 77 పరుగుల తేడాతో ఓడించడంలో బంగ్లాదేశ్‌కు సహాయపడింది. [30]
కెప్టెన్‌గా
[మార్చు]2021 మార్చిలో బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌ల వన్డే, టి20ఐ సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటించింది. దాస్, వన్డే, టీ20 సిరీస్లలో విఫలమయ్యాడు. మూడవ టి20ఐలో గాయం కారణంగా దూరమైన రెగ్యులర్ కెప్టెన్ మహ్మదుల్లా లేకపోవడంతో టి20ఐ లో మొదటిసారిగా బంగ్లాదేశ్ కు నాయకత్వం వహించాడు. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌ను బంగ్లాదేశ్ 65 పరుగుల తేడాతో కోల్పోయి, చివరికి టి20ఐ సిరీస్‌ను 3 - 0 తో కోల్పోయింది.[31]
రెగ్యులర్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గాయపడడంతో, 2022 డిసెంబరులో భారత్‌తో జరిగే 3-మ్యాచ్‌ల వన్‌డే సిరీస్‌కు దాస్ బంగ్లాదేశ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [32] తొలి రెండు వన్డేల్లో బంగ్లాదేశ్ 1 వికెట్ 5 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా గెలిచింది. మూడో వన్డేలో బంగ్లాదేశ్ 227 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరికి బంగ్లాదేశ్ 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. [33]
షకీబ్ అల్ హసన్ గాయపడడంతో, దాస్ బంగ్లాదేశ్ టెస్టుల్లో 12వ కెప్టెన్ అయ్యాడు. [34] ఢాకాలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్టులో అతను 9, 66* పరుగులు చేశాడు. వికెట్ కీపరుగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 6 అవుట్‌లు చేశాడు. బంగ్లాదేశ్ 546 పరుగుల తేడాతో గెలిచి, పరుగుల పరంగా తమ అతిపెద్ద గెలుపు మార్జిన్‌ను నమోదు చేసింది.[35] మొత్తం మీద క్రికెట్ చరిత్రలో ఇది మూడవ అతిపెద్ద విజయం. 21వ శతాబ్దంలో టెస్టుల్లో అతిపెద్ద విజయం. [36]
మూలాలు
[మార్చు]- ↑ "Time to decide on a Test gloveman". The Daily Star (in ఇంగ్లీష్). 2021-01-06. Retrieved 24 June 2021.
- ↑ "Bangladesh Cricket Team Records & Stats | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2021-07-17.
- ↑ "No alternative to Shakib for captaincy". The Daily Star. Dhaka. 5 August 2023.
- ↑ 4.0 4.1 "Liton Das's wedding reception held in Dinajpur". Daily Sun (in ఇంగ్లీష్). Retrieved 2022-11-07.
- ↑ লিটন কুমার দাস. Priyo.com (in Bengali). Retrieved 2022-11-07.
- ↑ "Bangladesh pick ODI newbie Abu Jayed for World Cup". ESPNcricinfo. Retrieved 16 April 2019.
- ↑ "Shakib, Jayed, Hossain in Bangladesh squad for World Cup". International Cricket Council. Retrieved 16 April 2019.
- ↑ "World Cup 2019: Shakib, Liton gun down 322 in record chase as Bangladesh crush West Indies". India Today. Retrieved 17 June 2019.
- ↑ "Shakib and Liton drive Bangladesh to victory over West Indie". icc-cricket.com. Retrieved 18 June 2019.
- ↑ "Liton's perfect second fiddle". The Daily Star. Retrieved 18 June 2019.
- ↑ "Das — the new age Bangladesh cricketer". The Hindu.
- ↑ "India tour of Bangladesh, Only Test: Bangladesh v India at Fatullah, Jun 10–14, 2015".
- ↑ "India tour of Bangladesh, 1st ODI: Bangladesh v India at Dhaka, Jun 18, 2015".
- ↑ "South Africa tour of Bangladesh, 1st T20I: Bangladesh v South Africa at Dhaka, Jul 5, 2015". ESPNcricinfo. Retrieved 5 July 2015.
- ↑ "Future Tours Programme" (PDF). International Cricket Council. Retrieved 16 January 2016.
- ↑ "Bangladesh's tour of West Indies likely to be pushed to July". ESPNcricinfo. Retrieved 23 August 2017.
- ↑ 17.0 17.1 "Bangladesh crash to all-time low in Antigua". ESPNcricinfo. Retrieved 6 July 2018.
- ↑ "Liton's blitz and Mustafizur's three-for seal Bangladesh's series win". ESPNcricinfo.
- ↑ "Asia Cup 2018 final: Liton Das slams maiden ODI hundred". The Indian Express. Retrieved 28 September 2018.
- ↑ লিটন দেখালেন, ওপেনারদের এভাবেই খেলতে হয়. Prothom Alo (in Bengali). Retrieved 1 March 2020.
- ↑ "Ton-up Liton guides Bangladesh to record score". New Age (in ఇంగ్లీష్). Retrieved 1 March 2020.
- ↑ "Ton-up Liton, Tamim as Bangladesh post 322/3". Dhaka Tribune. Retrieved 6 March 2020.
- ↑ "Liton, Tamim powers Bangladesh to 322". Daily Bangladesh. Retrieved 6 March 2020.
- ↑ "Stats: Liton Das and Tamim Iqbal power Bangladesh to new batting records". CricTracker. 6 March 2020. Retrieved 7 March 2020.
- ↑ "Das sparkles with ton but New Zealand close out innings win". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 11 January 2022.
- ↑ "Why Litton Das' Status As Bangladesh's Top-Ranked Test Batter Of All Time Is Fully Deserved". Wisden. 7 June 2022. Archived from the original on 8 జూన్ 2022. Retrieved 9 June 2022.
- ↑ "Shakib becomes Test captain, Liton his deputy". The Daily Star (in ఇంగ్లీష్). 2 June 2022. Retrieved 2 June 2022.
- ↑ "Liton blasts Bangladesh's fastest T20 half century". Dhaka Tribune. Retrieved 29 March 2023.
- ↑ "Shakib, Litton set up thumping win as Bangladesh seal T20 series against Ireland". bdnews24.com (in ఇంగ్లీష్). Retrieved 2023-03-29.
- ↑ "Shakib Al Hasan, Litton Das star as Bangladesh beat Ireland by 77 runs in 2nd T20I". The Times of India. Retrieved 2023-03-29.
- ↑ "Liton to captain in last T20I as injured Mahmudullah ruled out". Dhaka Tribune. 2021-04-01. Retrieved 24 June 2021.
- ↑ "Liton Das to lead Bangladesh in ODIs against India". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2 December 2022.
- ↑ "Bangladesh win nailbiter against India clinching ODI series". The Business Standard (in ఇంగ్లీష్). 7 December 2022. Retrieved 18 December 2022.
- ↑ "Bangladesh, Afghanistan meet amid rains as solitary Test struggles for significance". ESPNcricinfo. Retrieved 14 June 2023.
- ↑ "Shanto, bowlers shine as Bangladesh create history in Dhaka". Cricbuzz. Retrieved 17 June 2023.
- ↑ "Bangladesh seal 546-run win, third highest by runs in Test history". Dhaka Tribune (in ఇంగ్లీష్). 17 June 2023. Retrieved 18 June 2023.