Jump to content

లవ్ లైఫ్ అండ్ పకోడి

వికీపీడియా నుండి
లవ్ లైఫ్ అండ్ పకోడి
లవ్ లైఫ్ అండ్ పకోడి సినిమా పోస్టర్
దర్శకత్వంజయంత్ గాలి
రచనజయంత్ గాలి
నిర్మాతజయంత్ గాలి
మధుర శ్రీధర్ రెడ్డి
తారాగణంబిమల్ కార్తీక్ రెబ్బా, సంచిత పూనాచ, కృష్ణ హెబ్బాల్
ఛాయాగ్రహణంసాగర్ వైవివి, జితిన్ మోహన్
కూర్పుశ్రవణ్ కలిటినేని
సంగీతంపవన్
నిర్మాణ
సంస్థలు
కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్, మధుర ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీs
12 మార్చి, 2021
సినిమా నిడివి
151 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

లవ్ లైఫ్ అండ్ పకోడి, 2021 మార్చి 12న విడుదలైన తెలుగు సినిమా.[1] కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్, మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జయంత్ గాలి, మధుర శ్రీధర్ రెడ్డి[2] నిర్మించిన ఈ సినిమాకు జయంత్ గాలి[3] దర్శకత్వం వహించాడు. ఇందులో బిమల్ కార్తీక్ రెబ్బా, సంచిత పూనాచ, కృష్ణ హెబ్బాల్, కళాజ్యోతి తదితరులు నటించగా, పవన్ సంగీతం అందించాడు.

నటవర్గం

[మార్చు]
  • బిమల్ కార్తీక్ రెబ్బా
  • సంచిత పూనాచ
  • కృష్ణ హెబ్బాల్
  • కళాజ్యోతి
  • అనురాధ మల్లికార్జున్
  • ఆకర్ష్ రాజ్ భాగవతుల

ప్రచారం

[మార్చు]

2020, జూలై 29న రానా దగ్గుబాటి ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశాడు.[4] 2021, మార్చి 3న అల్లు శిరీష్ ఈ సినిమా థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ సినిమాను ప్రత్యేకమైన ప్రమోషన్ చేయడంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, యుఎస్ఎ అంతటా మల్టీప్లెక్స్‌లలో విడుదల చేశారు.[5]

పాటలు

[మార్చు]
Untitled

ఈ సినిమాకు పవన్ సంగీతం అందించగా, మహేష్ పోలోజు పాటలు రాశాడు. మధుర ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వేడి పకోడి"మహేష్ పోలోజుఅనురాగ్ కులకర్ణి2:40
2."కదిలే నదిలా"మహేష్ పోలోజుకృష్ణ తేజస్వి, ఆకాంక్ష బిష్త్2:48
3."ఈ పయనం"మహేష్ పోలోజుఅనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా3:13
4."రంగులన్ని కలిసి" పవన్, రాజీ 

స్పందన

[మార్చు]

ఈ సినిమాకు తెలుగు సినీ విమర్శకులు, సినీ పెద్దలమంచి సమీక్షలు వచ్చాయి. సినీ దర్శకులు నీలకంఠ, సాగర్ కె చంద్ర, నిర్మాత లగడపాటి శ్రీధర్ తదితరులు సినిమా, టీంను ప్రశంసింశించారు.

“ఇది కొత్త తరహా ప్రేమకథ” అని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది. ''అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ఈ కథలో ప్రేమకు సంబంధించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు" అని ది హిందూ పత్రిక రాసింది.[6] “ఇది మొత్తంగా సమకాలీన కథాంశంతో కూడిన సినిమా. ఆకట్టుకునే కథాంశంతో మొదలవుతుంది, హీరోహీరోయిన్ల నటన కూడా బాగుంది” అని 123తెలుగు వెబ్సైట్ రాసింది.[1] “దూరమైన సంబంధాలు కలుసుకోవడానికి మార్గాన్ని చూపడం ఇందులోని కథాంశం” అని తెలంగాణ టుడే పత్రిక రాసింది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Love Life And Pakodi Telugu Movie Review". 123telugu.com. 2021-03-12. Retrieved 9 April 2021.
  2. TelanganaToday. "Love, Life & Pakodi first look out". Telangana Today. Retrieved 9 April 2021.
  3. 3.0 3.1 TelanganaToday. "Love Life & Pakodi trailer is about new-age friendship, love". Telangana Today. Retrieved 9 April 2021.
  4. "Rana Daggubati unveils Love Life And Pakodi trailer - Times of India". The Times of India. Retrieved 9 April 2021.
  5. "Allu Sirish launches Love Life and Pakodi's trailer". 123telugu.com. 2021-03-03. Retrieved 9 April 2021.
  6. Dundoo, Sangeetha Devi (2021-03-12). "'Love, Life & Pakodi' movie review: From a non-judgemental space". The Hindu. ISSN 0971-751X. Retrieved 9 April 2021.

 

బయటి లంకెలు

[మార్చు]