Jump to content

లద్ధా రాంజీ

వికీపీడియా నుండి
లద్ధా రాంజీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాంజీ లద్ధా నకుం
పుట్టిన తేదీ(1900-02-10)1900 ఫిబ్రవరి 10
పిధార్, బ్రిటిషు భారతదేశం (ప్రస్తుత గుజరాత్ లో ఉంది)
మరణించిన తేదీ1948 డిసెంబరు 20(1948-12-20) (వయసు 48)
రాజ్‌కోట్, గుజరాత్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
బంధువులుAmar Singh (brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 16)1933 డిసెంబరు 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 27
చేసిన పరుగులు 1 325
బ్యాటింగు సగటు 0.50 8.55
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 1 70
వేసిన బంతులు 138 4,741
వికెట్లు 0 125
బౌలింగు సగటు 17.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 3
అత్యుత్తమ బౌలింగు 8/14
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 25/–
మూలం: CricInfo, 2022 జూన్ 9

రామ్‌జీ లద్ధా నకుమ్ (1900 ఫిబ్రవరి 10 - 1948 డిసెంబరు 20) 1933లో ఒక టెస్టు ఆడిన భారతీయ టెస్ట్ క్రికెటరు. [1]

ఫస్ట్ క్లాస్ క్రికెట్

[మార్చు]

రాంజీ ఆల్ఫ్రెడ్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. పంజాబ్ ఫాస్ట్ బౌలర్ గులాం నబీ బౌలింగ్ యాక్షన్‌ను అనుసరించాడు. లధా రామ్‌జీ ఫస్ట్-క్లాస్ ఆట జీవితం 1923-24 సీజన్ నుండి 1935-36 సీజన్ వరకు కొనసాగింది. అన్నయ్య అమర్ సింగ్‌తో పోలిస్తే, అతను ఎత్తుగా, బలంగా ఉండేవాడు. ఫాస్ట్-మీడియం బౌలరతను. దాదాపు అన్ని గేమ్‌లలో ఓపెనింగ్‌లో బౌలింగ్ చేసేవాడు. బాంబే ట్రయాంగులర్ పోటీలో హిందూ జట్టుకు ఆడుతూ చెప్పుకోదగ్గ విజయం సాధించాడు. అతని ఫస్ట్-క్లాస్ ప్లే కెరీర్ ఒక దశాబ్దానికి పైగా కొనసాగింది. 18.80 సగటుతో 111 వికెట్లు తీశాడు.

రాంజీ 1931-32 సీజన్‌లో ఫ్రీల్యూటర్స్ తరపున ఆడాడు. అతను నిజాం స్టేట్ రైల్వే A జట్టుపై 8/14, 4/32 తీసుకున్నాడు. సోదరుడు అమర్ సింగ్ మిగతా ఎనిమిది వికెట్లు తీశాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

లధా రామ్‌జీ తన కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క టెస్టు ఆడాడు. 1933 డిసెంబరు 15న సందర్శించిన ఇంగ్లండ్ జట్టుపై ఆ టెస్టు ఆడాడు.

మూల్యాంకనం

[మార్చు]

భారత క్రికెట్ చరిత్రలో తొలిదశలో పాల్గొన్న ఫాస్ట్ బౌలర్లలో ఇతను ఒకడు. టెస్టు క్రికెట్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టినా, దేశీయ క్రికెట్‌లో మాత్రం లేత వయసు లోనే అడుగుపెట్టాడు. ఆటలో స్థిరపడిన బ్యాట్స్‌మెన్‌లను కూడా భయపెట్టే బౌలింగు అతనిది. పేస్ అటాక్‌లో మహ్మద్ నిసార్, అమర్ సింగ్, జహంగీర్ ఖాన్‌లతో జతకట్టాడు.

ఒక దశాబ్దానికి పైగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కేవలం 27 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 17.37 సగటుతో 125 వికెట్లు తీశాడు. సెకండ్ క్లాస్ గేమ్‌లతో సహా 35 గేమ్‌లలో 17.86 సగటుతో 145 వికెట్లు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మధుమేహం స్థాయి పెరగకముందు, రోజూ దాదాపు యాభై కప్పుల టీ తాగేవాడు. అతని కుడి కాలులో గ్యాంగ్రీన్‌తో బాధపడ్డాడు. అయితే దీన్ని వదిలించుకోవాలని వైద్యుల సలహాలు, బంధువులు కోరినప్పటికీ శస్త్ర చికిత్సకు అంగీకరించలేదు. 1948 డిసెంబరు 20 న 48 ఏళ్ల వయసులో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో లద్ధా రామ్‌జీ మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Ladha Ramji". ESPN Cricinfo. Retrieved 15 May 2020.