Jump to content

రాహుల్ హరిదాస్

వికీపీడియా నుండి
రాహుల్ హరిదాస్
జననం1986, నవంబరు 2
ఇతర పేర్లుటైసన్, రాహుల్, హ్యాపీడేస్ టైసన్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2007–2014, 2017–ప్రస్తుతం

రాహుల్ హరిదాస్ తెలుగు సినిమా నటుడు. శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ (2007)తో సినిమారంగ ప్రవేశం చేసాడు.[1]

జననం

[మార్చు]

రాహుల్ హరిదాస్ 1986, నవంబరు 2న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.

కెరీర్

[మార్చు]

హరిదాస్ 2007లో హ్యాపీ డేస్‌తో అరంగేట్రం చేసాడు. వరుణ్ సందేశ్, తమన్నా సోనియా దీప్తి, గాయత్రీ రావ్‌లతోపాటు ప్రధాన పాత్రలలో ఒకరిగా కనిపించాడు. 2008లో విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన రెయిన్‌బో సినిమాలో నటించాడు.[2] 2014 నుండి 2017 వరకు విరామం తీసుకున్నాడు. 2017లో, మహిమ మక్వానా నటించిన రియల్ స్టోరీ బేస్డ్ క్రైమ్-థ్రిల్లర్ వెంకటాపురం సినిమా తిరిగి వచ్చాడు.[3][4]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2007 హ్యాపీ డేస్ అర్జున్ "టైసన్" అరంగేట్రం
2008 రెయిన్‌బో శ్యామ్
2011 ముగ్గురు మారుతి
2013 ప్రేమ ఒక మైకం లలిత్
2014 లవ్ యు బంగారమ్ ఆకాష్
2017 వెంకటాపురం ఆనంద్
2024 భజే వాయు వేగం

మూలాలు

[మార్చు]
  1. "Rahul Haridas - Movies, Biography, News, Age & Photos". BookMyShow.
  2. "Raahul interview – Telugu Cinema interview – Telugu film actor". idlebrain.com. Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
  3. "Rahul Haridas is getting back in shape! - Times of India". The Times of India.
  4. "Venkatapuram telugu movie review | Rahul Venkatapuram Movie Review Ratings | Venkatapuram Telugu Movie Review and Rating". 13 May 2017.

బాహ్య లింకులు

[మార్చు]