Jump to content

రావులపాటి సీతారాం

వికీపీడియా నుండి
రావులపాటి సీతారాం
జననంరావులపాటి సీతారాం
1964
India ఖమ్మం జిల్లా ఆరెంపల, తెలంగాణ
నివాస ప్రాంతంఖమ్మం జిల్లా ఆరెంపల, తెలంగాణ
వృత్తికవి, సాహితీవేత్త, విమర్శకుడు, సామాజికవేత్త, అధ్యాపకుడు.
తండ్రినారాయణ,
తల్లిమాణిక్యం

రావులపాటి సీతారాం ఆధునిక తెలుగు సాహిత్యం లో మూడు దశాబ్దాలుగా విమర్శకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, తెలుగు అధ్యాపకుడిగా పేరొందాడు.

బాల్యం, విద్యాబ్యాసం

[మార్చు]

రావులపాటి సీతారాం 1964 లో ఖమ్మం జిల్లా ఆరెంపులకు చెందిన నారాయణ, మాణిక్యం దంపతులకు జన్మించాడు. పదో తరగతి, డిగ్రి ఖమ్మంలో పూర్తి చేశాడు. ఏంఏ కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. ఆధునిక తెలుగు సాహిత్యంలో డాక్టరేటు పట్టాను పొందారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

రక్తస్పర్శ కవితాసంపుటితో ఆర్ సీతారాం సాహితీలోకానికి పరిచయమయ్యారు. అఫ్సర్, ప్రసేన్‌తో కలిపి సీతారాం ఈ కవితా సంపుటిని వెలువరించారు. ఇదిగో ఇక్కడిదాకా పేరుతో ఆయన వెలువరించిన కవితాసంపుటి సంచలనం సృష్టించింది. సన్నాఫ్ మాణిక్యం కవితాసంకలనం ఆయనకు మంచి పేరుప్రతిష్ఠలను తీసుకొచ్చింది. ఆధునిక కవితా ధోరణులు అనే అంశంపైన ఆయన పరిశోధన చేశారు. మానుకోటలో డిగ్రీ కాలేజీ విద్యార్థులతోనే రచనలు చేయించి విద్యార్థులలోని సృజన్మాతకతకు పదునుపెట్టారు. మా టీచర్, మానుకోట ముచ్చట్లు విద్యార్థులను ప్రోత్సహించే ఆయన ఉన్నత లక్షణానికి ప్రతిబింబాలు. ప్రస్తుతం మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రి కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు.

రచనలు

[మార్చు]
  • 1985:రక్తస్పర్శ
  • 1990:ఇదిగో ఇక్కడిదాకే
  • 1995:S/O మాణిక్యం
  • 2008:కుప్పం
  • 2010:అదే పుట
  • 2011:కారేపల్లి కబుర్లు
  • 2009:ఆ ముగ్గురు సరే-మన మాటేమిటి

పురస్కారాలు

[మార్చు]

ప్రజాకవి కాళోజీ నారాయణరావు- 2017 పురస్కారం.

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక 09-09-2017