రామనారాయణ
రామనారాయణ | |
---|---|
![]() 2014లో రామనారాయణన్ | |
జననం | |
మరణం | 2014 జూన్ 22 సింగపూర్ | (వయసు: 65)
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1981–2013 |
పిల్లలు | 2 |
రామనారాయణ లేదా రామనారాయణన్ (1949-2014) ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. ఇతడు తెలుగు, తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, భోజ్‌పురి, మలయ్ మొదలైన 9 భాషలలోని చలనచిత్రాలకు దర్శకత్వం వహించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు 1949, ఏప్రిల్ 3వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కారైకుడిలో జన్మించాడు. ఇతడు సినిమాలలో పాటలు వ్రాయాలనే ఉద్దేశంతో మద్రాసు లోనికి కాలుమోపాడు కానీ సంభాషణల రచయితగా సినిమాలలో అడుగు పెట్టాడు. తన మిత్రుడు ఎం.ఎ.ఖాజాతో కలిసి రామ్-రహీమ్ పేరుతో జంటగా తమిళ సినిమాలకు సంభాషణలు వ్రాశాడు. 1976లో తొలిసారి ఇతడు ఆశై అరుబదు నాళ్ అనే సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు వ్రాశాడు. 1977లో మీనాక్షి కుంకుమమ్ అనే సినిమాతో నిర్మాతగా మారాడు. 1981లో సుమై అనే సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించాడు. ఇతడు మొత్తం 9 భాషలలో 125కుపైగా సినిమాలకు పనిచేశాడు. 1980వ దశకంలో ఎక్కువగా జంతువులు ప్రధాన పాత్రలుగా ఉన్న సినిమాలు తీశాడు. 1990లలో భక్తి సినిమాలు తీశాడు. ఇతని సినిమాలు తెలుగు, హిందీతో సహా పలు భారతీయ భాషలలోనికి డబ్ చేయబడ్డాయి. ఇతడు తమిళ సినిమా నిర్మాతల మండలికి వరుసగా మూడుసార్లు అధ్యక్షుడిగా ఉన్నాడు. 1989లో కారైకుడి నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభకు ఎన్నికైనాడు. 1996లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" కు అధ్యక్షునిగా నియమితుడైనాడు. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ఇతడిని కళైమామణి పురస్కారంతో సత్కరించింది. ఇతడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తన 65వ యేట 2014, జూన్ 22న సింగపూర్‌లో మరణించాడు.
సినిమాలు
[మార్చు]రామనారాయణ తీసిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | వివరాలు | |||
---|---|---|---|---|---|---|
దర్శకత్వం | కథ | స్క్రీన్ ప్లే | నిర్మాత | |||
1980 | పున్నమినాగు | ![]() |
||||
1982 | అత్తకు తగ్గ అల్లుళ్ళు | ![]() |
||||
1982 | న్యాయ పొరాటం | ![]() |
||||
1984 | కోడలు దిద్దిన కాపురం | ![]() |
మనైవి సొల్లె మందిరం అనే తమిళ సినిమా డబ్బింగ్ | |||
1984 | ఛాలెంజ్ దొంగలు | ![]() |
||||
1984 | పగ పట్టిన పులి | ![]() |
||||
1984 | సకల కళా ప్రియుడు | ![]() |
తీరద విలాయత్తు పిళ్ళై అనే తమిళ సినిమా డబ్బింగ్ | |||
1985 | కేటుగాళ్ళకు సవాల్ | ![]() |
||||
1985 | చిలిపి యవ్వనం | ![]() |
||||
1985 | ఛాలెంజ్ కిలాడీ | ![]() |
||||
1985 | దెయ్యాల మేడ | ![]() |
||||
1985 | మావూరి మొనగాళ్ళు | ![]() |
||||
1985 | రాధ మాధవి | ![]() |
||||
1986 | నాగదేవత | ![]() |
![]() |
![]() |
||
1986 | మారుతి | ![]() |
![]() |
|||
1986 | రణధీరుడు | ![]() |
||||
1987 | నాగపూజా ఫలం | ![]() |
||||
1990 | లక్ష్మి దుర్గ | ![]() |
||||
1990 | శ్రావణ శుక్రవారం | ![]() |
||||
1991 | కొండవీటి ఖైది | ![]() |
||||
1991 | గంగ | ![]() |
||||
1991 | నరహరి మురహరి | ![]() |
||||
1991 | నాగమ్మ | ![]() |
![]() |
|||
1991 | ముద్దుల మరదలు | ![]() |
||||
1991 | శ్రావణ మాసం | ![]() |
||||
1991 | సింధూర దేవి | ![]() |
||||
1992 | గోమాతవ్రతం | ![]() |
||||
1992 | గౌరమ్మ | ![]() |
![]() |
![]() |
||
1992 | నాగబాల | ![]() |
||||
1993 | దుర్గ అనుగ్రహం | ![]() |
![]() |
|||
1993 | మావారికి పెళ్ళి | ![]() |
||||
1993 | శాంభవి | ![]() |
||||
1993 | శివరాత్రి | ![]() |
||||
1998 | జగదీశ్వరి | ![]() |
||||
1999 | గురు పౌర్ణమి | ![]() |
![]() |
|||
2000 | తిరుమల తిరుపతి వెంకటేశ | ![]() |
తిరుపతి ఎళుమలై వెంకటేశ అనే తమిళ సినిమా రీమేక్ | |||
2000 | దేవత | ![]() |
||||
2000 | మహాదేవి | ![]() |
||||
2002 | అమ్మోరు తల్లి | ![]() |
||||
2003 | అల్లరి గజేంద్రుడు | ![]() |
||||
2010 | కారా మజాకా | ![]() |
![]() |
![]() |
![]() |
తమిళంలో కుట్టి పిశాసు, కన్నడలో బొంబాట్ కార్ అనే పేర్లతో ఒకే సారి నిర్మించారు. |
మూలాలు
[మార్చు]- ↑ "Rama Narayanan, veteran director, producer, dies at 65". The Times of India. 23 June 2014. Retrieved 4 October 2022.
బయటిలింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రామనారాయణ పేజీ
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- 1949 జననాలు
- 2014 మరణాలు
- తెలుగు సినిమా దర్శకులు
- తెలుగు సినిమా రచయితలు
- తమిళ సినిమా దర్శకులు
- తమిళ సినిమా కథా రచయితలు
- తమిళ సినిమా నిర్మాతలు
- కన్నడ సినిమా దర్శకులు
- మరాఠీ సినిమా దర్శకులు
- బెంగాలీ సినిమా దర్శకులు
- కళైమామణి పురస్కార గ్రహీతలు
- తమిళనాడు శాసన సభ్యులు