రాజేష్ చౌహాన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రాజేష్ కుమార్ చౌహాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | రాంచీ, జార్ఖండ్ | 1966 డిసెంబరు 19|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 197) | 1993 జనవరి 29 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1998 మార్చి 18 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 87) | 1993 జూలై 25 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1997 డిసెంబరు 28 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4 |
రాజేష్ చౌహాన్ (జననం 1966 డిసెంబరు 19) 1993 నుండి 1998 వరకు 21 టెస్టులు, 35 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన మాజీ భారత క్రికెటరు. అతను 1990ల నాటి కుంబ్లే - రాజు - చౌహాన్‌ల స్పిన్ త్రయంలో భాగం.
ఆడిన 21 టెస్టుల్లో అతని తోడ్పాటు పరిమితమే అయినప్పటికీ, వాటిలో భారత్ ఏదీ ఓడిపోలేదు. [1] 1997లో కరాచీలో సక్లైన్ ముస్తాక్ వేసిన చివరి ఓవరులో సిక్స్ కొట్టి, పాకిస్థాన్‌పై భారత్‌కు నాలుగు వికెట్ల విజయాన్ని అందించడం ద్వారా అతను ఎక్కువగా గుర్తుంటాడు.
జీవిత విశేషాలు
[మార్చు]రాంచీలో నివసించే అతని తండ్రి గోవింద్ రాజా చౌహాన్ కూడా క్రికెటరే. అతను 1957లో రంజీ ట్రోఫీ,1964లో దులీప్ ట్రోఫీ ఆడాడు.[2] వారి పూర్వీకుల గ్రామం కచ్ ప్రాంతం లోని విడి. అతను కచ్ గుర్జర్ క్షత్రియ అనే చిన్న సమాజానికి చెందినవాడు. [2] [3] చౌహాన్ 1993-96 సంవత్సరాలలో కచ్ గుర్జార్ క్షత్రియ సంఘానికి ఆల్-ఇండియా యూత్ వింగ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు. చురుకైన సామాజిక సభ్యుడు. [2]
తరువాత జీవితంలో
[మార్చు]2007 ఏప్రిల్‌లో అతను కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనేక ఫ్రాక్చర్లతో పాటు అతని కాలు, వీపు, చేయి, తలపై గాయాలయ్యాయి.[4][5]
అతను ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో నివసిస్తూ, భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యాపారాన్ని కూడా నడుపుతున్నాడు.
2014 జూలై 7 న, భిలాయ్‌లోని తన నివాసంలో గుండెపోటుకు గురై, ప్రాణాలతో బయటపడ్డాడు. [6]
మూలాలు
[మార్చు]- ↑ "Has Steven Smith made the fastest ODI hundred for Australia?". ESPN Cricinfo. Retrieved 1 December 2020.
- ↑ 2.0 2.1 2.2 Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory by Raja Pawan Jethwa. (2007)
- ↑ "कच्छ गुर्जर समाज का मिलन समारोह". Dainik Bhaskar. 1 November 2011. Archived from the original on 7 April 2014. Retrieved 2 August 2013.
- ↑ Rajesh Chauhan injured in road accident
- ↑ Ex-cricketer Rajesh Chauhan injured
- ↑ "Cricketer Rajesh Chauhan suffers cardiac arrest". ABP Live. Retrieved 7 July 2014.