రాజేశ్వరీ పద్మనాభన్
రాజేశ్వరీ పద్మనాభన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1939 కొల్లూరు |
మరణం | 2008 ఆగస్టు 15 చెన్నై, భారతదేశం | (వయసు 68–69)
వృత్తి | వైణికురాలు |
రాజేశ్వరీ పద్మనాభన్ (1939-2008) కారైక్కుడి వీణ సంప్రదాయానికి సంబంధించిన ఒక వైణిక విద్వాంసురాలు.[1]
విశేషాలు
[మార్చు]ఈమె కారైక్కుడి వీణ సంప్రదాయానికి చెందిన తొమ్మిదవ తరం వైణికురాలు.[2] ఈమె 1939వ సంవత్సరంలో కొల్లూరులో జన్మించింది. ఈమె తల్లి పేరు లక్ష్మీ అమ్మాళ్. ఈమె తాత కారైక్కుడి బ్రదర్స్‌గా పేరుపొందిన వారిలో పెద్దవాడైన కారైక్కుడి సుబ్బరామ అయ్యర్.
ఈమె తన ఐదవ యేటి నుండే కారైక్కుడి సాంబశివ అయ్యర్ వద్ద గురుకుల పద్ధతిలో 1958లో అతడు మరణించేవరకూ సంగీత శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత భారత ప్రభుత్వ ఉపకారవేతనం పొంది మైసూరు వాసుదేవాచార్యవద్ద గాత్ర సంగీతాన్ని అభ్యసించింది. ఈమె చెన్నైలోని "కళాక్షేత్ర" ప్రిన్సిపాల్‌గా పనిచేసి అనేక సంవత్సరాలు సంగీతాన్ని బోధించింది. కొన్ని వర్ణనలకు, తిల్లానలకు స్వరకల్పన చేసింది. "కుంభేశ్వరర్ కురవంజి" అనే నృత్య సంగీత నాటికకు సంగీతం సమకూర్చింది.
ఈమెకు "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" కళైమామణి పురస్కారాన్ని ప్రకటించింది. మద్రాసు సంగీత అకాడమీ సంగీత కళానిధి పురస్కారం అందజేసింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1986లో అవార్డును ప్రదానం చేసింది.
ఈమె 2008 ఆగష్టు 15న తన 69వ యేట గుండెపోటుతో చెన్నైలో మరణించింది.
మూలాలు
[మార్చు]- ↑ web master. "Raajeswari Padmanabhan". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 26 March 2021.[permanent dead link]
- ↑ web master. "RAJESWARI PADMANABHAN (1939-2008)". ధ్వని. Archived from the original on 28 జనవరి 2021. Retrieved 26 March 2021.
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1939 జననాలు
- వైణికులు
- కళైమామణి పురస్కార గ్రహీతలు
- సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- 2008 మరణాలు