Jump to content

రాజీవ్ యువ వికాసం

వికీపీడియా నుండి
రాజీవ్ యువ వికాసం
ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ప్రధాన వ్యక్తులుతెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత
స్థాపన2025 మార్చి 17
నిర్వాహకులుముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,
తెలంగాణ ప్రభుత్వం

రాజీవ్ యువ వికాసం అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం ద్వారా తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యువతకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

ప్రారంభోత్సవం

[మార్చు]

రాజీవ్ యువ వికాసం పథకాన్ని 2025 మార్చి 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభిత్వా విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.[1]

మార్గదర్శకాలు

[మార్చు]

రాజీవ్ యువ వికాసం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4,200 మందికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద రూ.3 లక్షల వరకు ఋణం పొందడానికి ప్రభుత్వం మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. దరఖాస్తు చేయాల్సిన అధికారిక వెబ్‌సైట్[permanent dead link] లో ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.[2]

ఏదైనా సందేహాలు ఉంటే, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులను సంప్రదించవచ్చు లేదా హెల్ప్‌లైన్ 040-23120334కు కాల్ చేయవచ్చు.  

ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తిన వారు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులు, బీసీ కార్పొరేషన్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులను సంప్రదించాలి. అప్లికేషన్లను ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు పరిశీలించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేస్తారు.[3][4]

మూడు కేటగిరీల్లో ఆర్థిక సహాయం

[మార్చు]

రాజీవ్ యువ వికాసం పధకంలో భాగంగా కేటగిరీ-1, 2,3 వారిగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నారు.[5][6]

  • ₹50,000 వరకు ఖరీదు చేసే యూనిట్లకు, ప్రభుత్వం 100 శాతం సబ్సిడీని అందిస్తుంది.
  • ₹50,001 నుండి ₹1 లక్ష మధ్య ఖరీదు చేసే యూనిట్లకు ఇది 90 శాతం, మిగిలిన 10% బ్యాంకు రుణాల ద్వారా నిధులు సమకూరుస్తారు.
  • ₹1,00,001 నుండి ₹2 లక్షల మధ్య ధర కలిగిన యూనిట్లకు, సబ్సిడీ భాగం 80 శాతం, 20 శాతం బ్యాంకు రుణం ద్వారా నిధులు సమకూరుస్తుంది.
  • ₹2,00,001 నుండి ₹4 లక్షల వరకు ఉన్న యూనిట్లకు, ప్రభుత్వం ఖర్చులో 70 శాతం భరిస్తుంది, మిగిలినది బ్యాంకు రుణం ద్వారా వస్తుంది. అదనంగా, యూనిట్ ఖర్చుతో సంబంధం లేకుండా చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు 100 శాతం సబ్సిడీ మంజూరు చేయబడుతుంది.

అర్హతలు & అవసరమైన పత్రాలు

[మార్చు]
  • తెలంగాణకు చెందిన స్థిరనివాసి అయి ఉండాలి.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన వారు అయి ఉండాలి.
  • నిరుద్యోగ యువతీ యువకులకు మాత్రమే అవకాశం ఉంటుంది.
  • రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం (దరఖాస్తు పెట్టుకునేవారికి రేషన్ కార్డు తప్పనిసరి. అది లేకపోతే ఇన్‌కం సర్టిఫికెట్ ఇవ్వాలి.)
  • ఆధార్‌ కార్డు
  • కుల ధృవీకరణ పత్రం (తెలంగాణ ఏర్పడిన తర్వాత జారీ చేయబడింది)
  • దరఖాస్తు సమయంలో పాస్‌పోర్టు సైజు ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి
  • రేషన్‌కార్డు, ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజీలో నమోదు అయి ఉండాలి.[7]
  • శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగ పథకాలకు)
  • పట్టాదార్ పాస్‌బుక్ (వ్యవసాయ పథకాలకు)
  • సదరం సర్టిఫికేట్ (దివ్యాంగ అభ్యర్థులైతే)

ఆన్‌లైన్‌లో ఓబీఎంఎంఎస్‌ (ఆన్‌లైన్‌ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కాపీకి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతచేసి మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు (ఎంపీడీవో), మున్సిపల్‌ కమిషనర్‌, జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో అందజేయాలి.

ఆదాయ పరిమితులు

[మార్చు]
  • వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోని దరఖాస్తుదారులకు సంవత్సరానికి ₹1.5 లక్షలు & పట్టణ ప్రాంతాల్లోని వారికి సంవత్సరానికి ₹2 లక్షలు ఉన్నాయి. అర్హతను ధృవీకరించడానికి దరఖాస్తుదారులు తమ రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు.
  • దరఖాస్తుదారుల వయస్సు ప్రమాణాలు వ్యవసాయేతర పథకాలకు 21 నుండి 55 సంవత్సరాలు, వ్యవసాయం & అనుబంధ రంగాలకు 21 నుండి 60 సంవత్సరాలు.

జిల్లా, మండల స్థాయి కమిటీలు

[మార్చు]
  • జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా డీఆర్డీయే పీడీ ఉంటారు. సభ్యులుగా.. అదనపు కలెక్టర్‌, పరిశ్రమల శాఖ జీఎం, ఎస్సీ/బీసీ కార్పొరేషన్‌ల ఈడీ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, దివ్యాంగుల శాఖ ఏడీ, డబ్ల్యూ అండ్‌ సీడీ శాఖ పీడీ, గిరిజన సంక్షేమ శాఖ డీటీడీవో, ఎల్‌డీఎంలు ఉంటారు.
  • మండల స్థాయిలో ఎంపీడీవో/పురపాలక కమిషనర్‌, మునిసిపల్‌ కార్పొరేషన్‌లో జోనల్‌ స్థాయి అధికారి కన్వీనర్‌గా ఉంటారు. జిల్లా కలెక్టర్‌ నామినేట్‌ చేసిన మండల ప్రత్యేక అధికారి, ఆ ప్రాంతంలోని బ్యాంక్‌ మేనేజర్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల నుంచి ఒక ప్రతినిధి, డీఆర్‌డీఏ నుంచి ఒక సభ్యుడు ఈ కమిటీలో ఉంటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "పారదర్శకంగా రాజీవ్‌ యువ వికాసం". Eenadu. 18 March 2025. Archived from the original on 18 March 2025. Retrieved 18 March 2025.
  2. "రేషన్‌కార్డు ఉంటేనే రాజీవ్‌ యువ వికాసం.. ఇవీ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు!". NT News. 26 March 2025. Archived from the original on 27 March 2025. Retrieved 27 March 2025.
  3. "రాజీవ్ యువ వికాసం స్కీమ్, యువతకు రూ.3 లక్షల వరకు సాయం- పూర్తి వివరాలు ఇలా". ABP Desham. 17 March 2025. Archived from the original on 18 March 2025. Retrieved 18 March 2025.
  4. "నిరుద్యోగులకు భలే ఛాన్స్.. రూ.6 లక్షల వరకు సర్కార్ సాయం! రేపట్నుంచే దరఖాస్తులు". TV9 Telugu. 16 March 2025. Archived from the original on 18 March 2025. Retrieved 18 March 2025.
  5. "Guidelines for Telangana's Rajiv Yuva Vikasam Scheme issued" (in Indian English). The Hindu. 27 March 2025. Archived from the original on 27 March 2025. Retrieved 27 March 2025.
  6. "రూ.50 వేలలోపు యూనిట్లకు 100% సబ్సిడీ". Eenadu. 26 March 2025. Archived from the original on 27 March 2025. Retrieved 27 March 2025.
  7. "'రాజీవ్‌ యువ వికాసం'తో యువతకు బాసట". Andhrajyothy. 18 March 2025. Archived from the original on 18 March 2025. Retrieved 18 March 2025.

బయటి లింకులు

[మార్చు]