రంగా సొహోనీ
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | శ్రీరంగ వాసుదేవ్ సొహోనీ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | నింబాహేరా, బ్రిటిషు భారతదేశం | 1918 మార్చి 5|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1993 మే 19 థానే, మహారాష్ట్ర | (వయసు 75)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు |
| |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 35) | 1946 జూలై 20 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1951 డిసెంబరు 14 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 సెప్టెంబరు 3 |
శ్రీరంగ వాసుదేవ్ 'రంగా' సొహోనీ (1918 మార్చి 5 - 1993 మే 19) భారతీయ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. అతను ఆల్-రౌండరు. ఒత్తిడిలో బాగా బ్యాటింగ్ చేసేవాడు. దక్షిణాసియా పిచ్‌లపై అలుపు లేకుండా బౌలింగ్ చేసేవాడు. [1]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]సోహోనీ 1946లో ఇంగ్లండ్‌లోనూ, 1947/48లో ఆస్ట్రేలియాలోనూ భారత జట్టుతో పర్యటించాడు. అతను ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన రెండు టెస్టుల్లో బౌలింగు ప్రారంభించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో చివరి వికెట్ భాగస్వామ్యంలో దత్తారాం హింద్లేకర్, సోహోనీలు ఓటమిని తప్పించుకోవడానికి 13 నిమిషాల పాటు ఆడారు.
దేశీయ క్రికెట్
[మార్చు]దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగిన 108 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో సొహోనీ 8 సెంచరీలతో 28.17 సగటుతో 4,307 పరుగులు చేశాడు. 11 ఐదు వికెట్ల పంటతో, 2 సార్లు పది వికెట్ల పంటతో, 32.96 సగటుతో 232 వికెట్లు తీశాడు. రంజీ ట్రోఫీలో అతని సంఖ్యలు అసాధారణమైనవి (42 మ్యాచ్‌లు, 34.87 సగటుతో 2,162 పరుగులు, 24.49 సగటుతో 139 వికెట్లు). దురదృష్టవశాత్తూ, అతని ఇరవైలలో చాలా వరకు రెండవ ప్రపంచ యుద్ధ కాలం ఆక్రమించింది. అప్పుడు చాలా తక్కువ క్రికెట్ ఆడారు.[2]
సొహోనీ రంజీ ట్రోఫీలో బొంబాయి, మహారాష్ట్ర, బరోడా తరపున ఆడాడు. అతను మొదటి రెండు జట్లతో టైటిల్స్ గెలుచుకున్నాడు. బరోడాతో 1948-49 ఫైనల్లో ఓడిపోయాడు. అతను పదకొండు రంజీ మ్యాచ్‌లలో బాంబే, మహారాష్ట్ర జట్లకు కెప్టెన్‌గా ఉన్నాడు. 1953-54లో బాంబే విజయం సాధించినపుడు అతను కెప్టెన్‌గా ఉన్నాడు. సొహోనీ 1938-39, 1940-41 మధ్య బాంబే యూనివర్శిటీ తరపున ఆడాడు. 1940-41 లో కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ఒక అనధికారిక టెస్ట్‌లో కూడా ఆడాడు.
రంజీ ట్రోఫీలో, అతని అత్యుత్తమ సీజనైన 1940–41లో, మహారాష్ట్ర తమ టైటిల్‌ను నిలబెట్టుకుంది. జోనల్ ఫైనల్‌లో వెస్ట్రన్ ఇండియాకు వ్యతిరేకంగా, అతను కెరీర్‌లో అత్యుత్తమంగా 218* పరుగులు చేశాడు. విజయ్ హజారేతో కలిసి నాల్గవ వికెట్‌కు 342* పరుగులు చేసాడు. ఇది ఏ వికెట్‌కైనా భారత రికార్డు. మద్రాస్‌తో జరిగిన ఫైనల్‌లో చివరి ఇన్నింగ్స్‌లో అతను, నెర్రెలిస్తున్న వికెట్‌పై ఆడుతూ 104 పరుగులు చేసాడు. ఆ రంజీ సీజన్‌లో 131 సగటుతో 655 పరుగులు చేశాడు. అది ఒక కొత్త రికార్డు. అన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఐదు సెంచరీలతో 808 పరుగులు చేసాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]సొహోనీ, "పొడవుగా, సొగసైన చర్మంతో, లేత కళ్లతో" "సినిమా హీరో" లాగా ఉండేవాడు. వి. శాంతారామ్ అతనికి సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చాడు.
సొహోనీ లోయర్ హౌస్ క్లబ్‌తో లాంక్షైర్ లీగ్‌లో ప్రోగా ఉన్నాడు. అతను BA (ఆనర్స్) చేసి, వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి, మహారాష్ట్ర ప్రభుత్వంలో క్లాస్ I అధికారిగా పదవీ విరమణ చేసాడు.
మూలాలు
[మార్చు]- ↑ Mukherjee, Abhishek. "Ranga Sohoni: Maharashtra's champion all-rounder". Cricket country. Retrieved 8 February 2017.
- ↑ Mukherjee, Abhishek. "Ranga Sohoni: Maharashtra's champion all-rounder". Cricket country. Retrieved 8 February 2017.