యింగ్కియాంగ్ పట్టణ స్థలాకృతిలో కొండ భూభాగాలు,నది లోయలు కలిగి ఉంటాయి.[5] ఈ పట్టణం 28.61037 ° N 95.047531 ° E అక్షాంశ, రేఖాంశాల వద్ద ఉంది.ఇది సముద్ర మట్టానికి 200 మీ (660 (అడుగులు) సగటు ఎత్తులో ఉంది.యింగ్కియాంగ్ పట్టణానికి పడమర వైపు సియాంగ్ నది ప్రవహిస్తుంది. యింగ్కియాంగ్ సమీపంలో ట్యూటింగ్,సింగింగ్,బిషింగ్ పట్టణాలు ఉన్నాయి. భౌగోళికంగా యింగ్కియాంగ్ పట్టణానికి ఉత్తరాన ఇండో-చైనా సరిహద్దులు దగ్గరగా ఉన్నాయి.
యింగ్కియాంగ్ పట్టణ వాతావరణం సాపేక్షంగా వెచ్చని,తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంది.యింగ్కియోంగ్‌లో అత్యధికంగా వేసవిలో ఉష్ణోగ్రత 39 °C, శీతాకాలంలో4 °C.ఉంటుంది.[6] యింగ్‌కియాంగ్‌లో అత్యధికంగా నమోదైన వార్షిక వర్షపాతం 3116 మి.మీ.[7] పట్టణ ప్రాంతంలోని ఎగువ భాగాలు సంవత్సరంలో ఎక్కువ భాగం హిమపాతంతో నిండి ఉంటుంది.
యింగ్కియాంగ్ పట్టణంలోని ఎగువ ప్రాంతంలోని మంచుతో కప్పబడిన గ్రామస్తులు.
యింగ్కియాంగ్ పట్టణవాసులు ప్రాథమిక జీవనోపాధి కోసం సాధారణంగా ఎక్కువ భాగం వ్యవసాయంపై ఆధారపడ్డారు.వాణిజ్య ప్రయోజనం కోసం వ్యవసాయంతో పాటు పండ్లు,కూరగాయల పండిస్తారు.దీనికి స్థానిక పరిపాలన మిడ్ (మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్) ద్వారా వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ,భారత ప్రభుత్వం ప్రోత్సాహం లభిస్తుంది.[8][9] ఎగువ సియాంగ్‌లో వ్యవసాయంలో నిమగ్నమైన గృహాలలో మొత్తం 69 శాతం, యింగ్‌కియాంగ్ పట్టణ నివాస ప్రాంతంలో అత్యధికంగా పట్టణ వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి.[6] పంట అందిన తరువాత వ్యర్థాలను నరికి, తగులబెట్టే (స్లాష్, బర్న్) పద్ధతిలో ఉన్న పంటలను సాగు చేస్తారు.కొండప్రాంతాలపై మెట్లవలె కట్టిన సమమైన ప్రదేశాలలో (టెర్రస్ వ్యవసాయం) వ్యవసాయం చాలా ఎక్కువ ప్రాంతాలలో ఉంటుంది.సాధారణంగా వరి,మొక్కజొన్న,చిరుధాన్యాలు వీరి ప్రధాన ఆహార పంటలు.పసుపు,చెరకు వంటి వాణిజ్య పంటలను కూడా తక్కువ ప్రాంతాలలో పండిస్తారు.[10] వ్యవసాయ ఉత్పత్తులతో పాటు,"ముర్హా" అని పిలువబడే నేసిన వెదురు బల్లలు వంటి హస్తకళలు అక్కడి మార్కెట్లో సర్వసాధారణం.నారింజ,పైనాపిల్ వంటి కాలానుగుణ పండ్ల సాగు సాధారణం, అనుకూలమైన సాగు,మిగులు ఉత్పత్తి కాలంలో,అవి స్థానిక మార్కెట్లలో, పసిఘాట్లోని పట్టణం వెలుపల అమ్మకానికి రవాణా చేయబడతాయి.చేపల పెంపకం స్థానికులకు ఉపాధి కల్పించడానికి,రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించడానికి కేంద్ర ప్రాయోజిత ఎఫ్‌ఎఫ్‌డిఎ (చేప రైతుల అభివృద్ధి సంస్థ ) కార్యక్రమం కింద దీనిని ప్రోత్సహింపబడుతుంది.[11]ఆది తెగ 'ఎగిన్' అని పిలువబడే ఒక ప్రత్యేకమైన సాంప్రదాయ బుట్టను తయారు చేయడంలో ఇక్కడి ప్రజలకు నైపుణ్యం ఉంది.బియ్యం,ఎండిన కలప, ఇతర తినదగిన, వ్యవసాయ ఉత్పత్తులు గృహ వస్తువులను అతిధుల ఇండ్లకుతీసుకువెళ్ళడానికి స్థానికులు దీనిని తరచుగా ఉపయోగిస్తారు.[12]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో మొత్తం జనాభా 8,573 మంది ఉన్నారు. అందులో పురుష జనాభా 4,381, స్త్రీల జనాభా 4,192 మంది ఉన్నారు.0 నుండి 6 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు 1,139 మంది ఉన్నారు.శ్రామిక జనాభా మొత్తం 3,787 మంది,అందులో పురుష శ్రామిక జనాభా 2,221 మందికాగా, మహిళా శ్రామిక జనాభా 1,566 మంది ఉన్నారు..[13] పట్టణ అక్షరాస్యత రేటు 64%. స్త్రీల అక్షరాస్యత రేటు 44.89%, పురుషుల అక్షరాస్యత రేటు 55%.[14] పట్టణ పరిధిలో ఎక్కువ వయస్సు పైబడి పని చేయని జనాభా 4,786 మంది కలిగి ఉన్నారు.ఆది ఈ ప్రాంతంలో మాట్లాడే ప్రధాన మాండలికం.విభిన్న ప్రసంగం ఉన్న వ్యక్తులతో లేదా ఆది మాట్లాడని వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి హిందీ భాషను సాధారణంగా ఉపయోగిస్తారు.
యింగ్కియాంగ్ స్థానికులు ముఖ్యంగా సోలుంగ్,[15] అరన్ (యూనియింగ్-అరన్),ఎటోర్,[16] సియాంగ్ నది దర్శన్,మోపిన్ అనే పండుగలను జరుపుకుంటారు.
అరన్ పండుగ సందర్భంగా తపు (ఆది తెగకు చెందిన మగ సభ్యుల ఒక సాధారణ దూకుడు భంగిమ) నిజమైన సాయుధ పోరాటానికి ముందు 'సన్నాహకంగా' చేసిన వాస్తవ తెగ యుద్ధాల సమయంలో యుద్ధ క్రై డ్యాన్స్‌ను ప్రదర్శిస్తుంది.సోలుంగ్ పండుగ వ్యవసాయం, మంచి పంట కోసం జరుపుకుంటారు,ఆది సమాజంలో ప్రబలంగా ఉన్న సోలుంగ్ ఉత్సవం మూలం గురించి వివిధ పురాణాలు, కథలు,నమ్మకాలు ఉన్నాయి. సాధారణంగా ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో జరుపుకుంటారు, పండుగ తేదీని గ్రామ కౌన్సిల్ నిర్ణయిస్తుంది.[6] కొన్నిసార్లు, 'గామ్' (గ్రామ ప్రధానోపాధ్యాయుడు) గ్రామంలోని ఇతర నాయకులతో సంప్రదించి తేదీని నిర్ణయిస్తాడు.పండగ రోజు, గ్రామస్తులు బియ్యం-బీర్ (అపోంగ్) తయారుచేస్తారు.ఈ సందర్భంగా తాజా కూరగాయలు,మాంసాలు పుష్కలంగా నిల్వ చేయబడతాయి.
అరన్ (యునియింగ్ అరన్)అనేది తూర్పుఎగువ సియాంగ్ జిల్లాల్లో జరుపుకునే ఆది సమాజం నూతన సంవత్సర పండుగ.[17] ఇది వసంత రుతువు రాకను సూచిస్తుంది.పండుగ సందర్భంగా గ్రామంలోని పురుషులు పెద్దలు బారి నృత్యం చేస్తారు.యువకులు,బాలికలు యక్జోంగ్ నృత్యం చేస్తారు. ఈనృత్యాలు పండుగకు చెందిన మూలకథలను వివరిస్తాయి.వారు మంచి ఆరోగ్యం,ప్రజల శ్రేయస్సు కోసంప్రార్థిస్తారు.
ఈటర్ పండుగను మే 15 న తూర్పు,ఎగువ సియాంగ్ ఆది ఆదివాసులు జరుపుకుంటారు.ఎటోర్ అంటే 'కంచె' అని అర్ధం.ఇది పండించిన భూములను కంచె వేయడం ద్వారా పంటల రక్షణకు సంబంధించింది.అంతకుముందు స్థానిక పొలాలలో చేపలు ఉత్పత్తికి కంచెవేసి రక్షించబడతాయి.[18] దేవతలకు భారీ విందు,నైవేద్యాలు చేస్తారు.వార్షిక వ్యవసాయ చక్రం ప్రారంభించడానికి ఈ పండగను జరుపుకుంటారు [16]
సియాంగ్ రివర్ ఫెస్టివల్‌లో భాగంగా సాంప్రదాయ స్వాగత నృత్యం (పోనుంగ్) ప్రదర్శించే గిరిజన మహిళలు.సియాంగ్ రివర్ ఫెస్టివల్, గతంలో బ్రహ్మపుత్ర దర్శన్ ఫెస్టివల్ అని పిలిచేవారు, తరువాత సియాంగ్ నది ఫెస్టివల్ గా పేరు మార్చారు. 2005 తరువాత, యింగ్కియోంగ్,ట్యూటింగ్ పసిఘాట్ ఈసామూహిక సామరస్యం పండుగను నిర్వహించడానికి ప్రదేశాలుగా ఎంపిక చేయబడ్డాయి.[19]
ఈ పట్టణం అరుణాచల్ ప్రదేశ్ నుండి జాతీయ రహదారి 52 ద్వారా పసిఘాట్ నుండి ఇటానగర్ వరకు,జాతీయ రహదారి 513 ద్వారా దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది.రవాణా మార్గాల్లో సుమో (టాక్సీ) సేవలు ఎపిఎస్‌టి (అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రవాఁణా సంస్థ) బస్సు సర్వీసులు ఉన్నాయి. ప్రత్యక్ష వైమానిక అనుసంధానం లేదు.అంతకుముందు డిబ్రూగర్ లోని మోహన్‌బరి విమానాశ్రయానికి పరిమితం చేయబడింది.[20][21] యింగ్కియోంగ్ చేరుకోవడానికి సమీప విమానాశ్రయం 2018 లో పసిఘాట్ పట్టణంలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయం.[22] పట్టణానికి చేరుకోవడానికి పసిఘాట్, ఇటానగర్ అస్సాం నుండి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి.[23] పట్టణంలో రెండు హెలిపోర్ట్‌లు ఉన్నాయి.ఒకటి సియాంగ్ సమీపంలో,మరొకటి యింగ్‌కియాంగ్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా హెలికాప్టర్ ల్యాండింగ్ సేవలను వినియోగించుకోవటానికి సులభతరం చేస్తున్నాయి.[24] యింగ్‌కియాంగ్ పట్టణానికి అస్సాం రాష్ట్రం,జోనాయి జిల్లాలోని ముర్కాంగ్సెలెక్ రైల్వే స్టేషన్ నుండి పసిఘాట్ ద్వారా యింగ్‌కియాంగ్ పట్టణానికి చేరుకోవచ్చు [25][26]
ఎగువ సియాంగ్‌లోని పాలియుల్ మొనాస్టరీ సియాంగ్ నదిపై గాంధీ వంతెన (తాత్కాలిక స్వింగింగ్ వంతెన), చెరకు, వెదురుతో తయారు చేయబడింది. ఇది సియాంగ్ నదికి ప్రధాన పర్యాటక ఆకర్షణ
↑Managing natural resources : focus on land and water : felicitation volume in honour of Professor R.L. Dwivedi. Dwivedi, R. L., 1924-, Misra, H. N. (Harikesh N.), 1945-. Delhi. 13 March 2014. ISBN9788120349339. OCLC893309586.{{cite book}}: CS1 maint: location missing publisher (link) CS1 maint: others (link)
↑ 16.016.1Mishra, B.P.; Kumawat, M.M.; Kumar, Naresh; Riba, Toge; Kumar, Sanjeev (2016). "Significance of Aran Festival for Rodent Management by Adi Tribes of Arunachal Pradesh". Journal of Global Communication. 9 (1): 15. doi:10.5958/0976-2442.2016.00004.5. ISSN0974-0600.
↑Pathak, Guptajit; Gogoi, Raju (2008). Cultural fiesta in the "Island of peace" Arunachal Pradesh. New Delhi, India: Mittal Publications. ISBN978-8183242318. OCLC277280040.