యస్.రాజన్నకవి
స్వరూపం
యస్.రాజన్నకవి పండితులు | |
---|---|
జననం | సగబాల రాజన్నకవి పండితులు 1931 జూలై 1 ప్రొద్దుటూరు పట్టణం, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
వృత్తి | ఉద్యోగము |
ప్రసిద్ధి | కవి |
పదవి పేరు | రెవెన్యూ ఇన్స్పెక్టర్ |
మతం | హిందూ |
తండ్రి | చిన్న జమాలప్ప |
తల్లి | సాలమ్మ |
యస్.రాజన్నకవి పండితులు[1],[2] చిన్నజమాలప్ప, సాలమ్మ దంపతులకు 1931 జూలై 1న ప్రొద్దుటూరులో జన్మించాడు నాయీబ్రాహ్మణ కులానికి చెందినవాడు. పుట్టపర్తి నారాయణాచార్యుల శిష్యులలో ప్రముఖుడు. పెద్దతండ్రి పెద్దజమాలప్ప వద్ద సంగీతము పుట్టపర్తివారి వద్ద సంగీతము, సాహిత్యము నేర్చుకున్నాడు.జమాలప్ప సోదరులు ఇరువురు రాయలసీమలో పేరుపొందిన జంత్రవాద్య నిపుణులు. వీరికి గండపెండేర సత్కారం లభించింది. రాజన్నకవి రంగస్థలముపై శ్రీకృష్ణుడు, నక్షత్రకుడు, చంద్రుడు, గయుడు, భవాని మొదలైన పాత్రలు ధరించి మెప్పించాడు. హరికథలు కూడా చెప్పేవాడు. కవిగా, గాయకుడిగా, రంగస్థల నటుడిగా, హరికథకుడిగా పేరుమోసాడు. రెవెన్యూడిపార్ట్మెంటులో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేశాడు. స్వర్ణకంకణంతో సత్కరించబడ్డాడు.
రచనలు
[మార్చు]- కవిరాజ నీరాజనము
- అవతారమూర్తులు
- వ్యాససౌరభము
- ఖండకావ్య సంపుటి
- త్యాగరాజీయము
- తిమ్మన కమ్మని రచన
- దేవయాని
- లవంగి
- వసుచరిత్ర వైచిత్రి
బిరుదము
[మార్చు]- కవిసుధాకర
- గానకళాధర
రచనల నుండి ఉదాహరణ
[మార్చు]- నాఁడెన్నడో కాదు నేడిదే కనుడంచు
- బాలచంద్రులు నేడు ప్రబల వలయు,
- నాడెన్నడోకాదు నేడు కన్గొను డంచు
- తాండ్రపాపయ్యలు తరలవలయు,
- నాఁడెన్నడో కాదు నేడిదే కనుడంచు
- మహరాష్ట్ర వీరులు మసలవలయు,
- నాడెన్నడోకాదు నేడు కన్గొను డంచు
- రాణాప్రతాపులు రగుల వలయు
- నాఁడెన్నడో కాదు నేడిదే కనుడంచు
- నాటి యెందరో వీరులు మేటిమగలు
- భారతావని బ్రదికియున్నారు నేడు
- నాడు నేడును నేడెయై వాడిసూప
- భరతమాతను కాపాడవలయు!!
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర - రెండవసంపుటి- కల్లూరు అహోబలరావు
- ↑ కడపజిల్లా రచయితల మహాసభలు విశేషసంచిక