Jump to content

నోరు

వికీపీడియా నుండి
(మూతి నుండి దారిమార్పు చెందింది)
నోరు
Head and neck.
A human mouth, closed.
లాటిన్ cavitas oris
MeSH Oral+cavity
Dorlands/Elsevier c_16/12220513

నోరు, మూతి లేదా ముఖద్వారము (ఆంగ్లం: Mouth) మనిషి ముఖంలో మధ్యక్రిందభాగంలో ఉంటుంది. దీని ముందుభాగంలో రెండు పెదవులు నోరు తెరవడానికి లేదా మూయడానికి అనువుగా ఏర్పాటుచేయబడ్డాయి. వెనుకభాగం గొంతుతో కలుస్తుంది. నోటి లోపక కదులుతూ నాలుక ఉంటుంది. నోటి కుహరపు పైభాగాన్ని అంగిలి (Palate) అంటారు.

జీర్ణప్రక్రియ నోటినుండే మొదలౌతుంది. ఇక్కడే ఆహారం చిన్నచిన్నముక్కలుగా చేయబడి లాలాజలంతో కలుస్తుంది.

ఇదే కాకుండా మాటలాడడానికి, ద్రవపదార్ధాలు త్రాగడానికి, సిగరెట్లు త్రాగడానికి, గాలిపీల్చుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.

మనిషి నోటిలో ఇంచుమించుగా 100 మి.లీ. ద్రవం పడుతుంది.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో నోరు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] నోరు అనగా The mouth. నక్త్రము, ముఖద్వారము అని అర్ధము. G. నోటి, నోరి, నోట. బహువచనం: నోళ్లు. ఉదా: నోట with the mouth. నోరు ముయ్యి hold your tongue. నోరులేని dumb, unable to talk. నోరు లేనివాడు a simpleton. నోరుకొట్టు to strike on the mouth, i.e., to silence, check, rebuke; to deprive of one's rights or enjoyment, to plunder, spoil. నోరుకాచు to watch one's lips, to keep a secret. నోరుకట్టు to restrain the appetite. నోటిలో ఆడుచున్నది I have it at the tip of my tongue. వాని నోరు మంచిది కాదు he is a foul mouthed fellow. పెద్ద నోరు చేయు to talk loud or abusively. నోరుపడిన speechless. నోటికి వచ్చినట్టు తిట్టెను he gave them all the abuse that he could think of. నా నోట్లో మన్నుకొట్టినాడు he cast earth in my mouth, i.e., he destroyed my hopes or prospects. నోటిపేద foolish, ignorant, senseless. నోటిమాట a mere word of mouth. నోరుమెంగ అనగా A dumb man. మూగవాడు. నోరూరు (నోరు+ఊరు) v. n. To water (as the mouth). To desire, అపేక్షించు. ఉదా: నా నోరూరుచున్నది my mouth waters. వానితో నీవు యేల నోరు చేసుకొంటావు why do you quarrel with him? నోరెత్తు v. n. To raise the voice, cry, speak. To try to speak, మాట్లాడ యత్నించు. నోరాడు (నోరు+ఆడు.) v. n. To utter. వానికి ఎటుల నోరాడెనో I can't think how his mouth could utter such words. "చెయ్యప్పులనుచు నిచ్చినవారు కటువుగా నడుగ నుంకించి నోరాడకరుగ."

లాలాజల గ్రంథులు

[మార్చు]

నోటిలో మూడు జతల లాలాజల గ్రంథులున్నాయి. అవి

  1. పెరోటిడ్
  2. అథోజిహ్విక
  3. అథోజంబిక

వీటిలో పెరోటిడ్ గ్రంథులు చెవి దగ్గరగా ఉంటాయి. అథోజిహ్విక, అథో జంభికా గ్రంథులు నాలుక క్రిందకు తెరుచుకుంటాయి. ఈ గ్రంథుల నుంచి లాలాజలం విడుదలౌతుంది. లాలాజలంలో ఎక్కువగా నీరు, కొద్దిగా లవణాలు, ఎమైలేజ్, టయొలిన్ అనే ఎంజైమ్ లు ఉంటాయి. ఈ ఎంజైమ్ లు ఆహారంలోని పిండిపదార్థాన్ని డెక్స్ట్రిన్, మాల్టోజ్ అనే చక్కెరలుగా మారుస్తుంది. డెక్స్ట్రిన్ కూడా చివరకు మాల్టోజ్ గానే మారుతుంది. ఆహారంలోని పిండి పదార్థం నోట్లోనే పాక్షికంగా జీర్ణమవుతుంది. ఆహారం నోటి నుంచి గ్రసని ద్వారా ఆహార నాళంలోకి ప్రవేశిస్తుంది. గ్రసనిలో ఉన్న కొండనాలుక ఆహారం వాయునాళం లోకి పోకుండా కాపాడుతుంది. ఆహార వాహికలో స్రవించే శ్లేష్మం వల్ల ఆహారం సులువుగా కదులుతుంది. ఆహార వాహికలోని కండరాలు ఏర్పరిచే అలల వంటి సంకోచ కదలికలను పెరిస్టాటిక్ చలనాలు అంటారు. ఇవి అనియంత్రితమైనవి.

నోటి వ్యాధులు

[మార్చు]
  1. నోటి పుండు: నోటి శ్లేష్మ పొరపై ఏర్పడే పుండు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నోరు&oldid=3917554" నుండి వెలికితీశారు