ముదిగొండ సిద్ద రాజలింగం
Jump to navigation
Jump to search
ముదిగొండ సిద్ద రాజలింగం వరంగల్లు జిల్లా తొలి మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
జననం
[మార్చు]ఈయన ఫిబ్రవరి 9, 1919లో తెనాలి దగ్గర ఈమనిలో జన్మించారు. వరంగల్లులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో టి.హయగ్రీవాచారి నాయకత్వంలో పనిచేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక మహాత్మా గాంధీ ఆశ్రమం వార్ధాలో రెండు సంవత్సరాలు శిక్షణ పొందారు. 1952లో వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957లో చిల్లంచెర్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. వరంగల్‌లో 1949లో మొగిలయ్య హాలు నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఆయనకు ఒక కుమార్తె, నలుగురు కుమారులు సంతానం. వారిలో ముగ్గురు కుమారులు పరమపదించారు.